Friday, 25 January 2019

జాతిని జాగృతిని చేసిన అసలు సిసలు హీరోలు :

జాతిని జాగృతిని చేసిన అసలు సిసలు హీరోలు :
* * * * * * * * * * * * * * * * * * * * * * *
# ఎన్ని  అడ్డంకులు ఎదురైనా, నా ఆలోచనలు పవిత్రంగాను, దోషరహితంగాను ఉండునట్లు నా సర్వ శక్తులు సనాతన ధర్మాన్ని , భారతీయతను కాపాడటానికే ఉపయోగిస్తా ~ వీర శివాజి ~
#విదేశీ  ముష్కరుల వినాశకర పాలన నుంచి నా దేశానికి విముక్తి కల్పించడటానికి నా ప్రాణాన్ని, నా శక్తికి మూలమైన భారతీయుడికే సమర్పిస్తా ~ భగత్ సింగ్ ~
# నా  ఆలోచనలు,మాటలు, చేతలు నిర్మాణాత్మకంగా,స్పూర్తిని నింపే విధంగా నా జాతీయ పతాకాన్ని, విను వీధులలో , వినీల ఆకాశం లో రెప రెప లాడిస్తా ~ పింగళి వెంకయ్య ~
# సర్వ శక్తివంతుడు,సర్వవిదుడు,ప్రేమ సింధువు అయిన ఆ భాతతీయుడి లో నేను ఒక భాగమన్న సద్భావనతో నా దేశాన్ని సంఘటితం చేస్తా  ~  సర్దార్ పటేల్ ~
చరిత్ర పుటల్లో దాక్కున చరిత్ర హీనులను గౌరవించడం భావి తరాలకు చేటు కలిగిస్తుంది.ఇక నైనా జాతికి,నీతిని,దేశభక్తిని...
ఈ చరా చర సృష్టిజాతానికి  ధర్మాన్ని పంచిన స్పూర్తి కణాలను,నిజమైన హీరోలను గుర్తిద్దాం,వారినే గౌరవిద్దాం!!వారి మార్గాన్నే అనుసరిద్దాం!!!
జై భారత్! జై జై భారత్!!
I LOVE INDIA !!
Meraa Bhaarath Mahaan!!!

!!!







Thursday, 10 January 2019

SAT BHAVANA

సాధువు "అమ్మా వండినప్పుడు ఏ ఆలోచనతో వండుతామో అవే ఆలోచనలు తినేవారికి సంక్రమిస్తాయి. పాత్ర శుద్ధి,మనసు శుద్ధి ,దినుసుల శుద్ధి తినే వారి మీద ప్రభావం చూపుతాయి." ఒక్క రోజు చెడు సంస్కారం నా అనేక సంవత్సరాల సాధన కు పరీక్ష పెట్టింది .ఆ దుష్ట సంస్కారం నుండి బయటకి రావడానికి ఇన్నాళ్లు పూర్ణ ఉపవాసం చేసి నన్ను నేను శిక్షించు కోవలసి వచ్చింది."
ఒకప్పుడు ఈ దేశం లో రైతు విత్తనాలు చల్లేటప్పుడు రామ నామం చెపుతూ చల్లేవాడు.కోతల సమయం లో,నూర్చేటప్పుడు,దైవ నామం వినపడేది. ధాన్యం దంచేటప్పుడు విసిరేటప్పుడు దైవ నామ సమ్మిళితం జరిగేది. భోజన కాల దైవ నామస్మరణ,భోజనానంతరం గోవింద స్మరణ.
భోజన సమయం లోని ఆలోచనలే మన సంస్కారాలు గా తయారయ్యే లా ఆహారం రక్తంలో కలిసే సమయంలో చర్యలు జరుగుతాయని ప్రతీతి.

Wednesday, 9 January 2019

స్వస్వరూపాణ్వేషన IV

స్వస్వరూపాణ్వేషన IV
* విచక్షణా జ్ఞానంతో గూడిన
నరజన్మ మెత్తియు గానుగెద్దులా
బ్రతుకెంత కాలమీడ్చెడుదువోయి
తెలుసుకో నీవెవరో రమణమార్గాన
* చేసుకున్న వారికి చేసుకున్నంత
దృష్టాదృష్ట ఫలసమన్వితం జీవితం
జ్ఞానార్థివై ఛేదించు పునరపి జననం
పునరపి మరణాల దీర్ఘ చక్రభ్రమణం
* బొమ్మలోన బొమ్మ పంచకోశాల బొమ్మ
మూడు శరీరాల బొమ్మ మనిషి బొమ్మ
సంచితపు సొమ్ము తో నెంత నూరేగినా
ప్రారబ్దకర్మ మున్నంత కాలమే ధరణిపైన
* గుడ్డెద్దు చేనులో పడినట్లు ఎంతకాలమైన
జీవించనేమి తెలుసుకో ఉపనిషత్ బోదతో
జరామరణాలు దేహధర్మాలు ఆకలిదప్పులు
శోకమోహాలు మనోప్రాణ సూక్ష్మదేహధర్మాలు
* అన్నమయ కోశము స్థూల శరీరంబవగ
ప్రొణమయ మనోమయ విజ్ఞానమయ
కోశంబులాయె (లింగ) సూక్ష్మ శరీరం
ఆనందమయ కోశమేమో కారణ శరీరంబు.
* ఆత్మప్రకాశాన్ని కప్పిపెట్టునవి పంచకోశాలు
అన్నమయ కోశం అత్యంత స్థూలం మిగతా
నాలుగు కోశాలచే వ్యాపింపబడి ఉండును
చివరి కోశం ఆనందమయ కోశం బ్రహ్మమయం
* పంచకోశాలు అస్మద్ (నేను) యుష్మద్ (నీవు)
వ్యష్టిగాను సమిష్టిగాను రెండు రకాలుగానుండు
వ్యష్టిగా జీవుడి పంచకోశాలు కార్యాలు వానిని
కారణాలయిన సమిష్టి కోశాలలో లీనం చేయాలి
* పంచకోశాలే మరొక రీతిగా దేహత్రయాలు
వ్యష్టిగా సమిష్టిగా దేహాలు గూడ రెండురకాలు
స్థూలదేహాల సమిష్టి విరాట్ సూక్ష్మదేహాల సమిష్టి
సూత్రాత్మ కాగా కారణదేహాల సమిష్టి ఈశ్వరుడు.
~ Kranthi Kumar Sammohi ~

*'ఓం''... తో అలసట మాయం...

*'ఓం''... తో అలసట మాయం...*
శాస్త్రీయంగా నిరూపించిన బాలిక
🌿🌿🌿🌿🌻🌻🌻🌿🌿🌿🌿
👉 ఓం... శబ్దంతో....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
👉పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్‌లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది.
👉కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది.
=========🌻🌻🌻
👉ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్‌పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు.
==========🌻🌻🌻
అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన:పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్‌మిటర్స్‌తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి...
👉ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.
👉అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది.
===========🌻🌻🌻
👉గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు. కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతుందని అన్వేష నిరూపించిందని ఆయన తెలిపారు.
===========🌻🌻🌻
👉ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టలేదని స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
👉ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన వర్క్‌షాప్‌నకు 165 విద్యార్థులను ఎంపిక చేశామని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా అన్వేష ఉత్తరాఖండ్‌లో పర్యటించి నపుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్లు దూరాన ఉన్న కేదారీనాథ్‌కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజరుల్లో ఎలాంటి అలసట కనపడకపోవడంతో ఆశ్చర్యపడింది.
👉అలాగే వాళ్లు దోవపొడువునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగడం గుర్తించింది.
👉దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది.
👉దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. 👉ఓం శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్‌ల పౌన:పున్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది.
============🌻🌻🌻
👉17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్‌ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.
👉ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు అన్వేష తెలిపింది.

ఆత్మ యొక్క దివ్యత్వం

ఆత్మ యొక్క దివ్యత్వం

అత్యుత్కృష్ట భావనల కొరకు ప్రపంచం
పూర్వ సంప్రదాయాలను అనుసరిస్తుంది.
అత్యుత్కృష్ట సత్ భావనల కొరకు
పూర్వ ఋషులపై, మునులపై ప్రపంచము  దృష్టి సారిస్తుంది!!
ఆత్మ యొక్క దివ్యత్వానికి మించిన గొప్ప రహస్యమేదీ
ఇంతవరకు కనుగొనబడలేదు!!

ఆలయ సందర్శనలో అర్చకుడు అడిగిన గోత్రానికి
మనము చెప్పే గోత్ర నామాలు మన పూర్వీకులవే!!!
అదేమి చిత్రమో నేడు అనేక మంది
భావ దరిద్రులు, భయము-భక్తి లేనివారు
నేల చూపులు చూస్తూ అధోగతి పాలు అవుతున్నారు!!!
~ కాశ్యపస ~

ఒక చిన్న మనవి :

అన్నట్టు నేను " కాశ్యపస " గోత్రానికి చెందిన వాడను..మీకు తెలిస్తే మీ గోత్రమేమిటో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి.ఇందులో తప్పేమీ లేదు..
మీ ఊరు ,చిరునామా తదితర ప్రొఫైల్స్ ఏమీ అక్కరలేదు....
Rama Subba Rao.B.



Wednesday, 2 January 2019

ఓ భారతీ నిజం తెలుసుకో!!!

ఓ భారతీ నిజం తెలుసుకో!!!
ఇద్దరు మహిళలు

పుణ్యభూమి కేరళలో
వందలకొద్దీ పోలీసు బలగాలతో
మరో ఎవరెస్టును
అధిరోహించినంత సంబరపడ్డాయి!!!
దదామిబుద్ధి మోగం తం యేన మా ముపయానిత్తే
అని గీత చెబుతుంది..
అనగా  ఆయా పుణ్యక్షేత్రాలకు ఉన్న స్థల ప్రాశస్త్యం , ఆచారాన్ని బట్టి
 నిర్మలమైన ,ప్రశాంతతో కూడిన భక్తి మార్గం ద్వారా వెళితే జ్ఞానం ప్రాప్తిస్తుందనీ, తద్వారా మనిషి మోక్షాన్ని సాధించ వచ్చని గీత చెబుతుంది!!!
అయితే మాకేమిటి అన్న ఆ మహిళలు
కాలం చెల్లిన కోర్టులు
వంత పాడే నీతి లేని ఫెమినిస్టులు
అసభ్యత,అశ్లీలతే పెట్టుబడిగా చలామణి అవుతున్న
చానల్లు, సినెమాలు
ప్రతి జీవికి జీవించే హక్కు ఉంటుంది
అయినా మాకేంటి వాటినే మేము రోజూ కాల్చుక తింటాము
అంటూ దురూప దేశాలు చేస్తున్న బృందాలు, కారత్ లు
మూగపోయిన కలాలు, గళాలు!!!!!!
అతల,సుతల,తలాతల,రసాతల,భూతల మనెడి
పదునాలుగు లోకాల్లో మనిషీ నీ ఉనికెంత???
రాక రాక వచ్చిన మానవ జన్మను కోల్పోవటం తప్ప!!!
భారతీ...

అందరికీ అమ్మవు....ఇక నైనా మేలుకో!!
నిర్మలమైన భక్తి తోనే జ్ఞానం...జ్ఞానం తోనే ముక్తి!!!
భారతీ....
అందరికీ అమ్మవు నీవు .. ఇక నైనా మేలుకో!!
ధర్మాన్ని తెలుసుకో!!!













MYTHILI CHIRUMAMILLA

INSPIRING POST FROM MYTHILI CHIRUMAAMILLA

మనకు ఒక్క మెతుకు అంటే అంతగా విలువ ఉండదు ఎక్కడైనా పడితే ఏరి పారేస్తాం కాని అదే మెతుకు ఒక చీమ కు దిరికితే ఎంత పరమానందం తనకు కొండత ఆహారం దొరికి నందుకు కృతజ్ఞత కలిగి ఉంటుంది..మనిషి లా దానికి అంతా తానే తినాలి అనుభవించాలి తనకే దక్కాలనే అత్యాశ కలిగిఉండక తన తోటి వారందరిని ఏకం చేసి పంచుకుంటుంది..నిత్య శ్రమైక జీవనం నిజాయితీ సమిష్టి భావన కలిగిన ఆ చీమ ను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి
‌ప్రతీ రోజు మనం కనీసం ఒక్క‌గుప్పెడు అన్నం లేదా ఓక్క రొట్టె అభాగ్యులకి గాని మూగజీవులకి గాని అర్పించినా చాలు అది భగవంతునికి చేరి తీరుతుంది..
భగవంతుడు మన అర్హతకు మించే అన్నీ మనకు ప్రసాదించాడు.. ఆయాచితంగా మనకు లభించిన వాటిి విలువ మనకు తెలియకపోవచ్చు ..కాని
ఎంత ఇచ్చినా అసంతృప్తి తో రగిలిపోయే మనిషిని చూసి భగవంతుడు కూడా భాధ పడతాడు..ఎలాగైతే ఎంత ఇచ్చినా తృప్తి పడకుండా పదే పదే అడిగి విసిగించే బిక్ష మెత్తేవారిని చూసి మనం విసుక్కుంటామో అలానే మన స్వభావానికి చివరికి ఆయన విసిగిపోతాడు
మనము ఈ రోజు పోతే అతి మామూలు గానే మూడవ రోజు వస్తుంది అని బాబా అన్నారు.. అశాశ్వతమైన అనిత్యమైన ఈ జగత్తు నుండి ఏది కావాలని ఏది..దక్కలేదని మనం ఆరాటపడుతున్నాం..ఒకవేళ అనుకున్నది వెంటనే అమరినా దానితో మన తృష్ణ తీరుతుందా...దాని స్దానంలో ఇంకోక కోరిక పుట్టి మనసును ప్రశాంతంగా ఉండనీయదు...ధనమైనా అధికారమైనా మరేదైనా తనకు దక్కుతుందని భావించినది ఇతరులకు దక్కితే ఈర్ష అసూయలను మనం ప్రదర్శస్తే మనం ఆశించింది దక్కకపోగా చివరకు ఉన్న మనఃశాంతి కూడా కరువవుతుంది ..ఇతరుల భాధకు స్పందించి వారికి చేతనయినంత సాయపడేవారు..భక్తి తో దేవుని కొలిచేవారు..మనసును నిర్మలంగా ఉంచుకోగలిగిన వారు..కోట్ల సంపద కలిగి ఉన్నవారికి కూడా దొరకని ఆత్మ సంతుష్టత దానంతట అదే సిద్ధిస్తుంది..నీవు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నావా..ఇతరులు నీవు వేరు కాదు అని భావించగలుగతున్నావా..నీలో నువ్వు
ప్రశాంతంగా ఉన్నావా.. ఆ ప్రశాంతతను ఇతరులకు పంచతున్నావా.. మనం నిత్యం మనలని ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలివి..
మనకున్న డబ్బు వయసు..ఆరోగ్యం ..అందానికి అరోగ్యానికి మన దగ్గర అవి ఉన్నంతవరకే వాటికి విలువ.. ఒక్కసారి అవి దూరమయ్యాక సొంత వారే పరాయివారవుతారు.కాని మన వ్యక్తిత్వం బాగుంటే మన జీవితం ముగిసాక కూడా అది మనల్ని ఎవరు మర్చిపోలేకుండా చేస్తుంది
ఎవరైనా అనుకోని అతిధి వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం గా లేకపోతేేనో లేదా సరైన విధంగా వారికి మర్యాద ఏర్పాట్లు చేయలేక
పోతే సిగ్గుపడతాం అలాంటప్పుడు మన మనసుకి మురికి అంటుకున్నప్పుడు ఎందుకు సిగ్గుపడం.
మన తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే.. ఒకరు అంతరాత్మ ఇంకొకరు ఆ పరమాత్మ
అంతరాత్మ లో మార్పు రానంత కాలం ఏ కొత్త సంవత్సరం మొదలైనా మనకు ఒరిగేది ఏమీ లేదు.. ఏ మర్పూ ఉండదు.. ఒక్క కాలెండర్ లో పేజీలు తప్ప..క్షణ క్షణం మార్పులతో కూడిన ఈ జీవిత ప్రయాణ బాటలో మనము మనల్ని ఎప్పుడు కొత్తగా మలచుకుంటూ పయనిద్దాం ..కొత్త సంవత్సరం మొదలైన సందర్బంగా పంచుకోవాలనిపించిన మదిలోనున్న చిన్న చిన్న భావనలు..మైధిలి
my comments ; 
అద్భుతమైన సందేశం అందించావు సోదరి...
మానవ జీవితం భగవంతుడిచ్చిన వరం..కొన్ని విధులు,పరిమితులు , ధర్మాలు ఈ మానవ జన్మకు ఉన్నాయి..జాలి,కరుణ,దయ,దాన,క్షమా గుణములు కలిగి ఎలాంటి అసూయ ద్వేషాలు లేకుండా ప్రతి మానవుడు ధర్మ మార్గాన ప్రవర్తించాలి.
సకల జీవులను పరమాత్మ 
స్వరూపంగా భావించి ఆరాధించాలి..ధర్మబధ్ధమైన సాంఘిక అలవాట్లను భావి తరాలవారికి అందిస్తూ సుఖసంతోషాలతో జీవించాలి.ఇలా మనిషి బ్రతకాటినికి ఎన్నో అవసరాలున్నాయి..సుఖవంతమైన జీవితం తన ఆత్మను తెలుసుకుంటూ, తను తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులను జాగృతం చేయగలగాలి..అపుడే పరమాత్ముని దీవెనలు మనిషికి అందుతాయి.. ఇలాంటి ఎన్నో దివ్య సందేశాలు నీనుండి సమాజానికి చేరాలని ఆశిస్తున్నాను
Sister Mythili response : 

అన్నయ్య మీరు పంచిన ఈ దివ్య సందేశం తో మనసంతా తాదాత్మం చెంది మంచి అనుభూతి పొందాను‌..ఒక్కరోజు అన్నం తిన్న తరువాత పక్కన పడిన ఒక్కటి రెండు మెతుకులను ఒక్క మెతుకేగా అన్నట్లు నేను తీసి గట్టు మీద పెట్టాను దానిని ఒక చీమ గ్రహించిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది అది దాని వారందరి పిలిచి ఎంతో కష్టంతో దానిని కదిలించింది.. పోనీ అంతటితో ఆగిందా మరునిమిషం మళ్లీ దారి కట్టి తమ పని చేసుకుంటూనే పోయాయి..అతిధి అంటే మనిషి కోసమే ఎదురు చూడవద్దు ..ఆకలితో వచ్చే ఏ ప్రాణి ఐనా పక్షి..పిల్లి కుక్క..చివరకు చిన్న చీమైనా అది అతిధే అని బాబా చెప్పిన విషయం నాకు జ్ణప్తికి వచ్చింది..అందుకే రోజు రెండు మెతుకులు అన్నం గ్రహించే ముందు బయట ఒక గట్టు మీద విడుస్తాను..నాకు అనిపించింది ఈ సృష్టి లో మనిషి అంతగా విలువే ఇవ్వని అక్కరలేదని భావించేవి ఎన్నో ఇతర జీవులకు అవే అమృతతుల్యం....మనకు ఎంత ఉన్నా తృప్తి లేదు ఏది ఉన్నా తృప్తి లేదు ...ఎంత సేపని మన అనుభవిస్తున్న వాటికి ఇంకొకరిని నిందించగలం..మన అశాంతికి కారణం మనలోనే ఉన్నదన్న సత్యం గుర్తెరిగి మసలుకోవాలి..నా చిన్న మనః భావాలు మీ హృదయాన్ని తాకినందుకు సంతోషం..ఒక్కరికైనా ఇవి తాకితే చాలని పంచాను అన్నయ్య.. తప్పకుండా మీరు దీనిని పంచవచ్చు💖🙏

కాలం చిరుకొమ్మ మీద...

కాలం చిరుకొమ్మ మీద....
కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తూ నాకు అందిన అసంఖ్యాక సందేశాలలో ఒక వాట్సాప్ గ్రూపు ద్వారా ఓ మిత్రురాలు, ‘దాసుభాషితం’ అభిమాని ‘నెత్తావుల దారులలో నడవమంది కాలం’ అంటూ ఈ పాటను ఉదహరించారు. దీనిని రచించి స్వరకల్పన చేసిన మిత్రులు శ్రీ కలగ కృష్ణమోహన్ గారికి శ్రావ్యతను పండిస్తూ మధురంగా గానం చేసిన శ్రీమతి డి. సురేఖామూర్తి గారికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్తరోజు పరిమళాలు మీకోసం పంచుతోంది ‘దాసుభాషితం’ వినండి –
కొత్తరోజు పరిమళాలు పంచుతోంది ఉదయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
అణువణువును పలుకరించి పూలవార్తలను వినిచి
ఎదఎదలో మడురోహాల పరవశాల హాయినించి
నెత్తావుల దారులలో నడవమంది కాలం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం
లోలో స్వర పల్లవిలా పొంగారే మధురిమలా
ఆమని పొడిచే వేళల మదినెగసే రసధునిలా
తొలి మోజుల మలుపులలో కలవమంది ప్రాయం
చిరునవ్వుల స్వరకల్పన చేస్తోంది హృదయం