Saturday 14 September 2019

Vamana Jayanti

నేడు వామన జయంతి....10 సెప్టెంబర్ 2019.
Vamana Jayanti is celebrated to worship the fifth incarnation (avatar) of Lord Vishnu as Lord Vamana. The festivities of Vamana Jayanti takes place on the twelfth day of Bhadrapada month in the Shukla Paksha as per the Hindu calendar. Vamana Jayanti falls either in August or September as per the Gregorian calendar.
Lord Vishnu incarnated as the son of sage Kashyapa and his wife Aditi and was popularly known as Vamana. As per the Hindu Scriptures, if a person worships Lord Vamana, the individual gets free from all kind of sufferings and sins and achieves salvation.
పోతన వామనావతారాన్ని ఎంత అద్భుతంగా రచించాడో చూడండి.
పోతన -- ఖగోళ శాస్త్రజ్ఞుడు
************************
వామనావతారం ఘట్టం లో బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మండమంతా నిండి పోతాడు. ఈ క్రింది రెండు పద్యాలలో ఖగోళం లోని విషయాలన్నీ సమర్ధంగా రచించారు. వటుడు పెరిగే వైనాన్ని మొదటి పద్యంలో తాను ఊహించుకున్నట్లుగా రాసి, ఆ కమనీయ దృశ్యాన్ని పాఠకులకు కూడా స్పష్టంగా అర్ధమయ్యేట్లు రెండవ పద్యం లో ప్రతిభావంతంగా రాశారు పోతన.
శా: ఇంతింతై వటుడింత యై మఱియు దానింతై నభో వీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్య పదొన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
వటుడు పెరిగిన విధానాన్ని వర్ణిస్తూ మొదట ఆకాశవీధి పై, మేఘమండలము పై కాంతి రాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి చివరికి సత్యాపదం వరకూ పెరిగాడట. ఈ వర్ణన కాస్త చదువుకున్న వారికి అర్ధం అవుతుంది. మనకు చంద్రుడు, ప్రభారాశి వరకు కంటికి కనబడుతుంది, కాని ధ్రువ, మహర్వాటి, సత్యపదం ఎక్కడ ఉంటాయో తెలియవు. ఆ మహాద్భుతాకారం ఎలా ఉంటుందో కంటికి కట్టినట్టుగా ఈ క్రింది పద్యం లో చెప్పారు పోతన.
మ: రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రం బై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గలాభరణ సౌవర్ణ కేయూర మై
చవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్
మిట్ట మధ్యాహ్నం సూర్యున్ని చూడమన్నాడు, అప్పుడు సూర్యుడు సుమారు ఎంతదూరం లో ఉంటాడో ప్రతివారికి తెలుస్తుంది. ఆ సూర్యుణ్ణి అలాగే దృష్టిలో ఉంచి వామనున్ని పెంచుతూ పోయాడు. మొదట సూర్యుడు వామనునికి గొడుగులా ఉంది, ఇంకా పెంచాడు ఇప్పుడు తలపై రత్నం లా ఉందన్నాడు, ఇంకాస్త పెంచాడు ఇప్పుడు సూర్యుడు వామనునికి చేవిపోగులా, ఇంకా మేడలో రత్నం లా, భుజకీర్తి లా, ముంజేతి కంకణం లా, ఇంకా మొలకున్న మువ్వలాగా, ఇంకా కాలి అందే లా, ఆఖరికి ఆ సూర్యబింబం వామనుని పాద పీఠం లా ఉందన్నాడు. అంత పెద్ద ఆకారాన్ని ఎంత స్పుటంగా చూపెట్టాడో చూడండి. పోతన శిల్ప నైపుణ్యం అనితర సాధ్యం.
~ శ్రీ Kodati Sambayya గారికి దన్యవాదములతో ~

No comments:

Post a Comment