Friday 5 April 2019

Happy Ugadi

మిత్రులందరికి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది
ఉగాది పండుగ ప్రకృతి పరి రక్షణకు, ధర్మానికి కేంద్ర బిందువు.
ప్రతి పండుగలో పరమార్థం ఇమిడి ఉంటుంది.పండుగలన్నీ ఋతుపరమైనవి,పురాణేతిహాస సంబంధమైనవి.ఇవి ఆధ్యాత్మికచింతనను, ఆరోగ్యాన్ని,సోదర ప్రజలు, మిత్రుల పట్ల సౌహార్దభావాన్ని పెంపొదిస్తాయి.
ఇదే యుగయుగాలుగా, తరతరాలుగా అవిచ్చిన్నంగా ప్రవహిస్తున్న సనాతన, ధార్మిక,సజీవ, హైందవ సంస్కృతి!!!
ఈ ఉత్కృష్టమైన సంస్కృతి భారత దేశానికే సొంతం.
ప్రతి పుట్టను, చెట్టును, పల్లెను,తల్లిని, పాడిపంటలను పూజించన పుణ్యభూమి ఈ దేశం.
అయితే నేడు ఈ ధర్మానికి విరుధ్ధంగా మాతృదేశాన్ని కించపరచేలా మాట్లాడుతున్న దేశద్రోహులు,
అభివృధ్ధి పేరుతో మోసపూరితంగా పల్లెలను, ప్రకృతిని, పాడిపంటలను కాటేస్తున్న పాలకులు,
తల్లిలా పూజించబడే స్త్రీని, కుటుంబ గౌరవాన్ని మంటగలుపుతున్న చానల్లు, సినెమాలు ,
ఈ దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్న వారందరికీ భగవంతుడు త్వరలో బుధ్ధిచెప్పాలని మనమంతా ఒక్కటిగా ఆ సర్వేశ్వరుడిని ప్రార్థిద్దాం.
మిత్రులందరికి శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.


No comments:

Post a Comment