Thursday, 29 August 2019

#భరద్వాజ మహర్షి:

#భరద్వాజ మహర్షి:
బృహస్పతి,మమతల పుత్రుడు భరద్వాజుడు.సప్త ఋషులలో భరద్వాజుడు ఒకరు.కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరునిదీ భరద్వాజస గోత్రం కావటం విశేషం.
సృష్టిలో తొలుత విమానాన్ని కనిపెట్టి, విమాన శాస్త్రాన్ని పరిచయం చేసింది భరద్వాజ మహర్షియే!!
మానవ జీవన వికాసానికి పశువుల, పల్లెల ఆవశ్యకతను భరద్వాజుడు గుర్తించి "పశువులను ప్రేమించు" అనే విచార ధారను అందించాడు.గోమాత మహిమను తెలిపి గోహత్య చేయకూడదని, గో సంరక్షణ ఆచరించాలని మొట్టమొదట తనభావాలను వ్యక్తపరచినవాడు భరద్వాజుడు. గోరక్షణ ఉద్యమంలా వెలుగులోకి తెచ్చి,మనిషి ఆరోగ్యానికి గోవు నుంచి లభించే పంచగవ్యాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేశాడు.గోహత్య మహా పాపమని, ఈ హత్యలను చూస్తూ ఊరకుండే రాజులకు పుట్టగతులండవని భరద్వాజుడు ఋగ్వేదం లోని ఆరవ మండలం లో స్వయంగా హెచ్చరించాడు కూడా!!!
స్వధర్మాన్ని వీడి పాశ్చాత పోకడలను, పాశ్చాత్య శాస్త్రవేత్తలను, పాశ్చాత్య కవులను పరిశోధించడం,అనుసరించడం వల్ల భారతీయులకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువ అని గ్రహించాలి!!!

No comments:

Post a Comment