వినయము, సత్ శీలత :
కళలకు కాణాచి అమ్మ.ఈ అమ్మ ఎవరో కాదు మన అమ్మలగన్న అమ్మ సరస్వతీ దేవి!! చతుష్షష్టి కళలు(64 కళలు) ఆమె రూపాలే.సకల కళామ తల్లి సరస్వతి.సంగీత సాహిత్యాలు ఆమె రెండు నేత్రాలు.అన్ని విద్యారూపాలు,శాస్ర రూపాలు,కళారూపాలు ఆమె దివ్య రూపమే!!!ఆమె చూపులో ,ఆమె వాక్కులో కరుణ జాలు వారుతూ ఉంటుంది.ఇటువంటి మహోన్నత అధిదేవతలాంటి జ్ఞాన స్వరూపమే భారతీయ స్త్రీ. పాశ్చాత్య అనుకరణ, నేనే గొప్ప అన్న అహంకార ధోరణి విడనాడి విలువలకు, సనాతన భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలి. పవిత్ర భావనతో నిత్య విద్యార్థిలా స్త్రీలను,పెద్దలను,మంచి వారిని గౌరవించటం నేర్చుకోవాలి.అపుడే ప్రతి మానవుడు వినయము సత్ శీలం తో ఉన్నత శిఖరాలను అందుకుంటాడు....
No comments:
Post a Comment