Saturday 3 November 2018

సనాతన ధర్మం

సనాతన ధర్మాన్ని పాటించడమే విజయానికి మార్గం!
హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు 
మనం ఒక వ్యూహాన్ని అనుసరించవచ్చు.
ఏ ధర్మాన్ని ధ్వంసం చేయాలని…అనుష్ఠాన పరులని హత్యలు చేస్తున్నారో,
ఏ ధర్మాన్ని ఆచరణ నుంచి తప్పించాలని కోర్టు తీర్పులు వెలువరిస్తున్నారో…
ఆ ధర్మాన్ని మరింతగా,మరింత ఎక్కువ మందిమి ఆచరిద్దాం గాక!
ఉదయం సుప్రభాతం మైక్ లో వినిపించినందుకు ఒక వృధ్ధ బ్రాహ్మణ పూజారిని చంపితే
ఆ చుట్టుపక్కల ఉన్నవారందరితో సహా, మనందరమూ …
మనమన నివాస స్థానాల్లో …ఉదయాన్నే మన యిష్ట దేవతల సుప్రభాతాలు
మన దగ్గర గల సాంకేతికలతో వినిపించాలి.
[అయితే అది మితి మీరిన ధ్వని కాలుష్యనికి దారి తీయకూడదు.ఉదయాన్నే భాస్కరునికి, పక్షులు తమ కిలకిలారావాలతో స్వాగతం పలుకుతాయని ఛాందోగ్యోపనిషత్ చెబుతుంది.
వాటికి భంగం కలిగించకూడదు గనుకా,
దేనికైనా గీత యుక్తాహార విహారస్య అంటుంది గనుకా.]
ఆపైన వీలైనంత మంది.. మన దగ్గరి దేవాలయాలకి వెళ్ళి ,
ఆ సుప్రభాతం ఉన్న పదో ఇరవయ్యో నిముషాలు గుడి లో ఉండాలి.
ఒక్కణ్ణి చంపితే వందమందిమి తయారౌతామన్న హెచ్చరిక …
హిందూ ద్వేషుల్లో దడ పుట్టించాలి.
బ్రాహ్మణోక్తం గా ఆయా యజ్ఞ యాగాది క్రతువులు జరపాలి.
ప్రతి ఒక్క హిందువూ మనవైనా ఆచారాలనీ, సాంప్రదాయాలనీ నిక్కచ్చిగా పాటించాలి.
ఇక ముఖాన బొట్టు పెట్టుకోవడాన్ని,ముంగిట ముగ్గు పెట్టుకోవడాన్ని నిలిపివేయాలంటూ …
కోర్టులు తీర్పులిస్తే …ఆ కుటిలతే ప్రపచానికి మరింతా వెల్లడి అవుతుంది,
అజ్ఞానంతో ఇంకా ఉదాసీనం గా ఉన్న హిందువులకి కూడా నసాళానికి ఆవేశం అంటుతుంది.

~ Matha Ananthananda ~

No comments:

Post a Comment