Thursday 26 September 2019

శంబళ'

ఇది భారతంలోని మాట- కలియుగం అంతానికి 'శంబళ' అనే గ్రామంలో కలికి అవతారమైన బ్రాహ్మణుడు విష్ణుయశుడు అనే పేరుతొ పుడతాడు.అతడికి చదవకుండానే శాస్త్రాలు,వేదాలు అవగతమౌతాయి.సకలఆయుధాలు సమకూరి సార్వభౌముడై బ్రాహ్మణ బృందాలతో దుష్టులనుసంహరించి ధర్మస్థాపన,అ శ్వమేధయాగంచేస్తాడు.కృతయుగం ఆరంభమౌతుంది.

Monday 23 September 2019

Thanuja

Birthday Greetings to beautiful yesteryear actress Tanuja , who turned 75 years today.
Tanuja Mukherjee (born Tanuja Samarth; 23 September 1943), popularly known as Tanuja, is an Indian film actress, who predominantly works in the Hindi film industry. Part of the Mukherjee-Samarth family, she is the daughter of Shobana and Kumarsen, and was married to Shomu Mukherjee, with whom she has two daughters, actresses, Kajol and Tanisha. A recipient of two Filmfare Awards, Tanuja is best known for her roles in the Hindi films, Baharen Phir Bhi Aayengi (1966), Jewel Thief (1967), Haathi Mere Saathi (1971), Anubhav (1971) and Mere Jeevan Saathi (1972)
She started her film career with her older sister Nutan in Hamari Beti (1950) as Baby Tanuja. As an adult, she debuted in the film Chhabili (1960) which was directed by her mother and had her sister, Nutan, in the lead. The film that truly marked her transition into adult heroine came with Hamari Yaad Aayegi (1961), directed by Kidar Sharma, who had earlier discovered Raj Kapoor, Madhubala and Geeta Bali.
One of her early films, noticeable for her acting, was Baharen Phir Bhi Aayengi (1966), directed by Shaheed Latif. Incidentally it was Guru Dutt team's last offering, especially visible in the song, "Woh Hanske Mile Humse" (believed to have been picturized while Guru Dutt was still alive) who worked hard to help her "tone down" her performance. The result was that the natural, spontaneous performer gave a highly restrained performance which became the highlight of the film — as well of her career — as she moved to lead roles soon after. Tanuja had an important supporting role in the hit film, Jewel Thief. Her next big film was with Jeetendra, Jeene Ki Raah (1969), an immediate and surprise hit. In the same year, Tanuja won the Best Supporting Actress at Filmfare for Paisa Ya Pyar. After the success of Haathi Mere Saathi (1971), she acted in Door Ka Raahi, Mere jeevan Saathi, Do Chor and Ek Baar Muskara Do (1972), Kaam Chor, Yaarana, Khuddar, and Masoom. Some of the other films she has acted in are Pavitra Paapi, Bhoot Bangla, and Anubhav. Some of her Marathi films are 'Zaakol', 'Unad Maina' and Pitruroon
~ Credits to my literary friend Namrata Saluja ~

నరేంద్ర దామోదర దాస్ మోడి.

#పుట్టిన రోజు శుభాకాంక్షలు:
నరేంద్ర దామోదర దాస్ మోడి.
మన భారత ప్రధాని పూర్తి పేరది!!నేడు ఆయన పుట్టిన రోజు.
అధికారం కొందరికి ప్రాణవాయువు వంటిది మోడి గారికి ప్రజలే ప్రాణవాయువు.
ఆయన మాట్లాడితే దేశమే కాదు యావత్ ప్రపంచం ఆలకిస్తుంది.
ఆయన మాటలు సామాన్యుల ఆకాక్షలు!!
నోట్ల రద్దు, తలాక్ బిల్లు, 370 ఆర్టికల్ రద్దు వెనకాల గల ఎన్నో కుట్రలకు, కుతంత్రాలకు తనదైన శైలి లో చెక్ పెట్టిన ఓ గొప్ప నాయకుడు!!
ఆయన నెరవేర్చవలసిన కార్యాలు అనేకం ఉన్నాయ్!!
రిజర్వేషన్ల రద్దు, కామన్ సివిల్ కోడ్
ప్లాస్టిక్ , పెస్టిసైడ్స్ సమూల నిర్మూలన వల్ల ఒనకూడే ప్రయోజనాలను అతి త్వరగా భారతీయులకు అందించాలి!!
పల్లెలను, పాడిపంటలను, వ్యవసాయాన్ని బలోపేతం చెయ్యాలి!!
అన్నింటికీ మించి పవిత్రమయిన భారతీయ స్త్రీని, కుటుంబ గౌరవాలను మంటగలుపుతున్న టీవీ, సినీ విష సంస్కృతులను నాశనం చెయ్యాలి!!!
సనాతన ధర్మ సాంప్రదాయ పరంపరలను తూలనాడుతూ
నైతిక, ఆధ్యాత్మిక విలువలను కించపరుస్తున్న ద్రోహులకు ఆయన బుధ్ధిచెప్పాలి!!
మనందరికీ తెలుసు - సాధువులు, మహర్షులు, బ్రహ్మచారులు, ధర్మాన్ని విడువని గృహస్థుల పుణ్యభూమి ఈ దేశం.
ఏ జీవికి నమస్కరించినా, తిరస్కరించినా అది భగవంతునికే చెందుతుంది!!
మన దేశం ఆదినుండి అందిస్తున్న గొప్ప సందేశమిదే!!
మన దేశ గొప్పతనాన్ని చాటడం ఒక్కటే కాదు దేశ సమైక్యతను, సమగ్రతను, ఉత్కృష్ట జీవన విలువలను పాటించే నాయకులనూ,సాధు సజ్జనులనూ గౌరవించాలి!!
నరేంద్రుని సారథ్యం లో మనదేశం విలువలు,సమున్నత అభివృధ్ధి దిశగా మరింత పురోగమించాలని ఆకాంక్షిద్దాం !!
నరేంద్ర మోడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు!!
Many Many Happy Returns of the Day Modiji...

#గోమాత :

#గోమాత :
గోమాతతో పోలినది వేరొకటి లేదు.
గోమాత నిరుపమాన.
పరమాత్మతో సమానమైన మహిమకలది.
సచ్చిదానంద స్వరూపిణి.
గోవులో పృథ్వి నుండి సత్ తత్వం,సూర్యుని నుండి చిత్ తత్వం,చంద్రుని నుండి ఆనంద తత్వం వ్యక్తం అవుతాయి!!!
గోమాతను వధించినవారికి,గో సంబంధంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేసినవారికి పుట్టగతులుండవ్!!!
జై గోమాత!!!

#మనసా,వాచా,కర్మణా :

#మనసా,వాచా,కర్మణా :
"మనస్ ఏకం,వచస్ ఏకం,కర్మణ్యేకం"
బయటి ప్రపంచం మన పనితీరునుమట్టుకే చూస్తుంది.భగవంతుడు మాత్రం మన పని వెనుక సంకల్పాన్ని,ఉద్దేశాన్ని, సద్భావనను చూస్తాడు.ఆదిశంకరుల ఈ సూక్తిని త్రికరణశుధ్ధిగా ఆచరించి చూపిన మహనీయులెందరో ఈ పుణ్యభూమిలో ఉన్నారు!!!
మరుగునపడిన ఈ అధ్యాత్మిక సంపదను వెలికితీసి దేశానికంతటికీ పాఠ్యపుస్తకాల్లో చేర్చి ఒకే భాషద్వారా కోట్లమంది భారతీయులను జాగృతం చేయటానికి కేంద్రం ప్రణాలికలు సిధ్ధం చేసుకుంటోంది!!
భారత్ మాతాకి జై!!!

#అక్కినేని నాగేశ్వర రావు ..

#అక్కినేని నాగేశ్వర రావు ..
పరిచయం అక్కరలేని పేరు..
పరమ నాస్తికుడు.అయితేనేం దేవుడున్నాడు అన్నవారిని ఎప్పటికీ అగౌరవపరచలేదు.నటనలో నాజూకుతనం, నిర్భయమైన,నిజాయితీ కలిగిన వ్యక్తిత్వం.దౌర్భాగ్యమేమంటే అక్కినేని గారి రెండవ తరం, మూడవ తరం సత్ప్రమాణాలు లేని నటనతో జీవించడం..ఏది ఏమైనా ఆ ఎవర్ గ్రీన్ అక్కినేని పాటలను, చిత్రాలను ఆస్వాదిద్దాం!!!
* * * * * * * * * * * * * * * * * * * * *
ఓ దేవద..ఓ పార్వతి
ఓ దేవద
ఓ పార్వతి
చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడు దౌడ
ఓ దేవద చదువు ఇదేనా అయవారు నిదరోతే తమరు ఇలాగే దౌడు దౌడ
కూనలమ్మ మర్రిలో దివిగాలున్నయే పడితే వాటముగ పట్టుపడేనే
కూనలమ్మ మర్రిలో దివిగాలున్నయే పడితే వాటముగ పట్టుపడేనే
బడిమానే ఎడముంతే ఎపుడు ఇలగే ఆటే ఆట
బడిమానే ఎడముంతే ఎపుడు ఇలగే ఆటే ఆట
రేక్కరాని కూననె పడితే పాపమే బడిలో నెర్చినది ఈ చదువేన
రెక్కరాని కూననె పడితే పాపమే బడిలో నెర్చినది ఈ చదువేన
బడిలోనె చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
బడిలోనె చదువైతే బ్రతుకు ఇలాగే బెదురు పాటే
ఓ పిరికి పార్వతి
తేలెనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
తేలెనులే నీ బడాయి చాలునులే ఈ లడాయి
లడాయి ఇలా సరే మనకు గిలాయ్ ఇలాయ్ గిలాయ్లోయ్
లడాయి ఇలా సరే మనకు గిలాయ్ ఇలాయ్ గిలాయ్లోయ్
ఆ అన్న ఊ అన్న అలిగి పోయే ఉడుకుమోత
ఆ అన్న ఊ అన్న అలిగి పోయే ఉడుకుమోత
రా రా పిరికి పార్వతి పో ఓ దుడుకు దేవదా....

HAPPY DAUGHTERS' DAY

HAPPY DAUGHTERS' DAY
Every child must shine and be stronger than peace,every child is more precious than a divine dream , because they are the real heroes of simplicity and peace, I want to be a colour in the imagination of a child, may the world protect the rights of children.

"విద్వ‌న్మ‌ణి-గణపతిముని"

"విద్వ‌న్మ‌ణి-గణపతిముని"
దేశం నలుమూలలనుంచీ వచ్చిన కవులూ, పండితులతో నవద్వీప పండితసభ కోలాహలంగా ఉంది. సభలో నెగ్గినవారి పాండిత్యానికి తగ్గట్టు బిరుదులను ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సభలో తన సత్తా నిరూపించుకోడానికి వచ్చాడో తెలుగు యువకుడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. ఆశుకవితా దురంధరుడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆసేతు హిమాచలమంతా కీర్తించిన ఆ ప్రతిభామూర్తియే అయ్యలసోమయాజుల గణపతిముని.
వినాయకుడి అనుగ్రహంతో జన్మించినందున తల్లిదండ్రులు పెట్టినపేరు గణపతి. చిన్నతనంలోనే పురాణ–ఇతిహాసాలతోబాటు జ్యోతిష్యశాస్త్రాన్ని కూడా కరతలామలకం చేసుకున్నారు.
ఆనాటి పండిత లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచిన నవద్వీపసభలో గణపతిముని తన పాటవాలను నిరూపించుకుని‘కావ్యకంఠ‘ బిరుదును పొందారు. తత్త్వచింతనలో శంకరుడిని, కావ్యమాధుర్యంలో కాళిదాసుని తలపించే కవిత్వం గణపతిమునిదని ఆనాటి పండితులు అభిప్రాయ పడ్డారు.
వారి రచనల్లో ఉమాసహస్రం, ఇంద్రాణీ సప్తశతి, ఉమాశతకం, రమణగీత, దశమహావిద్యలు వంటి గ్రంథాలు ముఖ్యమైనవి.
నాయనగారు..!
తీవ్రమైన తపోకాంక్షతో అరుణాచలం చేరిన వీరిని చూసి అక్కడున్న బ్రాహ్మణస్వామి తమ దీర్ఘకాలిక మౌనాన్ని వీడి ‘నాయనా‘ అని ప్రేమపూర్వకంగా పిలిచారు. ‘రమణ మహర్షులకు‘ నమస్కారం అంటూ సంబోధించిన గణపతిముని మాటతో ఆనాటి నుండి బ్రాహ్మణ స్వామి రమణ మహర్షిగా ప్రజలలో స్థిరమయ్యారు.
– అప్పాల శ్యామప్రణీత్‌ శర్మ అవధాని

Namo Venkatesaaya

#Ohm..
Namo Venkatesaaya
The name 'Venkateshwara' can be split into multiple parts in Sanskrit: 'Ven' (sins), 'kata' (destroyer), and 'ishwara' (Supreme Lord). Using this etymology, Venkateshwara refers to the Supreme Lord who destroys sins.
#Ohm..Namo Venkatesaaya

సప్త జ్ఞాన భూమికలు

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
      🌷ॐ ఓం నమః శివాయ ॐ🌷

సూర్యుడి నుండి వచ్చే ఏడు
 కిరణాలు సప్త జ్ఞాన భూమికలు
 జ్ఞానం
జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం.
(1) శుభేచ్ఛ (2) విచారణ (3) తనుమానసం (4) సత్త్వాపత్తి (5) అసంసక్తి (6) పదార్ధభావని (7) తురీయం
అన్నవే సప్త జ్ఞాన భూమికలు.

 శుభేచ్ఛ: నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.

 విచారణ : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.

 తనుమానసం : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే, ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం .

 సత్త్వాపత్తి : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే.
      తమోగుణం అంటే సోమరితనం,
      రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం.
ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.

 అసంసక్తి : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం, రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.

 పదార్ధభావని : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.

 తురీయం : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే బుద్ధుడు అంటాం. ఇదే సహస్రదళకమలం .

ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.

 తురీయం అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.

🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉

Wednesday 18 September 2019

GURU DATTA

ఎత్తగ నీనామములను
చిత్తము స్వాంతన కలుగును శ్రీకరమగుచున్
సత్తువ కలుగుచు నంతట
దత్తుని తలువగ నెపుడును తన్మయమగుచున్

Tuesday 17 September 2019

Song from Railway Platform

Some  songs are divine and are created in the heavens.
The mesmerizing composition by Madan Mohan, the magic of Sahir Ludhianvi's poetry titled as " INTEZAR", from the fim : Railway Platform

chand maddham hai aasmaaN chup hai !
(The moon is dim and sky is calm


neend ki goad mein jahaaN chup hai
(In the lap of slumber, the whole world is drowsed)


chaand maddham hai aasmaaN chup hai !


duur vaadi meiN duudhiya baadal
(The white clouds, in the far-away valley,


Shhup ke parbat ko pyaar karate haiN !
 cuddle with the mountain in hiding)


dil mein naakaam hasarateiN lekar
(with futile desires in my heart,


ham tera intezaar karate hain
I am waiting for you all night)


chaand maddham hai aasmaaN chup hai


in bahaaroN ke saaye meiN aaja
(Please come while I am under the shadows of infatuation


phir mohabbat javaan rahe na rahe
who knows, my love remains as youthful or not)
zindagi tere na-muradooN par
(The life, on a distraught person like me,


kal talak mehrbaaN rahe na rahe
may not be kind tomorrow)


chaand maddham hai aasmaan chup hai


roz ki tarah aaj bhi taarey
(Like every day, the stars

subah ki gard meiN na kho jaayeiN
may not disappear in the twilight of the dawn)


aa terey gham mein jaagati aankheiN
(Please come, so that my sleepless eyes which are awake anguished for you,


kam se kam ek raat so jaayeiN!
may sleep at least for a night)
Hindi version :
chaand maddham hai aasmaan chup hai
चांद मद्धम है आसमां चुप है
नींद की गोद में जहां चुप है

दुर वादी में दूधिया बादल
झुक के पर्वत को प्यार करते हैं
दिल में नाकाम हसरतें लेकर
हम तेरा इंतजार करते हैं

इन बहारों के सायें में आ जा
फिर मोहब्बत जवां रहे ना रहे
ज़िंदगी तेरे नामुरादों पर
कल तलक़ मेहरबां रहे ना रहे

रोज कि तरह आज भी तारे
सुबह कि गर्द में ना खो जाएं
आ तेरे ग़म में जागती आंख़ें
कम से कम एक रात सो जाएं

चांद मद्धम है आसमां चुप है
नींद की गोद में जहां चुप है
Here is the link of the song :
https://youtu.be/abcnIgwy5Tg

Monday 16 September 2019

#తేజో మూర్తి :

#తేజో మూర్తి :
సౌశీల్యము,గుణము, పవిత్రభావాలు ...
వ్యక్తిలో ఉన్నంతవరకు దేదీప్యమనమైన ఓ తేజోమూర్తి , తేజో రాశి
ఆ వ్యక్తికి రక్షణకవచంలా ఉంటుంది!!!

Happy birth day to Modi

#పుట్టిన రోజు శుభాకాంక్షలు:
నరేంద్ర దామోదర దాస్ మోడి.
మన భారత ప్రధాని పూర్తి పేరది!!నేడు ఆయన పుట్టిన రోజు.
అధికారం కొందరికి ప్రాణవాయువు వంటిది మోడి గారికి ప్రజలే ప్రాణవాయువు.
ఆయన మాట్లాడితే దేశమే కాదు యావత్ ప్రపంచం ఆలకిస్తుంది.
ఆయన మాటలు సామాన్యుల ఆకాక్షలు!!
నోట్ల రద్దు, తలాక్ బిల్లు, 370 ఆర్టికల్ రద్దు వెనకాల గల ఎన్నో కుట్రలకు, కుతంత్రాలకు తనదైన శైలి లో చెక్ పెట్టిన ఓ గొప్ప నాయకుడు!!
ఆయన నెరవేర్చవలసిన కార్యాలు అనేకం ఉన్నాయ్!!
రిజర్వేషన్ల రద్దు, కామన్ సివిల్ కోడ్
ప్లాస్టిక్ , పెస్టిసైడ్స్ సమూల నిర్మూలన వల్ల ఒనకూడే ప్రయోజనాలను అతి త్వరగా భారతీయులకు అందించాలి!!
పల్లెలను, పాడిపంటలను, వ్యవసాయాన్ని బలోపేతం చెయ్యాలి!!
అన్నింటికీ మించి పవిత్రమయిన భారతీయ స్త్రీని, కుటుంబ గౌరవాలను మంటగలుపుతున్న టీవీ, సినీ విష సంస్కృతులను నాశనం చెయ్యాలి!!!
సనాతన ధర్మ సాంప్రదాయ పరంపరలను తూలనాడుతూ
నైతిక, ఆధ్యాత్మిక విలువలను కించపరుస్తున్న ద్రోహులకు ఆయన బుధ్ధిచెప్పాలి!!
మనందరికీ తెలుసు - సాధువులు, మహర్షులు, బ్రహ్మచారులు, ధర్మాన్ని విడువని గృహస్థుల పుణ్యభూమి ఈ దేశం.
ఏ జీవికి నమస్కరించినా, తిరస్కరించినా అది భగవంతునికే చెందుతుంది!!
మన దేశం ఆదినుండి అందిస్తున్న గొప్ప సందేశమిదే!!
మన దేశ గొప్పతనాన్ని చాటడం ఒక్కటే కాదు దేశ సమైక్యతను, సమగ్రతను, ఉత్కృష్ట జీవన విలువలను పాటించే నాయకులనూ,సాధు సజ్జనులనూ గౌరవించాలి!!
నరేంద్రుని సారథ్యం లో మనదేశం విలువలు,సమున్నత అభివృధ్ధి దిశగా మరింత పురోగమించాలని ఆకాంక్షిద్దాం !!
నరేంద్ర మోడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు!!
Many Many Happy Returns of the Day Modiji...

Saturday 14 September 2019

Pranam

Pranam to parents తల్లితండ్రులకు నిత్య పాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం ఈ జగత్తులో లేదు!!

"భారతీయుల కళాప్రాభవమ్మొలికించి"

Ramesh Panchakarla

"భారతీయుల కళాప్రాభవమ్మొలికించి" పద్యాన్ని రచించినవారు తోలేటి వెంకటరెడ్ది గారు( వెంకటశాస్త్రి).విజయనగరం సంగీత కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ఘంటసాలకు తోలేటి పరిచయమయ్యారు.తాను పాటలు,పద్యాలు రాస్తానని వాటిని పాడి రికార్డ్ చేయించమని ఘంటసాలగారితో చెబుతూ ఉండేవారు. 1949లో సరోజినినాయుడు గారు మరణించిన సందర్భంగా తోలేటి రాసిన ఈ పద్యాన్ని ఘంటసాల స్వరపరచి పాడగా 1950లో రికార్డ్ గా ఇది విడుదల అయింది. పద్యవివరణ డా.ఎం.పురుషోత్తమాచార్య విరచిత "మన ఘంటసాల పద్యగాన సౌరభం" నుండి గ్రహింపబడినది.
తోలేటి వెంకటరెడ్డి గారు 1947లో మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారు. 1952లో ఏ.వి.యం సంస్థలో రచయితగా చేరి "జీవితం,సంఘం, వదిన,ఆడజన్మ" మొదలైన సినిమాలకు పనిచేసి మంచిపేరు సంపాదించారు."ఆలీబాబా 40 దొంగలు" సినిమాకు పనిచేస్తూ అకాలమృత్యువు పాలైనారు.
సరోజినీదేవికి "భారతకోకిల" అనే బిరుదున్న విషయాన్ని మొదటిపాదం లోనే ద్వనింపజేసారు. వంగదేశంలో జన్మించి తెలుగుజాతి నట్టింట కోడలిగా అడుగుపెట్టిన విషయాన్ని 2,3 పాదాలలో అందంగా సూచించారు. ప్రాక్పశ్చిమ రీతులను ముడిపెట్టే సందేశాలను పాఠాలవలే అందించింది కనుక పంతులమ్మతో పోల్చారు.
ఘంటసాల మాస్టారు ఈ పద్యాన్ని "మోహన" రాగంలో విశుద్ధమైన పోకడలతో బాణీ సమకూర్చి మధ్యమస్థాయిలో ఆలపించారు. అందువల్ల ఈ పద్య గానానికి "పహాడి" రాగ ముద్ర కూడా కొంత సంక్రమించినట్లు లీలగా తెలుస్తుంది.ఎందుకంటే సాధారణ గాంధారం, కైశిక నిషాదం తగలకున్నా మంద్ర పంచమ సంచారం కనిపిస్తున్నది కనుక.
మొదటిసారి పాడిన "కోయిలమ్మ" దగ్గర హార్మోనియం బిట్టు అందంగా వినిపిస్తుంది. "కోడలమ్మ" దగ్గర క్లారియోనెట్ స్వర సంచారం ఉదాత్తంగా ఉంది. "చేయెత్తి చూపిన" పదాన్ని చెయ్యి పైకెత్తినట్లుగానే పంచమం దగ్గర దీర్ఘీకరించడం భావధ్వనిగా భావించవచ్చు.
తేటగీతి రెండవపాదం చివరి "విఖ్యాతిగన్న" దగ్గరనుంచి ఆధార షడ్జమంతో ప్రారంభించి ఆరోహణ క్రమంలో ఆలపిస్తూ "ఘనతకెక్కుడి" దగ్గర పైస్థాయి గాంధారం దాకా వెళ్లి "వనితలార" దగ్గరికి తిరిగి ఆధార షడ్జమం దాకా రావడం ఒక మనోహరమైన స్వరతంత్రం, సంగీత మాయాజాలం.అది ఒక్క ఘంటసాలకే సాధ్యం.ముగింపు ఆలాపనను సకలస్వర యుక్తంగా చేసి మంద్ర పంచమం దగ్గర ఆగి మరో చిన్న స్వర సంపుటితో పద్యాని ముగించడం వల్ల "పహాడి" లక్షణంతో ఎంతో హాయి గొల్పుతుంది.
భారతీయుల కళాప్రాభవమ్మొలికించి
తీయగా పాడిన కోయిలమ్మ
భారతీయుల కళాప్రాభవమ్మొలికించి
తీయగా పాడిన కోయిలమ్మ
కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో
ప్రసరించినట్టి మేల్ పసిడిబొమ్మా
కమనీయ వంగ వంగడమెల్ల మూర్తిలో
ప్రసరించినట్టి మేల్ పసిడిబొమ్మా
స్వారాజ్య వీర విహార రంగములోన
కోరి దూకిన తెన్గు కోడలమ్మ
మానవ కళ్యాణ మంగళారతిజ్యోతి
చేయెత్తి చూపిన చెల్లెలమ్మ..ఆ..ఆఆ
ప్రాక్పశ్చిమాలు విస్ఫారించి ప్రేమింప
పాఠాలు నేర్పిన పంతులమ్మ
భరతనారీ ప్రతాప ప్రభావ గరిమ
ఖండ ఖండాలు జల్లి విఖ్యాతిగన్న
దివ్యమూర్తి సరోజినిదేవి వోలె
దీర్ఘసూత్రాన ఆదేవి దివ్య సుగుణ
పుష్పముల నేరి విరిదండ పూర్తిచేసి
పుణ్య భారతమాతను పూజచేసి
ఘనతకెక్కుడి భారత వనితలార..ఆ.ఆఆ

ONAM

#Traditional India
#Onam festivity begins in Kerala
Onam observed by Malayalis all over the world as a rich age old cultural festival, Onam commemorates the annual homecoming of the legendary King Mahabali — the grandson of Prahlada —
Wishing
You All A Very Happy Onam.

Vamana Jayanti

నేడు వామన జయంతి....10 సెప్టెంబర్ 2019.
Vamana Jayanti is celebrated to worship the fifth incarnation (avatar) of Lord Vishnu as Lord Vamana. The festivities of Vamana Jayanti takes place on the twelfth day of Bhadrapada month in the Shukla Paksha as per the Hindu calendar. Vamana Jayanti falls either in August or September as per the Gregorian calendar.
Lord Vishnu incarnated as the son of sage Kashyapa and his wife Aditi and was popularly known as Vamana. As per the Hindu Scriptures, if a person worships Lord Vamana, the individual gets free from all kind of sufferings and sins and achieves salvation.
పోతన వామనావతారాన్ని ఎంత అద్భుతంగా రచించాడో చూడండి.
పోతన -- ఖగోళ శాస్త్రజ్ఞుడు
************************
వామనావతారం ఘట్టం లో బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల దానాన్ని గ్రహించి, వామనుడు త్రివిక్రముడై బ్రహ్మండమంతా నిండి పోతాడు. ఈ క్రింది రెండు పద్యాలలో ఖగోళం లోని విషయాలన్నీ సమర్ధంగా రచించారు. వటుడు పెరిగే వైనాన్ని మొదటి పద్యంలో తాను ఊహించుకున్నట్లుగా రాసి, ఆ కమనీయ దృశ్యాన్ని పాఠకులకు కూడా స్పష్టంగా అర్ధమయ్యేట్లు రెండవ పద్యం లో ప్రతిభావంతంగా రాశారు పోతన.
శా: ఇంతింతై వటుడింత యై మఱియు దానింతై నభో వీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్య పదొన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
వటుడు పెరిగిన విధానాన్ని వర్ణిస్తూ మొదట ఆకాశవీధి పై, మేఘమండలము పై కాంతి రాశి, చంద్రుడు, ధ్రువుడు, మహర్వాటి చివరికి సత్యాపదం వరకూ పెరిగాడట. ఈ వర్ణన కాస్త చదువుకున్న వారికి అర్ధం అవుతుంది. మనకు చంద్రుడు, ప్రభారాశి వరకు కంటికి కనబడుతుంది, కాని ధ్రువ, మహర్వాటి, సత్యపదం ఎక్కడ ఉంటాయో తెలియవు. ఆ మహాద్భుతాకారం ఎలా ఉంటుందో కంటికి కట్టినట్టుగా ఈ క్రింది పద్యం లో చెప్పారు పోతన.
మ: రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రం బై శిరోరత్నమై
శ్రవణాలంకృతమై గలాభరణ సౌవర్ణ కేయూర మై
చవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్వస్త్ర మై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుడు దా బ్రహ్మాండము న్నిండుచోన్
మిట్ట మధ్యాహ్నం సూర్యున్ని చూడమన్నాడు, అప్పుడు సూర్యుడు సుమారు ఎంతదూరం లో ఉంటాడో ప్రతివారికి తెలుస్తుంది. ఆ సూర్యుణ్ణి అలాగే దృష్టిలో ఉంచి వామనున్ని పెంచుతూ పోయాడు. మొదట సూర్యుడు వామనునికి గొడుగులా ఉంది, ఇంకా పెంచాడు ఇప్పుడు తలపై రత్నం లా ఉందన్నాడు, ఇంకాస్త పెంచాడు ఇప్పుడు సూర్యుడు వామనునికి చేవిపోగులా, ఇంకా మేడలో రత్నం లా, భుజకీర్తి లా, ముంజేతి కంకణం లా, ఇంకా మొలకున్న మువ్వలాగా, ఇంకా కాలి అందే లా, ఆఖరికి ఆ సూర్యబింబం వామనుని పాద పీఠం లా ఉందన్నాడు. అంత పెద్ద ఆకారాన్ని ఎంత స్పుటంగా చూపెట్టాడో చూడండి. పోతన శిల్ప నైపుణ్యం అనితర సాధ్యం.
~ శ్రీ Kodati Sambayya గారికి దన్యవాదములతో ~

స్వరూప జ్ఞానం

నిశ్శబ్దమును ఆధారం చేసుకొని శబ్దం ఉన్నది.
వెలుతురు లేమియే చీకటి!!
స్వరూప జ్ఞానం లేకుండుట అజ్ఞానమే!!
సస్వరూప జ్ఞానానికి సజ్జనుడిని ఆశ్రయించుటయే ఉత్తమం!!!

KRISHNA TULABHARAM

KRISHNA TULABHARAM 🙏 🌿 🐚 🔯
The Tulabharam is an incident in the life of Rukmini, that reveals the extent to which humble devotion is worth more than material wealth... Satyabhama, another queen of Krishna, prides herself about the love Krishna has for her and her grasp over his heart… Rukmini, on the other hand is a devoted wife, humble in her service of her Lord... Her devotion is her real inner beauty…
-----------------------
Credits to sweet friend, Ashwiñšujåý Śiñgh

Vandana Haiku

Haiku
morning newspaper a roadside astrologer reads his horoscope
@Vandana Parashar

Haiku. Senryu. Tanka. Haiga.

Friday 13 September 2019

Bhaja Govindam

Bhaja Govindam
kaamam krodham lobham moham
tyaktvaa atmaanam bhaavaya ko aham
aatmagyaana vihiinaa muudhaah
te pachyante narakaniguudhaah


Lust,anger,greed and obsession are emotions to be cast out
Thy real nature should be calmly pondered
Fools are those who on their true self are blinded
Consigned to hell they will suffer, their days sans end

Thursday 12 September 2019

ప్రముఖ వాగ్గేయ కారులు

సంగీత దీపిక
●●●●●●●●●
ప్రముఖ వాగ్గేయ కారులు
(అతి సంక్షిప్త పరిచయం)
■★■★■★■★■★■★■★■
*********************** జయదేవుడు(1101-1153)
***********************
'గీతగోవిందము' అను సంగీత గ్రంథమును సంస్కృత భాషలో రచించిన
ప్రథమవాగ్గేయకారుడు.'జయదేవ'
ముద్రతో ఇతను రచించిన సంగీత కృతులు 'అష్టపదులు'గా ప్రసిద్ధి చెందినవి
**************************
*పురందరదాసు(1484-1564)
**************************
తన ఇష్టదైవమగు పండరీపుర విఠలునిపై
వేలాది,సంగీత కృతులను కన్నడ భాషలో రచించారు.'దేవరనామాలు' అను పేరుతో
ప్రఖ్యాతిగాంచిన ఈతని కృతులు
'పురందరవిఠల' ముద్రతో ఉన్నాయి.
****************************
*అన్నమాచార్యులు(1408-1503)
****************************
తన ఇష్టదైవమైన తిరుపతి,
శ్రీవేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలను రచించినారు.ఈకీర్తనలు 'వేంకటేశ' ముద్రతో సాగుతుంది.
'ఆంధ్ర పద కవితా పితామహుడు' గా
ప్రఖ్యాతి చెందినారు.
*************************
*భక్త రామదాసు(1620-1680)
************************
*ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న.తన
ఆరాధ్య దైవమగు శ్రీరామునిపై 'రామదాసు' ముద్రతో అనేక కీర్తనలను
రచించారు.
************************
*క్షేత్రయ్య (1610-1685)
************************
*ఇతని అసలు పేరు వరదయ్య. అనేక
క్షేత్రములను సందర్శించడం వలన క్షేత్రయ్యగా పిలువబడినారు.తన ఇష్ట
దైవమగు గోపాలస్వామి పేర 'మువ్వగోపాల' ముద్రతో పెక్కు సంగీత కృతులు రచించారు.
************************
శ్యామశాస్త్రి(1762-1827)
************************
అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యం. ఆంధ్రులైన సంగీతత్రయంలో మూడవ
వాడు. త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు.'శ్యామకృష్ణ'
ముద్రతో సంగీత కృతులు రచించారు.
***********************
*త్యాగరాజు(1767-1847)
***********************
కాకర్ల త్యాగరాజు 'సంగీతరత్నత్రయము'
గా,ప్రసిద్ధి గాంచిన వారిలో అగ్రగణ్యుడు.
తనఇష్టదైవమైనశ్రీరామునిపై,అపారమైన
భక్తితో 24 వేల కీర్తనలను రాసారు.
**********************
*ముత్తుస్వామి దీక్షితులు(1776-1835)
*********************
'సంగీతరత్నత్రయం'లో రెండవ వారు.
'గురుగుహ' ముద్రతో సంస్కృత భాషలో
వీరు కృతులు రచించారు.
**********************
*స్వాతితిరునాళ్(1813-1846)
**********************
తిరువాన్కూరు(కేరళ) సంస్థానమునకు
ప్రభువు.బహుభాషాపాండిత్యమునకు
తోడు,సంగీతంములోనూ ,విశేష ప్రజ్ఞా వంతులు. మళయాళము,తమిళము, సంస్కృతము,హిందీ, మరాఠీ, ఒరియా,కన్నడము ,తెలుగు వంటి
ఎనిమిది భాషలలో 'పద్మనాభ' ముద్రతో సంగీత కృతులను రచించారు.
************************
నారాయణ తీర్థులు(17వ శతాబ్దము)
************************
ఇతని అసలు పేరు తల్లావఝల శివశంకరశాస్త్రి. తన ఆరాధ్య దైవమగు
శ్రీకృష్ణుని లీలావినోదములను 'కృష్ణ లీలా తరంగిణి' అను సంగీత గ్రంథమున
విపులంగా వర్ణిస్తూ కీర్తనలను రాసారు.
ఇవి 'తరంగములు'అను పేర ప్రసిద్ధి చెందినవి.

Tuesday 10 September 2019

RESPECT THE WOMAN

RESPECT THE WOMAN
Mother and Daughter
A true symbol of a divine thread
Bound naturally
A changeless truth
The limitless companionship!!
In a developed insight
Rather than a mere sight
All thoughts are
Striving to be Sublime!!
I bow my head in Respect
To that all Women
Because
I experience God in them!!

Saturday 7 September 2019

ISRO

#Success stories of ISRO:
Shivan we are with You...
As You know Shiva being referred as Chandramouli one who has the crescent moon in His head...
You are the Shiva of Space!!!

#సద్గురువు:

#సద్గురువు:
బాలబాలికల విద్యాభ్యాసమునందు
గృహస్థుని కష్టసుఖములయందు
సాధకుని చింతనయందు
యోగుల ధ్యానముయందు
సిధ్ధుల అంతఃకరణయందు
కవులు,గాయకులు
పశుపక్ష్యాదులు,పంచభూతాలు మొదలుకొని

ఈ చరాచర సృష్టియందంతయు సంపూర్ణముగా వ్యాపించి
ప్రకాశింపజేయుచున్న ఆ సద్గురువు
దత్తాత్రేయునికి నమస్కరించుచున్నాను...
🙏🏼🙏🏼 శ్రీసద్గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః🙏🏼🙏🏼

#పీవీ మార్గం లో మోడి:

#పీవీ మార్గం లో మోడి:
ఎవరెటుపోతే నాకేం
రాజకీయాలు మాకెందుకు?
స్పందన,చైతన్యాన్ని...
సనాతన ధర్మం మనకు అందించిన ఆత్మ శక్తిని నిర్వీర్యం చేసిన వేళ
90 వ దశకంలో భారతదేశాన్ని తనదైన మేధో శక్తితో ముందుకు నడిపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు!!!
దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించడమేకాదు
నిత్యం అల్లర్లు,వేర్పాటువాదం, తీవ్రవాదం తో రగిలిపోతున్న
పంజాబ్,అస్సాం లలో శాశ్వత శాంతిని పునరుధ్ధరించాడు.
పిచ్చి మొక్కలు మొలుస్తూ అదేదో మతం పూలను చెవిలో పెట్టాలని చూసిన సెక్యులర్ ముసుగు జీరోలకు చెక్ పెడుతూ రాత్రికి రాత్రి వారి వినాశకర ప్రగతి నిరోధ గోడలను కూల్చాడు !!!!
పీవీ గారి పరిపాలనా సుమధుర ఫలాలతోనే భారత్ నేడు ముందుకు దూసుకపోగలుగుతున్నది.
గీతా మహిమ అపారమైనది.సనాతన ధర్మం పరిధి అనంతమైనది.
పీవీ సేవలు అనన్య సామాన్యమైనవి.
ఈ స్పూర్తిని అనుసరిస్తూ భారతీయుల సత్యఫలప్రాప్తికి
370 ఆర్టికల్ రద్దుతో పాటు మోడి అనేక అంశాలలో భారత్ కు పునర్వైభవం తేబోతున్నాడనేది సత్యం!!
జై భారత్ మాత!!!
~ రా.రా.~

#పర్యావరణం..పరిరక్షణ..

#పర్యావరణం..పరిరక్షణ..
ఇపుడు కావలసింది యురేనియం త్రవ్వకాలా??
సిమెంట్ దిబ్బలా??
సెజ్జులు, పరిశ్రమలూ
లేక రియల్ ఎస్టేట్ పాపాలా??
వీటిని బలపరచేవారికి
కూడు దొరకదూ...నీడ దొరకదూ..
తుదకు నీళ్ళుకూడా దక్కవు!!!
పాలకులూ..కార్పోరేట్ కహానీలూ...
ఆలోచిస్తారా???
ఇక నిర్ణయం మీదే!!!

P.Bhanumathi

#వెండితెర దీపిక
★★★★★★★
స్వరవాహిని స్వరమోహిని!
చలనచిత్ర భరణిరాణి!
సంగీతపు సామ్రాజ్ఞి!
డా. పి.భానుమతి
7-9-1925 24-12-2005
(ఈరోజు వారి జయంతి)
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఆ గళం...
ఆపాత మధురం
సుస్వర శోభితం
సప్తస్వర వికసితం
రసఝరి భరితం
రాగమాలికల రత్నాగారం
గమకమయ భాండాగారం
రాగసుధా మధురం
రసరమ్య భరితం
వెరసి...
ఆబాలగోపాల వశీకరణం
సర్వజన సమ్మోహనం
అటువంటి గళాన్ని,
పూర్వజన్మ సుకృతంగాపొంది,
అధ్బతమైన తనస్వరంతో,
ప్రేక్షకులను, శ్రోతలను
సమ్మోహితులను జేసి,
సాటిలేని మేటి గాయనిగా,
ప్రఖ్యాత చలనచిత్ర నటిగా,
స్టూడియో అధినేత్రి గా,
ఖ్యాతిని-విఖ్యాతిని గడించారు
డా.పి.భానుమతి గారు.
తెలుగు చలనచిత్రానికి సంబంధించి
ముఖ్యమైన విభాగాలలో
ఆమెపోషించని భూమిక లేదు.
నటిగా,గాయకురాలిగా,సంగీత దర్శకురాలిగా,కథా రచయిత్రిగా,
దర్శకురాలిగా....ఇలా అన్ని పాత్రలను సమర్థవంతంగా పోషించారు. అన్నింటా ప్రతిభావంతురాలిగా వెలుగొంది,
తన ప్రత్యేకతను నిలుపుకొంటూ,
సమున్నత శిఖరాలు
అధిరోహించారు ఆవిడ.
"తెలుగు సినిమా చరిత్రలో భానుమతికి ఉన్న స్థానాన్ని మరెవ్వరూభర్తీచేయలేరు.
భవిష్యత్తులో మరో భానుమతి పుట్టదు. ఈ మాటను నేను సగర్వంగా చెప్పుకోగలను"
అని చిరునవ్వు చిందిస్తూ నిబ్బరంగా చెప్పడం ఆవిడకే చెల్లింది.
~ వెండితెర దీపిక శ్రీ V S Raghava Chari గారికి దన్యవాదములతో ~
- Pencil sketch credits to Ponnada VR Murty

Namo Narasimha

#
Namo Narasimha
నమో నారసింహ
Lest you should later blame me I solicit you that CM is also going to collapse!!!
చెప్పలేదంటనక పొయ్యేరు
ఆ ముక్కుమంత్రీ త్వరలో పతనం కానున్నాడు!!!
🙏🏼🙏🏼 Namo Narasimha 🙏🏼🙏🏼
🙏🏼🙏🏼 నమో నారసింహ 🙏🏼🙏🏼 

Tuesday 3 September 2019

Health Tips

Health Tips :
తిన కూడనిది తినకు !
-- శారీరక ఆరోగ్యం .
అన కూడనిది అనకు !
-- సామాజిక ఆరోగ్యం .
కన కూడనిది కనకు ! 
-- మానసిక ఆరోగ్యం .
విన కూడనిది వినకు !
-- సర్వత్రా ఆరోగ్యం .
నిరంతరం ఇది పాటించు !
-- నిండైన ఆరోగ్యం !
-- నిజమైన ఆరోగ్యం .
మల్లేశ్వరరావు

#దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు :

#దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు :
ఆంద్రప్రదేశ్ లోని పిఠాపురం లో అప్పలరాజు,సుమతి అనే పుణ్య దంపతులకు భాద్రపద శుక్ల చతుర్థి (వినాయక చవితి)నాడు శతాభిషా నక్షత్రం లో దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు
జన్మించారు.8 ఏట ఉపనయనం జరిగిన తరువాత అక్కడి ప్రజలకు ప్రాయశ్చిత్త ఉపదేశం చేసి,తోబుట్టువుల కుంటితనం,గ్రుడ్డి తనం పోగిట్టి తల్లిదండ్రులకు తన యదార్ధ రూపం చూపించి వారికి 3 ప్రదక్షిణలు చేసి 16 ఏళ్ళు అక్కడే ఉండి పాదచారులలై ద్వారకా,కాశీ,కైలాస,మనససరోవరం, బృదావనం,బదరీ,గోకర్ణం, శ్రీ శైలం,త్రిపురాoతకం అన్ని క్షేత్రాలను పునరుద్ధరణ చేసి,అనేక భక్తులను ఉద్దరిస్తూ చివరకు కురుపురం లో అంతర్ధానం అయ్యారు*.🙏🏻
గురుదత్తుని కృపతో 🙏🏻
🌹 వినాయకచవితి శుభాకాంక్షలు 🌷 మితృలందరికీ🙏