Saturday, 12 December 2020

పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

 పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.

రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.

దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు

మరి ఇన్ని విశిష్ఠతలు ఉన్న జమ్మిచెట్టు ఎందుకు మాయం అవుతోంది?


జై శ్రీ రాం 

జై భారత్

🙏🌺🌺🌺🌺🌺🌺🌺🙏

Saturday, 28 November 2020

మహాత్ముల పరిచయం-.... పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

 


మహాత్ముల పరిచయం-386....

పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

Rajyalakshmi Srinivas Boddupalli

ఉమాబాయి, రఘునాధ్ స్వామి దంపతులకు 1849 సంవత్సరం లో జన్మించారు. తుంగభద్ర నదీ తీరంలో దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు.

త్రివేది బ్రహ్మణ కుటుంబం లో జన్మించిన వీరు చిన్నప్పుడు సంస్కృతంతో పాటు అనేక భాషలు మాట్లాడేవారు. తరువాత  గురువు అయిన యశ్వంత్ మహరాజ్ దగ్గర ఉపదేశం పొంది,దీక్ష  తీసుకున్నారు. గురువు ఆజ్ఞ పై 4 వర్ణాలవారికి అర్ధం అయ్యేలా ధర్మ బోధ చేయడం తన లక్ష్యం గా పెట్టు కున్నారు. వీరు 

జాతవేద మహవాక్య గ్రంధం,వేదాంత కౌముది,హరి పాట్,శుభేదా భజన మాలిక వంటి గ్రoధాలు అందరికి అర్ధం అయ్యేలా రచించి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ లలో  పర్యటించి ప్రజలకు జ్ఞానబోధ చేసారు.   వీరు ఉన్న చోట దత్త  మందిరాలు కట్టించేవారు. అక్కడ ఒక ఆచార వ్యవహారాలను, పద్ధతి ప్రవేశపెట్టి ప్రజలను ఉద్ధరించారు.

అనేకమందిని ఆధ్యాత్మిక చర్చలలో ఓడించి, ఆధ్యాత్మిక మార్గంలో కి తీసుకొచ్చారు. కష్ట జీవులలో ఎక్కువగా ఉంటూ,వారిని ధర్మ మార్గం వైపు నడుపుతూ మద్యపానం, ధూమ పానం,అనాగరిక పనులు మానిపించేవారు. వారిని దత్త భక్తులు చేసి,ఆధ్యాత్మికంగా మార్గ నిర్దేశం చేశారు. ఎక్కువగా తుంగభద్ర నదీ ప్రాంతంలో వీరిచే ఉద్ధరించబడిన సంప్రదాయం కనపడుతుంది.అందరితో "జయ సచ్చిదానంద" మంత్రంతో భజనలు చేయించేవారు. జ్ఞాన ప్రచారం చేసేవారు. ఇప్పటికే వీరు రాసిన భజనలు తుంగభద్ర నది తీర గ్రామాల్లో వినపడుతున్నాయి.చివరకు పాలగరణాజిక్ అనే  కొండ పై 26-జనవరిలో/1912 సంవత్సరం లో వేలాదిమందిని దత్త సంప్రదాయం లోకి మళ్ళించి సమాధి చెందారు.

శ్రీ గురుశరణం!నమో గురవే వాసుదేవాయ !

 దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


Part-67

నమో గురవే వాసుదేవాయ !

శ్రీ గురుశరణం!

ఒకసారి స్వామి వారు మాణ్గావ్ లోని నారోపంత్ ఉకిడవే తో మంచి గంధం చెక్కతో చిన్న మంచం దత్త స్వామి పవళింపు సేవ కోసం చేయించారు. అతను తయారుచేసి తీసుకొచ్చాడు. భక్తుల సమక్షంలో స్వామికి సమర్పించాడు. అందరూ అతనిని తయారుచేయడానికి ఎంత పైకం ఖర్చయింది. ఉకిడవే భగవంతుని కోసం, నేను లెక్కపెట్టలేదు అన్నాడు. స్వామి వారు కూర్చుని ఇదంతా వింటున్నారు. వెంటనే స్వామి వారు 23 రూపాయల 12అణాలు అన్నారు. అప్పుడు ఉకిడవే ఖర్చు లెక్కవేయగా సరిగా అంతే వుంది. అందరూ ఆశ్చర్యపోయారు.

దత్త దర్శనం:

 దత్త దర్శనం

తెలుగు సరళం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

నైమిశారణ్యం లో ఆధ్యాత్మిక ఉన్నతస్థితిలో ఉండే ఋషులు,మునులు ప్రజలకు కావలసిన ధర్మాలు,వ్రతాలు,వాటి నియమాలు తెలుపు సూతమహా ముని సమక్షంలో కూర్చుని శ్రీ వాసుదేవుని ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తులు అయ్యారు. గాలి లేనప్పుడు ఉండే నీటి వలే కదలక  ఆధ్యాత్మిక తాదాప్యంలో ఉన్నప్పుడు పరిమళ సుగంధముల చిరుగాలి వీచింది. ఆ గాలితో పాటు సమస్త విశ్వమును ప్రకాశింప చేస్తూ కొన్ని కోట్ల సూర్యులు ఉదయించినట్లు తేజస్సు కనపడింది. తరువాత మునులకు మంగళ వాద్యముల ధ్వనులు వినపడ్డాయి. ఆ తేజస్సును చూడలేక మునులు కన్నులు మూసుకొని కూర్చుని, బంగారు గని దొరికినను చేజిక్కించుకోలేని దురదృష్టవoతునివలే ఎదురుగా కనపడుతున్నా కూడా చూడలేక పోతున్నామని ప్రార్ధిస్తున్నారు. అప్పుడు మేఘ ధ్వని వంటి వాక్కు వినపడి కళ్ళు తెరవమంది. వారికి అనంతుడు అను శ్రీ దత్తమూర్తి కనిపించారు. ఆ మునులు స్వామిని చూడగానే ఎలా ఉన్నారో స్తుతించారు.

1.దేవదేవం మహాత్మానం ! పరమానంద విగ్రహం!

విశ్వరూపం మహాభాగం! విచిత్రామలవర్చసమ్ !

భావము::🙏 దేవదేవుడు, మహాత్ముడు, ఆనందమూర్తి, విశ్వరూపుడు, చావు పుట్టుకలు లేక, సాటిలేని కీర్తిని కలిగినవాడు( మహాభాగుడు) అయినటువంటి దత్త దేవుని చూచిరి.🙏

2.తేజోమండలమధ్యస్థం ! ఉద్యంత మివ భాస్కరం!

త్రివర్ణం త్రియుగం త్రంశ్యం! త్రిగుణేశం త్రయీమయం॥

భావము:: తేజోమండలము లాగా వెలుగుతున్న, ఉదయించిన సూర్యుని వలె వున్నట్టి, నలుపు, తెలుపు, ఎరుపు  రంగులు కలిగి, ఆరు చేతులతో ఆవిర్భవించిన,బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశములు కలిగినట్టి, త్రిగుణాలుకు ఈశుడైనట్టి,ఋగ్, యజుర్వేద, సామవేద స్వరూపుడగు దత్త దేవుని చూసిరి🙏

3.ఆదిమధ్యాంతరహితం ! అనంతేతి చ విశ్రుతం!

బ్రహ్మోపేంద్రేశరూపం ! క్వచిదేకం పృథక్క్వ చ!

భావము:: ఆది, అంతము,నాశనము లేనివాడు, అనంతుడు,త్రిమూర్తి స్వరూపుడు, ఒక్కడే అనేక రూపములు ధరించినవాడు అయిన దత్తాత్రేయుని చూసిరి.🙏

4.రక్త చందన లిప్తాంగం! హంసవాహనమచ్యుతం

స్వరాలింగిత వామాంగం! ద్విభుజం ద్విజ దైవతం!

భావము::🙏 ఎర్రని మంచి గంధము పూయబడిన శరీరము కలిగి హంసవాహనమును ఎక్కిన బ్రహ్మ గానూ, శ్రీదేవి తో కూడిన విష్ణువు గాను, ఎడమభాగమున దేవితో కూడిన  శివుడు గాను, రెండు భుజములు కలవాడును, ద్విజులకు దేవతయైన దత్త స్వరూపమును చూసిరి.🙏


5.కమండలుం చ బిభ్రాణం! పూర్ణం దివ్యాంబునా సదా!

దివ్యపద్మాక్ష మాలాంచ! యజ్ఞసూత్రం తథైవ చ॥ 

భావము:: దివ్యమగు జలముతో నిండిన కమండలమును, దివ్య జపమాలను, యజ్ఞోపవీతమును ధరించినట్టి దత్త స్వామిని చూసిరి.🙏

6.చతుర్భుజం చతుర్వేదం ! చాతుర్హోత్రప్రవర్తకం !

ప్రజాపతిపతిందేవం ! జపంతంబ్రహ్మవాగ్యతం !

భావము:: నాలుగు భుజములు కలవాడును, నాలుగు వేదముల స్వరూపుడు, యజ్ఞప్రవర్తకుడు, బ్రహ్మకు ప్రభువైనట్టి వాడు, బ్రహ్మ జపమను చేయుచున్నట్టి ఆ దివ్యమైన దత్త స్వరూపమును మునులు చూసిరి.🙏

Wednesday, 25 November 2020

భోజనం

9thSponnsfootredSubramanyam valluri
ఇరవైఒకటవ శతాబ్దంలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా వుండే వస్తువుల్లో భోజనాల బల్ల ఒకటి. ఇది లేకపోతే సైకిల్ ఉండి చక్రాలు లేవు అన్న చందంగా ఉంటుంది నేటి ఇల్లు.
గత నలబై ఐదు - ఏబై ఏళ్ళలో దేశంలో వచ్చిన ఫ్యాషన్ల ప్రభావం వల్లనో , మారిన జీవనశైలి వల్లనో ఈ వస్తువు మన ఇళ్లల్లో ప్రముఖంగా కనిపించడానికి కారణం అయ్యుండొచ్చు. (పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు) శారీరక శ్రమ లేకపోవడం, సుఖాలకు బాగా అలవాటు పడడం వల్ల కింద కూర్చుని తినే అలవాటు పోగొట్టుకున్నాం.
ఒకప్పుడు మా వయసు వారి చిన్నతనంలో అందరి ఇళ్లల్లో కింద కూర్చుని , కలిసి భోజనం చేయడం,పెరట్లో అరటిచెట్టు ఉన్నవాళ్లు అతిధులతో పాటు ఇంటిల్లపాదికి అరటిఆకు, పీట వేసి వడ్డించడం ఉండేది. తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుకొచ్చి నింపాదిగా, సంతృప్తిగా భోజనం అరగించేవారు.
అసలు విషయం కూర్చోవడంలోనే ఉంది. బాసింపట్టు వేసుకుని విస్తరి ముందు కూర్చుని భోజనం చేయడం ఆచారమే కాకుండా, శాస్త్రాన్ని పొందుపరిచారు మన పూర్వీకులు. రెండిటి సమ్మేళనం ఎంతో ఆరోగ్యదాయకం. నేటి పిల్లలకు ఎంతమందికి తెలుసు ఈ విషయం.
పురావస్తు ఆధారాల ప్రకారం, మన పూర్వీకులు ఎన్నో వస్తు సామగ్రి వడ్రంగులతో చేయించుకునేవారు. ఇల్లు కట్టేటప్పుడు దూలాలు, నగిషీలు చెక్కిన స్తంభాలు , కిటికీలు , సింహద్వారాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దేవారు. వాటితోపాటు ఇంట్లోకి అవసరమైన మంచాలు, కుర్చీలు, రాసుకునే బల్లలు, బోశానం పెట్టెలు, బీరువాలు, ఉయ్యాల బల్లలు , వంటింట్లో పాలు పెరుగు, వెన్న దాచుకోవడానికి ప్రత్యేక అలమార్లు ఇత్యాదివి చేయించుకున్నవారు భోజనాల బల్ల , కూర్చోవడానికి కుర్చీలు మాత్రం చేయించుకునేవారు కాదు.
కారణం మడి, శుచి,అంటు, శుభ్రత మాత్రమే కాకుండా కొన్ని సమిష్టి కుటుంబాల్లో జనాభా కూడా ఎక్కువుగా ఉండేది. ఒక చూరు కింద ఏబై అరవై మంది నివసించేవారు.
భోజనానికి మాత్రం విశాలమైన గది ఉండాల్సిందే, బాసింపట్టు వేసుకుని భోజనానికి ఉపక్రమించేవారు. దేశంలో ఏ మూల కెళ్లినా ఇదే సంప్రదాయం. కూర్చోవడం యోగ సూత్రాల మీద ఆధారపడి నిర్ధారించబడింది. ఇందుకు అందరూ సమానులే, వారి హోదా, కులం ఏవి అడ్డొచేవి కావు ఈ "సుఖాసన బైటాయింపుకు".
ఈ క్రింద కూర్చోవడం అనే అలవాటు వల్ల ప్రతి ఒక్కరిలో వినయాన్ని పెంపొందించేవి. అలాగే భూమాతకు దగ్గర ఉన్న భావం కలిగేది. ప్రతికూల లక్షణాలైనటువంటి అహం, క్రోధం, ఆశ లాంటివి అదుపులో ఉండేవి. సుఖాసనం ధ్యానంలో భాగం అవడం వల్ల ఏకాగ్రత, ప్రశాంత భావాలు పెరిగేవి. సుదీర్ఘకాలంలో ఇదే ఆసనం వల్ల ఎక్కువుసేపు పూజలో నిర్మలంగా కూర్చోవడానికి దాహోదపడేది.
ఇవే కాకుండా ఇతర శాస్త్రీయ కారణాలు ఉన్నాయి, సుఖసనంలో కూర్చోవడంతో ప్రతి ముద్దకు కొద్దిగా ముందుకు వంగాలిసి వచ్చేది, మళ్ళీ నిటారుగా అయ్యి స్థిమితంగా నవులుతూ ముద్ద మింగేవారు. ఈ ముందుకు వెనక్కు జరగడం వల్ల కడుపు కండరాల మీద ఒత్తిడి పడేది, ఆ ఒత్తిడి వల్ల కడుపులోని గ్రంధులు ఆరగడానికి అవసరమయ్యే రసాయనాలు విడుదల అయ్యేవి.దాంతో అరుగుదల సులువయ్యేది
అరగడానికి మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు ఉండేవి ,ఒత్తిడివల్ల కడుపు, తక్కువ ఆహారానికే నిండినట్టుగా అనిపిస్తుంది, ఒక రకంగా మితాహరం వల్ల భుక్తాయాసం వుండేది కాదు.
బరువు పెరిగే అవకాశాలు తక్కువ, బోజనంతరం వంగి పనులు చేసుకునే ఆస్కారం ఉండి రక్త ప్రసరణ బావుండేది, ఇంకో అతి ముఖ్య లాభం వెన్నుముక్కకు ఏరకమైన ఇబ్బంది లేకుండా నిటారుగా ఉండేది. ఈ పలు కారణాలవల్ల భారతీయులు కింద సుఖాసనం వేసుకుని భోజనం చేసేవారు శతాబ్దాలపాటు. సరిగ్గా చెప్పాలంటే ఇరవయ్యవ శతాబ్దం మూడొంతుల వరకు ప్రతి ఇంట్లో కిందే కూర్చుని భోజనాలు చేసేవారు.
ఇదంతా జీవితంలో యాంత్రీకరణ పెరిగి, ప్రపంచం ఒక పల్లెటూరు అయిపోవడంతో పెక్కుమార్పులు చోటు చేసుకున్నాయి , ఆధునీకరణలో భాగంగా భోజనాలకు బల్ల వచ్చి తిష్ట వేసింది ప్రతి గృహంలో. పెళ్లిళ్లలో అయితే ఎంత హోదా కలవారైనా చెప్పులు లేదా బూట్లు వేసుకుని పళ్ళెం చేత్తో పట్టుకుని ఓ పదిళ్ళు తిరిగినట్టు, పదుగురి ముందు పళ్ళెం చాచాల్సిందే. సహపంక్తి భోజనాలు మృగ్యం ఈ కాలంలో, ఒకవేళ వున్నా వడ్డించేవారు సిగ్గుపడడం చూసి తీరాల్సిందే. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందాన , అరవై డెబ్బై పదార్థాల్లో వడ్డీయింపుకు వచ్చేసరికి పదార్థాలు తగ్గినా వడ్డించేవారికి తక్కువుగా వడ్డించమని మొదటే ఆదేశాలు అతని యజమాని ఇస్తాడు(క్యాటరర్) ఇంకొంచం వడ్డించమంటే విననట్టు వెళ్ళిపోతారు.
మా ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తే ఇప్పటికి నేల మీద సుఖాసనం వేసుకుని భోజనం చేస్తాం. అతికొద్దిమంది కూర్చోలేనివారికి కుర్చీ చిన్న బల్ల ఏర్పాటు. మేము అన్నీకింద పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం.
సుబ్రహ్మణ్యం వల్లూరి.

Tuesday, 24 November 2020

| దత్తాత్రేయ మంత్రాలు |

 | దత్తాత్రేయ మంత్రాలు |

1.సర్వ బాధ నివారణ మంత్రం.
“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||”
2. సర్వరోగ నివారణ దత్త మంత్రం.
“నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే||”
3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం.
“అనసూయాత్రి సమభూతో దత్తాత్రేయో దిగంబర: స్మర్తృగామీ స్వభక్తానాం ఉధ్ధర్తా భవ సంకటాత్||
4.దరిద్ర నివారణ దత్త మంత్రం.
“దరిద్ర విప్రగ్రేహే య: శాకం భుక్త్వోత్తమ శ్రియమ||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||”
5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం.
“దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం||
యో భూదభీష్టదః పాతు సనః సంతాన వృద్ధికృత్||”
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం.
“జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుహా||
మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు||”
7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం.
“అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||దత్తాత్రేయం తమీశానం నమామి ఋణముక్తయే||”
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం.
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం.
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం.
విద్వత్సుత మవిద్యం య అగతం లోక నిందితం|| భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తః శరణం మమ||
11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు..
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే||
విధానం:
ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి ప్రతి రోజూ ఉదయం జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి ..🙏

Friday, 20 November 2020

గురు చరిత్ర.. గుప్త భావం..🙏🏻 అధ్యాయం- 52

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురు చరిత్ర.. 

గుప్త భావం..🙏🏻


అధ్యాయం- 52

అచేతనావస్థలో ఉండి పోయిన ఈ  శరీరం లో ఉన్న ఆత్మకి మోక్షం ఇంకా లభించ లేదు. గురువు చివరి బాధ్యత గుర్తు చేస్తారు.ఈ విశ్వవ్యాపి అయిన ఆ పరమాత్మ అన్ని జీవులలో వున్నారు కనుక మిగతా జీవులకు కూడా ఈ ఆనందస్థితి చేరడానికి, తరిపజేయడానికి  సహాయం చేస్తూ,సేవిస్తూ మార్గదర్శనం అయి,సేవ చేస్తేనే మీకు మోక్షం కలుగుతుంది. అంటూ తననిజస్థితి లో తాను లేకుండా కలిసిపోయి ఇక మిగిలింది ఒక్కటే.పరమాత్మ స్వరూప్.అదే గురు చరిత్ర.

అవధూత చింతన శ్రీ గురు దేవ దత్త.

జై గురు దేవ దత్త🙏🌸🌼🕉️

పరమ పవిత్రమైన స్కంద షష్ఠి:

  పరమ పవిత్రమైన స్కంద షష్ఠి


స్కంద షష్టి కార్తీక మాస శుక్ల షష్ఠి రోజున తమిళనాడులో జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటాం కానీ ఈ స్కంద షష్ఠి వేరు, సుబ్రహ్మణ్య షష్ఠి వేరు అని గమనించాలి. ఆది దంపతులైన ఆ శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధించే అతి పవిత్రమైన రోజు ఈ స్కంద షష్టి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మనం జరుపుకునే సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, తమిళనాడులో జరిపే స్కంద షష్ఠి అయినా రెండిటిలోనూ సుబ్రహ్మణ్యుని ఆరాధన ఒకే విధంగా ఉంటుంది. అంతే కాదు, ఏ మాసంలో అయినా షష్ఠి తిథి రోజున ఇలా ఆరాధించడం అత్యంత ఫలప్రదం.


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ వృత్తాంతాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము.


తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలనూ భయభ్రాంతులకు గురిచేస్తూ లోకకంటకుడుగా ఉన్నాడని దేవతలు అందరూ బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు.


ఈ తారకాసురుడు అమిత బలశాలి, తపోబల సంపన్నుడు. ఈశ్వర తేజాంశ వలన సంభవించిన వాని వల్ల మాత్రమే మరణము పొందగలడు అని వరము కలిగి ఉన్నాడు. అందుచేత, మీరందరూ ఆ మహాశివుని శరణు వేడి, ఆయనకు మరియు హిమవంతునకు పార్వతీ దేవి రూపమున జన్మించిన సతీదేవికీ, వివాహం జరిపించిన, వారికి కలిగే సంతానము ఈ లోకకంటకుని సంహరించగలడు అని సెలవిచ్చాడు. అప్పటికే తపోనిష్ఠలో ఉన్న పరమశివునికి, వారిని సేవిస్తూ సర్వోప చారములూ చేస్తున్న పార్వతీ దేవికీ మధ్య ప్రణయ బంధాన్ని పెంపొందించే విధంగా మన్మధుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో మన్మధుడు తన ప్రాణాలను పోగొట్టుకున్నప్పటికీ, పార్వతీ పరమేశ్వర వివాహం సంపన్నమయింది. వారి వివాహానంతరమూ దేవతల విన్నపము మేరకు మన్మధుని పునర్జీవిమ్పజేస్తాడు మహాశివుడు.


అటు పిమ్మట పార్వతీ పరమేశ్వరుల ఏకాంత సమయాన అగ్నిదేవుడు ఒక పావురము రూపమున ఆ ప్రణయ మందిరమందు ప్రవేశిస్తాడు. అది గ్రహించిన మహాశివుడు తన దివ్య తేజస్సును అగ్నియందు ప్రవేశపెడతాడు. ఆ శక్తిని భరించలేక అగ్నిహోత్రుడు ఆ తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. గంగానది తనలోకి చేరిన ఆ తేజమును ఆ సమయంలో నదీస్నానం ఆచరిస్తున్న షట్ కృత్తికలనబడే దేవతల గర్భాన ప్రవేశపెడుతుంది. ఆ రుద్ర తేజమును తాళలేక ఆ దేవతా స్త్రీలు రెల్లు పొదలయందు విడిచిపెడతారు. ఈ ఆరు తెజస్సులు కలిసి ఆరు ముఖాలు కలిగిన దివ్య బాలునిగా ఉద్భవిస్తాడు. ఆరు ముఖములు కలిగిన వాడు కావున షణ్ముఖుడు అని పిలువబడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీపరమేశ్వరులు ఆ బాలుని కైలాశానికి తీసుకునివెళ్లి పెంచుకుంటారు.


ఈ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందున గాంగేయుడు అని, షట్ కృత్తికలు పెద్ద చేసిన కారణాన కార్తికేయుడు అని, ఆరు ముఖాలు కలిగి ఉండటం వలన షణ్ముఖుడు అని, గౌరీశంకరుల పుత్రుడు అయిన కారణాన కుమార స్వామి యని పిలువబడతాడు.


ఈతడిని దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు శూలం, పార్వతీ దేవి శక్తి, మరియు ఇతర ఆయుధాలను అందించి సర్వశక్తి సంపన్నుడిని చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా చేస్తారు. దేవసైన్యానికి సైన్యాధ్యక్షుడైన ఈ సుబ్రహ్మణ్యుడు తారకాసురుడనే అసురుడితో రకరకాలైన శక్తులతో మరియు రూపాలతో పోరాడి సంహరించాడు. యుద్ధ మధ్యలో సర్ప రూపం దాల్చి రాక్షస సేనను చుట్టుముట్టి వారిని సంహరించాడు.


ఆయన రెల్లుపొదలలో జన్మించడం చేత ఆయనను శరవణభవుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు తారకాసుర సంహారం అనంతరం బ్రహ్మ పట్ల తన అహంభావాన్ని ప్రదర్శించడంతో ఆతని తండ్రి అయిన ఆ మహాశివుడు హెచ్చరించాడు. ఆ తరువాత తన తప్పు తెలుసుకుని కఠోరమైన తపస్సును చేస్తాడు. శరీరంలో కొలువై నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తిని మేల్కొలిపి సమస్త దుర్గుణాలను జయించాడు. ఆయన మహాకఠోర తపస్సాధన వలన సహస్రాకారం చేరుకొని బుద్ధిని వికసింపజేసుకున్నాడు. స్వచ్ఛమైన మనసు మరియు వికసించిన  బుద్ధి కలవాడిగా మారిన కారణంగా ఆయనను సుబ్రహ్మణ్యుడు అని పిలుస్తారు.


తారకాసుర సంహారసమయానికి ఆయన బ్రహ్మచారి. అటు తర్వాత శ్రీ మహావిష్ణువు కోరిన కారణంగా ఆయన వల్లీ మరియు దేవసేనలను వివాహమాడెను. ఈ స్కంద షష్టి నాడు నాగ ప్రతిమలను మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించుకుని ఆయన ఆరాధన చేయడం మనం చూస్తూ ఉంటాము.


స్కంద షష్ఠి పూజా విధానం :


స్కంద షష్టి నాటి ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి ఎటువంటి ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకుని పువ్వులు, పళ్ళు మరియు పడగల రూపాలను స్వామికి సమర్పించవచ్చు. 


పిండి దీపం అంటే వరి పిండి, బెల్లము కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి, నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియూ సాయంత్రం వేళల్లో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యుని చరిత్ర, స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్లి దర్శించుకోవాలి. చలిమిడి, చిమ్మిలి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లీ మరియు దేవసేనాదేవిలతో సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా జరిపించడం చూస్తాము.


బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్టినాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా చూస్తాము.


ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి మొక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాము. ఈ కావడి కుండలను పంచదార, పాలు, పెరుగు, పూలు, వెన్న, నెయ్యి, తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ట చేసినవారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాల ప్రాంతాలలో ఉంది.


ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు, దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాము. ఇది ఒకరకం గా సమాజ శ్రేయస్సు గా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలై బీదలు సరైన నీడ లేక ఇబ్బంది పడే ఈ సమయం లో ఇటువంటి దానాలు భక్తులకున్న భక్తిని మరియు సమాజ శ్రేయోదృక్పదాన్ని కూడా చాటి చెప్పుతాయి.


ఇంతటి పవిత్రమైన రోజున సుబ్రహ్మణ్య స్తోత్రాలు మరియు సంతాన సాఫల్యం కలగజేసే షష్టి దేవి స్తోత్రం పఠించడం అత్యంత ఫలప్రదం!


 ఓం శరవణభవ

శ్రీ కావ్యకంఠ గణపతి ముని -----చాగంటి వారు

 శ్రీ కావ్యకంఠ గణపతి ముని


-----చాగంటి వారు


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



దక్షిణ దేశములో గొప్ప ఉపాసకులైన శ్రీ కావ్యకంఠ గణపతిముని ఉండేవారు.


 వారు భగవాన్ రమణుల అంతేవాసి.


 ఆయనా, వారి తమ్ముడు అరుణాచలము వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి, రాత్రి అయింది. తమ్ముడు ఆకలి అని అంటుంటే గణపతి ముని వద్ద డబ్బులు లేక బ్రాహ్మణ వీధిలో ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి తమ్ముడు ఆకలికి ఏడుస్తున్నాడు అన్నము పెట్టమని అరుస్తున్నారు. 


అందరూ 'ఈరోజు ఏకాదశి, ఉపవాసము' అని చెప్పారు.


 ఆయన తమ్ముడి ఏడుపు చూడలేక భగవంతుని ప్రార్ధన చేస్తూ శ్లోకము చదువుతూ వెళ్ళిపోతున్నారు.


 ఒక అరుగు మీద పడుకున్న బ్రహ్మణుడు లేచి 'మీరు అన్నము కోసము తిరుగుతున్నారా!' అని అడిగాడు. అవును అని చెప్పారు ముని. 


'ఎంత అదృష్ఠము! నా భార్యకి ఒక వ్రతము ఉంది. వంట చేసి ఏకాదశి నాడు సాయంకాలము ఇద్దరు బ్రహ్మణులకి  భోజనము వడ్డిస్తుంది. ఇవ్వాళ ఎవరూ యాత్రికులు కూడా దొరక లేదు. అన్నీ వండుకుని ఇలా పడుకున్నాము. రండి' అని పిలిచి లోపలికి తీసుకుని వెళ్ళారు. 


గణపతిముని ఏకాదశినాడు భోజనము చేసేవారు కాదు. ఇద్దరు ఉంటే గానీ ఆవిడ వ్రతము సిధ్ధించదు అని ఆయనా మడి కట్టుకుని భోజనమునకు కూర్చున్నారు.


 ఆవిడ పార్వతీదేవి లాగా నడచి వచ్చి, కాశిలో వ్యాస భగవానునికి అన్నపూర్ణమ్మ అన్నము పెట్టినట్లుగా అన్నము పెట్టినది. ఇద్దరూ కడుపునిండా అన్నము తిన్నాకా ఆమె కొంత ద్రవ్యమును పెట్టి తాంబూలము ఇచ్చింది. 


అన్న, తమ్ముడు 'అమ్మా! భుక్తాయాసముగా ఉన్నది. ఎక్కడకు వెళ్ళలేము అరుగు మీద పడుకుంటాము' అంటే ఆమె పడుకోమన్నది. 


ఇద్దరూ బట్టల మూటలు తల కింద పెట్టుకుని నిద్రపోయి, తెల్లవారుఝామున లేచి నిన్న రాత్రి మనకు అన్నము పెట్టిన ఆమెకు నమస్కారము చేసుకుందామని చూస్తే ఆ ఇల్లు లేదు. 


వాళ్ళు పడుకున్న అరుగు, ఆమె ఇచ్చిన తాంబూలము, అందులో డబ్బు అలాగే ఉన్నది. 


ఇంటికి బదులుగా వినాయకుడి గుడి ఉంది. 


ఇది కావ్యకంఠముని జీవితములో యదార్ధముగా జరిగిన  సంఘటన. 


ఆయన ఆర్తి చూసి అమ్మవారే ఆయనకు అన్నం పెట్టింది.


కావ్యకంఠ గణపతి ముని గొప్ప ఉపాసకులు, గురుభక్తి తత్పరులు. 


ఒకప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఒక విచిత్రమైన నిర్ణయము తీసుకున్నారు. అరుణాచలములో రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి తాను 21 రోజులు దీక్ష తీసుకుని ఉమా సహస్రమును రచన చేస్తానని చెప్పారు. అక్కడ మామిడి గుహలో కూర్చుని కావ్య రచన మొదలు పెట్టారు. 


కొద్ది రోజులు అయ్యేసరికి  బొటనవేలు మీద పెద్ద గోరుచుట్టు వేసింది. 


అమ్మవారి అనుగ్రహానికి ఆమె గురించి రచన చేద్దామన్నా ప్రారబ్ధము అడ్డు పడుతున్నది. లోపల మేధాశక్తి, సంస్కృత ప్రవాహము ఉన్నా నొప్పి వల్ల వ్రాయలేకపోతున్నారు. 19 రోజులు అయిపోయాయి. ఇంకా 250 శ్లోకములు వ్రాయాలి


. శిష్యులు 'మీ దీక్ష పాడైపోయిందా? ఉమాసహస్రము అవదా ? ఆ తల్లి అనుగ్రహము కలగలేదా?' అన్నారు. గ


ణపతి ముని – ‘నన్ను ఏ ప్రారబ్ధము వెంబడించి వేలిమీద గోరుచుట్టుగా నిలబడిందో అది తీసివేసి మిగిలిన శ్లోకములను ఆ తల్లియే పూర్తి చేయించాలి. అమ్మ అనుగ్రహము కలిగితే తప్పకుండా పూర్తి  చేయిస్తుంది’ అని ఆ రాత్రి పడుకున్నారు.


 తెల్లవారితే 20 వ రోజు. తిరువణ్ణామలై లో పుణ్యకోటి అనే వైద్యునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు కలలో కనిపించి 'ఎంతో వైద్యము తెలిసిన వాడివి, చేత కాని వాడిలా పడుకున్నావు. కొండ మీద గుహలో ఒక బ్రాహ్మణుడు ఉమాసహస్రము రచన చేస్తున్నాడు. అతని దీక్షాకాలము పూర్తి కావస్తున్నది. ఆయన వేలికి గోరుచుట్టు లేచింది. పరికరములు అన్నిటినీ పట్టుకెళ్ళి నీ శక్తి అంతటినీ ప్రదర్శించి గోరుచుట్టును తొలగించి కట్టు కట్టి ఉమాసహస్రము పూర్తి చేసే శక్తినివ్వు' అన్నారు.


 ఆయన రమణ మహర్షి దగ్గరకు వెళ్తే ఆ వైద్యుని ఆమ్రగుహలోకి తీసుకెళ్ళారు. ఆయనలోకి అమ్మవారు ప్రవేశించింది. రాత్రి ఎనిమిది అయింది. 


వైద్యుడు కట్టు కట్టినా గణపతిముని ఘంటమును పట్టకోలేక పోతున్నారు. తెల్లవారే లోపల 250 శ్లోకములు పూర్తి కావాలి. శిష్యులు 'కొద్ది సమయమే ఉన్నది. ఐదుగురు లేఖకులను తీసుకుని వస్తాము. వారు పుస్తకములు, కలము పట్టుకుని కూర్చుంటే మీరు శ్లోకములను చెపితే వారు వ్రాస్తారు. చెప్పేస్తారా ?' అని అడిగితే గణపతి ముని 'అలాగే తీసుకుని రండి' అన్నారు.


 గణపతి ముని  తన చేతిని ఒళ్ళో పెట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. ఆయన నాలుక మీద శారద నిలబడింది. ఆ సమయములో రమణ మహర్షి వచ్చి వెనక ఉన్న అరుగు ఎక్కి పడుకున్నారు. ఆయన ఎందుకు వచ్చారో తెలియదు.   


గణపతి ముని  తన చేతిని ఒళ్ళో పెట్టుకుని లేఖకుల వంక చూస్తూ ఐదు వృత్తములతో ఒక్కక్కరికీ ఒక్కక్క పాదము చొప్పున చెపుతూ మొత్తము శ్లోకములు చెప్పారు. 

అయిదుగురి లేఖకులకు రెండు గంటలలో 250  శ్లోకములు వెయ్యి పాదములతో పూర్తి చేసారు. 


బ్రాహ్మీముహూర్తము అవుతుండగా రమణ మహర్షి దిగ్గున లేచారు. ఆయనే ఆత్మయై, శారదయై కావ్యకంఠగణపతి మునిని ఆవహించి చెప్పించి పూర్తి చేయించింది. 


దీక్ష పూర్తి అవుతుండగా ఉమా సహస్రము పూర్తి అయింది. గణపతి ముని పొంగిపోతూ ఇది రమణులు నా చేత చెప్పించారని ఆఖరు శ్లోకముతో పూర్తి చేసారు.


ఓం నమో భగవతే శ్రీరమణాయ🙏



🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Thursday, 19 November 2020

ఊరకుంద ఈరణ్ణ స్వామి...

 మహాత్ముల పరిచయం.383

ఊరకుంద ఈరణ్ణ స్వామి...
వీరు ప్రసిద్ధ శైవ యోగులు. 1610 వ సంవత్సరంలో కౌతాళం అనే గ్రామం లో జన్మించారు. అసలు పేరు హిరణ్యులు. ఈ వూరు కర్నూలు సమీపాన ఆదోనీకి దగ్గరలో వుంది. తమ పన్నెండవ ఏట అడవిలో ఆవులను మేపటానికి వెళ్లినప్పుడు ఒక సిద్ధుడు వీరి వద్దకు వచ్చి గురుబోధ చేశారు. దైవధ్యానంలో లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో గడపమన్నారు. బాలుడైన స్వామి వారు ఆ అశ్వత్థ వృక్షం క్రింద సమాధి స్థితి లో కూర్చుని, నరసింహ స్వామి ని కీర్తిస్తూ గడిపాడు.లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పొందారు. ఊరకుంద ఈరణ్ణ స్వామి గా పిలువబడే హిరణ్యులు వీరభద్ర వంశంలో జన్మించిన సిద్ధపురుషులు, యోగి,అణిమాది అష్టసిద్ధులు పొంది విరాగిగా జీవించారు. స్వామి వారి ప్రతీకగా అశ్వత్థ వృక్షాన్ని కొలుస్తారు. వందల సంవత్సరాలు గడచినా చెక్కుచెదరకుండా వుంది. మానవత్వం, ప్రేమ వారి ముఖ్యమైన ఆశయాలు. తమ తపశ్శక్తితో రోగాలు తగ్గిస్తూ, ఆర్తులను ఆదుకుంటూ, ప్రబోధాలతో శాంతి, సంతోషాన్ని పంచుతూ హిందూ సమాజాన్ని ఏకం చేశారు. ముస్లింల ఆధిపత్యం ఎక్కువ గా వున్న ఆ రోజుల్లో వీరభద్ర ప్రతిపాదితమైన వీరశైవాన్ని పాటిస్తూ, వీరభద్రులను తయారుచేసి ముస్లిం సైన్యాన్ని ఎదుర్కొని సనాతన ధర్మాన్ని నిలిపారు. వారి ఆశ్రమంలో ముస్లింలు ప్రవేశించి ఆక్రమించిగా శాంతిని కాంక్షించే వీరు చేతికర్ర, కమండలం ధరించి అనుచరులతో ఊరకుంద వచ్చారు. స్వామి అక్కడే వుంటూ ధర్మ ప్రబోధాలు చేస్తూ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు ప్రసాదించారు. సమాధిని నిర్మాణం చేయించుకుని 1686 వ సంవత్సరంలో జీవసమాధి అయినారు. హిరణ్యులు తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం క్రిందనే ఈరన్న స్వామి సన్నిధి ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తున్నారు. 1768లో దేవాలయాన్ని నిర్మించారు. ఒక్క హిందవులే కాక ముస్లింలు కూడా వీరిని కొలుస్తారు. స్వామి తపస్సు చేసిన అశ్వత్థ వృక్షం క్రింద లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం,ప్రక్కన ఋషి ఈరణ్ణ విగ్రహం వుంచి పూజిస్తారు. ఇప్పటికీ ఈ స్వామి అగ్ని రూపములో ఈ ప్రాంతంలో రాత్రి పూట సంచరిస్తూ వుంటారని,ఆకాశం లో ఒక దీపంలా కనిపిస్తారని, తెల్లని గడ్డంతో వుంటారని అంటారు. సోమ, గురు వారాలు వీరికి అత్యంత ప్రియమైనవి. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా,ఊరకుంద పొలిమేర లోని అశ్వత్థ వృక్షం నివాసంగా, ఊరకుంద శ్రీ ఈరణ్ణ లక్ష్మీనరసింహ స్వామిగా శ్రావణ మాసంలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న రాఘవేంద్ర స్వామి పల్లకి ఊరకుంద లో అనుకోకుండా ఆగిపోగా, అప్పుడు స్వామి తన దివ్య దృష్టి తో ఆలయ మహిమను గుర్తించి, నరసింహ స్వామి దర్శనం చేసుకున్నారు. తన దివ్యశక్తి ప్రభావం చేత జాతిని ఉత్తేజం చేసిన, ఆ మహాయోగి నివసించిన స్థలమైన ఊరకుంద రావి చెట్టు నీడలోని ప్రతి అణువూ ఆ పరమ యోగి నివాసమే.
Image may contain: one or more people and people standing
You, Rajyalakshmi Srinivas Boddupalli and 10 others

గురుచరిత్ర...గుప్త భావం..🙏🏻 అధ్యాయం- 48-51

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురుచరిత్ర...గుప్త భావం..🙏🏻
అధ్యాయం- 48-51
మిగిలిన చిన్న చిన్న ప్రారబ్ధాలను గురు అనుగ్రహంతో తప్పించుకొని జీవన్ముక్తి వైపు పయనించి మోక్ష స్థితికి చేరువ అవుతున్నాము. సమస్తం ఇక గురు స్వరూపంగా దర్శనం కలుగుతోంది కనుక, తనకు అన్యము అయినది ఇప్పుడు ఏది లేదు.
గురువే సర్వస్వం.ఇప్పుడు మనం త్రిగుణ తీతం అయి, ఆ+త్రి అత్రి తత్వం ని మనలో నిలుపుకున్నాము.అనసూయ తత్వం,అత్రి తత్వం మనలో ఎప్పుడైతే ప్రవేశించి నదో దత్తాత్రేయ తత్వం తనకు తానుగా వచ్చి మనకు దత్తం అవుతారు.అదే దత్తత్రేయ జన్మ రహస్యం.
పారాయణ ద్వారా సాధనా పరంగా ఈ భావన దృఢపడింది. ఆ భావనే ఆనందం కలిగిస్తోంది. ఏ భావన మనకు ఆనంద స్థితి కలిగిస్తోందో ఆ ఆనంద స్థితియే మన లక్ష్యం కనుక, ఆ ఆనందస్థితి యే దుఃఖ స్పర్శ లేని ఆనందంగా పరిణమించింది. అంటే మనకు సంపూర్ణ సద్గురు అనుగ్రహం లభించింది,తన్మయత్వం కలుగుతోంది. ఇక గురువు,తాను ఒక్కటే అన్న భావనలో నిలిచిపోయి మన సాధనలో చివరి మెట్టు అయిన పరమాత్మలో లీనమై,పోయి,మనస్సు నిశ్చల స్థితిలో ఉండి, తనకు అన్యమైనది ఏది లేదు కనుక శాశ్వత ఆనంద స్థితిలో ఉండి పోయాము.
ఇదే గురుచరిత్ర పారాయణ సారాంశం.ఇలా గురుచరిత్ర పారాయణ చేస్తే మన జన్మ ధన్యం అయినట్లే.ఆ పరమాత్మ లో లీనం అయినంత మాత్రాన మనకు మోక్షం రాదు.అని ఈ రాబోయే అధ్యాయం హేచరిస్తోo ది.మరి ఏమి చేస్తే మనకు మోక్షం లభిస్తుంది?.
జై గురు దత్త

గిరినార్-పగలే బాబా

 


గిరినార్-పగలే బాబా

గిరినార్ పరిక్రమ
Part-1
గిరినార్ పర్వతం అతి పురాతన పర్వతం,సౌరాష్ట్ర లో అతి ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చుట్టూ 7 పర్వతాల సమూహం.గౌరక్ష నాధ్,అంబామాత, ఊగరనాధ్....ముందు అంబాశిఖర్, తరువాత గోరక్షనాధ్ శిఖర్,ఊగరనాధ్ శిఖర్,తరువాత గిరినార్ పర్వతం పై శ్రీ దత్తాత్రేయ స్వామి విరాజమానులై ఉంటారు.ఈ పర్వతాలలో అనేక గృహాలు ఉన్నాయి.ఈ గృహాలలో ఇప్పటికి నిరంతరం 84 మంది యోగులు,నవనాధులు,అశ్వధామ ఉన్నారని ప్రసిద్ధి.కలియుగం పూర్వం పర్వతాలకి రెక్కలు ఉండేవి ట. స్వేచ్ఛగా విహారుస్తూ,తరచు క్రిందకి దిగడం వల్ల ఇబ్బంది గా ఉందని ఇంద్రుడు వజ్రాయుధం తో పర్వతాల రెక్కలు కోసాడు. హిమాలయాల లో ఉండే ఈ పర్వతం ఇక్కడ ఎగురుతూ వచ్చి ఆగిపోయింది అంటారు.హిమాలయాల కన్నా పురాతన మైన పర్వతం గా చెప్తారు.సౌరాష్ట్ర లో ఎత్తైన పర్వతం.
ఇక్కడ బోధ్ గృహ లో 1200 సంవత్సరాల వయస్సు గల పగలా బాబా ఇప్పటికి వున్నారు.7 అడుగులు ఎత్తున, జుట్టు 10 అడుగులు,20 సంవత్సరాలు వయస్సు తో కనపడుతూ,చేతులు మోకాళ్లను దాటి బ్రహ్మ తేజస్సు తో ఉంటారు.నిరాహరి వారు.అక్కడ84 మంది సిద్ధులు 200 ఏళ్ళ నుoచి 900 సంవత్సరాలు మధ్య వయస్సు వారే.పగలే బాబా మార్గదర్శనం లో సాధన చేస్తుంటారు. తరచూ గిరినార్ పర్వతం లోపల అంతా ఖాళీగా ఉంటుంది. పైనుంచి స్థూపం ఆకారంలో నెల వరకు అంతా ఖాళీనే. పర్వతం లోపలికి 84 యోగులు,నవనాధులు,అశ్వధామ్, లు ప్రవేశిస్తారు.తరువాత దత్తాత్రేయ స్వామి ప్రకటం అయి వారితో సత్సంగం నిర్వహిస్తారు.
గిరినార్ పర్వతం పరిక్రమ కార్తీక శుక్ల ఏకాదశి రోజు మొదలు అయి,పౌర్ణమి రోజు సమాప్తి అవుతుంది. ఆ 5 రోజులు ఈ మహనీయులు పరిక్రమ చేసే వారిని ఆశీర్వదిస్తారు.అక్కడ జంతువులు ఎవరినీ ఏమి చేయవు.
జై గురు దత్త
ధర్మదాస్ బాబా ,గిరినార్.
తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

గురుచరిత్ర..గుప్త భావము..🙏🏻 అధ్యాయం- 34-40

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

గురుచరిత్ర..గుప్త భావము..🙏🏻
అధ్యాయం- 34-40
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
ఏది ధర్మమో,ఏది సత్యమో దాని మీద మనకు అవగాహన ఇప్పుడు గురు అనుగ్రహముతో క్రమేపీ పెరుగుతుంది. ఇది ఆచరణలో పెట్టె కొద్దీ వివేక,వైరాగ్య లతో పాటు జ్ఞాన,కర్మ,భక్తి,అన్ని కలిసి సాధనలో మనం ముందుకు పోగలుగుతాము.
మనలో రాజోగుణ, తమోగుణ. లక్షణాలు క్రమేపి దూరం అవుతాయి.ఇక మిగిలింది సత్వ గుణం మాత్రమే.
మనకు అప్పుడు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుందిి. ఇక్కడ స్వామి లీలలు చదవడం వల్ల వారి పట్ల మన భావన ఇంకా ఉత్తమంగా తయారు అవుతోంది.
ఇంకేమి కావాలి!మనకు సద్గురువు తప్ప ఇంకో ప్రపంచం లేకుండా పోయింది. గురు భక్తి ఇంకా తీవ్రం అయి మన సాధన యొక్క ఫలితం లభించే సమయం ఆసన్నమవుతోంది.
జై గురు దత్త

మహాత్ముల పరిచయం-203 శ్రీ బరఫని దాదాజి సజీవులు.227 పైన సంవత్సరాలు

 మహాత్ముల పరిచయం-203

శ్రీ బరఫని దాదాజి
సజీవులు.227 పైన సంవత్సరాలు వీరికి.
వీరు హిమాలయాల్లో 40 సంవత్సరాలు కైలాస,మనసా సరోవరం తపస్సు చేయగా మొత్తం శరీరం మంచుతో కప్పబడి పోయింది. అందుకే వీరికి బరఫని(మంచు) బాబా గా పేరు వచ్చింది.
రాజరికాపు వంశంలో1792 సంవత్సరం లో దీపావళి రోజు ఉత్తర ప్రదేశ్ లో గంగా నది వడ్డు న డోది ఖేడా గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సంత్ ధుని వాలా దాదా గారికి శిష్యులు. పిల్లలు లేకపోవడంతో వీరు దాదా గారిని ఆశ్రయించారు. దాదా గారి అనుగ్రహముతో శ్రీ బరఫని బాబా గారు జన్మించారు. వీరికి 8 వ సంవత్సరం లో ధునివాలా గారి దగ్గరకు ఆశీస్సులకోసం తీసుకెళ్లారు. అక్కడ సంత్ శ్రీ అర్జున్ దాస్ మహరాజ్(అయోధ్య)గారు కొద్దీ రోజులుగా ప్రవచనం చెప్తున్నారు.శ్రీ దునివాలా దాదా వీరిని శ్రీ అర్జున్ దాస్ బాబా ని ఆశ్రయించి,సేవించమన్నారు.వారిని సేవించి వారితోనే దేశ పర్యటన చేసారు.తర్వాత ఆయుర్వేదం, గణితం,వేదాలు,ఉపనిషత్తులు అన్ని శ్రీ కేలా బ్రహ్మచారి (వారాణసి)గారి దగ్గర నేర్చుకొని మరలా హిమాలయాల కు తపస్సు కు వెళ్లి పోయారు. టిబెట్,నేపాల్,కొన్నిచోట్ల తపస్సు చేసి కైలాస, మానస సరోవరం దగ్గర ఉండి, తరువాత జ్ఞానగంజ్ దగ్గర, ఫూలేరి బాబా పరమహంస దగ్గర ఆధ్యాత్మిక సాధన చేసి 1930 సంవత్సరం లో చ శరీరం వృధాప్యం చెందటం తో కాయ కల్ప విద్యతో మరల వృధాప్యం పోగొట్టుకొని 1962 లో 32 సంవత్సరల తర్వాత హిమాలయాల ను వదిలి అమర కంఠక్ గుడిలో స్థిరపడ్డారు.సాయిబాబా,శ్రీ.దునివాలా దాదా,వీరు కలిసి సింధూ, కరాచీ,పంజాబ్ ప్రాంతాల్లో పర్యటించారు ట.సాయి నాధుడు గొప్ప సిద్ధ పురుషులు అని,సాయి నాధుడు ఎక్కడ ఉన్నా ధుని వాలా దాదా తో కలిసి తప్పక ధుని నిర్వహించేవారుఅని తెలిపారు..వీరిని చిన్నప్పుడు చుసిన వారు, చూసిన వారు వృద్దులై నప్పటికి,దాదాజి గారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు అని అన్నారు.తెలుగు రాష్ట్రాల లో కూడా పర్యటన లు ఉన్నాయి.దసరా అప్పుడు వైజాగ్ కివచ్చారు.ఓం శ్రీ సాయిరాం.
ఆశ్రమo అడ్రస్::
అమార్కంఠక్,
బరఫని దాదాజి ఆశ్రమం,
నర్మదా మాత మందిరం వెనుకాల,
అనూప్ పోర్ జిల్లా,
మధ్యప్రదేశ్-484886.
ఫోన్ no.09926627364.

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |

 బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |

ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే || 🌺🙏
🌺బ్రహ్మజ్ఞానం అనే ముద్రతో, ఆకాశము, భూమిని వస్త్రముగా కలవాడు, మూడు స్థితులలో ప్రజ్ఞతో వుండేవాడు అయిన శ్రీ దత్తాత్రేయునికి నమస్కారము.🌺