Sunday, 1 September 2019

#ProudToBeAnLician

63 Years of Trust!!
యోగక్షేమం వహామ్యహం.. !!!
ఆపదలన్నీ కట్ట కట్టుకుని చుట్టుముట్టినప్పుడు..
కష్టాలన్నీ కలిసి వచ్చినప్పుడు,
తాను మీ వెంటే ఉంటానన్న సూచన భగవద్గీత లోని ఈ శ్లోకం లో కనిపిస్తుంది.
నిజానికి "యోగక్షేమం వహామ్యహం " అన్నది ఒక మాట కాదు.
ఒక అభయం..
ఒక ఆశీస్సు.
అందుకే జీవిత బీమా సంస్థ ఈ వాక్యాన్ని తన నినాదం గా మార్చుకుంది.
1956 నాటి మాట.!!
ఆనాటి ప్రైవేటు కంపెనీలు ప్రజలకు చెల్లించవలసిన లక్షల క్లెయిములు ఎగవేయగా..ఎల్ ఐ సి ఆ మొత్తాన్ని తన మూల ధనం నుంచి చెల్లించింది.
అలా 1956 సంవత్సరం సెప్టెంబర్ 1న మొదలు పెట్టిన ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులు. ఎన్నో చాలెంజెస్. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రూపంలో ఎన్ని సవాళ్ళు విసిరినా... ఎల్ ఐ సి తన ప్రగతి పధాన్ని ఎప్పుడూ ఆపలేదు. ప్రభుత్వ రంగ సంస్థగా సమాజం లో తన భాధ్యతనీ విస్మరించలేదు.
ప్రజల నమ్మకమే పునాదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతి పెద్ద ఆర్ధిక సంస్థగా నిలిచింది.
క్లెయిముల పరిష్కారంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల యొక్క అచంచలమైన విశ్వాసాన్ని చూరగొంది.
"ప్రజల సొమ్ము ప్రజలకే " అన్న లక్ష్యంతో దేశంలో మౌలిక వసతుల కల్పనకు, వివిధ సామాజిక పధకాలకు ఏటా లక్షల కోట్లు అందిస్తోంది.
మనకు నిత్య జీవనాధారాలైన గృహ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు.. రైల్వేస్ ఈ రంగాలన్నింటికీ కలిపి గత సంవత్సరం ఎల్ ఐ సి అందించిన నిధులెంతో తెలుసా.. 29,84,331 కోట్లు.
ప్రపంచం మొత్తం ప్రైవేటికరణకు దాసోహం అంటున్నా.. పాలక వర్గాలు గంగిగోవులాంటి ఎల్ ఐ సి ని బలి ఇవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా చెక్కుచెదరని దీక్షతో మేం శ్రమిస్తూనే ఉంటాం.
మా సంస్థని కాపాడుకుంటాం...
ఎందుకంటే...
WE ARE PROUD TO BE LICIANS...
~ Sister Uma Nuthakki ~

No comments:

Post a Comment