Thursday 13 December 2018

భారతీయ పండుగలు

భారతీయ పండుగలు

తొలి యుగం కృతయుగం ధర్మానికి ప్రమాణం.అక్కడినుంచే ఓంకారం,భాషలు పుట్టుకొచ్చాయి.సంస్కృత,తెలుగు భాష లోని శ్లొకాలను, స్తోత్రాలను ఉచ్చరించేకొద్దీ మన జీవ నాడులు చైతన్యవంతమవుతాయి.యుగయుగాలుగా ,అనేక తరాలనుండి అవిచ్చిన్నంగా ప్రవహిస్తున్న క్షీర ధార మన భారతీయ సంస్కృతి.
ఈ సంస్కృతీ సంప్రదాయాలకు కేంద్ర బిందువే పండుగ.ఈ పండుగలు పురాణ ఇతిహాసాలతోపాటు ఆయా ఋతువుల ఆగమనం ,శీతోష్ణస్థితిగతుల ఆధారంగా ఏర్పడ్డవే!! ప్రతి పండుగలో పరమార్థం, ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడిఉన్నాయి. నిజానికి ఈ ఋతువులను సృజించినది పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమారుడు షన్ముఖుడు.ప్రముఖ ప్రముఖ పండుగలైన ఉగాది,దీపావళి,సంక్రాంతి మొదలైన పండుగలలో కొన్ని ప్రత్యేకతలు కలిగిన పిండివంటలు తినుటచే ఋతువుల మార్పువల్ల వచ్చే జబ్బులూ
నివారించబడతాయి..ఈ పండుగలు ఐకమత్య పటిష్టతకు,సోదరభావానికి,ఉమ్మడికుటుంబాల సుఖ సంతోషాలకు సాక్షీభూతాలు.. ఇంతటి గొప్ప ధార్మిక, సామాజిక, అరోగ్య జీవన విధానము భారదేశం లో తప్ప మరెక్కడాలేదు.



No comments:

Post a Comment