Monday, 31 December 2018

LITERATURE AND SOCIETY

LITERATURE AND SOCIETY
Literature is a reflection of human society.It has a value and social purpose.
Poets and writers have a responsibility towards the society around them.Literature must show people what is good for them.
A poet or writer can inspire people to action with his / her writings.He / She can dispel their ignorance and enlighten them.A Sanskrit proverb says that the aim of poem should be the good of mankind!!! 

HAPPY NEW YEAR

HAPPY NEW YEAR
“Celebrate endings,welcome beginnings  and you will manage the uncertainties.”


TRADITIONAL INDIA  WISHING ALL FOR   A HAPPY HEALTHY,PEACEFUL AND PROMISING NEW YEAR 2019



Sunday, 30 December 2018

YOU ARE A GIFT TO ME

YOU ARE A GIFT TO ME by Linda B.Scalan
I don't feel as though I do
I talk a lot 
Sometimes at people 
I feel sorry for them
No escape! 

I'm bossy 
When things don't go my way there is a tendency to sulk and blame unseen forces for conspiring against me - after all, don't I know best! 

Ha......

I'm often fearful of silence 
Afraid of what may follow 
So I fill up the space with a lot of clammer and chatter ....

Then you come along 
And offer your friendship
Your words buoy me 
Give me strength 
Invite me to be still and sit in sacred silence 
You know 
You know
There is found 
the very will of God 
Who speaks not loudly 
But in a whisper....

Blessings dear friend 
You are a gift to me....🙏

PURE SOUL

PURE SOUL 
layers of what's up possible
excites imagination
promotes creative interest
allow us to dream
always reaching more
like a pure soul reflecting
deep call of echoed beauty
love received
(c) Janet Rice Carnahan 2018

POETRY OF DENKANEEKOTA JAYALAKSHMI

POETRY OF DENKANEEKOTA JAYALAKSHMI
మంచి విషయాలనుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు  , దానినే బోధన అని కూడా పిలవవచ్చు అని సమర్థ రామదాసు దాసబోధలో చెబుతారు.. ఇలా మంచిని పంచడం లో , మంచి విషయాలను తమ సహజసిధ్ధమైన భావా రూపాలుగా ప్రకటించే వారు ఈ ముఖపుస్తకం లో బహు అరుదు.. అందరూ మాస్టర్లూ, కవులూ కానక్కరలేదు..సత్యం ఎప్పుడూ సత్య కర్మలనే ప్రేరేపిస్తుంది..మనసును పవిత్రం చేసేది ఈ సత్యకర్మలూ, సత్కర్మలే.. సకల సంపదలలో విద్యా సంపద గొప్పది.. కాని కనీసము పాఠశాలకు కూడా వెళ్ళకుండా ఎన్నో భక్తి గీతాలను, కీర్తనలను, పద్య రచనలను భక్తి చైతన్య రూపం లో ప్రకటించిన భాషా పాండిత్య సరస్వతి స్వర్గీయ డెంకణీకోట జయలక్ష్మి గారు వారి పుత్రులైన గారిద్వారా నాకు పరిచయం కావటం నా భాగ్యంగా భావిస్తున్నాను..ఈ పోస్టుపైన మీ అమూల్య స్పందనను కనపరచిన వారందరికీ మరొక్కసారి  దన్యవాదాలు..

Saturday, 29 December 2018

TRIBUTE TO NAGAIAH

TRIBUTE TO NAGAIIAH

నాగయ్య గారి (28-03-1904 & 30-12-1973) 45 వ వర్ధంతి సందర్భంగా నివాళులు.
అది తిరువాన్కూరు మహారాజావారి దర్బార్ హాలు. మహాపండితులు, సంగీత, నాట్య, నటన కళాకోవిదులతో సభా భవనం క్రిక్కిరిసి పోయింది. మేళతాళాలతో సకల రాజ మర్యాదలతో రాజదర్బారు ప్రవేశించాడొక తెలుగు నటుడు. మహా రాజు గద్దె దిగి ఎదురేగి ఆ నటశ్రేష్టుని సాదరంగా కౌగలించు కొన్నారు. తన గద్దె ప్రక్కను ఏర్పాటు చేసిన సమున్నతమైన ఆసనంపై కుర్చుండజేసి, వేదమంత్ర పఠనం మధ్య, నటునికి పాదపూజ చేసి అమూల్యమైన కానుకలను అందచేయటంతోపాటు ' అభినవ త్యాగరాజ ' బిరుదంతో సత్కరించారు.
మైసురు సంస్థానాధీశ్వరుడు తన రాజ ప్రాసాదంలో ఆ నటరాజుకు సకల రాజ లాంఛనాలతో స్వాగతంపలికి పెద్ద వెండి పళ్ళెంలో 101 బంగారు కాసులు పోసి బహూకరించారు.
ఇలా రాజాస్థానాలలో అపూర్వమైన సత్కారాలను అందుకొన్న తెలుగు నటశిరోమణి చిత్తూరు నాగయ్య గారు.
భారతదేశంలో భక్తి రస ప్రధానమైన పాత్రలు ధరించి ఆయనవలె ప్రజల మన్నన లందుకున్న వారెవరూ లేరు.
నాగయ్య గారు 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవారు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత తనయుడిని బాల్యంలోనే ఆకర్షించింది.
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించారు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నారు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చారు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపారు.
ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యారు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగారు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించారు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగారు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించారు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించారు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవారు నాగయ్య.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించారు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధాంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నారు.
మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరారు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.
చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నారు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించారు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్ నామ్ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించారు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపారు. పుణ్యక్షేత్రాలు చూశారు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరారు.
1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళారు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశారు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించారు. తిరిగి మద్రాసు వచ్చారు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టారు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.
చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయారు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించారు.
నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చారు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నారు. వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యారు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చారు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.
బి. యన్. రెడ్డిగారు మూలానారాయణ స్వామితో కలిసి వాహినీ పిక్చర్స్ అనే సంస్థను ప్రారంభించారు. వందేమాతరం, సుమంగళి, దేవత, మున్నగు చిత్రాల్లో నటించిన నాగయ్యకు అశేష పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
"ఫిల్మ్ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్ముని' గా కీర్తించారు.
కె. వి. రెడ్డిగారు, 'భక్త పోతన' చిత్రంలో, పోతన పాత్ర ధారణకు నాగయ్యను ఎన్నుకొన్నారు. పోతనగా, నాగయ్య చూపిన హావభావాలు, భక్తుడుగా ఆయన అభినయం చిరస్మరణీయం. 'పావన గుణ రామా' అను పాట ఈనాటికీ చిత్రం చూచిన వారిని మైమరిపిస్తుంది. అసమాన నటుడుగా ప్రశంసలందుకొన్నారు.
https://www.youtube.com/watch?v=WI1G5f4rG9U
నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి త్యాగయ్య చిత్రాన్ని నిర్మించి చరిత్ర సృష్టించారు. ఆ చిత్రం ప్రారంభించుటకు ముందు తిరువాయార్ లోని త్యాగరాజుల వారి సమాధి వద్ద కొన్ని రోజులు ఉపవాస దీక్ష చేశారు. 'త్యాగయ్య' చిత్రంలో నాయకుడుగా సంగీత దర్శకుడుగా అఖండ కీర్తినార్జించారు. త్యాగయ్య చిత్రం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి భారతదేశ కీర్తి పతాకను ఎగుర వేసింది.
తెలుగు చిత్రాలతోపాటు నాగయ్య తమిళ చిత్రాలలో కూడా నటించారు. మోసాలు, తంత్రాలు తెలియని నాగయ్య 'భక్త రామదాసు' చిత్ర నిర్మాణంలో పెక్కు అడ్డంకులను ఎదుర్కొన్నారు. 'రామదాసు' అనుభవించిన సంకటాలను అనుభవించారు. చిత్రం ఎలాగో బయట పడింది. కాని నాగయ్య ఆశించిన రీతిలో రాలేదు. మరలా మనశ్శాంతిని కోల్పోయి పుట్టపర్తి సాయిబాబాను ఆశ్రయించారు. బాబా ఆధ్వర్యంలో, మద్రాసులో నాగయ్య షష్టిపూర్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య.
నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించారు.
నాగయ్య మహానటుడే కాదు, మహాదాత. ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించారు.
"నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను. అందరి మాటా నమ్ముతాను. అందర్నీ విశ్వసిస్తాను! అదే నా అర్థిక పతనానికి కారణమైంది" అని తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడాయన.
లక్షలార్జించిన నాగయ్య చివరిదశలో కఠిన దారిద్య్రాన్ని అనుభవించారు. చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది, డబ్బుకోసం!
పోతన, త్యాగయ్య, రామదాసు మున్నగు పాత్రలలో భక్తి రసామృతాన్ని పంచిపెట్టిన నాగయ్య నటించిన వేమన, పోతన చిత్రాలను చూచి ఒక బాలుడు యోగిగా మారి ముమ్మిడివరం 'బాలయోగి' అయ్యాడు.
ఒకమారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు వచ్చారు. ఆయన దర్శనం కోసం నాగయ్య, గుమ్మడి మరో మిత్రుడు వారి దగ్గరకు వెళ్ళారు. నాగయ్య గారు వచ్చారని విన్న రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నాగయ్యను ఆహ్వానించారు. నాగయ్యతో పాటు వచ్చిన మూడోవ్యక్తి, రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేస్తే "మావంటి వారికి పాదాభివందనం ఎందుకయ్యా? మీ ప్రక్కనే వున్న నాగయ్యగారికి చేస్తే మీకు పుణ్యం వస్తుంది అన్నారట" రాధాకృష్ణన్. ఆమాటకు నాగయ్య పులకించి పోయారు.
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డారు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశారు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో 'నటయోగి నాగయ్య' కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.
శ్రీ నాగయ్య గారు తెలుగులో 177 సినిమాలలో నటించారు. గృహ లక్ష్మి (1938), వందే మాతరం, సుమంగళి, దేవత, భక్త పోతన, స్వర్గ సీమ, త్యాగయ్య, వేమన, మన దేశం, సంఘం, తెనాలి రామ కృష్ణ, పాండు రంగ మహాత్మ్యం, సంపూర్ణ రామాయణం, బండ రాముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ఇంటికి దీపం ఇల్లాలే, సీతా రామ కల్యాణం, పెండ్లి పిలుపు, సతీ సులోచన, దక్ష యజ్ణం, స్వర్ణ మంజరి, గాలి మేడలు, బంధిపోటు, లవకుశ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, లక్షాధికారి, ఇరుగు పొరుగు, అగ్గి పిడుగు, రామదాసు, వివాహ బంధం, గుడి గంటలు, దాగుడు మూతలు, బొబ్బిలి యుద్ధం, తోడు నీడ, దేవత, విశాల హృదయాలు, సత్య హరిశ్చంద్ర, పాండవ వనవాసం, దొరికితే దొంగలు, వీరాభిమన్యు, అడుగు జాడలు, పరమానందయ్య శిష్యుల కధ, శకుంతల, కంచుకోట, పుణ్యవతి, స్త్రీ జన్మ, భామా విజయం, శ్రీ కృష్ణావతారం, రాము, తిక్క శంకరయ్య, నిండు సంసారం, కధా నాయకుడు, కోడలు దిద్దిన కాపురం, పెత్తందార్లు, లక్ష్మీ కటాక్షం, ఒకే కుటుంబం, జీవిత చక్రం, శ్రీ కృష్ణ సత్య, కుల గౌరవం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, బడి పంతులు, దేశోద్ధారకులు, ఎవరు దేవుడు (1977) మొదలైనవి.
ప్రతీ తెలుగువ్యక్తి తప్పక చూడవలసిన సినిమాలు నాగయ్యగారు నటించిన త్యాగయ్య (1946), వేమన (1946), పోతన (1943).
పాహి హరే, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
https://www.youtube.com/watch?v=C16aHfHDCxM
జయ జయ గోకుల బాలా, పాండు రంగ మహాత్మ్యం
https://www.youtube.com/watch?v=ljG0FzEEqFw
సన్నుతి సేయవే మనసా, పాండు రంగ మహాత్మ్యం
https://www.youtube.com/watch?v=edXlQRu9vqI
సందేహింపకుమమ్మా, లవకుశ
https://www.youtube.com/watch?v=K3OkLfS76yE
రా రా కృష్ణయ్యా, రాము
https://www.youtube.com/watch?v=hPqml0Af6MI

చిత్తూరు నాగయ్య

'కళాదీపికాంజలి'!
◆◆◆◆◆◆◆◆◆
చిత్తూరు నాగయ్య
28-3-1904 30-12-1973
(ఈరోజు వారి వర్థంతి)
★★★★★★★★★★★
దక్షిణ భారత దేశ చలనచిత్ర రంగంలో అగ్రనటుడూ,
ఆంధ్రుల ఆదరాభిమానాలను చూరగొన్న
ఉత్తమ నటుడూ 'పద్మశ్రీ' చిత్తూరు ఉప్పలదడియం
నాగయ్య ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యారు.
దక్షిణభారత దేశంలో 'పద్మశ్రీ' పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమా నే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది - తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు.
ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం
అతిశయోక్తి అనిపించుకోదు.
బాల్యము:
★★★★★
చిత్తూరు నాగయ్య 1904, మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. తండ్రి ఉప్పల ధడియం రామలింగేశ్వర శర్మ గారు అక్కడ రెవిన్యు శాఖలో ఉద్యోగిగా వుండేవాడు. నాగయ్య అసలు పేరు "ఉప్పల దడియం నాగయ్య". కొంతకాలం పాత్రికేయునిగా పనిచేశాడు. చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన "సారంగధర" నాటకంలో "చిత్రాంగి" వేషం ద్వారా ప్రశంసలు అందుకొని "చిత్తూరు నాగయ్య"గా ప్రసిద్ధులయ్యాడు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు, తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత కొడుకుని బాల్యంలోనే ఆకర్షించింది.
సంగీతము పై అభిరుచి
★★★★★★★★★★
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు.
ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, " ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?" అని ప్రశ్నించాడు. నా పేరు 'ప్రహ్లాదుడు' అని జవాబిచ్చాడు బాలుడు. 'సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా' అని అడిగాడు. 'ఓ-వినండి' అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై 'బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు' అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.
కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభ కోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు. కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు. మద్రాసులో చదువుకు 'గుడ్ బై' చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది. చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు.
నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. "హిజ్ మాస్టర్స్ వాయిస్" కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్. ఎం. రెడ్డిగారికి నాగయ్య గారిని పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే "గృహలక్ష్మి" చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.
నాటకాలు
★★★★★
చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంసలందు కొన్నాడు.
నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు గారు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు 'రంగ భూషణ' బిరుదంతో సత్కరించారు.
కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య. కాని జీవితంలో కష్టాలెదురైనాయి. తండ్రి మరణించాడు. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతిలేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. 'నీ కార్యక్షేత్రం కళారంగం, వెళ్ళు మరళా కళాకారుడవై ఆత్మ శాంతిని సాధించు' అని అంతరాత్మ బోధించింది. మరలా చిత్తూరు చేరాడు.
సినీరంగ ప్రవేశం
★★★★★★★
1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూర్లో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. 'పాటా పద్యం వచ్చునా - ఓకే!' అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు అందర్నీ ఆకట్టుకొని ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.
1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. అప్పుడు 'హీరో ఇమేజ్' వుంటుందీ, పోతుందీ అన్న భావన లేనేలేదు. వెంటనే 'సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశాలొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. తన పాటలు తానే పాడుతూ 'సిసలైన తెలుగు సినిమా హీరోగా' గొప్ప వెలుగు వెలిగారు నాగయ్య. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది.
1938-1973 మధ్య నాగయ్య 200పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పటిలో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడు. 1948లో తమిళ సినిమా "భక్యదలి (?)" కి నాగయ్యకు లక్ష రూపాయలు పారితోషికం.
నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపధ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. తెలుగు సినీరంగంలో మొట్టమొదటి పద్మశ్రీ సత్కారం గ్రహించింది నాగయ్యే. మాన్యులు, సామాన్యులు కూడా నాగయ్యను విపరీతంగా అభిమానించే వారు.
సినీనిర్మాత
★★★★★
తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాల వలన ఆయన ఆస్తి బాగా కరిగిపోయింది.
వ్యక్తిత్వం
★★★★
ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన - తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, - నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. 'త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు.
దర్శకత్వం
★★★★★
దర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు - నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, 'త్యాగయ్య' ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధదర్శకుడు కె.విశ్వనాథ్ 'ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివీ అని కీర్తించారు. 'త్యాగయ్య సినిమాలోని 'ఎందరో మహానుభావులూ' పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును.
సన్మానాలు
★★★★★
నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య. "ఫిల్మ్‌ ఇండియా" సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్‌ముని' గా కీర్తించాడు. నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.
చివరి దశ
★★★★★
చివరి రోజులలో పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశాడు.
- పి.లక్ష్మీ నరసింహారావు
సికింద్రాబాదు

JAI GURUDATTA

JAI GURUDATTA

శ్రీ మాణిక్ ప్రభు - మారుతి !!
చాలకా పుర సమీపమున
నొక భీకర అరణ్యమున
మారుతి దేవాలయముబు కలదు !
అచటి మారుతి మహోగ్ర రూపి !
పూజారులు పెందల కడనే
పూజను ముగించి
తమ నిజ గృహములకు
వెడలేడివారు !
రాత్రి ఎవ్వరును అచ్చోట
నిద్రించ సహసించే వారు కారు !!
ఒకానొక దినమున పూజారి
గుడి తలుపులు తెరువగా
అచటి మారుతి తలపై
గుడ్డల మూట కనబడెను !
మూట విప్పి చూడగా
కాలి జొళ్ళ జత, కొన్ని బట్టలు
అందు కలవు !!
సమీపమున ఒక పాతిక [25]
సంవత్సరములు గల యువకుడు
గుర్రుపట్టి గాడముగా నిద్రించు చుండెను !
పూజారి ఆతనిని లేపి
ఈ వస్త్రపు మూట నీదా యని యడిగెను !!
అంత ఆ యువకుడు,
ఈ ప్రదేశంలో దొంగల భయ ముండుట వలన
జాగ్రత్తగా భద్ర పరచుమని మారుతి
కిచ్చితినని అమాయకంగా తెలిపెను !!
పూజారి ఊగ్రుడై కర్ర తీసుకొని
ఆ యువకుని గోట్టసాగెను !
మారుతి తన స్థలమున
గజ గజ వణికేను !!
చిత్రం ! భళారే విచిత్రం !
మారుతి మెడలోని పూలమాల
ఆ యువకుని గళమును అలంకరించెను !
మారుతి దేహముపై నున్న
వస్త్రము ఆతనిపై కప్పబడెను !
ఆ పూజారి అచ్చెరు వొందెను !!
ఎవరు శ్రీ రాముడో !
ఎవరు శ్రీ కృష్ణుడో !
ఎవరు శ్రీ విష్ణువో !
ఎవరు శ్రీ దత్తుడో !
వారే కలి యుగమున
శ్రీ మాణిక్ ప్రభువని తెలుసుకొని,
ఆ పూజారి పాదాక్రంతుడయ్యే !!
శ్రీ ప్రభు ఆతనిని అనుగ్రహించే !!

జ్ఞాన పుష్పం

అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః
సర్వ భూత దయా పుష్పం క్షమా పుష్పం విశేషతః |
జ్ఞాన పుష్పం తప: పుష్పం శాంతి పుష్పం తథైవ చ
సత్యం అష్ట విధం పుష్పో: విష్ణో హో ప్రీతి కరం భవేత్ ||
1. అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.
2. ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.
3. దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.
4. క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.
5. ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.
6. తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.
7. జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.
8. సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి. త్వరలోనే మిగతా పూలు పూయించండి.

అష్టసిద్ధులు.💐💐

అష్టసిద్ధులు.💐💐
సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?
సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ ఎవరో కాదు మీరే. మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం, కానీ మనం శరీరం కాదు. మనల్ని మనం తెలుసుకోవడమే, అన్నిటికి అతీతమైన ఆత్మ స్థితిని పొందే ప్రయత్నమే ఆత్మవిచారణ. అటువంటి ఆత్మానుభూతిని పొందే సులువైన పద్దతిని పరమశివుడు యోగం (యోగా) ద్వారా అందించారు. దాన్ని పతంజలి మహర్షి తిరిగి మానవాళికి అందించారు. ఆత్మ విచారణ చేసే క్రమంలో, సాధకునికి కొన్ని శక్తులు లభిస్తాయి. వాటితో ఆత్మవిచారణకు సంబంధం లేకపోయినా, వాటి మీద అధికమోహం అసలు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్ధులు 8 కనుక వాటిని అష్టసిద్ధులు అన్నారు. అవి
1. అణిమా - ఈ సిద్ధితో యోగి తన శరీరాన్ని చీమ కంటే, అణువుకంటే చిన్నగా మార్చుకోగలడు, పూర్తిగా అదృశ్యమవగలడు.
2. మహిమా - దీన్ని పొందడం ద్వారా యోగి తన రూపాన్ని చాలా పెద్దదిగా చేయగలడు, మేఘాలను చీల్చ్కుని, సూర్యుని తాకుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు.
3. లఘిమా - దీని ద్వారా దేహాన్ని చాలా తేలికాగా చేస్తారు, ఎండిన ఆకు, పక్షి ఈక కంటే తేలికగా యోగి దేహం మారిపోయే శక్తిని పొందుతుంది, ఈ సిద్ధితో గాలిలో తేలగలడు, నీటిపై నడువుగలడు.
4. గరిమా - భారీకాయంతో పర్వతాన్ని తపలిస్తూ యోగి మొత్తం గాలిని పీల్చేయగలడు.
5. ప్రాప్తి - ఈ సిద్ధితో యోగి, ఏ వస్తువునైనా తనకు నచ్చిన విధంగా రూపం మార్చగలడు, దాని స్థితిని మార్చగలడు. భవిష్యత్తును దర్శించగలడు, ఫోనులు మొదలైనవి అవసరం లేకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సంభాషిచగలడు, వ్యక్తిని చూసి మనసులో ఏముందో చెప్పగలడు, ఎవడు ఎలాంటివాడో, పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పగలడు, ప్రపంచంలోని అన్ని బాషలను అర్దం చేసుకుంటాడు, ఏ భాషలోనైనా మాట్లాడుతారు, జంతువులు, మృగాలు, పక్షులు, చెట్లతో కూడా మాట్లాడగలడు, వాటి భాషను అర్దం చేసుకోగలరు.
6. ప్రాకామ్య - ఏ ఇతర శరీరాల్లోకైనా ప్రవేశించగలరు, ఇదే పరకాయప్రవేశ విద్య.
7. వశిత్వం - అందరిని వశం చేసుకుంటారు. కౄర మృగాలను సైతం తన దగ్గర పెంపుడు జంతువులను చేసుకోగలరు, తన సంకల్పబలం చేత దుష్టులను కూడా అదుపు చేయగలరు, పంచభూతాలను సైతం తన అదుపులో ఉంచుకుంటారు.
8. ఈశిత్వం - యోగి దైవశక్తిని పొందుతారు, ఈశ్వరతత్వాన్ని పొందుతారు, ఈ ప్రపంచానికి అధిపతి అవుతాడు, మరణించిన వారిని కూడా బ్రతించగలరు..
ఇవి అష్టసిద్ధులు.
ఇవి పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో వివరించిన అష్టసిద్ధులు. మంత్రజపం చేత కూడా కలుగుతాయని గురువుల వచనం. కానీ ఇతరులకు అపకారం చేయడానికి వాడుకుంటే మాత్రం సిద్ధులు నశిస్తాయి..!!

Be good ..Do good..

" Let us discontinue the dirty practice of wining, dining and street rioting on 31st December "
~ A good message from Mr. Vl Sastry ~

🌷#అనఘష్టమి_సందర్భంగా🌷

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది. ఆ వ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.
అతని సతీమణి అనఘాదేవి.వారి సంతానం అణిమాది అష్ట సిద్ధులుగా చెపుతారు.మార్గశిర బహుళ అష్టమి నాడు ఆణి మాది అష్టసిద్ధులు అనఘాదేవి సమేతం గా దత్త దేవుని పూజిస్తే పాపనాశనం జరిగి అనెక శుభాలు జరుగుతాయాని కల్ప వచనం.అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ.అనఘాదేవి శ్రీమహాలక్ష్మి స్వరూపం. లక్ష్మీ అష్టోత్తరములో "అనఘా యైనమః"అని చెప్పబడినది.దత్తాత్రేయ స్వామి యొక్క యోగ శక్తియే అనఘాదేవి అంతేగాని ఆయన భార్య అంటే ఆయన వివాహం చేసుకున్నారని కాదు.ఆయన సాధించిన యోగ శక్తి వాటిద్వారా పొందిన అనిమాది అష్ట సిద్ధులు వారి కుమారులుగా చెప్పబడ్డాయి.ఆయన భౌతిక ముగా బ్రహ్మచారి.
దత్తుని రూపంలో అంతరార్థం:
శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే • మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.
• నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.
• ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.
• మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.
• త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.
• చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.
• డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.
• కమండలము:సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.
దత్త తత్వం:
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది.
🌺🌺🌺సర్వంశివసంకల్పం🌺🌺🌺

Friday, 28 December 2018

హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?
📌హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత
హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.
📌తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?
క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.
📌 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం
తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.
📌సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.
📌తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.
📌జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.
📌విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.
📌శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.
📌తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.
📌భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.
📌సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది ......

Thursday, 27 December 2018

| సిద్ధార్థ గౌతమ బుద్ధుని ధమ్మ‌పదం



|| సిద్ధార్థ గౌతమ బుద్ధుని ధమ్మ‌పదం ||
Original Pali language verse in English transliteration and with my English and Telugu translations.
మూల పాళీ భాషా శ్లోకం ఇంగ్లిష్ లిపిలోనూ, నా ఇంగ్లిష్ , తెలుగు‌ అనువాదాలతోనూ...
***
The original Pali verse in English transliteration:
|| Deeghaa jaagarato ratti
deegham santassa yojanam
deegho baalaanaam samsaaro
saddhammam avijaanatam. ||
***
My English rendition:
|| To the wakeful, night will be long. To the weary, road will be long. To the foolish who do not know the great virtue, the worldly life (Samsaara) will be long. ||
***

తెలుగు సేత:
|| మెలకువతో ఉన్నవారికి రాత్రి దీర్ఘంగా ఉంటుంది. అలసటలో ఉన్నవారికి దారి దీర్ఘంగా ఉంటుంది. సద్దర్మం తెలియని వారికి సంసారం (ప్రాపంచిక జీవనం) దీర్ఘంగా ఉంటుంది.||
***
|| Rochishmon ||
|| రోచిష్మాన్ ||

THE EVENING IS GOING TO PASS

THE EVENING IS GOING TO PASS
शाम बीत रही बीत जाने को है
ऐसा है के मैं उस लड़की की सारी तस्वीरें देख डालती हूँ
जिससे तुम्हारा प्रेम सा कुछ था शायद
तुलना करती हूँ मन ही मन
निष्कर्ष नहीं आता
भूलने की कोशिश में भी नहीं भूल पाती उसकी आँखें होंठ कॉलर की हड्डियाँ
तुलना नहीं होती
सराहने लगती हूँ के खूब सुंदर तो है
तुमसे पूछने मन नहीं होता
कि हमसे प्यार करते हो कितना कैसा करते हो
ये कहकर टाल देती हूँ
कि इसका जवाब जो मुझे संतुष्ट कर दे तुम्हें आता ही नहीं
कभी कभी ही तो तुमसे विलग होकर सोचती हूँ
तुम जताओ...
जितनी भी कविताएँ तुमने दूसरों की, पूर्व प्रेमी प्रेयसी की, भाव में भरकर मुझसे कही हैं
मैं भूलती हूँ चाहती हूँ
यही एक स्थान है जहाँ सब अबूझ होता रहा है
हारती हूँ थक जाती हूँ
खीझती हूँ कि सभी को तुमसे प्यार ही क्यों होना था
तुम लाख कह लो कुछ भी कह लो
मैं जब कुछ नहीं पाती
बेनाम चिट्ठीयों सा लिखा करती हूँ,
तुम्हारी
neहा

The evening is going to pass
It's like I see all the pictures of that girl
To whom your love was something maybe
I compare my mind.
Conclusion doesn't come
Can't forget even trying to forget her eyes lips collar bones
Don't compare
I start to appreciate that it is very beautiful.
I don't want to ask you
That you love us how much do you do
I turn away by saying this.
That the answer that makes me satisfied, you do not know.
Sometimes I think I'm going to be separated from you.
You Jatao...
All the poems you have said to me, the ex-lover of the beloved, the lover.
I want to forget
This is the place where everyone has been undeliberately
I lose, I get tired.
Grabbing why everyone had to fall in love with you.
You say million say anything
Me when I don't get anything
I write anonymous letters,
Yours

Ne ha


They can see the world

They can see the world
“Sages, mystics,poets ,wise people  shine so they can see the world, not so the world can see them.” 

Introduction to Radio DXing

Introduction to Radio  DXing
DXing means listening to far-away — usually foreign — radio stations. Listening to your regular hometown station is not DXing, but listening to a similar station thousands of kilometers away, outside the normal coverage area, is DXing.

"D" is said to mean distance and "X" refers to the unknown. DXers — hobbyists who enjoy DXing — try to pick up radio stations, which normally would not be audible at such a distance. 
DXing was the way to learn about the world and connect with the outside world in real time before satellite television and the Internet. Even today, DXing offers an intriguing and challenging way to get in touch with remote corners of the world.
Most DXers  are interested in  shortwave stations like All India Radio External Service, BBC,VOA(Voice Of America),Radio Japan,Radio Korea, Radio Australia,Radio Canada International,Voice of Germany, Radio Nederland etc.Radio propagation on most shortwave frequencies is rather similar. 
Send a reception report...
For future reference, all interesting signals are recorded. By reviewing notes and recordings made at the time of listening, many DXers compile reception reports, which they send to the station by mail — or nowadays mostly by e-mail. A reception report includes all the details of what, where, when and how the station was heard by the distant listener. Written program details or a recording should be enclosed as proof of having heard the station. In the report, DXers request a confirmation in return — this can be in the form of a letter, an e-mail or a "QSL" card from the station verifying that the signal was indeed theirs.

In the past reception reports used to be valuable feedback for international broadcasters, but nowadays when monitoring reception quality is in many causes automated and more professional, many stations find themselves inundated with reception reports that are not much use, and reply just out of courtesy. Domestic broadcast stations can however be positively surprised that their small local station has been picked up in a distant country, even though far-away listeners are not part of their target audience.

... and hope for a reply
DXers collect these verifications — known as QSLs — as mementos of their discoveries on the dial, and also to demonstrate how many stations they have been able to pick up. Even though QSLs can't be considered as definite evidence of hearing a station — as some stations routinely confirm even insufficient reports and other stations hardly ever reply to any reports — collecting QSLs remains a major pursuit for many DXers. Competitions between DXers are usually based on the number of QSLs received. Increasingly, also recordings of station identifications are collected, counted and saved as evidence of hearing remote stations.



Here You can find my QSL / Verification card received from Radio Korea in the year 1994 towards my Reception Report .
Explore the Hobby of Radio Dxing...It is fun,fascinating and educative!!!
~ With my Radio Dxer friends Mika, Mitual Kansal,Ananda Mohan Bain, Vasantha Vivekananda,Shaik Jawahar,Sekar PS, Sidhdhartha Bhattachaarjee and many across the globe ~




MY QSL COLLECTION

MY QSL COLLECTION


Wednesday, 26 December 2018

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి? 🏵️🙏
చేతికి గాజులందము...చెంపకు సిగ్గులందము’ అన్నాడో సినీ కవి. నిజమే...లేత తామరతూడులాంటి కన్నెపిల్ల చేతికి గాజులిచ్చే అందము మరేది ఇవ్వదు. కేవలం అందం కోసమే గాజులయొక్క ప్రయోజనం.. అని అనుకోవడం పొరపాటు. గాజులు..స్త్రీకి రక్షాకంకణం వంటిది. ఈ గాజులు ధరించడం వెనుక సాంప్రదాయబద్ధమైన ఎన్నో ప్రయోజనాలు దాగివున్నాయి. అప్పుడే పుట్టిన పసిబిడ్డలకు దిష్టి తగలకుండా ఉండడానికి నల్లగాజులు వేస్తారు. ఆ పసిబిడ్డ మెలుకువగా ఉన్నప్పుడు చేతులు ఆడిస్తూంటే.. ఆ చేతులకు ఉండే గాజులు..లయబద్ధంగా చేసే చిరుసవ్వడులు..ఆ పసివాణ్ణి పలకరిస్తాయి. అవి వింటూ..ఆ చిన్నారి ఆడుకుంటాడు. ఇలా ప్రారంభమైన గాజుల ప్రస్థానం..జీవితం చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రాచీనకాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ గాజులు ధరించేవారు. వీటిని ధరించడం వల్ల మనకు తెలియకుండానే నడకలో ఒక లాలిత్యం, లయ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు చాలా చిన్నతనంనుంచే ఈ గాజుల వాడకాన్ని అలవాటు చేస్తారు. ‘జీవితం చాలా విలువైనది..ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. గాజులాగే ఫగిలిపోతుంది’ అనే జీవన సత్యాన్ని చిన్నతనం నుంచే తెలిసేలా చెయ్యడం కోసమే.. ఆడపిల్లలకు ఈ గాజులు ధరింపజేసే ఆచారాన్ని అలవాటు చేసారు.
అయితే..‘ఆడపిల్లకే ఈ జాగ్రత్త అవసరమా..మగవాడికి అవసరం లేదా’ అనే సందేహం నేటి ఆధునిక స్త్రీలకు కలగడం తప్పు కాదు. కానీ..ప్రాచీనకాలం నుంచీ, నేటి వరకూ..స్త్రీని ‘గృహలక్ష్మి’ అని గౌరవించారేగానీ.. పురుషుని ‘గృహవిష్ణువు’ అని గౌరవించిన దాఖలాలు ఎక్కడా లేవు. అందుకే.. ఇల్లాలిని చూసి ఇంటిని చూడమన్నారు...పెద్దలు. మగవాడు..దుబారా మనిషి అయినా.. ఆ ఇంటి ఆడది జాగ్రత్తపరురాలైతే..ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు. అందుకే చిన్నతనం నుంచీ ఆడపిల్లకు జాగ్రత్త అలవాటు చెయ్యడం కోసమే..గాజులు వేసేవారు. రెండు చేతుల నిండా గాజులేసుకుని, పట్టుపరికిణీ కట్టుకుని.,సాక్షాత్తు లక్ష్మీదేవిలా..ఆడపిల్ల నట్టింటిలో తిరుగుతూంటే..చూడడానికి శోభాయమానంగా ఉంటుంది కానీ... బోసి చేతులేసుకుని..నడకలో ఓ లాలిత్యం లేకుండా పెద్ద పెద్ద అంగలేస్తూ, రాక్షసిలా ఆడపిల్ల తిరిగితే ఏం బావుంటుంది చెప్పండి. సరే...గాజుల విషయానికొద్దాం. గాజులు అందానికే కాదు.,సౌభాగ్యానికి కూడా చిహ్నం. గాజులు...తమ రంగునుబట్టి రకరకాల అర్థాలను తెలియచేస్తాయి.
ఎరుపురంగు గాజులు శక్తిని, నీలంరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చరంగు గాజులు అదృష్టాన్ని, పసుపురంగు గాజులు సంతోషాన్ని, నారింజరంగు గాజులు విజయాన్ని, తెల్లరంగు గాజులు ప్రశాంతతను, నలుపురంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. పెళ్లయిన ఆడపిల్ల...కడుపు పండి, పురిటికని పుట్టింటికి వచ్చిన వేళ.. ఐదోనెలలో గాని, ఏడోనెలలో గాని, సీమంతం చేస్తారు. ఈ కాలంలో తొమ్మిదో నెలలో కూడా చేస్తున్నారనుకోండి. అది వేరే సంగతి. ఈ సీమంతోత్సవంలో..పేరంటానికి వచ్చిన ప్రతి ముత్తయిదువు...ఆ సీమంతవధువు చేతులకు తలో జత మట్టిగాజులు తొడగడం అనాదినుంచి వస్తున్న ఆచారం. ఇలా గాజులు తొడగడం ఎందుకు అంటే... ఐదో నెలలోనే గర్భస్థ పిండానికి ప్రాణం వస్తుంది. అప్పటినుంచి ఆ స్త్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి. గాజులేస్తే జాగ్రత్త వస్తుందా.? వస్తుంది. గాజులు ఫగలడాన్ని అమంగళంగా, అశుభంగా భావిస్తారు మన భారత స్త్రీలు. అందుకే గాజులు ఫగలడాన్ని ఇష్టపడరు. గాజులు ఫగలకుండా నడవడం కోసమే.. సీమంతంలో గాజులువేసే సాంప్రదాయాన్ని ప్రతిపాదించింది మన శాస్త్రం.
ధనవంతులు రెండు చేతులనిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా..ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు)గాజులు వేసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం. ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఎంత పేదింటి అన్నయినా..చెల్లెలిని చూడడానికి వచ్చి, తిరిగి వెడుతున్నప్పుడు..ఓ పదో, పరకో చేతిలోపెట్టి..‘గాజులేయించకోమ్మా’ అంటాడు. ఇలా స్త్రీ జీవితంలో గాజులు చోటుచేసుకుని, వారికి అందాన్నిస్తూ, జాగ్రత్తలు నేర్పుతూ, తాము ఫగలకుండా, మన సాంప్రదాయాలు ఫగలకుండా కాపాడుతూ వస్తున్న గాజులను గౌరవిస్తే మన సాంప్రదాయాలను గౌరవించినట్టే.
గాజుల ధరించడం వలన స్త్రీ లకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. గాజులు ఒక్క స్త్రీ కే కాదు , పూర్వ కాలం లో పురుషులు కూడా ధరించేవారట.రాను, రాను ఈ ఆచారం స్త్రీలకు మాత్రమే అనేలా వచ్చింది.స్త్రీ మంచి చీరకట్టుకొని , ఎన్ని నగలు మెడలో ధరించినా , చేతులకు గాజులు లేవంటే అందమనేది రాదు కదా ? గాజు లు ధరించడం అనే సాంప్రదాయం , పుట్టిన పిల్లల నుండి వస్తున్నదే కదా ? ఎలా అంటారా ? పుట్టిన బిడ్డలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు. అది కేవలం దిష్టి కోసమే కాదు , ఆ గాజులనుండి వచ్చే సవ్వడులు,పసిపిల్లలను పలకరిచి వారిలో బోసినవ్వులను పూయిస్తాయట.
గాజులు ధరించడం వలన స్త్రీలలో నడవడిక మారుతుందట.ఎలా అంటే గాజులు సున్నితం గా ఉంటాయో,గాజులు ధరించిన స్త్రీ అవి పగల కుండా సున్నితం గా నడుస్తుంది , అలాంటి నడకవలన , నడవడిక మారుతుందట. అంతే కాదు జీవితం చాలా సున్నితమైనది , జాగ్రత్తగా ,పదిలంగా చూసుకోకపోతే గాజుపగిలితే ఎలా అతకదో , అలానే జీవితం కూడా సక్రమంగా ఉండదు అని అర్దమట. చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్ష్యాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట. గాజులు అందం తో పాటుగా స్త్రీ సౌభాగ్యం ప్రతిబింబిస్తుంది. అందుకే గాజులు పగులకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
శ్రీమంతం లో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు ? అనే దానికి మరో అద్బుతమయిన కారణాలు ఉన్నాయి .. అయిదవ నెలలో స్త్రీ గర్భం లో వుండే పిండానికి ప్రాణం వస్తుంది,శిశువు ఎంత సున్నితం గా వుంటుందో , తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో , గాజుల రూపం లో (గాజులు సున్నితమైనవే కదా ) తెలిజేస్తారట . మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాతం లో వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయట. స్వల్ప వత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయ లోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి, గర్బం లోని కండరాలు సరిగా పనిచేసేదానికి దోహదపడుతాయట.అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గర గా ఉంటాయి కనుక గర్బం లో వుండే శిశువు కు గాజుల సవ్వడి స్పష్టం గా వినబడి , శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయట.