Wednesday 2 January 2019

MYTHILI CHIRUMAMILLA

INSPIRING POST FROM MYTHILI CHIRUMAAMILLA

మనకు ఒక్క మెతుకు అంటే అంతగా విలువ ఉండదు ఎక్కడైనా పడితే ఏరి పారేస్తాం కాని అదే మెతుకు ఒక చీమ కు దిరికితే ఎంత పరమానందం తనకు కొండత ఆహారం దొరికి నందుకు కృతజ్ఞత కలిగి ఉంటుంది..మనిషి లా దానికి అంతా తానే తినాలి అనుభవించాలి తనకే దక్కాలనే అత్యాశ కలిగిఉండక తన తోటి వారందరిని ఏకం చేసి పంచుకుంటుంది..నిత్య శ్రమైక జీవనం నిజాయితీ సమిష్టి భావన కలిగిన ఆ చీమ ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి
‌ప్రతీ రోజు మనం కనీసం ఒక్క‌గుప్పెడు అన్నం లేదా ఓక్క రొట్టె అభాగ్యులకి గాని మూగజీవులకి గాని అర్పించినా చాలు అది భగవంతునికి చేరి తీరుతుంది..
భగవంతుడు మన అర్హతకు మించే అన్నీ మనకు ప్రసాదించాడు.. ఆయాచితంగా మనకు లభించిన వాటిి విలువ మనకు తెలియకపోవచ్చు ..కాని
ఎంత ఇచ్చినా అసంతృప్తి తో రగిలిపోయే మనిషిని చూసి భగవంతుడు కూడా భాధ పడతాడు..ఎలాగైతే ఎంత ఇచ్చినా తృప్తి పడకుండా పదే పదే అడిగి విసిగించే బిక్ష మెత్తేవారిని చూసి మనం విసుక్కుంటామో అలానే మన స్వభావానికి చివరికి ఆయన విసిగిపోతాడు
మనము ఈ రోజు పోతే అతి మామూలు గానే మూడవ రోజు వస్తుంది అని బాబా అన్నారు.. అశాశ్వతమైన అనిత్యమైన ఈ జగత్తు నుండి ఏది కావాలని ఏది..దక్కలేదని మనం ఆరాటపడుతున్నాం..ఒకవేళ అనుకున్నది వెంటనే అమరినా దానితో మన తృష్ణ తీరుతుందా...దాని స్దానంలో ఇంకోక కోరిక పుట్టి మనసును ప్రశాంతంగా ఉండనీయదు...ధనమైనా అధికారమైనా మరేదైనా తనకు దక్కుతుందని భావించినది ఇతరులకు దక్కితే ఈర్ష అసూయలను మనం ప్రదర్శస్తే మనం ఆశించింది దక్కకపోగా చివరకు ఉన్న మనఃశాంతి కూడా కరువవుతుంది ..ఇతరుల భాధకు స్పందించి వారికి చేతనయినంత సాయపడేవారు..భక్తి తో దేవుని కొలిచేవారు..మనసును నిర్మలంగా ఉంచుకోగలిగిన వారు..కోట్ల సంపద కలిగి ఉన్నవారికి కూడా దొరకని ఆత్మ సంతుష్టత దానంతట అదే సిద్ధిస్తుంది..నీవు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నావా..ఇతరులు నీవు వేరు కాదు అని భావించగలుగతున్నావా..నీలో నువ్వు
ప్రశాంతంగా ఉన్నావా.. ఆ ప్రశాంతతను ఇతరులకు పంచతున్నావా.. మనం నిత్యం మనలని ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలివి..
మనకున్న డబ్బు వయసు..ఆరోగ్యం ..అందానికి అరోగ్యానికి మన దగ్గర అవి ఉన్నంతవరకే వాటికి విలువ.. ఒక్కసారి అవి దూరమయ్యాక సొంత వారే పరాయివారవుతారు.కాని మన వ్యక్తిత్వం బాగుంటే మన జీవితం ముగిసాక కూడా అది మనల్ని ఎవరు మర్చిపోలేకుండా చేస్తుంది
ఎవరైనా అనుకోని అతిధి వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం గా లేకపోతేేనో లేదా సరైన విధంగా వారికి మర్యాద ఏర్పాట్లు చేయలేక
పోతే సిగ్గుపడతాం అలాంటప్పుడు మన మనసుకి మురికి అంటుకున్నప్పుడు ఎందుకు సిగ్గుపడం.
మన తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే.. ఒకరు అంతరాత్మ ఇంకొకరు ఆ పరమాత్మ
అంతరాత్మ లో మార్పు రానంత కాలం ఏ కొత్త సంవత్సరం మొదలైనా మనకు ఒరిగేది ఏమీ లేదు.. ఏ మర్పూ ఉండదు.. ఒక్క కాలెండర్ లో పేజీలు తప్ప..క్షణ క్షణం మార్పులతో కూడిన ఈ జీవిత ప్రయాణ బాటలో మనము మనల్ని ఎప్పుడు కొత్తగా మలచుకుంటూ పయనిద్దాం ..కొత్త సంవత్సరం మొదలైన సందర్బంగా పంచుకోవాలనిపించిన మదిలోనున్న చిన్న చిన్న భావనలు..మైధిలి
my comments ; 
అద్భుతమైన సందేశం అందించావు సోదరి...
మానవ జీవితం భగవంతుడిచ్చిన వరం..కొన్ని విధులు,పరిమితులు , ధర్మాలు ఈ మానవ జన్మకు ఉన్నాయి..జాలి,కరుణ,దయ,దాన,క్షమా గుణములు కలిగి ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా ప్రతి మానవుడు ధర్మ మార్గాన ప్రవర్తించాలి.
సకల జీవులను పరమాత్మ 
స్వరూపంగా భావించి ఆరాధించాలి..ధర్మబధ్ధమైన సాంఘిక అలవాట్లను భావి తరాలవారికి అందిస్తూ సుఖసంతోషాలతో జీవించాలి.ఇలా మనిషి బ్రతకాటినికి ఎన్నో అవసరాలున్నాయి..సుఖవంతమైన జీవితం తన ఆత్మను తెలుసుకుంటూ, తను తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులను జాగృతం చేయగలగాలి..అపుడే పరమాత్ముని దీవెనలు మనిషికి అందుతాయి.. ఇలాంటి ఎన్నో దివ్య సందేశాలు నీనుండి సమాజానికి చేరాలని ఆశిస్తున్నాను
Sister Mythili response : 

అన్నయ్య మీరు పంచిన ఈ దివ్య సందేశం తో మనసంతా తాదాత్మం చెంది మంచి అనుభూతి పొందాను‌..ఒక్కరోజు అన్నం తిన్న తరువాత పక్కన పడిన ఒక్కటి రెండు మెతుకులను ఒక్క మెతుకేగా అన్నట్లు నేను తీసి గట్టు మీద పెట్టాను దానిని ఒక చీమ గ్రహించిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది అది దాని వారందరి పిలిచి ఎంతో కష్టంతో దానిని కదిలించింది.. పోనీ అంతటితో ఆగిందా మరునిమిషం మళ్లీ దారి కట్టి తమ పని చేసుకుంటూనే పోయాయి..అతిధి అంటే మనిషి కోసమే ఎదురు చూడవద్దు ..ఆకలితో వచ్చే ఏ ప్రాణి ఐనా పక్షి..పిల్లి కుక్క..చివరకు చిన్న చీమైనా అది అతిధే అని బాబా చెప్పిన విషయం నాకు జ్ణప్తికి వచ్చింది..అందుకే రోజు రెండు మెతుకులు అన్నం గ్రహించే ముందు బయట ఒక గట్టు మీద విడుస్తాను..నాకు అనిపించింది ఈ సృష్టి లో మనిషి అంతగా విలువే ఇవ్వని అక్కరలేదని భావించేవి ఎన్నో ఇతర జీవులకు అవే అమృతతుల్యం....మనకు ఎంత ఉన్నా తృప్తి లేదు ఏది ఉన్నా తృప్తి లేదు ...ఎంత సేపని మన అనుభవిస్తున్న వాటికి ఇంకొకరిని నిందించగలం..మన అశాంతికి కారణం మనలోనే ఉన్నదన్న సత్యం గుర్తెరిగి మసలుకోవాలి..నా చిన్న మనః భావాలు మీ హృదయాన్ని తాకినందుకు సంతోషం..ఒక్కరికైనా ఇవి తాకితే చాలని పంచాను అన్నయ్య.. తప్పకుండా మీరు దీనిని పంచవచ్చు💖🙏

No comments:

Post a Comment