Friday, 6 November 2020

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి

 శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి సిద్ధ మంగళ స్తోత్రం

శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీనరసింహ రాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషీగోత్ర సంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
దోచౌపాతీదేవ లక్ష్మీ ఘన సంఖ్యా భోదిత శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పీఠికాపుర నిత్య విహారా మధుమతి దత్త మంగళరూప
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
ఈ సిద్ధమంగళ స్తోత్రమును మూడు కాలముల యందు పఠించిన వారికి
అవధూతలు,సిద్ధపురుషుల దర్శనభాగ్యం కలుగుతుందని శ్రీపాదుల వారే స్వయంగా తెలియజేసారు..
కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః
కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు
ద్వాపర యుగములో కృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు
అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలోప్రస్తావించారు.
శ్రీపాద శ్రీవల్లభులు కలియుగములో ప్రప్రధమ దత్తాత్రేయ అవతారం.తరువాత ఈ గురువు గారు
శ్రీ నృసింహ సరస్వతి యతీంద్రులుగాను,శ్రీ మాణిక్య ప్రభువుగాను, స్వామి సమర్ధుల గాను,శిరిడీ సాయి బాబా గాను
షేగాఁ శ్రీ గజానన్ మహరాజ్ గాను,శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబాగాను అవతరించారు.భగవంతుని అన్ని అవతారాలు అవతారకార్యం ముగియగానే మూలంలో నిక్షిప్తమౌతాయి.కానీ దత్తావతార విశిష్టత ఏమిటంటే ఈ అవతారం కృత యుగం నుండి కలియుగం వరకూ ప్రతి యుగంలోనూ ఉంటుంది.ప్రతి యుగంలోనూ ఒక లక్షా ఇరవై ఐదు వేల మంది అవధూత మహాత్ముల్ని తయారుచేస్తూనే ఉంటానని అని దత్త ప్రభువులు వాగ్ధానం చేసివున్నారు.దత్త సంప్రదాయమైన గురు పరంపర ప్రతి మతంలోనూ కనిపిస్తుంది.
స్వామి వారి జన్మస్థలం: తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యనారాయణ స్వామి వారు కొలువై వున్న అన్నవరం పట్టణానికి
30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం అని పిలవబడుతున్న శ్రీ పీఠికాపురం అనే పట్టణంలో జన్మించారు.అక్కడ
16 సంవత్సరాలు నివశించి,ఆ తర్వాత కృష్ణా నది తీరంలో ఉన్న కురువపురం/కురుగడ్డ లేదా కురుంగడ్డ చేరుకుని అక్కడ
14 సంవత్సరములు తపస్సు చేసి కృష్ణా నదిలో అంతర్హితమయ్యారు.వీరి చరిత్ర శ్రీమాన్ శంకరభట్టుగారు సంస్కృతంలో రచించారు, మల్లాది గోవింద దీక్షితుల వారు తెలుగు ప్రతిని మనకందించారు..
దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా

శ్రీ విష్ణు బువా బ్రహ్మచారి...🙏🏻

మహాత్ముల పరిచయం-376
శ్రీ విష్ణు బువా బ్రహ్మచారి...🙏🏻
వీరు 1825 సంవత్సరంలో జన్మించారు. ఐదవ సంవత్సరంలో తండ్రి గారు చనిపోవడంతో తీవ్ర వైరాగ్యము వచ్చి కొన్ని రోజులు వేదం అధ్యయనం చేసి,9వ ఏడు వచ్చేసరికి చక్కగా రాయడం నేర్చుకున్నారు.9 ఏటనే వీరికి రెవిన్యూ శాఖలో రాసే ఉద్యోగo వచ్చింది. చిన్నప్పటి నుంచి వివేక సింధు,జ్ఞానేశ్వరి,వేదోక్త ధర్మ ప్రకాష్,భావార్త సింధు,దాసభోధ చదువుతూ తీవ్ర సాధన చేసేవారు.కానీ తల్లి గారు అడవిలో ఆవులు, వ్యవసాయం చేయమని చెప్పడంతో ఇంటి నుంచి పారిపోయి సప్తశృంగి కొండకి వెళ్లి,అక్కడ అడవిలో సద్గురువు కోసం కందములాలు తింటూ,తీవ్ర తపస్సు చేసాడు. దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం కలిగింది. స్వామి వీరిని నా స్వరూపంగా, జనాలకు ఆధ్యాత్మిక, సామాజిక స్ఫూర్తి అందరిలో జ్ఞానం తలఎత్తేలా కలిగించండి, ప్రపంచానికి భోధించండి అన్నారు.వీరు దత్తాత్రేయ స్వామి తో నా శక్తీకి మించిన పని కదా అన్నారు. స్వామి వీరితో మీరు శూన్య స్థితిలో ఉండి జ్ఞానంతో నా మాటలు వినండి చాలు అన్నారు. వీరు అనేక ఆధ్యాత్మిక గ్రంధాలు రచించి,ఊరు ఊరు తిరుగుతూ ప్రజలలో భక్తి,సామాజిక చైతన్యం కలిగించారు.
1.అప్పటి లోనే పునర్వివాహం,2.వివాహ వ్యవస్థ మీద అనాగరిక సతీ సహగమనం,కట్నం,అంటరానితనం లాంటి వాటి మీద,సత్వ గుణం మీద ప్రజల్లో, గిరిజనులలో,అందరిలో ఒక ఉత్తేజం తెచ్చారు. ప్రజలు అందరిదీ ఒకటే కుటుంబం, భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే అనే వారు. బ్రిటిష్ వారి కుతంత్రాలను ముందుగానే తన యోగ శక్తితో ప్రజలకు హెచ్చరించి,ఆ బాధల నుంచి తప్పించేవారు 18-ఫిబ్రవరి-1871 సంవత్సరం లో సమాధి చెందారు.

Thursday, 5 November 2020

నృసింహ వాడి లో స్వామి వారి నిత్య కార్యక్రమం... Part-49🙏🏻

 దత్త. లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:రంగావధూత


తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి

నృసింహ వాడి లో స్వామి వారి నిత్య కార్యక్రమం...

Part-49🙏🏻

నృసింహవాడి నుంచి స్వామి బయలు దేరేటప్పడికి సాయంత్రం అయింది. ఈ రోజు స్వామి కురుద్వాడలోని కృష్ణా ఘాట్ లో మజిలీ చేశారు. అక్కడ దత్త దర్శనం చేసుకొని అక్కడే ఆశీనులు అయ్యారు. వారితో పాటు అక్కడికి  సుమారుగా 200 మందిదాకా  వాడి నుంచి వచ్చిన భక్తులు వచ్చారు. స్వామి కురుద్ వాడి వచ్చారని తెలుసుకొని అక్కడ ప్రజలు స్వామి దర్శనం కోసం వచ్చారు. స్వామి సంగమంలో కూర్చోడానికి వెళ్లగా అక్కడ భక్తుల వినతి ప్రకారం స్వామి అక్కడ కృష్ణ నీళ్లను వారిపై సంప్రోక్షణ చేశారు. సాయంకాలం సంధ్యావందనం తరువాత స్వామి ఘాట్ మీద దత్త మందిరానికి వచ్చారు. అక్కడ నృసింహ వాడి వచ్చిన భక్తులు భజనలు చేసి,వాడీకి వెళ్లిపోయారు. ఈ రాజ్యం యొక్క రాజు స్వామి దర్శనం కోసం తరుచూ వాడి వెళ్లి దర్శించుకొని 10 నిమిషాలు ఉండి వచ్చేవారు. ఈసారి స్వామి వారు కురుద్వాడి వచ్చేసరికి రాజు బాలాసాహెబ్ ఒక పని మీద మిరాజ్ వెళ్లారు. స్వామి ఇక్కడకు వచ్చారని తెలిసి  రాత్రికి వెనుకకు వచ్చి స్వామితో మీరు వస్తున్నారని తెలియదు, ఈ అపరాధమునకు క్షమించండి అని వేడుకున్నారు. స్వామి తన రాష్ట్రాన్ని పావనం చేసినందుకు చాలా సంతోష పడ్డారు. మరురోజు భిక్ష స్వీకరించవలసినది గా వేడుకున్నారు. స్వామి అంగీకరించడంతో వెంటనే వంట సామాను సేకరించి అక్కడే ప్రారంభించారు. బాలా సాహెబ్,దాజి సాహెబ్,భావు సాహెబ్అనే ముగ్గురు స్వామికి సంప్రదాయం ప్రకారం భిక్ష ఇచ్చారు.(సన్యాసులకు 3 ఇళ్లలో భిక్ష స్వీకారం చేయాలి,అందుకని ఇలా చేశారు.) ఆ రోజు 1,500 మంది నైవేద్యం స్వీకరించారు. స్వామి మహరాజ్ పక్కన నృసింహ సరస్వతి స్వామి(దీక్షిత్ స్వామి)ఇంకా 4 వేరే సన్యాసులు భిక్షకు కూర్చున్నారు.

భిక్ష తరువాత స్వామి మహరాజ్ బయలుదేరుతున్నారు. రాజు 

గౌరవప్రదంగా స్వామిని తీసుకెళతానని రాజు తెలిపారు. స్వామి అంగీకరించలేదు. స్వామి స్థానిక విష్ణు ఆలయం,దత్త ఆలయానికి వెళ్లి రాజు వినతి ప్రకారం రాజుకోటకు వెళ్లి,ఆశీర్వదించారు. స్వామి వారితో నేను ఎన్నో రాజ్యాలు వెళ్ళాను. కానీ ఎక్కడ రాజమహల్ లో కాని, రాజు భిక్ష స్వీకరించ కూడదని నా నియమం. మొదటిసారి మీ భక్తి చూసి నియమం తప్పాను అని అన్నారు.

స్వామి అలా చెప్పడంతో బాలాసాహెబ్ స్వామికి నమస్కారం చేసుకున్నారు. స్వామి తర్వాత దేవిని దర్శించుకొని గ్రామం వదిలారు. స్వామితో రాజు, అతని సైనికులు వెనుక నడిచారు. స్వామి వారిని తిరిగి వెళ్ళమని ఆజ్ఞాపించారు. వారు మా మీద ఇలాగే అఖండ కృపా దృష్టి ఉంచండి అని గొంతు బొంగురపోగా ,కళ్ళ వేంట నీరు కారింది. స్వామి మహరాజ్ వారితో గోవులను, బ్రాహ్మాణులను రక్షించడం రాజు ధర్మం ఇది ఆచరించి శ్రీ గణపతిని సేవించండి మీకు కళ్యాణం అవుతుంది అని ఆశీర్వదించి. స్వామి ముందుకు వెళ్లిపోయారు.

జై గురు దత్త

దత్తోపాసన అంటే?

 దత్తోపాసన అంటే?


Part-1


దత్తోపాసన అనేది కాలనుగుణం గా ఎన్నో సంప్రదాయాలు గా మారుతూ నాధ,మహానుభావ,అఘోరీ, సమర్ధ, అవధూత, వరకారి, ఆనంద,శైవ,భైరవ,అఖండ,అతీత, శ్రీ విద్య,యోగ విద్య,ఇలా అనేక సంప్రదాయాలు జ్ఞాన, యోగ,భక్తి మార్గాల ప్రాముఖ్యతను భోధిస్తూ ఆది విశ్వ గురువుగా లోకం లో జీవులు వున్నంతకాలం తాను అవతరించే ఏకైక గురువు దత్తాత్రేయ స్వామి.విశ్వంలో చివరి జీవిని ఉద్ధరించేదాక తన అవతారం జరుగుతూనే ఉంటుంది అని ప్రతిజ్ఞ చేశారు.


 ప్రతిజ్ఞ తేన భక్తా మే నశ్య   న్తితి సునిశ్చితమ్!

 శ్రీదత్త చిత్త ఆనీయ జీవనం ధారయామ్యహమ్!!


భా. నీభక్తులకు ఎట్టి అధోగతియు రాదని నీవు ప్రతిజ్ఞ చేసిఉన్నావు.ఆమాట నమ్మియే నేను జీవించుకున్నాను.అని అంటారు శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి.

మనం కూడా అలాగే దత్త బిడ్డలము అవుదాము. ఇక తరింపజేయవలసినది దత్తుడే.

శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

 శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:శ్రీ రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


శ్రీ నృసింహ వాడీలో వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్న రోజుల్లో వారి దత్త సేవ.

Part-45

వక్రతుండ కవీశ్వర్ గారి మనుమడు శ్రీ దత్త మహరాజ్ కవీశ్వర్ గారు కూడా మహనీయులు. వీరు శ్రీ గుళవణి మహరాజ్ గారి, వాసుదేవ నివాస్ కి వారి తరువాత పీఠాధిపతిగా వున్నారు. శ్రీ దత్త మహరాజ్ కవీశ్వర్ గారు, తరువాత గాంధీ నగర్ లో దత్త మందిరం లో దత్త విగ్రహం ప్రతిష్ఠ చేశారు.

తరువాత స్వామి ఉపన్యాసం మొదలు అయ్యేది. అలా ఉదయం 10 గంటల వరకు జరిగేది. తరువాత భక్తులు అందరూ శ్రద్దగా వాసుదేవానంద సరస్వతి స్వామికి పూజ చేసేవారు. పూజలో దక్షిణాది బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేవారు. అప్పటి దాకా వచ్చిన టెంకాయలు,పండ్లు స్వామి స్వయంగా భక్తులకు దత్త ప్రసాదం క్రింద ఇచ్చేసేవారు. పండ్ల పై ఎవరైనా స్వామి వారికి ధనం, దక్షిణ కింద పెడితే స్వామి అక్కడ పూజరులతో వీటి మీద ఆ వ్యర్థం ఎందుకు పెట్టారు అని అడిగి ముట్టుకునేవారు కాదు. వారు జీవితంలో డబ్బు ముట్టుకోలేదు.

తరువాత ఈ కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూర్తిఅయ్యేది.

తరువాత వాసుదేవానంద సరస్వతి స్వామి ఐదు ఇళ్లలో గ్రామంలోకి భిక్షకి వెళ్లేవారు.

ఆ భిక్ష ఇచ్చే ఇళ్ల వాళ్ళు స్వామి రాకకై ఎదురు చూస్తూ, వారి ముంగిట చిమ్మి,.ముగ్గులు పెట్టి స్వామి రాకకై ఎదురు చూసేవారు(అదృష్ట వంతులు). స్వామి భిక్ష గ్రహించి, అది తినడానికి నారాయణ మఠం గాని,బ్రహ్మానంద స్వామి మఠమున కు కానీ వెళ్లేవారు." అష్ట గ్రాసా మనోభిక్ష"స్వామి మహరాజ్ దినచర్య ఇలా ఉండేది. ఎప్పుడూ ఖాళీగా ఉండేది లేదు. ఎప్పుడూ దత్త సేవ,జనుల సేవ మాత్రమే. భిక్ష స్వీకరించి వచ్చేటప్పుడు తనకు ఎవరైనా నమస్కారం చేసిన,రజస్వల అయిన మహిళ కనపడిన ఆ రోజు వారు ఉపవాసము ఉండేవారు. అది వారి నియమము. అందుకే భక్తులు స్వామి కన్నా ముందు వెళుతూ అందరింని హెచ్చరించేవారు. 

శ్రీ రంగావధూత రచించిన శ్రీ వాసుదేవ లీలామృతం పుస్తకం లోనిది.

తెలుగు అనువాదం; రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

శ్రీ గురుచరిత్ర.... గుప్త బోధ. రాజ్యలక్ష్మి ప్రధమ అధ్యాయం🙏🏻

 దత్త లీలా క్షేత్ర మహత్యం...

        శ్రీ గురుచరిత్ర....

గుప్త బోధ.

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ప్రధమ అధ్యాయం🙏🏻

ప్రధమ అధ్యాయం ఏమి చెపుతోంది?

మన జీవిత చరిత్రయే ఇది.

. ఈ మాయ ప్రపంచంలో చీకటిలో ఉన్నది లేనట్టు-లేనిది ఉన్నట్లు,శాశ్వత మైనది అశాశ్వతమైనదిగా-అశాశ్వతమైన ది,శాశ్వతంగా భ్రమ పడతాము.


మసక చీకటిలో త్రాడు చూసి పాము అనుకోని భయపడి,తరువాత తాడు అని తెలుసుకొని భయం పోగొట్టుకుంటాము.అలాగే ఈ మాయా ప్రపంచంలో మనమే భగవత్ స్వరూపం అయినా, ఈ మాయ వల్ల

భయపడి,మనమే ఆత్మస్వరూపo అని తెలుసుకొని.భయం పోగొట్టుకుంటాము.


ఒక సామాన్యమైన మానవుడి(మనమే) జీవిత మార్గదర్శిగా గురుచరిత్ర ను చూడవచ్చు.మోక్షం పొందాలి అనుకునే వారు గురువు అనుగ్రహం పొందాలి. ఎలా పొందాలి?ఆ అనుగ్రహం మనకు ఎప్పుడు లభిస్తుంది?అసలు ఈ సాధన చాలా?ఇంకా ఏమైనా  సాధనాలు చేయాలి నా?


మనం పూజలు చేస్తుంటాము.భగవంతుడు పలకడు, ఎందుకు పలకడో తెలియదు, ఎప్పుడు పలుకుతాడో తెలియదు, యాంత్రికంగా పూజలు చేస్తుంటాము. అసలు ఉన్నాడో, లేడో మన పూర్వీకులు అందరూ కాలం వృధా చేసుకున్నారా?ఒకవేళ ఉంటే ఎలా ఉంటాడు?అనేక సందేహాలు, ప్రశ్నలకు సమాధానం వెతకడం కోసం నామధారకులు (మనమే,జన్మించిన తరువాత ఎదో ఒక పేరు ధరించాలి కదా  ) బయలు దేరుతారు.

ఉన్నాడా?లేడా?అని కోపం, ఉక్రోషంతో అయోమయంలో వెతుకుతూ ఉంటాము. వాటి లో నించి ఆర్తి మొదలవుతుంది. పట్టుదల పెరుగు తుంది.అదే ఆర్తితో మన లాగానే  బయలుదేరిన నామధారకుడు గురు దర్శనం కలుగక అలసిపోయి నీ మీద   గోత్ర ఋషులకు ఫిర్యాదు చేస్తాను అంటూ తెలియకుండానే భగవంతుడు వున్నాడు అన్న నిర్ణయానికి   వచ్చాడు. వున్నాడు అని మనస్సు లోకి వచ్చింది అంటే భగవంతుడు ఉండబట్టే కదా ఫిర్యాదు చేస్తాను అన్నాడు. దానితో సద్గురువు  మనస్సు కరిగింది. ఆవు దూడ దగ్గరకు ఆవు వచ్చినట్లు పరుగున గురువు అయిన సిద్ధులు స్వప్న దర్శనం ఇస్తారు. మేలుకొని ఆనందంగా తన గురువు దొరికాడు కాబట్టి వారిని సశరీరంగా దర్శించుకోవడానికి ముందుకుసాగారు. అలాగే మనకు అలాంటి సద్గురువు  దొరకాలని  ఆర్తి తప్పక సద్గురువుని చూపుతుంది. అదే మొదటి అధ్యాయం వివరిస్తుంది.గురుసేవ,గురువు మహత్యం, గురువు  మోక్షం కు  ఎంత ముఖ్యం మో కథల రూపంలో తెలియ జేయ బడినది.గురుచరిత్ర, జ్ఞాన,కర్మ,ఉపాసన(భక్తి)

కాండలు గా రచించారు శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి.

జై గురు దత్త

శ్రీ గురు చరిత్ర....🙏🏻 అధ్యాయం -2...🙏🏻 🌷గుప్త భావం 🌷

 దత్త లీలా క్షేత్ర మహత్యం


శ్రీ గురు చరిత్ర....🙏🏻


అధ్యాయం -2...🙏🏻

 🌷గుప్త భావం 🌷

రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

ముందు భగవంతుడు ఉన్నాడా?లేడా? అన్న స్థితి నుంచి తన కల (అనుభవం) ఆధారంగా వున్నాడు అని నిర్ణయించుకొని ఆ గురు దేవుని దర్శనం కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఆ స్వప్న మూర్తిని ధ్యానిస్తూ, వెతుకుతూ సాధనగా మనసును ఈ దివ్య మూర్తి మీద లగ్నం చేసాడు . తనకు స్వప్న దర్శనం వలన  గురు అనుగ్రహము లభిస్తుంది అన్న నమ్మకం కలుగుతుంది. తన సందేహలు,తనలో  దోషాలు నాశనం  అవ్వడం మొదలవుతుంది.. ఇక గురు ప్రాముఖ్యత, గురువు యొక్క  బోధ,గురుబోధ ఆచరణ,ఇవి గురు అనుగ్రహముతో పాటు,ఆచరణలోకి తెచ్చుకొని,ఆత్మనుభూతి పొందడమే మిగిలినది. ఎలా పొందాలి, తెలియదు. అందుకే చేస్తున్న సాధనతోనే  ముందుకు పోవాలి.మన సంగతి మనకు తెలియదు.అది తెలియజేసేవాడే గురువు.


 నామాధారకుడు వెతుకుతూ ముందుకు పోతున్నాడు. గురువు ఎదురుగా ప్రత్యక్ష దర్శనం లభించింది. గురువుని కళ్లారా చూసుకొని,సాష్టాంగ ప్రమాణం చేసుకొని ఆర్తితో ఇంత ఆలస్యం అయిందే దర్శనం అనుగ్రహించటానికి అని మనలా అమాయకంగా  అడిగారు. 


స్వామి నామధారకునితో భగవంతుని కృపాదృష్టి లో లోపం లేదు, నీ ప్రార్ధనలోనే సంశయం ఉంది. భగవంతుడు వున్నాడు, అతని మీద గోత్ర ఋషులకు ఫిర్యాదు చేస్తాను అన డంతో సంశయం పోయి వున్నాడు  కాబట్టి  అన్నావు కాబట్టిదర్శనం లభించింది. సంశయాత్మకుడు,శ్రద్ద లేని వారు భగవంతుడు చేత అంగీకరింపబడరు. అని శిష్యునిలోని  లోపo సరి దిద్దారు.

శిష్యుడికి  బుద్ధి చాపల్యం,చపల చిత్తం పోవడంతో,శ్రద్ద వచ్చింది. అప్పుడు గురువు చేత బుద్దిమంతుడవు అని అనిపించుకున్నాడు. అంటే సాధన ద్వారా  గురువుని సంతోష పెట్టడం(సేవించడం) మొదలు అయింది. అంటే సేవ ద్వారా నే కదా మనలో అహంకారం, విషయ వాసనలు పోయేది.కలి ప్రభావం, మాయ మొహం వల్ల చెంచలమైన మనస్సు గురువు దొరికిన తరువాత గురువుని అనన్యంగా ఎలా సేవించాలి?ఎలా సంతోష పెట్టాలి?సాత్విక మైన ఓర్పుతో ఎలా సేవించాలి అని తెలిపే అధ్యాయం ఇది.

గురు ప్రాముఖ్యత తెలుసుకుంటే కదా,గురువుని శ్రద్ధగా సేవించేది.

ఇలాంటి అనుభవం గురువే ఇవ్వాలి కదా.

జై గురు దత్త