Thursday, 21 November 2019

హిందూ ధర్మం



ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సషనల్ న్యూస్ వేసి మంచిపేరు తీసుకో వాలని ఆమె కోరిక.
అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది.
జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి?
భక్తుడు :85 ఏళ్లు ఉంటాయండి
జర్నలిస్ట్ :ఎన్నేళ్లుగా గుడికి వస్తుంటారు?
భక్తుడు : నాకు బుద్ది వచ్చినప్పటి నుండి
జర్నలిస్ట్ : మరి దేవున్ని చూసారా?
భక్తుడు : లేదండి
జర్నలిస్ట్ :మరి ఎందుకు అంత నమ్మకంగా ప్రతిసారి గుడికి వెళుతున్నారు?
భక్తుడు :మీరెక్కడ నుండి వచ్చారు?
జర్నలిస్ట్ :సిటీ నుండి
భక్తుడు :అక్కడ ఎక్కువ కుక్కల్ని పెంచుకొంటారట కదా?
జర్నలిస్ట్ :అవును, చాలా ఇళ్లల్లో పెంచుకొంటారు
భక్తుడు :మాది చిన్న పల్లెటూరండి, అక్కడ పంట చేల్లో దొంగలు పడకుండా కొంత మంది మామూలు కుక్కల్ని పెంచుకొంటారు,
జర్నలిస్ట్ :నేనడిగిన దానికి మీరు చెప్పేదానికి ఏమిటి సంబంధం?
భక్తుడు :రాతిళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా దొంగ కనిపిస్తే ఒక కుక్క మొరుగుతుంది, అది చూసి చుట్టూ దూరంగా ఉన్న కుక్కలు కూడా మొరుగుతాయి, కానీ దొంగని చూసింది ఒక కుక్క మాత్రమే, కానీ మిగతా కుక్కలు దాని మీదున్న నమ్మకంతో నే మొరిగాయి తప్ప అవేవి దొంగని చూడలేదు.
అలాగే వేల సంవత్సరాల నుండి ఎంతో మంది, ఋషులు, పుణ్యపురుషులు, రాజులు, తపస్సుతో దేవుడినే చూసివచ్చిన వాళ్ళు ఇలా ఎంతో మంది
తప్పకుండా మంచిమనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకొంటాను.
హిందూ ధర్మంలో పురాణపురుషులు చెప్పారు దేవుడు ఉన్నాడని, అలాంటప్పుడు యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి, ఉన్న మనుషులం మనం మన పూర్వీకుల నే నమ్మలేమా !
జర్నలిస్ట్ : క్షమించండి. మీ అనుభవం అంత, నా వయసు లేదు, తప్పు గా మాట్లాడినా జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను.
from the time line of Nagendra Sarma Suravarapu

No comments:

Post a Comment