Friday 26 April 2019

చరిత్ర లో కొన్ని నిజాలు

via ..Jai Sankar
చరిత్ర లో కొన్ని నిజాలు చదవండీ
హిందూ ధర్మ సోదరులారా..
ఈ చిత్రం బీకానేర్, రాజస్థాన్‌లోని ఒక సంగ్రహాలయంలోనిది.
పీ.ఎన్.ఓక్ గారు అక్బర్ మహాన్ కైసే? (అక్బర్ మహిమాన్వితుడు ఎలా అయ్యాడు?) అని ఒక పుస్తకం రాసారు. మన చరిత్రకి పట్టిన పైత్యం పేరు సెక్యూలర్ చెద. ఫలితంగా మన జాతిని నిర్వీర్యం చేసిన ప్రతివాడిని మన చరిత్ర పుస్తకాలు, హీరోగా కీర్తిస్తాయి.
అక్బర్‌లాంటి స్త్రీలోలుడు బహుశా ప్రపంచ చరిత్రలోనే లేడని, ఆయన జనానాలో అతడి కామానికి బలి అయిన 5000 వేలకి పైగా ఆడవాళ్ళు మ్రగ్గిపోతుండేవారని, అక్బర్ నుమాయిష్, మేలాలు నిర్వహించి, ఆ విపణిలో అక్బర్ బురఖా వేసుకుని తిరుగేవాడు. విపణికి వచ్చిన మహిళలలో అందమైన యువతులను ఎంచుకుని తన సైనికుల ద్వారా వాళ్ళని ఎత్తుకుపోయి అనుభవించి తన జనానాలో పారేసేవాడు. అటువంటి అక్బర్‌ని మన చరిత్ర పుస్తకాలు “అక్బర్ ది గ్రేట్” అంటూ పొగడ్తలతో నింపేస్తాయంటారు పి.ఎన్.ఓక్.
పైగా అక్బర్ మత సామరస్యత కోసం దీన్-ఏ-ఇలాహీ అనే నూతన ఒరవడిని స్థాపించి హిందు-ముస్లిము సఖ్యత కోసం గొప్ప సేవ చేసాడని కూసేవారికి కొదవ లేదు. ఈ నూతన ఒరవడిలో హిందు మహిళలను పెళ్ళి చేసుకున్న ముస్లిము యవకులు కనిపిస్తారు కానీ, ముస్లిము మహిళలను పెళ్ళి చేసుకున్న హిందు యువకులు కనిపించరు. అది ఆయన సామరస్యత. కానీ మన సిక్(సెక్యులర్)గాళ్ళు ఇదే విషాయాన్ని పదేపదే అక్బర్ గొప్పతనంగా ఎకరువు పెడుతుంటారు.
ఇంక చిత్రంలోని విషయానికి వద్దాం.
రాజస్థాన్ ఎందరో వీరులకి జన్మస్థలి. వీదేశీ మూకలను ధైర్యంగా ఎదుర్కొన్న భూమి. ఆయా వీరుల తల్లులు, అక్క-చెల్లెళ్ళు, భార్యలు కూడా అదే రకమైన శ్రౌర్య, ప్రతాపాలను చూపించారు. వారి త్యాగ, బలిదానాల కారణంగా భారతీయ సంస్కృతి ఇప్పటికీ ధృడంగా నిలచి ఉంది.
అంటువంటి వీరాంగనలలో కిరణ్ దేవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆమె అక్బర్ పై కత్తి దూసి తన మాన సంరక్షణకి నడుము కట్టిన వీర నారీమణి. ఈ సంఘటన నౌరోజీ మేలాలో జరిగింది. మేలాకి వెళ్ళిన అక్బర్ దృష్టి కిరణ్ దేవీ పైన పడింది. ఆమెని ఎలాగైనా పొందాని తలంచాడు అక్బర్.
అమెని పట్టి తీసుకురావడానికి అక్బర్ తన గుప్తచరులను పంపాడు. ఆమె మేవాడ్ మహారాణా ప్రతాప్ సింగ్ చిన్న తమ్ముడైన శక్తిసింగ్ కూతురు. బీకానేర్, రాజస్థాన్ యొక్క ఫృధ్విరాజ్ రాఠోర్‌తో ఆమె వివాహం జరిగింది.
అక్బర్ ఒక పక్క ఫృద్విరాజ్‌ని యుద్ధం పేరు చెప్పి వేరే ఊరు పంపి, అక్బర్ మిమ్మల్ని పిలుస్తున్నాడని కిరణ్‌కి కబురుపంపాడు. రాజాజ్ఞతో అక్బర్‌ని కలవడానికి వచ్చిన కిరణ్ పై బలత్కారం చేయబోయాడు అక్బర్. కిరణ్ తన ఒరలో ఉన్నకత్తి తీసీ అక్బర్ పై విజృంభించింది. ఊహించని పరిణామంతో భీతి చెందిన అక్బర్ నన్నువదిలేయి ఇంక నుండి ఇటువంటి మేలాల నిర్వహణ చేయనని, కాళ్ళ బేరానికి వచ్చి ప్రాణం రక్షించుకున్నాడు. ఈ ఘటనతో భయ-భ్రాంతుడైన అక్బర్ మళ్ళీ ఎప్పడూ మేలాల నిర్వహణ చేయించలేదట.
ఈ చిత్రం అదే విషయాన్ని వివరిస్తున్నప్పటిది.
పైన ప్రస్తావించిన అక్బర్ వ్యవహార శైలి నేపధ్యంలో ఒక సారి మన జాతీయ ఆదర్శాలకి, సాంస్కృతిక వారసత్వానికి ఆదర్శమైన శివాజీ వ్యవహార శైలి కూడా ఒక సారి పరికించండి. వ్యత్యాసం ఎంతో స్పష్టంగా బోధపడుంతుంది.
శివాజీ సైనికులు యద్ధానంతరం ఒక అందమైన ముస్లిము యువతిని బంధించారు. ఆమెని శివాజీకి కానుకగా ఇచ్చి పదోన్నతి పొందాలనుకున్నారు. ఆ సైనికులు మీకోసం బహుమతి తెచ్చామని ఆమెని శివాజీ ఎదుట నిలబెట్టారు. సైనికులపైన కోపోద్రికుడైన శివాజీ, నా సైనికులు పెద్ద పొరపోటు చేసారు, క్షమించు తల్లి అని ఆమె కాళ్ళపైన పడ్డాడు. నా తల్లే కనుక నీ అంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకెంత అందగా పుట్టేవాడినో కదా అని అంటూ ఆమెను రాజలాంఛనాలలో ఆమె ఇంట దిగబెట్టించాడు శివాజి.
మన చరిత్రలో ప్రముఖంగా ఎన్.సి.ఇ.ఆర్.టి.సి. పుస్తకాలు అటువంటి శివాజీకి కేటాయించినవి ఒక్కపేజి. కాని మన చరిత్ర పుస్తకాలు అక్బర్ పొగుడుతూ పుంఖాను పుంఖాలుగా రాస్తుంటాయి.
మీ జై శంకర్

No comments:

Post a Comment