Wednesday 28 February 2018

శివైక్యం చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు

శివైక్యం చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు 
యేనకేనా స్వపాయేన యస్యకస్యాసి దేహినః
సంతోషం జనయే త్ప్రాజ్ఞః తదేవేశవర పూజనం
అనగా తమ ప్రజ్ఞ, ఉపజ్ఞల ద్వారా తాము తరిస్తూ, తరతరాలను తరింపజేస్తారు కొందరు.అదే సర్వేశ్వరుడికి సమర్పించవలసిన పూజ.అటువంటి దైవాంశసంభూతుల్లో కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఒకరు.
కంచి పీఠాన్ని, పీఠాధిపత్యాన్ని భక్తితో, గౌరవంతో ఆదరించిన ఆయన హృదయం సత్సంప్రదాయాలకు , ప్రేమాభిమానాలకు నిలయం...
అన్ని జన్మలలోను మానవజన్మ ఉదాత్తమైనదని విజ్ఞులు చెబుతారు..అందునా సన్యాసి జీవితం మరెంతో ఉత్కృష్టమైనది.ఇది జన్మాంతరపుణ్యపాక వశమున ప్రాప్తించు అపురూపవరం.
కంచి స్వామి , కంచి పీఠానికి 69 వ అధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతులవారు లోకాన్ని అలౌకిక స్థితిలోకి పయనింపజేసి , జగధ్ధితంగా జీవయాత్ర సాగించి నేడు శివైక్యం సాధించారు..  వారు సత్య, ధర్మ, ఆధ్యాత్మిక యోగిపుంగవులు...భువి, దివి మెచ్చిన మంత్రపుష్పం..
వారు ఒక అద్వైత దర్శన దీప్తి!
దేశ సమైక్యతా స్పూర్తి!!
వారి దివ్య మార్గములు,
వారి పాద పద్మములే  మన సన్నిధి!!!
***********************
రా.రా.28/02/2018

No comments:

Post a Comment