Thursday 29 August 2019

Goddess Kamakshi

#Goddess Kamakshi :
She revered by knowledgeable with divinity,
She source of all, through Her everything be,
She has strength to destroy evil heart fully,
And enlighten devotee with knowledge truly.
🙏🏼🙏🏼May Goddess Kamakshi give us the power to fight against the evil 🙏🏼

#గృహలక్ష్మి :

#గృహలక్ష్మి :
సనాతన ధర్మలో జ్ఞానం బ్రహ్మ స్వరూపం.
పుట్టిన ప్రతి మనిషిని జ్ఞానానికి చేరువగా తీసుకవెళ్ళేది అమ్మయే!!
భక్తిపూరితములైన ఆచారములు, సంప్రదాయాలు 
అనునిత్యం ఇంటిలో కొనసాగిస్తూ మనందరికీ శోభను కలిగించేది 
అమ్మ,అక్క,చెల్లియే!!!
అందుకే భారతీయ స్త్రీ గృహలక్ష్మి,
శక్తి సరస్వతి భారతీ అనికూడా పిలువబడుతుంది.

NR Quotes

"“The highest form of our IT innovation is often hidden in simplicity.” 
~ NR Narayana Murthy, Pioneer of IT Industry ~

స్టార్ సెలెబ్రిటీ డా. సి. మృణాళిని.

స్టార్ సెలెబ్రిటీ డా. సి. మృణాళిని.
సాధారణంగా సినిమా రంగానికి చెందిన వారు సెలెబ్రిటీలుగా పరిగణించబడతారు. ఎవరైనా సెలెబ్రిటీలకే సెలబ్రిటీ అయితే వారు ‘స్టార్’ హోదా పొందినట్టు. అందుకే వారు ‘తార’లు. ఏ రంగానికి చెందినవారైనా, తారలందరూ సెలెబ్రిటీలే గానీ, సెలెబ్రిటీలందరూ తారలు కానక్కరలేదు.
సినిమా కాకుండా ఇతర రంగాల్లో సుప్రసిద్ధులైన వారిలో కూడా ‘తార’ స్థాయిని అందుకున్నవారు ఉంటారు. ఈ కోవకి చెందిన ఒక స్టార్ సెలెబ్రిటీ డాక్టర్ సి. మృణాళిని గారు. ఒక్క సాహిత్యమే కాదు, సంగీతం, లలిత కళలూ, సినిమా, పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు, విద్యా బోధన, భాష, సాంస్కృతిక వ్యవహారాలు - ఇలా ఏ రంగంలో, ఏ విభాగంలో చూసినా ఏదో ఒక స్థాయిలో ఆమె ప్రవేశం, ఉనికి, పాత్ర, కృషి మనకు కనిపిపిస్తాయి వీటికి తోడు విరబూసే చిరునవ్వు, వ్యక్తిత్వంలో వికసించే ఆత్మీయతా, పలకరింపులో పరిమళించే సంస్కార సౌరభాలు; చూడగానే "ఎవరు ఈ సరస్వతి!" అని చేతులెత్తి నమస్కరించాలని ఎంతటి అపరిచితులకైనా, అనిపిస్తుందంటే అందులో ఆశ్చర్యం ఏముంది! అందుకే ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలెందరో ఆమెకు అభిమానులు.
అటువంటి వారిని అలంకరించటానికి కాకపోతే సన్మానాలకు, సత్యారాలకు, బిరుదులకూ సార్ధకత ఏముంటుంది? అందుకే అవన్నీ వెదుక్కుంటూ వచ్చి కుప్పలు తెప్పలుగా ఎప్పుడో తన దరి చేరాయి. ఇప్పుడు మరొక పురస్కారం ఆమెను వరించింది. ప్రజ్వలిత అనే సాంస్కృతిక సంస్థ నిన్న (18 ఆగస్టు 2019) తెనాలిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్ కె. శివారెడ్డిగారి చేతుల మీదుగా ‘ప్రతిభామూర్తి’ అనే ఈ పురస్కార ప్రదానం జరిగింది.
మనలో చాలామందికి, ఏదో రంగానికి చెందిన సుప్రసిద్ధులతో ఏ కొద్దిపాటి పరిచయం ఉన్నా దానిని అపురూపంగా భావించడం సహజం. మృణాళిని గారిని అభినందించడం అంటే ‘దాసుభాషితం’ తనను తాను అభినందించుకోవటం. ఎందుకంటే ‘దాసుభాషితం’ కు మృణాళిని గారికీ అభిమానానికి మించి, పరస్పర అభినందనలకు అతీతమైన ఆత్మీయమైన సంబంధం ఉంది. ఆమె ‘దాసుభాషితం’ కు ‘మెంటర్’. దాసుభాషితం ప్రతీ కార్యక్రమం వెనుక ఆమె అనుభవం, స్ఫూర్తి, కృషి ఉన్నాయి.
ప్రతిభావంతమైన ఆమె మార్గదర్శకత్వంలో తెలుగు భాషాభిమానులకు మరిన్ని మనోరంజకమైన కార్యక్రమాలు లభించాలని కోరుకుంటూ తన తరఫునా శ్రోతలందరి తరఫునా వారికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నది దాసుభాషితం.
~ Credits to Sri Tulasidas Konduru / Dasubhashitam ~

Happy National Radio Day

Happy National Radio Day 2019 - Tuesday, August 20 to all Radio Listeners !
Although there is not one authoritative source on the history of National Radio Day, it has been celebrated since the early 1990s on August 20. Perhaps it was decided that August 20 would be an appropriate day because 8MK (now WWJ) in Detroit, first broadcast on August 20, 1920.
Celebrate National Radio Day on Tuesday, August 20 by telling a friend about RADIO Listening ! National Radio Day is a time to honour one of the most longstanding electronic media and its role in our everyday lives. It is also a time to honour community radio listeners, volunteers, staff and contributors!
Radio delivers information, news, entertainment and company to millions of listeners every hour of every day. Of course, does so with listener support and volunteer power. Thank you, and happy National Radio Day!
--------------------------
Credits to my Radio DXer friend, Mitul Kansal

ఇపుడతనిది బ్రహ్మ స్థానం :

##ఇపుడతనిది బ్రహ్మ స్థానం :
హనుమంతుడి పేరు చెప్పగానే ఆబాల గోపాలానికి ఎంతో భక్తిప్రపత్తులు.
రాముని,సీత సేవలో తరించిన భక్తుడు.
పంచవిధ భక్తులలో దాస్యభక్తికి నిలువెత్తు నిదర్శనం!!
అనంత కరుణాసముద్రుడై భక్తులను ఎల్లప్పుడు రక్షించే సనాతన శాశ్వతానందమే హనుమంతుడు!!!
సాధువులకు,సన్యాసులకు,బ్రహ్మచారులకు శీఘ్రంగా ఆత్మయోగసిధ్ధిని ప్రసాదించే బ్రహ్మ మానస పుత్రుడు ఈ హనుమంతుడు.
సీతా దేవి వరం వల్ల ఇపుడు ఈ కలియుగం లో
బ్రహ్మ స్థానాన్ని అధిరోహించిన బ్రహ్మ!!! చిరంజీవి!!!
// శ్రీ రామదూతం శిరసా నమామి //

#నోట్ల రద్దు వెనక :

#నోట్ల రద్దు వెనక :
పాక్ ఉగ్ర మూకలనుంచి ట్రక్కుల కొలది నకిలీ కరెన్సీ 
అదీ మనల్ను కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు 
కాశ్మీర్ లో పిల్లల చేత రాళ్ళ దాడితో విఘాతం కలిగించే వేళ!!!
ఆ ఆర్థిక మంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే నోట్ల రద్దు!!!
తెలియని మూర్ఖులు, దేశ ద్రోహులు ఈ సత్యాన్ని గ్రహించాలి!!!!

#చిచ్చు-కార్చిచ్చు

#చిచ్చు-కార్చిచ్చు
అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు అయినా..ఆంధ్రాలో సెజ్జులయినా ..
ఇక ప్రజలతో సహా ప్రాణికోటికి 
ఆక్సిజన్ లేకుండా ఊపిరిపోయే రోజులు వస్తాయ్!!!
No Trees..No Life...

DANCE

#DANCE 
It is always Serene 
And it is 
An Yogic Discipline 
Portrayed by Bhagavan Shiva

#మాతృభాష:

#మాతృభాష:
భారతీయ వేదం లో భాష యొక్క వాత్సల్యమయ పోషణరీతి వర్ణితమై ఉంది.తల్లి జన్మను ఇచ్చి పాలిస్తుంది.
పృథ్వీమాత అనంత జీవకోటిని పోషిస్తుంది.
భాష అందునా మాతృభాష ఇంతకంటే అనంతమైన ఉపకారం చేస్తుంది.
కనుక మన భాషను గౌరవిస్తూ విశ్వ శ్రేయస్సును కోరే రచయితలను, కవులను మాత్రమే అనుసరిద్దాం.
ఈ జ్ఞానానికి, విజ్ఞానానికి ఆధారభూతమైన తల్లి సరస్వతి దేవిని సదా పూజిద్దాం.

#గో బ్రాహ్మణులు :

#గో బ్రాహ్మణులు :
గోవులు,ద్విజులు దయా సముద్రులు.ప్రపంచమంతటికీ సర్వశ్రేష్ఠమైనది గోవు, బ్రాహ్మణుడి ఆశీస్సులే!!!ఎవరికైనా, ఎక్కడైనా సర్వ సంపదలు, సుఖ సమృధ్ధి పొందాలనే కోరిక ఉంటే మంచి మనసుతో బ్రాహ్మణుని ఆశీస్సులు పొందాలి..గోసేవ చేస్తుండాలి..ధార్మిక జీవితానికి ఆధార భూతమైన భారతదేశంలో గోసంపద, బ్రాహ్మణుల గౌరవం పెరుగుతూనే ఉండాలి..దీనికి భిన్నంగా ప్రవర్తిస్తూ గో హత్యచేస్తూ, బ్రాహ్మణులను ధూషిస్తూ, ద్వేషించే వారికి పుట్టగతులుండవు!!! సరికదా వారి వంశాలే నిర్వీర్యం అవుతాయని గ్రహించాలి!!! 
#Respect The Indian Sacred Cow..
#Respect Brahmins...

Say no to zomato

#జొమాటో అది ఒక విష సంస్కృతి :
శుచి,శుభ్రంగా
స్నానమాచరించి చేసిన వంటనే భుజించాలని
మన తల్లితండ్రులు, పూర్వీకులూ చెప్పలేదా??
సనాతన సంప్రాదాయం , సనాతన ధర్మం లో ఉన్న
బలమూ, హితోపదేశం ఇదే!!!
ఈ ధర్మాలు తెలియని వారే జొమాటోలు తింటారు
సర్వభ్రష్టులూ అవుతారు!!!
నిన్న మొన్న పుట్టిన ప్లాస్టిక్ మతాలకు
ఈ సత్యాలు బోధపడవు!!!
#Say no to zomato

#సూక్ష్మ అంశమిది:

#సూక్ష్మ అంశమిది:
అనంతమైన కోరికలు, దుఃఖ జనిత వియోగ బాధలు
సంకల్పబలముచే 
జగత్తనెడి ఇంద్రజాలము భాసించుచున్నదేకాని 
నిజానికి అంతయూ బ్రహ్మమే!!!
మనో చింతనలను,
మనో మాలిన్యములను త్యజించినవారికి
ఈ తత్వం అవగతమవుతుంది!!!
ఓం నమః శివాయ

A I R Cares

All India Radio - Akashvani
* * * * * * * * * * * * * * * * * * * 
Tips for presenters: Radio is an intimate medium and should be treated as such. Talk to your audience as you would normally to your friends. Be real, be yourself, and you will connect.
#AIRCares 🎙️

#భరద్వాజ మహర్షి:

#భరద్వాజ మహర్షి:
బృహస్పతి,మమతల పుత్రుడు భరద్వాజుడు.సప్త ఋషులలో భరద్వాజుడు ఒకరు.కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరునిదీ భరద్వాజస గోత్రం కావటం విశేషం.
సృష్టిలో తొలుత విమానాన్ని కనిపెట్టి, విమాన శాస్త్రాన్ని పరిచయం చేసింది భరద్వాజ మహర్షియే!!
మానవ జీవన వికాసానికి పశువుల, పల్లెల ఆవశ్యకతను భరద్వాజుడు గుర్తించి "పశువులను ప్రేమించు" అనే విచార ధారను అందించాడు.గోమాత మహిమను తెలిపి గోహత్య చేయకూడదని, గో సంరక్షణ ఆచరించాలని మొట్టమొదట తనభావాలను వ్యక్తపరచినవాడు భరద్వాజుడు. గోరక్షణ ఉద్యమంలా వెలుగులోకి తెచ్చి,మనిషి ఆరోగ్యానికి గోవు నుంచి లభించే పంచగవ్యాల ప్రాశస్త్యాన్ని ప్రచారం చేశాడు.గోహత్య మహా పాపమని, ఈ హత్యలను చూస్తూ ఊరకుండే రాజులకు పుట్టగతులండవని భరద్వాజుడు ఋగ్వేదం లోని ఆరవ మండలం లో స్వయంగా హెచ్చరించాడు కూడా!!!
స్వధర్మాన్ని వీడి పాశ్చాత పోకడలను, పాశ్చాత్య శాస్త్రవేత్తలను, పాశ్చాత్య కవులను పరిశోధించడం,అనుసరించడం వల్ల భారతీయులకు జరిగే మేలు కంటే కీడే ఎక్కువ అని గ్రహించాలి!!!

నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు

#అన్నమయ్య కీర్తన

#
నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు
# For this Annamayya Kriti(Sung by Priya Sisters) click this link @
https://youtu.be/4xQIGzgzIO8

EMPATHY AND KINDNESS

EMPATHY AND KINDNESS
This Earth- The Vedic Land of Bharath
which sustains
Empathy and Kindness
must not be injured;
Those who wish to destroy this Vedic Land
they will severely punished!!!
~ Shyamala Devi ~

Thursday 22 August 2019

గుంతకల్లు లోని కసాపురం



గుంతకల్లు లోని కసాపురం : 
శ్రీ నెట్టి కంటి ఆంజనేయ స్వామి దేవాలయం
విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయలి గురువు గారు శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవారుట .వారు గొప్ప చిత్రకారులు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట 
ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.
ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి" నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పారట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేషించమని వ్యాస రాయల వారు కోరగా స్వామి వారు ఈ విధంగా తెలిపారుట “దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుందని, అక్కడ భూమిలో తాను ఉంటాను" అని చెప్పారుట.
మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణంగావించి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయల వారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు కాస్త ఆకుపచ్చగా చిగురిస్తుంది. వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తారు తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.
నెట్టి కంటి అంటే నేరుగ చూసె కన్ను కలిగిన స్వామివారి కుడి కన్ను మాత్రమె కనిపిస్తు వుంటుంద భక్తులకు ఈయనే "కల్పతరువు" మరియు "వరప్రదాత" కూడానూ. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.
అలానే ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పించేవాడట. మర్నాడు వచ్చి చూస్తె అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటారని భక్తుల నమ్మకం.
ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.
వ్యాసరాయులు ఒకే సమయంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే గ్రామల్లో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.
సుమారుగ 70 కిలోమీరటర్లదూరము వుంటుంది నెట్టికంటి నుండి నేమకల్లు వరకు 
అలానే నేమకల్లు నుండి మూరడికి సుమారు 38 కిలోమీటర్లు
శ్రావణ మాసం లో అది శనివారము నాడు మూడు చోట్ల అంటే నెట్టికంటి, నేమకల్లు, మూరడిలను దర్శించుకంటే అత్యంత ఫలప్రదమని భక్తులు భావిస్తారు
@Bhavani Prakash W

Wednesday 21 August 2019

32 రకాల వీణలు

సంగీత దీపిక
★★★★★★
పాల్కురికి సోమనాథుడు చెప్పిన
32 రకాల వీణలు 
★★★★★★★★★★★★★★
క్రీ.శ. 13వ శతాబ్దికి చెందిన తెలుగువాడైన పాల్కురికి సోమనాథుడు సాహిత్యకారుడే కాదు, ప్రముఖ సంగీత నాట్యకోవిదుడు కూడా. ద్విపదలో బసవపురాణం, పండితారాధ్య చరిత్రలను రాసి తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొన్నాడు.
పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో గల భరతశాస్త్ర లక్షణమనే విభాగంలో సంగీత, నాట్య విశేషాలను పేర్కొంటూ, అప్పటికి తెలుగునేలపై వాడుకలోనున్న 32 రకాల వీణలను గురించి చెప్పాడు.
అవి:
1. వీణోత్తమము
2. బ్రహ్మ వీణ
3. కైలాస వీణ
4. సారంగ వీణ
5. కూర్మ వీణ
6. ఆకాశ వీణ
7. మార్గ వీణ
8. రావణ వీణ
9. శ్రీ గౌరి వీణ
10. అంబికా వీణ
11. బాణ వీణ
12. కాశ్యప వీణ
13. స్వయంభూ వీణ
14 భుజంగ వీణ
15. కిన్నర వీణ
16. త్రిసారి వీణ
17. సరస్వతీ వీణ
18. మల్ల వీణ
19. మనోరథ వీణ
20. గణనాథ వీణ
21. కుమారి వీణ
22. రావణహస్త వీణ
23. చిత్రికా వీణ
24 .నాట్యసాగరికా వీణ
25. కుంభం వీణ
26. విపంచి వీణ
27. కేసరి వీణ
28. పరివార వీణ
29. స్వరమండల వీణ
30. ఘోషవతి వీణ
31. ఔదుంబర వీణ
32. తంత్రసాగర (అంబుజ) వీణలు
ఇప్పటివరకూ అందుబాటులోకొచ్చిన ఏ సంగీత గ్రంథమూ, ఏ సంగీత లాక్షణికుడు పేర్కొనని 32 రకాల వీణలను గురించి చెప్పిన పాల్కురి సోమన తెలుగు వారికి గర్వ కారణం.
వీణలతో పాటు వీణలకు బిగించే ఉభాయానుగ, గీతానుగ, ధ్రుతానుగ, ప్రమాణ వినియోగ మరియు ముఖవీణానుగ అనే తీగెలను గురించి కూడా చెప్పాడు.
ఇంకా 22 రకాల వీణానాద గతులను,
14 రకాల వీణా రచనలను,
40 రకాల వీణా వాద్య బంధాలను,
18 రకాల వీణావాద్య నాదాలను
కూడా పేర్కొనటం విశేషం.
-ఈమని శివనాగిరెడ్డి
గారికి కృతజ్ఞతలతో...
(ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధం
27 డిసెంబర్-2015నుంచి సంగ్రహీకరణ)
సాంకేతిక సహకారం:
శ్రీ ఎ.వెంకట్,ఫోటో మేజిక్-మండపేట.
'కళాదీపిక'
22-8-2018 ( V S Raghavachari )

మృణాళిని ఓ సర్వనామము

మృణాళిని ఓ సర్వనామము
-------------------------------------
గొప్పదైతే కావచ్చుకానీ పేరు మరీ ఇంత గొట్టుదైతే ఎలాగండీ బాబూ..
మ..దానికో రూత్వం
అష్టవంకరలు తిరిగే ణ...దానికో దీర్ఘం
మెలికెలు మెలికెలుగా కులికే ళ..దానికో గుడి
చివర్లో మాత్రం బుద్దిగా తలొంచుకుని కూచున్నట్టుండే.. ని
గమ్మత్తేమిటంటే
ఈ మూడు గొట్టక్షరాలకూ చివరి ని యే ప్రాణం
ఎవరినైనా చనువుగా నీ అనగలిగే పెద్దమనిషితనమూ
ఎవరితోనైనా నీ అని ఆత్మీయంగా పిలిపించుకోగల పెద్దమనసుతనమూ ఆమె..
ఆ పేరు
మృణాళిని ....ఆ పేరుకు లెక్కలేనంత పేరు
ఆ పేరొక బహువచనం ఆ పేరొక బహుముఖ నిర్వచనం
అందుకు..అందుకే ఈ పురస్కారం
ఇంతకీ ఆ పేరు ఏమేం సాధించిందో తెలుసా
జర్నలిజానికి రాతలు నేర్పింది, దృశ్యమాధ్యమానికి సౌందర్యాన్నద్దింది. రేడియోకు మాటలు దిద్దింది.
అధ్యాపకురాలిగా కొత్త పాఠమయింది. గైడ్ గా దారులు చూపింది. రచయిత్రిగా అన్ని ప్రక్రియలకూ కర్త కర్మయింది.
అందుకే ఆ పేరుకు కీర్తి ప్రతిష్టలు పర్యాయపదాలయాయి.
అది పేరు మాత్రమే కాదు సర్వనామము.
అందుకు ..అందుకే పురస్కారం.
ఇరవైకి పైగా పుస్తకాలు, పదికి పైగా దేశాలలో సిద్దాంత పత్రాల సమర్పణ, మూలాలను సరళం చేసిన అనువాదాలు
రెండు డజన్ల అవార్డులు ఈ పేరు మోసిన కిరీటాలు
అందుకే ఈ పురస్కారం.
కోమలి గాంధారం, ఇంతిహాసం,తాంబూలం, స్వరార్చనం, మాల్డుడి రచనలు, ఇంకా మరెన్నో సృజనలు ఆ పేరు సాహిత్యానికిచ్చిన బహుమానాలు.
ఇవన్నీ ఒకెత్తయితే రేడియో రూపకాలలో వరల్డ్ స్పేస్ లో చందమామ కథల ప్రొడక్షన్ కు వచ్చిన మూడు అవార్డులు మరెంతో ఎత్తు.
ఆ ఎత్తులకెదిగినందుకే ఈ అవార్డు.
ఆ పేరంటే తామర తూడు అని నిఘంటువు చెప్పే అర్దమంతా అబద్దం
అసలు నిజమేంటంటే
నెర్రెలిచ్చిన పూల వనాలకు వరాలిచ్చే నవ్వు,
ప్రసరించిన మేర వెన్నెల ప్రవహించే చూపు ,
తిరగాడిన చోట కుప్పలు తెప్పలుగా పరుచుకునే ఆత్మీయ పరిమళం
మనసునే మాటలు చేసే తేనె పాటల తీపిరాగాల పలకరింత
కళ్లెదుట కదలాడే నిలువెత్తు విద్యుల్లత విద్వల్లత, మానవ రూప దేవత
ఇది నిజం..ఇదే నిజం..
ఇవే ఆ పేరుకు అసలు అర్దాలు
అందుకే ఈ పురస్కారం
అవును ఆ పేరులో అక్షరాలన్నీ గొట్టువే కావచ్చు..
కానీ అర్దం మాత్రం సున్నితం, నవనీతం
అక్షరాలన్నీ మెలికలే కావచ్చు అర్దం మాత్రం
గురితప్పని బాణం..ఎప్పటికీ గెలిచే రణం
మృణాళినిగారూ
ఈ నూలుపోగుకో చంద్రిక మీరు..
అందుకోండి మా ఈ ప్రజ్వలిత పురస్కారం
..
ఇవాళ మృణాళిని మేడమ్ ప్రజ్వలిత పురస్కారం అందుకుంటున్న సందర్బంగా అందించిన సన్మాన పత్రం ఇది...
నేను రాసింది

Monday 19 August 2019

Atal quotes

#బ్రహ్మచర్యం లోని గొప్పతనమది
"యుధ్ధమన్నది అనివార్యమైతే ప్రతి భారతీయుడి అరచేయి అణ్వాయుధమవుతుంది"
~ అటల్ బిహారి వాజ్ పేయి ~

Goddess Kamakshi :

#Goddess Kamakshi :
She revered by knowledgeable with divinity,
She source of all, through Her everything be,
She has strength to destroy evil heart fully,
And enlighten devotee with knowledge truly.
🙏🏼🙏🏼May Goddess Kamakshi give us the power to fight against the evil 🙏🏼🙏🏼

Sudha Murthy

"Leadership is nothing but Simplicity and Transparency" 
~ Sudha Narayana Murthy 
~

#గృహలక్ష్మి :

#గృహలక్ష్మి :
సనాతన ధర్మలో జ్ఞానం బ్రహ్మ స్వరూపం.
పుట్టిన ప్రతి మనిషిని జ్ఞానానికి చేరువగా తీసుకవెళ్ళేది అమ్మయే!!
భక్తిపూరితములైన ఆచారములు, సంప్రదాయాలు 
అనునిత్యం ఇంటిలో కొనసాగిస్తూ మనందరికీ శోభను కలిగించేది 
అమ్మ,అక్క,చెల్లియే!!!
అందుకే భారతీయ స్త్రీ గృహలక్ష్మి,
శక్తి సరస్వతి భారతీ అనికూడా పిలువబడుతుంది.

NR Murthy

"“The highest form of our IT innovation is often hidden in simplicity.” 
~ NR Narayana Murthy, Pioneer of IT Industry ~

Thursday 15 August 2019

24 అక్షరల గాయత్రి మంత్రం:

24 అక్షరల గాయత్రి మంత్రం:
ఋషి ప్రోక్త గాయత్రి మంత్రము లో ఉండవలసినది 24 అక్షరాలే.

 గాయత్రీ మంత్రము:
ఓం తత్స వితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
పురాతన భాస్కర యంత్రములో ఉన్నది ఈ 24 అక్షరాలే . ప్రముఖ  తెలుగు,ఆంగ్ల  కవి రోచిష్మాన్ గారి అభిప్రాయమూ ఇదే!!
ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతి రోజు శుచి , శుభ్రత, నిష్ఠతో జపించడం వలన కీర్తి,యశస్సు,దివ్య తేజస్సు,సుఖ సంతోషాలు,సకల శుభాలు మన సొంతమవుతాయి.

I AM THE SON OF THE DIVINE GODDESS GAYATHRI


I AM THE SON OF THE  DIVINE GODDESS GAYATHRI

Gayatri Japam will be observed tomorrow, 16th August,2019, it is the first day of Shravana Krishna Paksha called Padyami.

Gayatri hymn is the central composition for all hymns, shastras and holy texts. It is dedicated to Goddess Gayathri, who is said to be the mother holy trinity, Brahma, Vishnu, and Maheshwara.

THE GAYATHRI MANTRA

|| OM Bhur Bhuvah Swaha ||

|| That Savitur Varenyam
||
|| Bhargo Devasya Dhimahi
||
|| Dhiyo yo Nah Prachodayath ||
Meaning:
1: Om, Pervading the Bhu Loka (Earth, Consciousness of the Physical Plane), Bhuvar Loka (Antariksha, The Intermediate Space, Consciousness of Prana) and Swar Loka (Sky, Heaven, Consciousness of the Divine Mind),
2: That Savitur (Savitri, Divine Essence of the Sun) which is the most Adorable,
3: I Meditate on that Divine Effulgence,
4: May that Awaken our Intelligence (Spiritual Consciousness).
గాయత్రి మంత్రము:
"ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్‌!”
గాయత్రికి మూడు పేర్లు. అవి గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఇంద్రియములకు నాయకత్వం   వహించునది గాయత్రి, సత్యమును పోషించునది సావిత్రి, వాగ్ధేవతా స్వరూపిణి సరస్వతి. అనగా హృదయము, వాక్కు, క్రియ… ఈ త్రికరణ శుద్ధి గావింఛునదే గాయత్రి మంత్రము. సకల వేదముల సారము ఈ గాయత్రి మంత్రము.

Wednesday 14 August 2019

THE SACRED ASHES

THE SACRED ASHES
Suddenly Stormed
Little giggles
Set on fire 
Tiny laughters
Numb fingers
Collecting
Burnt pieces
Frozen hands
Alll Ashes
Still life
Standing at a distance
Spreading arms
Calling
The mutely wailing children
Smearing ashes
On their foreheads
Caressing the Innocents
Wiping the silent tears
Taking a leaf from
Ancient Scriptures
"Oh my little ones !
Life ends with ashes
Rises too
With ashes
As Sacred as
The holy waters
Of Ganges "
@ By Sister Rupa 

Saturday 10 August 2019

Article 370 effect

#Article 370 effect :
ఏదో జరుతుంది..ఏమో అవుతుంది అనుకున్న దేశద్రోహులకు ఇపుడు మింగుడు పడని అంశం :
పాక్ సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతోంది!!! 
రెండవది ఇపుడు అక్కడి ప్రజలు విరివిగా భగవత్ గీత ప్రతులను కొంటున్నారు!!!
అందులోని సారాన్ని గ్రహిస్తున్నారు!!
జై భారత్ మాత!!!

విశ్వనాథ సత్యనారాయణ

"దేశభక్తి, దైవ భక్తి సమకాలీన రచయితల్లో మచ్చుకైనా కనిపించనపుడు వారి రచనలను చదవటం పాఠకుని తప్పే అవుతుంది" 
~ విశ్వనాథ సత్యనారాయణ ~

చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) :

#చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (ఆగష్టు 8, 1870 - 1950) :
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకడు. దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, అతని మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించాడు.
ప్రజల్లో భక్తి,సదాచారం,సత్ప్రవర్తన,ధర్మాచరణం వంటి సుగుణాలను పెంపొందించి తన పాండిత్యం ద్వారా అక్షరసిరులను పండించిన అత్యుత్తమ తెలుగు కవి వర్యుడు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు.
నేడు ఆయన 150 వ జయంతి ఉత్సవం!!!
సమకాలీన తెలుగు రచయితలు వారినుంచి నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయ్!!!!

Maternal Bliss

#Maternal Bliss
అమ్మ దీవెన,చక్కటి బోధ ఉంటే చాలు
నైతికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!!!
#pencil sketch by Ponnada VR Murty

Book lovers day

#BOOK LOVERS DAY 
#August 9th BOOK LOVERS DAY 
Avoid social media as much as possible!!
Cultivate book reading as a lifetime reading habit.
HAPPY BOOK LOVERS DAY 
# రోజు పుస్తక ప్రేమికుల దినోత్సవవం.
సోసియల్ మీడియా అన్నది పరిమితంగా ఉండాలి.
నేడు అది హద్దులు మీరిన విలాస వినోదం అయి కూర్చుంది!!
ఈ సోసియల్ మీడియా మాయ నుంచి బయటపడి
సద్గ్రంథ పఠనానికి మళ్ళి చేరువకాగలితే
నిజమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలం!!!!

Sayings of Tarigonda Vengamamba

Sayings of Tarigonda Vengamamba


ఆత్మస్తుతి, పరనింద, అశ్లీల పరుష భాషణమును మఱియు కామక్రోధాదులను దరిచేయనివాడు శ్రీ హరికి మిక్కిలి ప్రీతిపాత్రుడు!!
తన రచనలలో భక్తి భావమును ప్రకటించు కవి 
తన గానంతో శ్రోతలను భగవంతునివైపు నడిపించు గాయని, గాయకులు 
శ్రీ హరి కృపకు పాత్రులగుదురు!!!
~ తరిగొండ వెంగమాంబ ~