Friday 14 September 2018

తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము అన్నమయ్య సంకీర్తన

#
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము అన్నమయ్య సంకీర్తన
*************************************************
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము కలవంటిది బదుకు -ఘనునికిని అనయము సుఖమేడది -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లవి - యోగికిని తగినయమృతమేది - తలవగ విషమేది తెగి నిరాహారియైన - ధీరునికిని పగవారనగ వేరి - బంధులనగ వేరీ వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి వేవేలువిధులందు - వెఱపేది మఱపేది దైవము నమ్మినయట్టి - ధన్యునికిని శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు యీవలేది యావలేది - యితనిదాసునికి
***************************************
వివరణ :
********

తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు।
శరీరము నశించును। ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు
నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విషము లేదు


 । ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేదు , బంధువు లేడు।
వేల వేల విధులున్నయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామని తలంప సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు।

No comments:

Post a Comment