Wednesday, 28 February 2018

కార్తవీర్యార్జునునికి గర్గమహాముని చెప్పిన కథ: - దత్తాత్రేయ వైభవం

కార్తవీర్యార్జునునికి గర్గమహాముని చెప్పిన కథ: - దత్తాత్రేయ వైభవం
ఒకప్పుడు జంభాసురుడు అనే ఒక రాక్షసుడు విజ్రుమ్భించి తపోబలంతో తనదైన రాక్షస బలంతో దేవతలనందరినీ ఓడించివేశాడు. ఇతనివల్ల దేవతలందరూ దెబ్బతిని చెల్లాచెదురై బాధపడి తిరిగి తమ స్థితి కోసమని గురువైన బృహస్పతిని శరణువేడారు. బృహస్పతి ఒక్కసారి ధ్యాన ముద్రాంకితుడై బ్రహ్మదేవుని ఆజ్ఞతో జంభాసురుని అణచాలంటే విష్ణువునే ఆశ్రయించాలి అని తెలుసుకుని విష్ణువు దత్తుడిగా ఉన్న రూపాన్ని ఆశ్రయించమని దేవతలకు బోధించాడు. బృహస్పతితో కలిసి దేవతలందరూ దత్తుని వద్దకు వచ్చారు. ఆ సమయంలో దత్తుడు వారికి ఒళ్ళో మగువ, చేతిలో మదిరలతో దుర్భాషలాడుతూ కనిపించాడు. వికృతమైన చేష్టలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ దేవతలకు ఏమిటి ఇలా కనపడుతున్నాడు అనే ప్రశ్న కూడా రాలేదు. సత్త్వగుణంతో కూడిన దైవీ శక్తికే భగవంతుడిని గుర్తించే శక్తి ఉంటుంది. స్వామీ! నువ్వు మమ్మల్ని పరీక్షిస్తున్నావు. కానీ నీ ఈ రూపం యొక్క తత్త్వం చెప్తున్నాం స్వామీ! ఏ దోషమూ లేనివాడివి నువ్వు అన్నారు. అప్పుడు స్వామి ఇన్ని దోషాలు పెట్టుకున్న నన్ను ఇలా సోత్రం చేస్తున్నారు. ఏ ప్రయోజనం కోసం వచ్చారో చెప్పండి అన్నాడు. అప్పుడు బృహస్పతి జంభాసుర సంహారం కోసం నిన్ను పిలుస్తున్నాం అన్నాడు. వ్యసనాలతో ఉన్న ఒకానొక పిచ్చివాడిని. నావల్ల అవుతుందా? అన్నారు స్వామి. స్వామీ! మీరు అలా మాట్లాడవద్దు. నువ్వు ఏమిటో మాకు తెలుసు. ఆ స్త్రీ ఏమిటో మాకు తెలుసు. నువ్వు ఎలా ప్రవర్తించినా నీ స్థితి బ్రాహ్మీ స్థితి. త్రిగుణాతీత స్థితి. ఆ స్థితి ఉన్నవాడికి ఏ దోషమూ లేదు. అగ్నికి చెదలు అంటుతాయా? దోషమునకు సంస్కృతంలో అఘము అంటారు. నీవు దోషము లేని వాడవు కనుక నీకు ‘అనఘుడు’ అని పేరు. అలాంటి నిన్ను ఆశ్రయించిన వారు అఘరహితులై అనఘులు అయిపోతున్నారు. నీ ఒళ్ళో ఉన్న ఈవిడ జగన్మాత. అంటే మహాలక్ష్మి. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో ‘అనఘా’ అనే నామం ఉంది. ఇక మద్యపానం – నువ్వు తాగుతున్న ఆ మద్యపానం మరేమిటో కాదు బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యా పానంతో నువ్వు ఆనంద పరవశుడవై ఉన్నావు అన్నారు. అప్పుడు తన అసలు స్వరూపాన్ని దర్శింపజేశాడు స్వామి అనఘాసమేతుడై. వెంటనే అందరూ సాష్టాంగ నమస్కారం చేసి దత్తుని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రంతో సంతుష్టి చెంది దత్తుల వారు “మీరు కోరినట్లు అసుర సంహారం చేస్తాను. మీరు వెళ్ళి ఆ రాక్షసులను యుద్ధానికి పిలిచినట్లు పిలిచి నా దగ్గరికి తీసుకురండి అన్నారు స్వామీ.
వెంటనే దేవతలందరూ వెళ్ళి జంభాసురుని కవ్వించారు. మళ్ళీ వచ్చారు అని అసురులందరూ యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు చిత్రంగా యుద్ధం చేస్తూ వెనక్కి నడవడం మొదలుపెట్టారు. సరిగ్గా దత్తుని ఆశ్రమం వచ్చేసరికి వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు. ఎదురుగా మునిలా కూర్చున్న దత్తులవారు, అనఘాదేవి కనిపించారు రాక్షసులకి. వెంటనే లక్ష్మి మీదకి దృష్టి వెళ్ళింది రాక్షసులకి. ముల్లోకాలలో ఇంత గొప్ప స్త్రీ మరొకరు లేరు. స్వీకరించవలసిందే అని ఒక సిబిక(పల్లకి) తెప్పించి ఆవిడని బలవంతంగా లాగి అందులో కూర్చోబెట్టి సిబిక నెత్తిమీద పెట్టుకున్నాడు. నవ్వుతూ ఉన్నారు దత్తుల వారు. సిరి నెత్తికి ఎక్కగానే ప్రతివాడిలో అంతవరకూ ఉన్న బలం, తేజస్సు, ఉత్సాహం క్షీణించిపోయాయి. దానితో బలహీనులైపోయారు. అప్పుడు లక్ష్మీదేవి దిగి వచ్చి దత్తుని ఒళ్ళో కూర్చుంది. వెంటనే దేవతలకు సైగ చేశారు దత్తులవారు ఇప్పుడు మీరు వెళ్ళండి అని. వెంటనే దేవతలందరూ వెళ్ళి అవలీలగా జంభాసురుడు మొదలుకొని రాక్షసులు అందరినీ సంహరించారు.
శత్రువును దెబ్బతీయాలంటే మన బలమైనా పెంచుకోవాలి లేదా వాడి బలమైనా తీసేయాలి. బలం తీయడానికి పెద్ద కారణమైనది సిరిని నెత్తికి ఎక్కించుకోవడం. ఎవడు సిరిని నెత్తికి ఎక్కించు కుంటాడో వాడిని లక్ష్మి వదిలేస్తుంది. ఇది ఈ కథలో ఉన్న తత్త్వం. సృష్టిలో ఉన్న ఐశ్వర్యములన్నీ నారాయణుడివి. ఆయన ఇక్కడ దత్తుడు. రాక్షసుల దృష్టి ఇక్కడ ఆయనదైన సంపద మీద పడింది కానీ సంపద ఎవరిదో ఆయనవైపు చూడలేదు.
దీనివల్ల మనకు తెలుస్తున్నది ఏమిటంటే విశ్వవ్యాపకమైన సంపదలను, శక్తులని, ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపము అని అవిభాజ్యంగా చూసి గ్రహించగలగాలి. దత్త తత్త్వం తెలిసిన వారికే ఆ తల్లి అనఘయై, దోషరహితయై అనుగ్రహిస్తున్నది. అలా లేనివారికి అఘం అవుతున్నది. అందుకే అందరికీ మహాలక్ష్మి, నీకు మాత్రం కాళరాత్రి అన్నాడు హనుమంతుడు రావణాసురుడితో.

◆◆◆◆◆ బిల్వము ◆◆◆◆◆

◆◆◆◆◆
బిల్వము
◆◆◆◆◆
ఏక బిల్వం శివార్పణమని ఒక భక్తుడైన
జ్ఞాని మారేడు దళము న‍ర్పించును.
జ్ఞానస్వరూప పరమాత్మయే శివుడు.
ఏ జ్ఞానము శివునితో బేధ బుద్ధి కలిగించునో ఆ జ్ఞానమనెడి అజ్ఞానమునే మారేడు దళముగా సమర్పించుచున్నారు.
మూడు దళములు చేరినదే
ఒక బిల్వము.
ఈ మూడు రేకులకు నాధారమైన కాండముఒక్కటే.
పూజకుడు,పూజ్యము,పూజ,
స్తోత్ర, స్తుత్యము,స్తుతి,
జ్ఞాత,జ్ఞేయము,జ్ఞానము
అను నీ మూడు మూడును వేరు వేరుగా భావించుటయే
త్రిపుటి జ్ఞానము.
ఇదియే అజ్ఞానము.
వేరు వేరుగా కానవచ్చినను ఆధారకాండ మొక్కటియే యైనట్లు
"ఓ!మహాదేవా!
నీ వొక్కడవే సృష్టి,స్థితి, లయాధికారిగ
మారేడు దళమందు మూడు పత్రములుగా వేరు వేరుగా తోచుచున్నట్లు తోచుచున్నావు.
పూజకుడవు నీవే,
పూజింపబడునది నీవే,
పూజ క్రియయు నీవే
అనుచు అభేద బుద్ధితో
పూజించుటయే పుణ్యము.
అట్లు పూజింపకుండుటయే పాపము.
అను నీ రహస్యము నెఱింగి బిల్వపత్ర రూపములతో త్రిపుటీ జ్ఞానమును
నీ పాదములకడ నేను విడుచుచున్నాననియెడి "శివోహమ్" "శివోహమ్" అను మహావాక్య జ్ఞానమును స్థిరపడుచేయునదియే
బిల్వపూజయగును.
◆◆◆◆◆
బిల్వ(మారేడు) వృక్షోత్పత్తి క్రమము
(బిల్వములో గల లక్ష్మీ ప్రసన్నత)
◆◆◆◆◆
శ్లో:త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం
చ త్రియాయుధమ్౹
త్రిజన్మ పాప సంహారం
ఏక బిల్వం సమార్పణమ్౹౹
ఒకానొకప్పుడు శ్రీవైకుంఠమున శ్రీలక్ష్మీ నారాయణు లేకాంతముగా నున్న సమయమున లక్ష్మీదేవి విష్ణుమూర్తితో
మీకు ప్రియులెవరని ప్రశ్నించెను.అందుల కాతడు "నాకు శివుడు ప్రియుడు నేను శివునకు ప్రియుడనని "బదులు చెప్పెను.అంతటితో నూరకుండక యాపె శివభక్తులలో శ్రేష్ఠు లెవరని ప్రశ్నింప నాతడు "ఎవరు శివుని పద్మములతో ఒక సంవత్సరకాలం పూజింతురో వారే శివభక్త శ్రేష్ఠులని నుడివెను"
వెంటనే ఆమె శివుని పూజించి శివభక్త శ్రేష్ఠురాలుగా పేరొంద నిశ్చయించి,
ఆ మరుసటి దినమునుండి ఉదయముననే నూట ఎనిమిది పద్మములు కోసికొనివచ్చి
తదేక ధ్యానముతో
అష్టోత్తర శత నామములతో
శివపూజ చేయుచుండెను.
ఇట్లు చేయుచుండ సంవత్సరములోని చివరి రోజున అష్టోత్తర పూజకు సరస్సులో రెండు పద్మములు తక్కువ బడెను. అందుకామె కొంత తడవు చింతించి తుదకు తన భర్త ఒకప్పుడు తన స్తనములు పద్మములు వంటివని తనకు చెప్పిన సంగతి స్మరణకు వచ్చి
ఇక భయములేదని ప్రప్రథమమున తన ఎడమవైపు స్తనమును గోసి శివుని కర్పించి,రెండవ స్తనము గోయ నుద్యుక్తురాలు కాగా శివుడు తనిసి,
ఆమె భక్తికి మెచ్చి ,ప్రత్యక్షమై ఆమె యర్పించిన స్తనమును మారేడు వృక్షముగా బుట్టునట్లు వరమిచ్చి ఆమెకు యధారూపము గల్పించి
ఆమెకీర్తిని శాశ్వత మొనర్చెను.
ఆ దినము నుండి బిల్వవృక్ష ముత్పన్నమై శివపూజకు బిల్వ దళము ప్రశస్తమైనదిగా వెలసినది.
శ్లో:వామ పత్రే వసేద్బ్రహ్మా
పద్మనాభశ్చ దక్షిణే౹
పత్రాగ్రే లోకపాలాశ్చ
మధ్య పత్రే సదాశివః౹౹
పృష్ఠభాగే స్థితా యక్షాః
పూర్వభాగేఽమృతం స్థితమ్౹
తస్మాద్వై పూర్వభాగేన
అర్చయే గిరిజాపతిమ్౹౹
తా౹౹శివపూజకు మూడు రేకులతో
(ఆకులు) నొప్పిన బిల్వదళమే ఉపయోగింపవలయును.బిల్వదళములోని మూడు రేకులలో
మధ్యగలది సదాశివుడనియు కుడివైపునది విష్ణువనియు నెడమవైపునది బ్రహ్మభాగమనియు ప్రసిద్ధినొందినది.పత్రాగ్రమున లోకపాలు రుందురు.మరియు బిల్వదళములోని
ముందుభాగమున నమృతమును వెనుక భాగమున యక్షులును కలుగుటచేత శివుని పూర్వభాగము
ముందువైచి శివుని పూజింపవలయును. ఇట్టి మహిమలు గలిగి లక్ష్మీ స్వరూపమైనదే బిల్వవృక్షము.బిల్వవనము
కాశీక్షేత్ర తుల్యము.ఎక్కడెక్కడ మాఱేడు చెట్టుగలదో అచ్చటచ్చట
ఆ చెట్టుక్రింద లింగాకారముతో శివుడు వెలసియుండునట.
ఇంటి ఆవరణలో
ఈశాన్యభాగమున బిల్వవృక్షమున్న
ఐశ్వర్యము కలుగును. ఆపదలుండవు.
తూర్పుననున్నసుఖప్రాప్తియగును.
పడమర నున్న పుత్ర సంతాన భాగ్యము కలుగును.
దక్షిణమున నున్నచో యమబాధలుండవు.
ఈ విషయములు
స్కాందపురాణములో నుడువబడినది.
ఎండిన పత్రమైనను, నిల్వయుండిన పత్రములైనను శివపూజకు దోషములేక
పనికివచ్చి పూజించువాని సర్వపాపములను పోగొట్టగల్గును.
శ్లో౹౹శుష్కైః పర్యుషితైర్వాపి
బిల్వపత్రైస్తుయో నరః౹
పూజయంస్తు మహాదేవం
ముచ్యతే సర్వపాతకైః౹౹
శ్లో౹౹బిల్వానాం దర్శనం పుణ్యం
స్పర్శనం పాప నాశనమ్౹
అఘోర పాపసంహారం
ఏక బిల్వం శివార్పణమ్౹౹
◆◆◆◆◆
మారేడు-ఒక దివ్య ఓషధి
◆◆◆◆◆
1.సదాఫలం:
ఎల్లప్పుడును ఫలములు
గలిగియుండునది.
2.మహాఫలః:
గొప్ప ఫలములు గలది.
3.త్రిపత్ర:
మూడు ఆకులు గలది.
4.గంధపత్రః:
వాసనగల ఆకులు గలది.
5.హృద్యగంధః:
మనోహరమగు సువాసన గలది.
6.కంటకాఢ్యః:
ముండ్లుగల వృక్షము
7.శ్రీఫలః:
శ్రీకారమువలె నుండు ఫలములు
గలది.
అని మారేడు చెట్టునకు నామాంతరములు గలవు.ఇది ఈశ్వర
ప్రీతికరమగు వృక్షము. పవిత్రమగు నీశ్వర పూజా పత్రములలో బిల్వపత్రము శ్రేష్ఠము.గాలిని, నీటిని శుభ్రపరచుటలో వీనికి మించినవి వృక్ష
పత్రములలో లేవు.దీని గాలి సోకినను, పీల్చబడినను శరీరమందలి బాహ్యాభ్యంతర పదార్థములు చెడకుండనుండును. గాలి సోకని గర్భాలయములలో(దేవాలయమున)
దుర్వాసన పుట్టకుండ పూజలో శివున కర్పింపబడిన మారేడు పత్రములు కాపాడుచుండును.దీనియందలి గుణవిశేషమును బట్టియే యిది పూజాద్రవ్యముగ నేర్పడినది.మారేడు
చెట్టునందలి సర్వాంగములు గూడ
నత్యంతోపయుక్తములైనవి.
ఔషధ ప్రక్రియలో దీని విలువ అనుపమానము.
మారేడు వేరు మూడు దోషములను
హరించును.వాంతులను కట్టును.సగము పండిన పండు దీపనకారి.వేడిచేయు స్వభావము కలది.వాత కఫముల హరించును. బాగుగా పండిన పండు విదాహి దోషములనడంచును.
అగ్నిని,పైత్యమును పోగొట్టును.ఆకులు కఫ వాతములను,
ఆమశూలలను హరించును.
గ్రాహి రుచిని బుట్టించును.పూవులు అతిసారమును దప్పిని వాంతిని హరించును. మారేడు పండు గుజ్జునుండి తీసిన తైలము వాత హరమైనది.
ధన్వంతరినిఘంటువులో,భావప్రకాశికలో,బృహన్నిఘంటురత్నాకరములో,
చరకసంహితలో,సుశ్రుతసంహితలో,
చక్రదత్త,వంగసేన,మళయాళ రహస్య యోగములలో దీని చికిత్సావిధానము వివరముగా తెలుపబడినది.
ఆమవాతమునకు,జ్వరములకు,
మూలవ్యాధులకు,ప్రవాహికకు,
స్కంధగ్రహనివారణమునకు,
చెముడుకు,అతిసారమునకు,
ఉబ్బులకు,రక్తమూలములకు,
వాంతులకు,గ్రహణులకు,
శరీరదుర్గంధముపోవుటకు,
ఆమశూలలకు,చంటిపిల్లలవాంతికి,
విరేచనములకు,నేత్రరోగములకు,
సమస్త విషములకు,మారేడుతో తయారుచేయబడిన వివిధౌషధములు పనిచేయును.ఆ యా వ్యాధులను బోగొట్టును.
బిల్వాది లేహ్యము చాల ప్రశస్తమైనది.అజీర్ణవాతములకిది వజ్రాయుధం వంటిది. మరియు దారుణమగు ఎక్కిళ్ళు,వాంతులు, ఊర్థ్వవాతములు, శ్వాసకాసలు,హృచ్ఛూలలు,అరుచ్యపస్మారములు తగ్గును.
నవీన వైద్యక మతము ప్రకారమిది చాలా విలువైనది.పండిన మారేడు రేచనకారి,మూలవ్యాధి రోగులకిది బాగుగా పనిచేయును.
ఆకుల రసము అగ్నిదగ్ధ వ్రణములకు హితకరమైనది.అతిసార అమరక్తాతి సారములయందు బాగుగ పనిచేయును. మరియు జ్వర కాసలయందు దీని వేరు బాగా పనిచేయును
-'విద్యావాచస్పతి'
వీరవల్లి రామానుజాచారి
(వీ.రా.ఆచార్య)

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..
కపాలమోక్షం.. దత్తాత్రేయుడి గా పిలువబడటం..
శ్రీ స్వామివారు దేహ త్యాగం చేశారు కనుక..ఇక జరగవలసిన ఏర్పాట్ల గురించి శ్రీధరరావు గారు, శ్రీ స్వామివారి సోదరులు చర్చించుకుంటున్నారు..శ్రీ స్వామివారి ఆఖరి సోదరుడు పద్మయ్యనాయుడుకు శ్రీ స్వామివారు చెప్పిన విధంగా చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..
సమయం రాత్రి 11 గంటలు కావొచ్చింది..ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది..
శ్రీ స్వామివారి శరీరం లోంచి..ఒక పెద్ద శబ్దం వినబడసాగింది..దూరం నుంచి ఒక మోటార్ సైకిల్ వస్తున్న శబ్దాన్ని పోలివుంది..ముందుగా ఎవ్వరూ ఆ శబ్దం శ్రీ స్వామివారి శరీరం నుంచి వస్తున్న సంగతిని పసిగట్టలేదు..ఎవరో మోటార్ సైకిల్ మీద వేస్తున్నారేమో అనే భ్రమ లో వున్నారు..కానీ రెండు నిమిషాల కాలం గడిచేసరికి..ఆ శబ్ద నాదం ఉధృతంగా మారింది..అప్పటికి అందరూ తేరుకొని..శ్రీ స్వామివారి దేహం వైపు చూసారు..నాభి ప్రాంతం నుంచి మొదలైన ఆ శబ్దం..క్రమంగా ఊర్ధ్వంగా శిరస్సు పై భాగానికి ప్రాకిపోయింది..ఇలా దాదాపు 5నిమిషాల పాటు జరిగింది..అందరూ ఆశ్చర్యంగా స్థాణువుల్లా నిలబడిపోయారు..
ఎంత ఉధృతంగా శబ్దం వచ్చిందో..ఒక్కసారిగా ఆ శబ్దం ఆగిపోయింది..ఆ మరునిమిషంలోనే.. శ్రీ స్వామివారి శిరస్సు పై మధ్యభాగం నుంచి..రక్తం ధారగా కారసాగింది..అదే సమయానికి ఆశ్రమం బైట ఉన్న వ్యక్తులకు..ఆశ్రమం పై భాగం నుంచి ఒక నీలి రంగు జ్యోతి..పై కెగసి..ఆకాశం లో కలిసిపోవడం కనిపించింది..ఆ నీలి రంగు జ్యోతి మొగలిచెర్ల గ్రామం లో ఉన్న వ్యక్తులూ చూడగలిగారు.. ఆశ్రమం లోపల ఉన్న శ్రీధరరావు దంపతులకు..శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందారు అని అర్ధం చేసుకున్నారు..అప్పటి దాకా శ్రీ స్వామివారు తన శరీరం లో తన ప్రాణాన్ని నిలిపివుంచారని వాళ్లకు అవగతం అయింది..
శ్రీధరరావు ప్రభావతి గార్లు అందరితో చర్చించి..శ్రీ స్వామివారి పార్థివ దేహాన్ని..శ్రీ స్వామివారు కోరుకున్న విధంగా..వారు ముందుగానే నిర్మించుకొని..తపస్సు ఆచరిస్తున్న నేలమాళిగ లోనే ఉంచి సమాధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..శ్రీ పద్మయ్యనాయుడు తో శ్రీ స్వామివారు ముందుగానే ఆ విధి విధానాలు తెలియచేసి వున్నారు కనుక..ఎవ్వరికీ ఆ విషయం లో ఎటువంటి సందేహమూ కలుగలేదు..తెల్లవారేవరకూ వేచి చూసి..సమాధి చేద్దామని నిర్ణయం తీసుకున్నారు..ఉదయానికి శ్రీ స్వామివారి దేహాన్ని..ఆ నేలమాళిగ లో..ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకున్న స్థితి లోనే ఉంచి..పై భాగాన్ని సిమెంట్ తో మూసివేశారు..
అతి చిన్న వయసు లోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకొని..కఠోర సాధన చేసి..అవధూత అంటే...ఇలా ఉండాలి..ఇలా ఆచరించాలి..అని మార్గదర్శనం చేసి..కేవలం ముప్పై రెండు సంవత్సరాల ప్రాయం లోనే..ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్రీ స్వామివారు..శ్రీ దత్తాత్రేయుడిని ఆరాధించి..తనను కూడా దత్తాత్రేయుడి గానే పిలువమని ఆదేశించి..దత్త తత్వానికి ఓ సంపూర్ణత తీసుకొచ్చారు..మాలకొండ పుణ్యక్షేత్రం లో తపస్సు ఆచరించినందునా...ఆ లక్ష్మీనృసింహుడి మీద ఉన్న అపార భక్తి ప్రపత్తుల కారణంగా..ఒక్క శనివారం నాడు మాత్రం..తన సమాధి దర్శనం వద్దనీ..మిగిలిన రోజుల్లో తనను దర్శించవచ్చనీ..తెలియచేసారు..ఈనాటికీ ఆ నియమం పాటించబడుతున్నది..
తమకు శ్రీ స్వామివారు పరిచయం అయిన నాటి నుంచీ..తమ జీవితాలను ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించి..తమకు అపారమైన జ్ఞాన బోధ చేసిన ఆ మహనీయుడిని దగ్గరుండి సమాధి చేయడం..శ్రీధరరావు ప్రభావతి గార్ల జీవితంలో మరచిపోలేని ఒక ముఖ్య ఘట్టం..ఇలా చేయవలసి వస్తుందని ఆ దంపతులు ఊహించని పరిణామం..

సర్వం..
శ్రీ దత్తకృప!
(శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..సెల్..94402 66380).
28-02-2018..బుధవారం.

SOUL REACHES ITS DESTINATION

SOUL REACHES ITS DESTINATION
Kanchi seer Jayendra Saraswathi, 82,attained Siddhi at 9:00 am today- Shukla Trayodasi - 28 February, 2018 at Sri Kanchi Kama Kothi Peetham, Kanchi Puram, Tamil Nadu, South India.He was 69th  pontiff of the Kanchi Mutt founded by Adi Shankara about 2520 years ago!! He was revered by millions of devotees and crores of people all over the world for his spiritual teachings. He served the people and children through may schools, colleges,eye hospitals and clinics. Sri Jayendra Saraswathi's services to the society are commendable . He was a great spiritual leader and social reformer of rare eminence!!!


శివైక్యం చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు

శివైక్యం చెందిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు 
యేనకేనా స్వపాయేన యస్యకస్యాసి దేహినః
సంతోషం జనయే త్ప్రాజ్ఞః తదేవేశవర పూజనం
అనగా తమ ప్రజ్ఞ, ఉపజ్ఞల ద్వారా తాము తరిస్తూ, తరతరాలను తరింపజేస్తారు కొందరు.అదే సర్వేశ్వరుడికి సమర్పించవలసిన పూజ.అటువంటి దైవాంశసంభూతుల్లో కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు ఒకరు.
కంచి పీఠాన్ని, పీఠాధిపత్యాన్ని భక్తితో, గౌరవంతో ఆదరించిన ఆయన హృదయం సత్సంప్రదాయాలకు , ప్రేమాభిమానాలకు నిలయం...
అన్ని జన్మలలోను మానవజన్మ ఉదాత్తమైనదని విజ్ఞులు చెబుతారు..అందునా సన్యాసి జీవితం మరెంతో ఉత్కృష్టమైనది.ఇది జన్మాంతరపుణ్యపాక వశమున ప్రాప్తించు అపురూపవరం.
కంచి స్వామి , కంచి పీఠానికి 69 వ అధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతులవారు లోకాన్ని అలౌకిక స్థితిలోకి పయనింపజేసి , జగధ్ధితంగా జీవయాత్ర సాగించి నేడు శివైక్యం సాధించారు..  వారు సత్య, ధర్మ, ఆధ్యాత్మిక యోగిపుంగవులు...భువి, దివి మెచ్చిన మంత్రపుష్పం..
వారు ఒక అద్వైత దర్శన దీప్తి!
దేశ సమైక్యతా స్పూర్తి!!
వారి దివ్య మార్గములు,
వారి పాద పద్మములే  మన సన్నిధి!!!
***********************
రా.రా.28/02/2018

Saturday, 24 February 2018

జ్ఞానజ్యోతి



సంస్కృతీ 
సంప్రదాయాలు
సాధారణ జీవన శైలి
విలువలు పాటించే 
వినయ శీలురకు 
జ్ఞానజ్యోతి 
మార్గదర్శకంగా ఉంటుంది...

Wednesday, 21 February 2018

“Awake to the Name

Awake to the Name


To be born in a human body is rare,
Don’t throw away the reward of your past good
deeds.
Life passes in an instant – the leaf doesn’t go back to
the branch.
The ocean of rebirth sweeps up all beings hard,
Pulls them into its cold-running, fierce, implacable
currents.
Giridhara, your name is the raft, the one safe-passage 
over.
Take me quickly.
All the awake ones travel with Mira, singing the
name.
She says with them: Get up, stop sleeping – the days
of a life are short.
_         Saint Meerabai

Monday, 19 February 2018

THE ENSHRINED STONES

THE ENSHRINED STONES
Bonds
Rooted in the pain of
Age-long thirst 
The unknown search
Found in the
Tender tranquil
Magical moment of
All moist - eyed union
The sole moment of
Soul - realization
Oh So stubbornly
Yet endearingly bear
The vagaries of times
With innate majestic silence
Calligraphed on the
Surface of existence
Like the
Quranic verses
Enshrined on
The enduring stones
Of the undying Magnificence
*****************
By Sister Rupa..

Sunday, 18 February 2018

మరేమవుతాయ్?



మరేమవుతాయ్?
జీవితం దెబ్బ మీద దెబ్బ కొడుతుంటే
అర్ధం చేసుకోవడమెలాగో అర్ధంకాక
శబ్దాలన్నీ నిశ్శబ్దం లోకి జారుకోక మరేమవుతాయ్?
మనసుకైన గాయాల్ని ముక్కుతో పొడిచి
నొసటితో నవ్వి ,కంటితో గేలిచేసే కాకుల్లాంటి
లోకులున్నపుడు మాటలన్నీ శబ్దాల్ని మర్చిపోక
మరేమవుతాయ్?
కళ్ళెదుట జరిగే అన్యాయాల్ని భరించి
అవమానాలని తట్టుకుని,ఆవేశాలని సహించి
సాగిపోతుంటే భావాలన్నీ మౌనముద్రలుగాక
మరేమవుతాయ్?
ఇన్నేళ్ళలో ఏం సాధించామని వెనక్కితిరిగి చూస్తే
గుప్పెడుదిగుళ్ళు,గంపెడునిరాశ,అణువణువునా
వెక్కిరిస్తుంటే పదాలన్నీ మౌనపు మూటలవక
మరేమవుతాయ్?
విధి అదేపనిగా పదేపదే పరిహసిస్తుంటే
తలరాత గుండె గూటిపై కథాకళి చేస్తుంటే
మాటలన్నీ మౌన సమాధులు గాక
మరేమవుతాయ్?
©® P.నాగసుశీల

MOM'S LAP

MOM'S LAP

sit at mom's lap
gazing at full moon
a warmth!!!
***********
~ Lisbeth Ho ~

Alamkara

Alamkara or Adornment is to beautiful ; it is a metaphor and also a visual prayer ...
~ Sister Rupa ~

Saturday, 17 February 2018

సాహిత్యం

సాహిత్యం 
ఒక కాంతి రేఖ
అది కావ్యం కావచ్చు
గేయం కావచ్చు
నాటకం కావచ్చు
నవల కావచ్చు
శోక గీతం కావచ్చు
సాహిత్యం
విమర్శ కావచ్చు
అభినందన కావచ్చు
సాహిత్యం చైతన్యాన్ని ప్రసాదించే
ఒక సుందర సువర్ణ సుప్రభాతం
అజ్ఞానాన్ని పోగొట్టే
ఒక విజ్ఞాన సర్వస్వస్వం!!!
**************
రా.రా.18/02/2018


Tuesday, 13 February 2018

OH COBRA !

OH COBRA !

Oh Cobra !
The dense shadow
Of our Lord
So lovingly
So endearingly
Embraced
Wrapped
Coiled
By our Lord
Our Blue-Necked Shiva !
Offering you
The milk of
Truthfulness
The flowers of devotion
The petals of surrender
Protect !!!
Save the essence
The Nectors
Sting kill
The Engulfing poisons !
Let the soul remain
At HIS abode
In HIS horizon
******************
By Sister Rupa
ఓం నమః శివాయ
ప్రతి మాసం లోను ప్రదోషవేళ కృష్ణ చతుర్దశి ఉంటే దానిని మాస శివరాత్రి అంటారు.మాఘమాసం లో వచ్చే మాస శివరాత్రిని మహా శివరాత్రి అంటారు.ఇది పరమ శివుడు ఆవిర్భవించిన దినం.శివుని ఉపాసించడానికి తగినది శివరాత్రి.
సత్యజ్ఞానాంతస్వరూపమైన సనాతన పరబ్రహ్మ శివుడు ...ఆయనో సనాతనుడు...సగుణుడు..సచ్చిదానంద స్వరూపుడు...అటువంటి అద్వితీయము, నిత్యము,అనంతము,పూర్ణము,అసంగము అయిన ప్రకృతి పురుషాతీతమైన ఈ పరతత్వాన్నే శివుడు అని చెప్పింది శివపురాణం.సర్వవ్యాపకుడైన ఈ శివుడే లింగ రూపంలో ఎన్నో క్షేత్రాలలో  కొలువై ఉండి భక్త సులభుడై ఎందరికో అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు.భారతదేశం అఖండం అనే పరమ సత్యాన్ని నిరూపిస్తున్నాడు... ఆ పరమ శివుడి అనుగ్రహం, కరుణ కటాక్షాలు అందరికీ ప్రసరించుగాక!!! ఓం నమః శివాయ!!!

Saturday, 10 February 2018

THEY ARE PURE AND INNOCENT

THEY ARE PURE AND INNOCENT
“Children always give this simple message: Be natural, be sincere, be kind and be yourself!” 

Thursday, 8 February 2018

# SAYINGS OF MYSTIC WOMAN SAINT, AKKA MAHA DEVI #

# SAYINGS OF MYSTIC WOMAN SAINT, AKKA MAHA DEVI #
"O Lord, I pined for Thee
With parched mouth, thinking that
I was away from Thee!
O Lord, if Thou come near
And take thy seat upon my palm,
Henceforward all that love
Shall be in Thee, O LINGA Lord!
The pupils of my eyes, behold!
Are set on Thee!
O Channamallikararjuna Lord,
Gazing at Thee continuously
Up on my palm.My eyes have been
Transformed in to my 'Soul'.

పసిహృదయం

నిరంతరం ప్రవహించే నదిలో
నీరు పవిత్రంగా ఉంటుంది!!!
కల్లాకపటమెరుగని
పసిహృదయం లో
భగంతుడి కరుణ
నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది!!!

అక్క మహా దేవి వచనములు:

అక్క మహా దేవి వచనములు:
శుధ్ధ సత్వగుణ సంపన్నుడవై
ప్రాపంచిక విషయభోగాలను అనుభవించడంతోగాని
ధన గౌరవ మర్యాదలతోగాని
యౌవన సౌందర్యాలతోగాని
అలంకరణలతోగాని
ఆనందాన్ని  పొందాలనే పిచ్చి భ్రమను వదిలిపెట్టి 
పసిబిడ్డలాంటి హృదయ నిర్మలత్వంతో శ్రధ్ధాభక్తియుక్తుడవై
ఈశ్వరతత్వంలో శాశ్వత ఆనందం కోసమే
ఈ జీవితాన్ని ఉధ్ధరించుకొవాలి!!!



Monday, 5 February 2018

పరమ శివుడు..ఆయన భక్తులు

పరమ శివుడు..ఆయన భక్తులు
భౌతికమైన వ్యధలను
అనుభవిస్తున్నప్పటికీ
ఆ వ్యధలతో వారికి ఎలాంటి
సంబంధమూ ఉండదు.

వారు సర్వావస్తలలోనూ ముక్తులే!!
శైవుడైన వాడు భక్తియుక్త సేవలో
నిమగ్నుడవ్వడం వల్ల
నిరంతరం దివ్యానందంలో
సుస్థిరుడై ఉంటాడు!!!


భూమి

భూమి 
అనగా భూమాత
భూగోళానికి అధిష్టాన దేవత!!
ఇలా కన్నీళ్ళు కార్చవలసిందేనా???

Sunday, 4 February 2018

సజ్జనుడు



సజ్జనుడికి
యోగికి
బ్రహ్మచారికి 
కవికి...
ఏలోపమైన 
ఏలోపమున్నా
అది విషమే!!!

త్యాగి అంటే

త్యాగి అంటే 
లక్షల కార్యోన్ముఖుల 
ఉత్ప్రేరక విధాత!!!

ఇల్లాలు

ఇల్లాలు
ఏది గొప్ప అంటే ఏమి చెప్పగలం??
అడుగుల్లో ఆత్మ విశ్వాసం
ఒడ్డిన త్యాగం
తగ్గని ధైర్యం
అదే ఆవిడ విజయం!!
ఆడపిల్లని
వద్దంటున్నారేమో
అవని ముద్దుబిడ్డ ఆమె
మండే సూర్యుడి ఎండలో కూడా
నీకు ఆహ్లాదాన్ని పంచుతుంది
ఏది గొప్ప అంటే ఏమి చెప్పగలం??
కలకాలం
నిలిచిపోయే
మంచిపనులు చేయడం లో
ఖర్చయిన
ఆ ఇల్లాలి జీవితమే
మహా గొప్పది!!!

Saturday, 3 February 2018

చప్పుళ్ళు కన్నీళ్ళు .....

చప్పుళ్ళు
కన్నీళ్ళు ..... 
నిండు నిశ్శబ్దంలో 
లయమైపోతేనే 
మానసం
సేద తీరేది!!!
అపుడే
చిగురించిన
అంతరాళపు
వేకువ కిరణాలు
శూన్యతా హృదయాన్ని
శీతలంగా స్పర్సిస్తాయ్!!!

అమ్మ

అమ్మ "నిశ్శేష జాఢ్యాపహ"...
అనగా సకల జాడ్యాలను 
పరిహరిస్తుంది అమ్మ!!
అమ్మ దయ ఉంటే 
అజ్ఞాని సుజ్ఞాని అవుతాడు!!!
అమ్మను గౌరవిద్దాం
అమ్మను పూజిద్దాం.


స్నేహం

స్నేహం
నిజానికి ఎప్పుడు వరమౌతుంది??
సహృదయులైన 
స్నేహితులు సమకూరినప్పుడు!!!

Female Characters

"I keep on saying that when the golden period was there,when there were films like Pyasa, Guide,Kagazkephool,Saraswatichandra,Bandini,Sujatha...and others ,all these films were made by the biggest film makers of that time and they have such strong female characters"
~ Waheeda Rehman (Indian Actress) ~

అమృతత్వ లక్షణాలు

"త్యాగేనైకే అమృతత్వమానశుః"
త్యాగం వల్లనే అనన్య శరణాగతి
భగవదర్పణ బుధ్ధి మొదలైన 
అమృతత్వ లక్షణాలు అలవడతాయని 
వేదాలు చెబుతాయ్....

రచయిత

అభిప్రాయ భేదాలవల్ల కలిగే 
ఉద్రేకాన్ని వడగట్టి 
స్వచ్చమైన 
సరళమైన
వివేకవంతమైన 
సారాంశాన్ని మాత్రమే
రచయిత పాఠకులకు
అందివ్వగలగాలి!!!