కాలం చిరుకొమ్మ మీద....
కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ నాకు అందిన అసంఖ్యాక సందేశాలలో ఒక వాట్సాప్ గ్రూపు ద్వారా ఓ మిత్రురాలు, ‘దాసుభాషితం’ అభిమాని ‘నెత్తావుల దారులలో నడవమంది కాలం’ అంటూ ఈ పాటను ఉదహరించారు. దీనిని రచించి స్వరకల్పన చేసిన మిత్రులు శ్రీ కలగ కృష్ణమోహన్ గారికి శ్రావ్యతను పండిస్తూ మధురంగా గానం చేసిన శ్రీమతి డి. సురేఖామూర్తి గారికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్తరోజు పరిమళాలు మీకోసం పంచుతోంది ‘దాసుభాషితం’ వినండి –
కొత్తరోజు పరిమళాలు పంచుతోంది ఉదయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
అణువణువును పలుకరించి పూలవార్తలను వినిచి
ఎదఎదలో మడురోహాల పరవశాల హాయినించి
నెత్తావుల దారులలో నడవమంది కాలం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
ఎదఎదలో మడురోహాల పరవశాల హాయినించి
నెత్తావుల దారులలో నడవమంది కాలం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
లోలో స్వర పల్లవిలా పొంగారే మధురిమలా
ఆమని పొడిచే వేళల మదినెగసే రసధునిలా
తొలి మోజుల మలుపులలో కలవమంది ప్రాయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
ఆమని పొడిచే వేళల మదినెగసే రసధునిలా
తొలి మోజుల మలుపులలో కలవమంది ప్రాయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
No comments:
Post a Comment