Thursday 22 August 2019

గుంతకల్లు లోని కసాపురం



గుంతకల్లు లోని కసాపురం : 
శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయలి గురువు గారు శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవారుట .వారు గొప్ప చిత్రకారులు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట 
ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.
ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి" నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పారట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేషించమని వ్యాస రాయల వారు కోరగా స్వామి వారు ఈ విధంగా తెలిపారుట “దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుందని, అక్కడ భూమిలో తాను ఉంటాను" అని చెప్పారుట.
మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణంగావించి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయల వారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు కాస్త ఆకుపచ్చగా చిగురిస్తుంది. వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తారు తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.
నెట్టి కంటి అంటే నేరుగ చూసె కన్ను కలిగిన స్వామివారి కుడి కన్ను మాత్రమె కనిపిస్తు వుంటుంద భక్తులకు ఈయనే "కల్పతరువు" మరియు "వరప్రదాత" కూడానూ. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.
అలానే ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పించేవాడట. మర్నాడు వచ్చి చూస్తె అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటారని భక్తుల నమ్మకం.
ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.
వ్యాసరాయులు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.
సుమారుగ 70 కిలోమీరటర్లదూరము వుంటుంది నెట్టికంటి నుండి నేమకల్లు వరకు 
అలానే నేమకల్లు నుండి మూరడికి సుమారు 38 కిలోమీటర్లు
శ్రావణ మాసం లో అది శనివారము నాడు మూడు చోట్ల అంటే నెట్టికంటి, నేమకల్లు, మూరడిలను దర్శించుకంటే అత్యంత ఫలప్రదమని భక్తులు భావిస్తారు
@Bhavani Prakash W

No comments:

Post a Comment