Sunday, 23 September 2018

KV REDDY

KV REDDY
వెండితెర దీపిక
★★★★★★★
సుప్రసిద్ధ సినీ దర్శకుడు
కె.వి.రెడ్డి
(కదిరి వెంకటరెడ్డి)
1-7-1912 15-9- 1972
●●●●●●●●●●●●●●●●●●
కె.వి.రెడ్డి గా సుప్రసిద్ధులైన కదిరి వెంకట రెడ్డి గారు
తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాలను తెలుగు తెరకు అందించిన ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత.
పురాణాలు, జానపద చలన చిత్రాలు తియ్యడంలో సాటి లేని మేటి అనిపించుకొన్న కె.వి.రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1912 వ సంవత్సరం జూలై 1 న జన్మించారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలలో కథానాయకులకే కాకుండా ఇతర చిన్న పాత్రలకు సైతం ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.
ఉదాహరణకు సత్య హరిశ్చంద్ర చిత్రంలోరేలంగి, జగదేకవీరుని కథ చిత్రంలో రాజనాల, మాయాబజార్ చిత్రంలో ఎస్వీ.రంగారావుపాత్రలు. అంతేకాక కె.వి.రెడ్డి సినిమాలలో గిల్పం, తసమదీయులు, పరవేశ దవారం, డింభకలాంటి కొత్త పదాలు వినిపించడం కద్దు. ఈయన సినిమాలలో కథ, చిత్రానువాదం, పాత్రల విశిష్టతే కాకుండా సంగీతం కూడా ఎంతో బాగుంటుంది.
చలనచిత్రాలను అపురూపంగా,అద్వితీయంగా,అద్భుతంగా, రసప్లావితంగా,ప్రేక్షకజన సమ్మోహితంగా రూపొందించిన ఈ దర్శక మహేంద్రుడు కె.వి.రెడ్డి గారు 1972 సెప్టెంబరు 15 న కీర్తిశేషులైనారు
.

No comments:

Post a Comment