Saturday, 1 December 2018

TELUGU PHILOSOPHICAL SONGS

*ప్రాణాధారమైన స్వఛ్ఛమైన నీరు.....పారుతూ ఉండొచ్చు. లేదా...ఓ నీటి కుళాయిలో నుండి తిప్పుకొని నింపుకోవచ్చు. మనం తీసుకెళ్ళిన పాత్ర ఎంతో అంతేగా దక్కేది. అది ఓ బకెట్ కావచ్చు...బిందె కావచ్చు. లేదా..ఓ తుప్పు పట్టిన పాత గిన్నె కావచ్చు!*
*ఇక్కడ నీరు పట్టుకునే పాత్రకే ప్రాముఖ్యం. అదెంత పెద్దదైతే...అంత ఎక్కువగా...ఎంత చిన్నదైతే....అంతే తక్కువగా నీరు మనకు దక్కుతుంది. ఒకవేళ...ఏపాత్ర దొరకక...తుప్పు పట్టిన...చిల్లులు నిండిన పాత్ర తీసుకెళితే...స్వఛ్ఛమైన నీళ్ళు...పాత్రలో పడినట్లే ఉంటాయి. కానీ ఆ తుప్పు జలాన్ని కళుషితం చేసేస్తుంది. గిన్నెకున్న చిల్లుల నుండి జలం కారిపోయి....నీళ్ళు దక్కవు.*
*మన మనస్సు ఓ పాత్ర అనుకుంటే....స్వఛ్ఛమైన నీటి ధార.....జ్ఞానవాహినిగా ఉదాహరించవచ్చు. మన హృదయనైర్మల్యమే...పాత్ర సైజు నిర్ణయిస్తుంది. మనస్సెంత విశాలమైతే.....జ్ఞాన సముపార్జన కూడా...అంతే బాగుంటుంది మరి.*
*స్వఛ్ఛమైన నీటిలో ఏ లోపమూ లేనట్లే....జ్ఞానార్జనలో...తరతమ బేధాలు లేవు. కాకపోతే....నీ మనస్సనే పాత్ర....విశాలమై...తుప్పు పట్టనిదై...చిల్లులు గట్రా లేనిదై ఉండాలి. అప్పుడే జ్ఞాన జలం దక్కించుకోవచ్చు.*
*ప్రాణాధారమైన ఆక్సిజన్...మనకెంత అవసరమో...అదే ఆక్సిజన్...ఇనుముతో చేరి ఫెర్రస్ ఆక్సైడ్ గా మారి తుప్పు పట్టిస్తుంది!*
*మన హృదయమనే పాత్ర ఇనుము తో కాక...ఇతర లోహాలతో చేరి...అల్లాయ్స్ గా మారితే...తుప్పుపట్టవు. ఆ ఇతర లోహాలే....సదాలోచనలు, శాంతి భావనలు, సత్సాంగత్యాలు లాంటివి. అలా మనస్సును మంచి పాత్రగా మలచుకుంటే...జ్ఞానాన్ని గ్రహించే హృదయ వైశాల్యం మన సొంతమౌతుంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.*
*విషయవాసనలతో....ఇంద్రియలోలత్వంతో..రాగద్వేషాలతో....ఈర్ష్య అసూయలతో...బుసలుకొట్టే....మనస్సున....జ్ఞానం నిలవడం సాధ్యమా! మనస్సనే పాత్ర కు తుప్పుపట్టనీయకు. చిల్లులు పడనీయకు. అప్పుడు జ్ఞాన సముపార్జన....దక్కినంత దక్కకపోదు. ప్రశాంతత నీకు అసాధ్యం కాదు.*
*అసలు...నువ్వు ప్రశాంతంగా నిదురించి ఎంత కాలమైంది?ఒకటి పోతే...మరో సమస్య....వస్తూనే ఉంటాయి...నీ జీవిత కాలగమనాన.*
*కాస్త మెదడుకు పదును పెట్టి....ఆలోచించు. నేను నీ ఆత్మను...నీ మసకేసిన.... మబ్బుకమ్మిన హృదయాకాశాన్ని. శాశ్వత పరిష్కారం ఏదో నువ్వే కనుగొని....ఆచరించు మరి. ముందే చెప్పలేదనవద్దు! హెచ్చరిస్తున్నా..అంతే.*
*ఈ వేదాంత ధోరణి....ఏమిటి....అనుకుంటే....కుదరదు....జీవిత సమరాన పరుగుతీయాలి....కానీ...ఆ పరుగు క్రమబధ్ధమై ఉండాలి. గమ్యం తెలిసి ఉండాలి.అప్పుడే...జన్మ సార్థకమవుతుంది.*
*మనో వికాసానికై, కొన్ని చక్కటి తత్వాలు, బోధనలు చూద్దాం.*
***************************************************
ఆలుబిడ్డలు జీవయాత్రలోన: ...మాయ సంసారం తమ్ముడూ...........ఉమాసుందరి.
చెప్పలేదండనక పొయ్యేరు.......శ్రీ పోతులూరి వీరబ్రహ్మేద్రస్వామి చరిత్ర.
మాయదారిమరల బండిరా....ఈ మాయదేహం ఆరుచక్రములు అమరిఉన్నవిరా.
ఒకటే జననం...ఒకటే మరణం............శివపుత్రుడు.
షావుకారు.
ఇంతేనన్నా...ఇంతేనన్నా...నిజమింతేనన్నా.
మారిపోవురా కాలము....మారుటదానికి సహజమురా...
ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం........ఆ నలుగురు.
మాయను పడకే మనసా........యోగి వేమన.
ఇంతేనా..ఇదేనా...జీవితసారమిదేనా........యోగి వేమన.
మాయజాలమున మునిగేవు నరుడా.......శ్రీకాళహస్తి మహాత్యం.
ఈ మేను మూడునాళ్ళ ముచ్చటేరా..........భూకైలాస్.
భజగోవిందం...భజగోవిందం.......రాజారమేష్.
🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳🌾🌳
- కె.వి.ఎస్. ప్రసాద్.

No comments:

Post a Comment