Maaredu Dalaalu (Bilva leaves) is a deep study of the life of the great philosopher Sri Adi Sankaracharya. This is a unique publication that first appeared in as a weekly column for 54 weeks in 'Srisaila Prabha' monthly magazine. Listeners will get a true understanding of the Advaita Philosophy, not found anywhere else.
దాసుభాషితం శ్రోతలందరికీ నమస్కారం
‘మారేడు దళాలు’
భారత దేశం పుణ్యభూమి. మహోన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఎందరో మహర్షులకు జన్మభూమి. వారందరూ విశ్వమానవ సౌఖ్యం కోసం మానవుడి పరమోన్నతి కోసం నిరంతరమూ తపించారు, అపారమైన జ్ఞానాన్ని పొందారు, ప్రబోధించారు. నిజానికి తత్త్వ జ్ఞానం సామాన్యుడికి బహు దూరం. అంతటి దుర్లభమైన జ్ఞానాన్ని తపోఫలంగా పొందిన సూత, శుక, శౌనకాదుల వంటి ఎందఱో ఋషులు, ఆ జ్ఞానాన్ని తమ కోసమే కాకుండా ఈ ధర్మ ధరిత్రి మీద అతి సామాన్యులకు సయితం అందేలా సహస్రాబ్దాలుగా నిరంతరం ప్రవహింప జేస్తూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన మహనీయులలో ప్రథములు, ప్రముఖులు, అద్వైత జ్ఞానామృతాన్ని ఆసేతు హిమాచలం పరివ్యాప్తం చేసిన శ్రీమద్శంకర భగవద్పాదులు.
ఈ భూమి మీద, శత, సహస్రాబ్దాలుగా జ్ఞాన సముపార్జన నిమిత్తం అన్ని కాలాల్లోనూ అనేక అన్వేషణలు కొనసాగాయి. ఇవన్నీ సత్యాన్ని కథన రూపంలో దర్శించే, దర్శింపజేసే ప్రయత్నమే చేశాయి. ఈ అన్వేషణలు, చాలా వరకూ వేదాలూ ఉపనిషత్తులూ కేంద్రంగా కాగా, మరి కొన్ని, వాటికి అతీతం గానూ, వ్యతిరేకంగానూ సాగాయి. ముఖ్యంగా బౌద్ధ, జైన దర్శనాలు. ఈ అన్వేషణలోని భాగాలే అయినప్పటికీ. అవి ధర్మం గురించీ సంఘం గురించీ మాత్రమే చెప్పాయి కానీ దేవుడిని గుర్తించ లేదు. తదనుగుణంగా కొన్ని వందల సంవత్సరాల పాటు మహారాజులు, చక్రవర్తుల ప్రత్యక్ష ఆశ్రయం, పోషణ, ప్రాపకాలతో ఉధృతంగా జరిగిన ప్రచారం కారణంగా, ఆయా విశ్వాసాలను పాటించే వారిలో సైతం భయభక్తులు లోపించి విచ్చలవిడితనం. భోగలాలసత్వం ప్రబలి, నైతిక విలువలు నశించి, సాత్త్విక చింతనకు, శ్రేయస్కర జీవనానికి దూరమై పూర్తిగా భ్రష్టు పట్టిన సమాజం పతనావస్థకు చేరుకుంది.మరోవైపు సనాతన ధర్మం ఆచరిస్తూ సన్మార్గంలో జీవించేవారు అవహేళనలకూ, అవమానాలకూ, సామూహిక హింసకూ గురయ్యారు.. నిజానికీ బౌద్ధం కానీ, జైనం కానీ ఈ విధమైన కృత్యాలను ప్రబోదించలేదు, ప్రోత్సహించనూ లేదు. ఏదో విధంగా తమ మతం వ్యాప్తి చెండుతున్నది కదా అనే సంకుచిత దృష్టితో, సమాజాన్ని సన్మార్గంలో పెట్టవలసిన వారు గానీ ఆ ప్రయత్నం చేసిన వారు గానీ, దురదృష్టవశాత్తూ, ఆ మతాలలో లేకపోయారు. తత్ఫలితంగా అప్పటికే ప్రపంచం నలుమూలలా విస్తరించిన వైదిక జ్ఞాన జ్యోతులు కొడిగట్టి ప్రభావం కోల్పోయాయి. అసలు సనాతన ధర్మమే నామమాత్రావశిష్టమూ, ప్రశ్నార్దకమూ అయి పెను ప్రమాదంలో చిక్కుకున్నది.
అటువంటి విపత్కర సమయంలో -- కూర్మ పురాణంలో చెప్పబడినట్లు -
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే |
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః |
కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః |
శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా||
“దుష్టాచారాన్ని నశింపజేసి, శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్టితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టటానికి నీల లోహితుడైన శివుడే స్వయంగా శ్రీ శంకర భగవత్పాదులుగా అవతరించారు.” ఆ విధంగా కారణ జన్ములైన శంకరులు అద్వైత మత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తద్వారా వైదిక ధర్మాన్ని పునరుద్ధరించారు. అలాగే భవిష్యత్తులో వైదిక ధర్మానికి మళ్ళీ ఎటువంటి ప్రమాదం ఏర్పడకుండా, సనాతన ధర్మ పరిరక్షణ. ప్రచారమూ, ఆచరణా శాశ్వతంగా జరిగే విధంగా దేశం లోని నాలుగు దిక్కులా నాలుగు పీఠాల రూపంలో పటిష్టమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆదిశంకరులు కేవలం ఎవరో ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక సన్న్యాసీ కాదు. వారు ఒక దివ్య చైతన్య మూర్తి. గొప్ప తాత్వికుడు, విశిష్ట కవి, మహా పండితుడు, మహాయోగి, సమాజ సంస్కర్త, ఉద్దారకుడు, తిరుగులేని వక్త, మానవతా విలువలకు కట్టుబడిన ఉదార హృదయుడు, అమోఘమైన వ్యూహ కర్త – ఇలా, పరిశీలకులకు వారిలో ఎన్నో కోణాలు గోచరిస్తాయి.
అంతటి మహాద్భుతమైన శ్రీ శంకరాచార్యుల వారి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి, అన్ని కోణాలనూ స్పృశిస్తూ, సమగ్రమైన వివరణలతో, శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల దేవస్థానం కొంత కాలం క్రితం తమ మాస పత్రిక ‘శ్రీశైలప్రభ’ లో ‘మారేడు దళాలు’ పేరున సరళమైన తెలుగులో దారావాహినిగా ప్రచురించింది ఆ ధారావాహినిని, ఇప్పుడు మీకు శ్రవణ రూపంలో అందిస్తున్నది దాసుభాషితం. శ్రవణానువాదం, గళం : కొండూరు తులసీదాస్. వినండి ‘మారేడు దళాలు’ – శ్రవణ పుస్తకం నిడివి 09:48:33
https://www.dasubhashitam.com/ab-title/ab-maaredu-dalaalu#

~ Credits to Sri Tulasidas Konduru and Sri Sailadevasthanam ~
No comments:
Post a Comment