Monday 15 April 2019

ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977) 2

శిలనొక్క ప్రతిమగా...మలచింది నీవే...
ఆ ప్రతిమనీ.. దైవముగా...కొలిచింది నీవే...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా.. జాబిల్లి అనుబంధం....
మదినొక్క గుడివోలే...మలచింది నీవే...
ఆ గుడిలోనే కరుణతో...వెలసింది నీవే....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా... జాబిల్లి అనుబంధం....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
నీ చెంతగ ఎన్నాళ్ళున్నా...నిన్ను చేరుకోలేదు...
ఎదుట ఉన్న పారిజాతం ..ఎదను చేర్చుకోలేదు...
అపరంజి కోవెల ఉన్నా..అలరారు దైవం ఉన్నా...
ఆ గుడితలుపులు ఈనాడే తెరచుకున్నాయి...లోనికి పిలుచుకున్నాయి....
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కడలి నిండ నీరున్నా..కదలలేని నావను నేను..
అడగాలని మదిలో ఉన్నా.. పెదవి కదపలేకున్నాను..
నావకు తెరచాపనై...నడిపే చిరుగాలినై...
కలలో.. ఇలలో ..నీ కోసం పలవరించేనూ...నీలో కలిసిపోయేనూ...
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
కలనైనా తలచింది కానే కాదు...ఏనాటిదో ఈ బంధం...
ఈ వెన్నెల్లా జాబిల్లి అనుబంధం....ఉమ్మ్...ఉమ్మ్..
నేననుకున్నది కాదూ...ఇది నేననుకున్నది కాదూ...
చిత్రం: ఈనాటి ఈ బంధం ఏనాటిదో (1977)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఎం. బాలయ్య
నేపధ్య గానం: బాలు, సుశీల

No comments:

Post a Comment