Wednesday 21 August 2019

32 రకాల వీణలు

సంగీత దీపిక
★★★★★★
పాల్కురికి సోమనాథుడు చెప్పిన
32 రకాల వీణలు 
★★★★★★★★★★★★★★
క్రీ.శ. 13వ శతాబ్దికి చెందిన తెలుగువాడైన పాల్కురికి సోమనాథుడు సాహిత్యకారుడే కాదు, ప్రముఖ సంగీత నాట్యకోవిదుడు కూడా. ద్విపదలో బసవపురాణం, పండితారాధ్య చరిత్రలను రాసి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొన్నాడు.
పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో గల భరతశాస్త్ర లక్షణమనే విభాగంలో సంగీత, నాట్య విశేషాలను పేర్కొంటూ, అప్పటికి తెలుగునేలపై వాడుకలోనున్న 32 రకాల వీణలను గురించి చెప్పాడు.
అవి:
1. వీణోత్తమము
2. బ్రహ్మ వీణ
3. కైలాస వీణ
4. సారంగ వీణ
5. కూర్మ వీణ
6. ఆకాశ వీణ
7. మార్గ వీణ
8. రావణ వీణ
9. శ్రీ గౌరి వీణ
10. అంబికా వీణ
11. బాణ వీణ
12. కాశ్యప వీణ
13. స్వయంభూ వీణ
14 భుజంగ వీణ
15. కిన్నర వీణ
16. త్రిసారి వీణ
17. సరస్వతీ వీణ
18. మల్ల వీణ
19. మనోరథ వీణ
20. గణనాథ వీణ
21. కుమారి వీణ
22. రావణహస్త వీణ
23. చిత్రికా వీణ
24 .నాట్యసాగరికా వీణ
25. కుంభం వీణ
26. విపంచి వీణ
27. కేసరి వీణ
28. పరివార వీణ
29. స్వరమండల వీణ
30. ఘోషవతి వీణ
31. ఔదుంబర వీణ
32. తంత్రసాగర (అంబుజ) వీణలు
ఇప్పటివరకూ అందుబాటులోకొచ్చిన ఏ సంగీత గ్రంథమూ, ఏ సంగీత లాక్షణికుడు పేర్కొనని 32 రకాల వీణలను గురించి చెప్పిన పాల్కురి సోమన తెలుగు వారికి గర్వ కారణం.
వీణలతో పాటు వీణలకు బిగించే ఉభాయానుగ, గీతానుగ, ధ్రుతానుగ, ప్రమాణ వినియోగ మరియు ముఖవీణానుగ అనే తీగెలను గురించి కూడా చెప్పాడు.
ఇంకా 22 రకాల వీణానాద గతులను,
14 రకాల వీణా రచనలను,
40 రకాల వీణా వాద్య బంధాలను,
18 రకాల వీణావాద్య నాదాలను
కూడా పేర్కొనటం విశేషం.
-ఈమని శివనాగిరెడ్డి
గారికి కృతజ్ఞతలతో...
(ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం
27 డిసెంబర్-2015నుంచి సంగ్రహీకరణ)
సాంకేతిక సహకారం:
శ్రీ ఎ.వెంకట్,ఫోటో మేజిక్-మండపేట.
'కళాదీపిక'
22-8-2018 ( V S Raghavachari )

No comments:

Post a Comment