Saturday, 7 September 2019

P.Bhanumathi

#వెండితెర దీపిక
★★★★★★★
స్వరవాహిని స్వరమోహిని!
చలనచిత్ర భరణిరాణి!
సంగీతపు సామ్రాజ్ఞి!
డా. పి.భానుమతి
7-9-1925 24-12-2005
(ఈరోజు వారి జయంతి)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఆ గళం...
ఆపాత మధురం
సుస్వర శోభితం
సప్తస్వర వికసితం
రసఝరి భరితం
రాగమాలికల రత్నాగారం
గమకమయ భాండాగారం
రాగసుధా మధురం
రసరమ్య భరితం
వెరసి...
ఆబాలగోపాల వశీకరణం
సర్వజన సమ్మోహనం
అటువంటి గళాన్ని,
పూర్వజన్మ సుకృతంగాపొంది,
అధ్బతమైన తనస్వరంతో,
ప్రేక్షకులను, శ్రోతలను
సమ్మోహితులను జేసి,
సాటిలేని మేటి గాయనిగా,
ప్రఖ్యాత చలనచిత్ర నటిగా,
స్టూడియో అధినేత్రి గా,
ఖ్యాతిని-విఖ్యాతిని గడించారు
డా.పి.భానుమతి గారు.
తెలుగు చలనచిత్రానికి సంబంధించి
ముఖ్యమైన విభాగాలలో
ఆమెపోషించని భూమిక లేదు.
నటిగా,గాయకురాలిగా,సంగీత దర్శకురాలిగా,కథా రచయిత్రిగా,
దర్శకురాలిగా....ఇలా అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అన్నింటా ప్రతిభావంతురాలిగా వెలుగొంది,
తన ప్రత్యేకతను నిలుపుకొంటూ,
సమున్నత శిఖరాలు
అధిరోహించారు ఆవిడ.
"తెలుగు సినిమా చరిత్రలో భానుమతికి ఉన్న స్థానాన్ని మరెవ్వరూభర్తీచేయలేరు.
భవిష్యత్తులో మరో భానుమతి పుట్టదు. ఈ మాటను నేను సగర్వంగా చెప్పుకోగలను"
అని చిరునవ్వు చిందిస్తూ నిబ్బరంగా చెప్పడం ఆవిడకే చెల్లింది.
~ వెండితెర దీపిక శ్రీ V S Raghava Chari గారికి దన్యవాదములతో ~
- Pencil sketch credits to Ponnada VR Murty

No comments:

Post a Comment