Friday 30 November 2018

GANAPATHI MAHAMUNI

KAVYAKANTHA GANAPATHI MAHAMUNI

Vasistha Ganapati Muni (1878-1936), famed as Kavyakantha , and popularly addressed as Nayana, was a mighty spiritual personality in his own right and had a large following of illustrious disciples. It is a standing testimony to his spiritual sincerity, humility, and intellectual honesty that he recognized the uniqueness of Bhagavan Sri Ramana Maharshi's teaching, accepted Him as his Guru, and proclaimed him as the Maharshi to the whole world. 

Thursday 29 November 2018

కాశీలో ప్రత్యేక ఆశ్రమం :

బ్రాహ్మణులు కొరకు కాశీలో ప్రత్యేక ఆశ్రమం :
బ్రాహ్మణులు కొరకు కాశీలో శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవ సొసైటీ తరపున ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేసాము.
ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు, ఎయిర్ కూలర్ గదులు కేటాయింపు..
2, 3, 5 పడకలు గల రూములు కలవు. ఎయిర్ కూలర్ సదుపాయంతో ఒక్కొక్కరికి కేవలం 150/- (ఒక రోజుకు) లకే వసతి కల్పించబడును.
ఈ ఆశ్రమంలోబ్రాహ్మణులు కొరకు ప్రత్యేక నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ప్రతీ రోజు రెండు సార్లు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 03.30 వరకు మరియు రాత్రి 07:00 నుండి 09:00 వరకు
అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు.
ఉచిత లైబ్రరీ సదుపాయం.
 ఈ విషయాలలో మీకు ఎలాంటి వివరాలు కావలసినా సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:
+91 89191 23647
+91 99367 64525
+91 99187 74933
Email: sethu2kasi@gmail.com
సంప్రదించవలసిన అడ్రస్:
శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ,
శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం,
అబ్బూరు హరి హర శాస్త్రి,
D 47 /2B 2G,
PDR మాల్ దగ్గర,
రామాపుర, వారణాసి.
PIN 221001

అమ్మ

అమ్మ జోల పాట ఆనంద భైరవి 
అవని లోన లేరు ఆమె సాటి 
ఆమె పాట విన్న ఆపాప నిదురించు 
సుగుణ చెప్పు మాట సూటి గాను

Tuesday 27 November 2018

భైరవకోన

భైరవకోన
ఎత్తయిన జల పాతము లింపు కలుగ
యెనిమిదగు దేవళంబులు నిచట నుండె 
భైరవుని కోన యద్భుత ప్రకృతి సొగసు
లకిది యాట పట్టుగ నుండె రమ్య మలర !!
పున్నమందున చంద్రుని పొలుపు దుర్గ
తల్లి పై ప్రసరింపగ తళతళ మని
మెరిసె నంబిక వదనము మిసిమి తోడ
భవుడు ముదమున మురిసెను భవ్యముగను!!
నల్లమల కానలందున నాణ్య మైన
శివుని మందిరంబు శిలలు శిల్పి చేత
వెన్నముద్ద లాయె నిచట వేల్పు లగన
మనసు విరియు భక్తియుపొంగు మనకు నిచట !!
కొండ కోనల యున్నను కోరి వచ్చు
జనులు స్వామిని చూడగ శైల మైన
నడచి వత్తురు శ్రమకోర్చి నభవుఁగనగ
భారతీయత యనగనె పరిమళమిది !!
హరుడ పరమేష్టి భగవాను డాది దేవ
భూత నాధుడ మదనారి మోక్ష మివ్వు
నర్ద భాగము సతికిచ్చి నరయఁ గంగ
నెత్తినుంచిన భవుడవు నెమ్మి నొసగు!!
భైరవకోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖర పురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. భైరవకోన అంటేనే
ముందుగా గుర్తుకొచ్చేది ఎత్తయిన జలపాతం. ఎత్తైన కొండలపై ఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200 మీటర్ల ఎత్తు నుంచి పడుతూ యాత్రికులకు కనువిందు చేస్తోందీ
జలపాతం. జలపాతం నుంచి కింద పడి నీరు సోనవాన పేరుతో దుర్గాంబ, భైరవాలయాల మధ్య ప్రవహిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుని కాంతి కిరణాలు సెలయేటి నీటిపై
పడి దుర్గా దేవిపై ప్రసరిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసేందుకు ఆ రోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల
అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూపంగా అనిపిస్తుంటుంది.
వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.
కోనకు ఎలా వెళ్లాలంటే... భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది.
అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది.

Monday 26 November 2018

త్రిపురాంతకం


త్రిపురాంతకం
బాలత్రిపుర సుందరి దేవిపార్వతిసహి 
తముగ త్రిపురాంతకంబున ధరణి ధరము
నందు వెలసిరి స్వామియు నగము పైన
యంబ లిర్వురు దిగువన యవత రించె !!
ఆ చిదగ్ని సంభూతయై యంబ వెలసె
పొత్తమును,జపమాలయు మురిసి వట్టి
శ్వేత కమలము నధివసించినది మాత
బాల రూపిణి యైనిల్చె పావనమున!!
పుణ్య క్షేత్రము ప్రాచీనము నిది శివుడు
నడచి నట్టి స్థలంబట నటన సూత్ర
ధారి నటరాజు నాడిన ధన్య యాల
యంబిదికనుల పండుగౌ యంబఁ గనిన !!
పున్నమి దినమందునచూడ పుణ్యమొసగు
ఆ కదంబ వృక్షములిట యంబ పూజ
కొరకు నమరెనిచ్చోటనె కొండ పైన
చూడ చక్కని దైవము సొగసు లొలుక !!
సిరి శిఖరముదాపుననుండె శివుని క్షేత్రి
కార్తికంబున పోవగ గరళకంఠుఁ
దర్శ నంబది మనలకు తన్మయంబు
బాల తల్లియె కుంకుమ పసుపు నిచ్చు !!
త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన
ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన
మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ
స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు.ఆకాశం నుండి చూస్తే శ్రీ చక్ర ఆకారం స్పష్టంగా కనబడుతుంది.ఈ పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.
ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి
వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారుశ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది..

Friday 23 November 2018

మాతృభాషయ

మాతృభాషయన్న, మమకారమే లేదు
పరుల భాష టన్న,ప్రాపు మెండు
తల్లి స్తన్యమేమి ,తకరారుజేసెరా?
తెలివి తక్కువైన, తెలుగువాడ..
* * * * * * * * * * * * * * * * * * 
Ravela Purushottama Rao 

రథి, అతిరథి, మహారథి,

An interesting WhatsApp post regarding categorisation commanders of war in mythological era
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి. అవి -
రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి.
1) రథి - ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు, ద్రౌపది కొడుకులు -
వీరంతా రథులు.
2) అతి రథి (రథికి 12రెట్లు) -
60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు, కృతవర్మ, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు, విరాట, అకంపన, సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త, అంగద, దుర్యోధన, జయద్రథ, దుశ్శాసన, వికర్ణ, విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ, ప్రద్యుమ్నులు అతిరథులు.
3) మహారథి (అతిరథికి 12రెట్లు) -
7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ, అర్జున, భీష్మ, ద్రోణ, కుంభకర్ణ, సుగ్రీవ, జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ, జరాసంధులు మహారథులు.
4) అతి మహారథి (మహారథికి 12రెట్లు) -
86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు - వీరు అతి మహారథులు.
రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.
5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) -
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి, గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, వీరు మహామహారథులు.
మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు. అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

अंदाज़ (1971)

ज़िन्दगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना
चाँद तारों से चलना है आगे
आसमानों से बढ़ना है आगे
पीछे रह जायेगा ये ज़माना
यहाँ कल क्या हो...
ज़िन्दगी एक सफ़र...
हँसते गाते जहाँ से गुज़र
दुनिया की तू परवाह ना कर
मुस्कुराते हुए दिन बिताना
यहाँ कल क्या हो...
ज़िन्दगी एक सफ़र...
#movie/Album: अंदाज़ (1971)
Music By: शंकर जयकिशन
Lyrics By: हसरत जयपुरी
Performed By: आशा जी

ARUNACHALA RAMANA - ARUNACHALA SHIVA

ARUNACHALA RAMANA - ARUNACHALA SHIVA
గుడిపాటి వెంకటచలం,ఆయనకుమార్తె “సౌరిస్ “. (1972 లో నేనుతీసిన ఫోటో )..స్త్రీలకు స్వేచ్ఛ ,స్వాతంత్ర్యాల ప్రాధాన్యత గురించి సమాజంపై సాహిత్య పోరాటం జరిపిన రచయిత చలం....తరతమ భేదాలులేని ఆయనజీవిత సరళి విశ్వప్రేమ తత్వాన్ని చాటుతూ నన్నెంతో ఆకట్టుకున్నది,అరుణాచలంలో ఆయనఅందరిచేత నాన్న అని పిలిపించుకుంటూ తనుమాత్రం పసివాడిలా ఉండేవారు....
~ Artist Ramarao Jinka ~

Thursday 22 November 2018

చలం చూచినదీ..చలం నేర్చుకున్నదీ :

చలం చూచినదీ..చలం నేర్చుకున్నదీ :
* * * * * * * * * * * * * * * * * * * * * 
అనేక మానసిక దౌర్బల్యాలతో సతమతమౌతున్న చలం మొట్టమొదటి సారి భగవాన్ రమణ మహర్షిని చూడగనే తనలో గూడుకట్టుకొనిఉన్న మనో వికారాలన్నీ తొలగిపోయాయని...ఈ అనంతమైన ఆకాశం...నేను శ్వాసిస్తున్న ఈ గాలి..త్రాగుతున్న ఈ నీరు.. అనంత ప్రాణికోటికి శక్తిని, వెలుగును ప్రసాదిస్తున్న అగ్ని, భూమి ..ఇవన్నీ పరమాత్మ స్వరూపాలని తెలుసుకున్నానని...తద్వారా నాలో ఆత్మ సాక్షాత్కారం కలిగిందని చెబుతాడు..మహనీయుల,మహర్షుల మౌనం లో ఇమిడి ఉన్న కాస్మిక్ పవర్ అంటే ఇదే మరి!!!
ఆ కాంతిని.....ఆ అనుభూతిని...ఆ ఈశ్వరతత్వాన్ని చూడగలిగిన రచయితల్లో చలం ఒకరు!!!

VISWANATHA SATYANARAYANA

SIMPLICITY WITH SPIRITUAL ESSENCE
VISWANATHA SATYANARAYANA

“ విశ్వనాధ సత్యనారాయణ “. వేయిపడగలు,రామాయణ కల్పవృక్షం వంటి సంప్రదాయ సాహిత్య గ్రంథ రచయిత ,తెలుగు సాహిత్యంలో సంప్రదాయమేరుపర్వతం లాంటి ప్రఖ్యాతిని పొందిన కవీశ్వరులు ...
ఆయన సాధారణ జీవన విధానము..విషయవాంఛలను తొలగించే ఆయన కవితా శైలి నన్ను వేయిపడగలను హింది భాషలోకి అనువదించేలా చేసిందని బహుభాషా కోవిదుడు, భారత అత్యుత్తమ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు చెబుతారు...

Viswanatha Satyanarayana (10 September 1895 – 18 October 1976)  was a Telugu writer of the 20th century.  Viswanatha's style of poetry was classical in nature and his popular works include Ramayana Kalpa Vrukshamu (Ramayana the wish-granting divine tree), Kinnersani patalu (Mermaid songs) and and Veyipadagalu (The Thousand Hoods).

Wednesday 21 November 2018

మాతృదేవోభవ , పితృదేవోభవ

1) మాతృదేవోభవ , పితృదేవోభవ
అని చెప్పిన దేశం భారత దేశం.
కానీ దానిని ఆచరించేది ఆస్ట్రేలియా. ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)
2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)
3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)
4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)
5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)
6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)
7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)
8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో మొదటి స్థానం జపాన్ దే)
9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)
10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)
నేను మొదటి స్థానాన్ని మాత్రమే తెలియజేసాను. పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న దేశాలు ఇవి..(ర్యాండం గా)
నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా .....
చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.
మనదేశం మొదటి స్థానం లోకి వచ్ఛేరోజు వస్తుందని ఆశిద్దాం

త్రికరణశుధ్ధి కరువైతే???

త్రికరణశుధ్ధి కరువైతే???
* * * * * * * * * * * * * * * 
అతిశయోక్తులు...అలంకారాలూ...
అక్షర ఐశ్వర్యం అనుకునేరు!!! 
త్రికరణ శుధ్ధి కరువైనపుడు 
మీ కలం లో పులుముకున్న 
అసంబధ్ధ, అబధ్ధ భావాలవి!!!
~ రాచమల్లు రామచంద్రా రెడ్డి ~

· #కవిత్వ కళా నిరూపణము * *




#కవిత్వ కళా నిరూపణము 2
* * * * * * * * * * * * * * * 
శుచి, ధారణ, ధ్యానం,క్రమశిక్షణ,ఈశ్వర భక్తి ,సోదర భావము ...ఇవేమి లేకుండా కవి ఎన్ని గ్రంధాలు రాసిన పండితుడు కాజాలడు....అట్టి రచనలకు వెలుగుండదు!!!
~ శ్రీ రామ సమర్థ - దాసబోధ నుంచి సంగ్రహించబడిన సత్యవాక్కులివి ~

పిఠాపురం

పిఠాపురం
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
(శ్రీనాధుడు భీమేశ్వర పురాణం )
పీఠికాపురమది ఘనపీఠమనగ
దేవళముల కూడలిదియు దివ్యమైన
ధామము పవిత్ర జలముల తటము నందు
స్నానమాచరించినతోడ సకల శుభము !!
కుక్కుటేశ్వరుడైనాడు కోకనదుడు
యా పురూహూతికమనకు నంబ కాగ
శక్తి పీఠమిదియె దత్త స్వామి నిచట
పరిమళించెను శ్రీపాద వల్లభునిగ !!
ఆ గయాసురుఁ యొడలది యజ్ఞ వాటి
ఘనత కలిగిన భక్తుని కలిలమదియు
తాకినంతనె జీవుల తరల చేయు
పాద గయగ పిలువబడు ప్రస్తుతంబు !!
దివ్య మైనట్టి గుడులతో భవ్య మౌగ
పీఠికాపురంబదియును విజయమొసగు
భక్త వరులకు కన్నుల పండుగాయె
చూచి వద్దము రండయ సుజనులార !!
కాకినాడకు చేరువన్ కలదు పురము
కార్తికమున హరిహరుల గాంచుటనగ
పుణ్య ప్రదమగు పరమును పొంద గలము
శివుని కొల్చుట శుభమగు చేరి మనకు !!
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పై విధంగా చెబుతాడు.
పాదగయ క్షేత్ర వివరణ
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. .కుక్కుటేశ్వర దేవాలయంఈ దేవాలయం కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.కుక్కుటేశ్వరస్వామి
ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.

Sunday 11 November 2018

NOVEMBER 12, PUBLIC SERVICING BROADCASTING DAY

NOVEMBER 12, PUBLIC SERVICING BROADCASTING DAY
Broadcasting indeed is an important social service
That equips the listeners with knowledge up to date nice!
Private and public sector service in this regard great
Premier broadcaster is that of our central Government!
November twelfth today is “Public Service Broadcasting Day”
Observed every year on this day to commemorate
Mahatma Gandhi’s maiden visit to All India Radio
(AIR) studio!Father of the Nation Mahatma
Gandhi visited the studio, Delhi first and last.
To address the refugees from Pakistan,
At Kurukshetra in Haryana after partition.
Consoling, assuring and providing consolation!
Notwithstanding the invasion of Television far and wide
Radio has its own charm and role to play in side by side
We know the people treat transistor as sister and keep
With them not to miss programs important and interesting neat!
Image result for Image of All India Radio Delhi

Karthika Masam -

Karthika Masam -
The Most Auspicious and Sacred Month
It is a month long festival, starting just after Deepavali Amavasya where both Lord Shiva and Maha Vishnu are worshipped and prayed.
It is most auspicious and sacred month for both Shaiva and Vaishnava followers.
It is believed that offering prayers to "Shivakesavas" particularly in this month brings luck and prosperity. Karthika Masam is the favorite month to Lord Shiva amongst all other months.
“Shivaya Vishnu Roopaya
Shiva Roopaya Vishnave.
Shivaya Hrudayam Vishnu
Vishnoscha Hrudayagum Shivah"
"Yathaa Shivamayo Vishnu
Evam Vishnu Maya Shivah"
Karthika Masam helps the devotee to
understand and embrace the thought that
there is no difference between Lord Vishnu and Lord Shiva and they both are one.

Wednesday 7 November 2018

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.
దిక్కులు :-
"""""""""
(1) తూర్పు, 
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం
మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం
వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం
పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా
పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.
పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.
పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.
దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.
పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.
పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.
పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.
పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం
షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.
అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.
ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర
సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.
సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.
నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.
నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర
నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.
దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.
జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.
తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.
రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.
తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107
( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108
( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113
( 8 )భావ. -
1934, 1994, 2054, 2114
9యువ. -
1935, 1995, 2055, 2115
10.ధాత. -
1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118
13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119
14.విక్రమ. -
1940, 2000, 2060, 2120
15.వృష.-
1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122
17.స్వభాను. -
1943, 2003, 2063, 2123
18.తారణ. -
1944, 2004, 2064, 2124
19.పార్థివ. -
1945, 2005, 2065, 2125
20.వ్యయ.-
1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127
22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128
23.విరోధి. -
1949, 2009, 2069, 2129
24.వికృతి. -
1950, 2010, 2070, 2130
25.ఖర.
1951, 2011, 2071, 2131
26.నందన.
1952, 2012, 2072, 2132
27 విజయ.
1953, 2013, 2073, 2133,
28.జయ.
1954, 2014, 2074, 2134
29.మన్మద.
1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136
31.హేవళంబి.
1957, 2017, 2077, 2137
32.విళంబి.
1958, 2018, 2078, 2138
33.వికారి.
1959, 2019, 2079, 2139
34.శార్వారి.
1960, 2020, 2080, 2140
35.ప్లవ
1961, 2021, 2081, 2141
36.శుభకృత్.
1962, 2022, 2082, 2142
37.శోభకృత్.
1963, 2023, 2083, 2143
38. క్రోది.
1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145
40.పరాభవ.
1966, 2026, 2086, 2146
41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147
42.కీలక.
1968, 2028, 2088, 2148
43.సౌమ్య.
1969, 2029, 2089, 2149
44.సాధారణ .
1970, 2030, 2090, 2150
45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151
46.పరీదావి.
1972, 2032, 2092, 2152
47.ప్రమాది.
1973, 2033, 2093, 2153
48.ఆనంద.
1974, 2034, 2094, 2154
49.రాక్షస.
1975, 2035, 2095, 2155
50.నల :-
1976, 2036, 2096, 2156,
51.పింగళ
1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159
54.రౌద్రి
1980, 2040, 2100, 2160
55.దుర్మతి
1981, 2041, 2101, 2161
56.దుందుభి
1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164
59.క్రోదన
1985, 2045, 2105, 216
60.అక్షయ
1986, 2046, 2106, 2166.

Tuesday 6 November 2018

TELUGU HITS - చిత్రం : భార్య (1968)

ఆ పాత మధురాలు
చిత్రం : భార్య (1968) 
నిన్న చూసింది ఈ అరుణకాంతులే
నిన్న చూసింది ఈ అరుణకాంతులే


వింత అందాలు చిందేను నేడెందుకో // నిన్న చూసింది //
ఎరుగవు నీవు ఎపుడీ హాయి
ఎరుగవు నీవు ఎపుడీ హాయి
ఎగిసీ పడేవిల ఎందుకే తువాయి!
ఓ విరజాజి నినుజతగూడి
తుంటరి చేసి
సరాగములు ఆడి
పలికే పదాలలో భావాలమే!! // నిన్న చూసింది //
పెన్నిధివోలె దొరికితివీవు నిలువుమయా నా తోడుగా // పెన్నిధి వోలె //
నిన్నే నా మది నమ్మిన దాన
నిన్నే నా మది నమ్మిన దాన
నను పాలింపుమా స్వామీ !!!


Saturday 3 November 2018

సనాతన ధర్మం

సనాతన ధర్మాన్ని పాటించడమే విజయానికి మార్గం!
హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు 
మనం ఒక వ్యూహాన్ని అనుసరించవచ్చు.
ఏ ధర్మాన్ని ధ్వంసం చేయాలని…అనుష్ఠాన పరులని హత్యలు చేస్తున్నారో,
ఏ ధర్మాన్ని ఆచరణ నుంచి తప్పించాలని కోర్టు తీర్పులు వెలువరిస్తున్నారో…
ఆ ధర్మాన్ని మరింతగా,మరింత ఎక్కువ మందిమి ఆచరిద్దాం గాక!
ఉదయం సుప్రభాతం మైక్ లో వినిపించినందుకు ఒక వృధ్ధ బ్రాహ్మణ పూజారిని చంపితే
ఆ చుట్టుపక్కల ఉన్నవారందరితో సహా, మనందరమూ …
మనమన నివాస స్థానాల్లో …ఉదయాన్నే మన యిష్ట దేవతల సుప్రభాతాలు
మన దగ్గర గల సాంకేతికలతో వినిపించాలి.
[అయితే అది మితి మీరిన ధ్వని కాలుష్యనికి దారి తీయకూడదు.ఉదయాన్నే భాస్కరునికి, పక్షులు తమ కిలకిలారావాలతో స్వాగతం పలుకుతాయని ఛాందోగ్యోపనిషత్ చెబుతుంది.
వాటికి భంగం కలిగించకూడదు గనుకా,
దేనికైనా గీత యుక్తాహార విహారస్య అంటుంది గనుకా.]
ఆపైన వీలైనంత మంది.. మన దగ్గరి దేవాలయాలకి వెళ్ళి ,
ఆ సుప్రభాతం ఉన్న పదో ఇరవయ్యో నిముషాలు గుడి లో ఉండాలి.
ఒక్కణ్ణి చంపితే వందమందిమి తయారౌతామన్న హెచ్చరిక …
హిందూ ద్వేషుల్లో దడ పుట్టించాలి.
బ్రాహ్మణోక్తం గా ఆయా యజ్ఞ యాగాది క్రతువులు జరపాలి.
ప్రతి ఒక్క హిందువూ మనవైనా ఆచారాలనీ, సాంప్రదాయాలనీ నిక్కచ్చిగా పాటించాలి.
ఇక ముఖాన బొట్టు పెట్టుకోవడాన్ని,ముంగిట ముగ్గు పెట్టుకోవడాన్ని నిలిపివేయాలంటూ …
కోర్టులు తీర్పులిస్తే …ఆ కుటిలతే ప్రపచానికి మరింతా వెల్లడి అవుతుంది,
అజ్ఞానంతో ఇంకా ఉదాసీనం గా ఉన్న హిందువులకి కూడా నసాళానికి ఆవేశం అంటుతుంది.

~ Matha Ananthananda ~

POET

వెలుగును ఇచ్చే సూర్యుడు మాట్లాడడు!
సువాసనను ఇచ్చే పువ్వు పలకదు!!
సమాజ హితం కోసం 
కవిత్వాన్ని ధారపోసే కవి ఆర్భాటం కోరడు!!!
~ శ్రీ రామ సమర్థ ~ 

నాసీమ రాయలసీమ..

నాసీమ రాయలసీమ.. రతనాల సీమ…
రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!! అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభోగం ఉంది..!! ఫ్యాక్షన్ అనేది కేవలం 1970 నుండి 1995 వరకు మాత్రమే. కానీ నేడు చాలావరకు ఫ్యాక్షన్ పోయింది..అందరికి చదువు విలువ తెలిసింది..!
మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం)
లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి
అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!!
కుందకుందాచార్యుడు (కొనకొండ్ల – గుంతకల్లు -అనంత పురం
తరిగొండ వెంగమాంబ (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, కంది మల్లయ పల్లి, కడప.!! 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త
వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం, కడప జిల్లా
మొల్ల (1440 -1530 –గోపవరం-కడప) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
గజ్జెల మల్లారెడ్డి (1925 ఆంకా ళమ్మ గూడూరు కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి
గువ్వల చెన్నడు (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో శతకాన్ని రచించాడు..!!
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి.
తరిమెల నాగిరెడ్డి(1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం)
B.N రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి, పులి వెందుల, కడప జిల్లా..!! బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
బి.నాగిరెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి..
కె.వి.రెడ్డి (జూలై 1, 1912 – 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాల ను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత..!!
టీ.జి. కమలాదేవి (1930 – 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి
జిక్కి (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం)
నీలం సంజీవరెడ్డి (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి
దామోదరం సంజీవయ్య (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి
మునెయ్య (కడప జిల్లా, దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు.
జిడ్డు కృష్ణమూర్తి (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా)
బళ్ళారి రాఘవ (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా)
శంకరంబాడి సుందరాచారి (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)
C.R Reddy (1880-1951 కట్టమంచి చిత్తూరు)
కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు..!!
గడియారం వేంకట శేషశాస్త్రి (1894 పెదముడియం కడప)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే ‘శ్రీశివభారతం’.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి (1926-2014 రాయదుర్గం అనంతపురం)
తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!
మధురాంతకం రాజారాం (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)
రాయలసీమ అంటే ఇది..!!
ఇలా ఎందఱో మహాను భావులు మరెందరో చరిత్రలో నిలచిన వారు. అందరూ కలగలిపిన నేల ఈ రాయలసీమ అంటే సీమ అంటే నాలుగు నాటు బాంబులు, 10 మంది ఫాక్షనిస్టు పది సుమోలు కాదు. ఇక్కడ ఆప్యాయతకి అద్భుతమైన ఆతిధ్యానికి మారుపేరు. ఇప్పుడు చెప్పండి రాయలసీమ అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి సీమ వైభోగం ఏంటో ఎలా ఉండేదో..తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి ఇది మా గడ్డ..ఇది మన రాయలసీమ.

KARTHIKA DEEPAM

KARTHIKA DEEPAM

శీతాకాలం లో చల్లదనానికి సూక్ష్మజీవులు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి.అవి వేడికి..ధ్వనికి నశిస్తాయి..చలికాలంలో వేడి తక్కువ ఉంటుంది కాబట్టి కార్తీకంలో

వీలైనన్ని
ఆవునెయ్యి..నువ్వుల నూనెతో దీపాలు పెట్టమని చెప్పారు..
హైందవ ధర్మంలో ఏమి చెప్పిన ఇటు ఇహంలోను...అటు పరంలోను ఉపయోగపడేలాగా చెప్పారు.అన్నిటికీ టిష్యూ పేపర్ల సంస్కృతి ఉన్న వారు అవి లేనప్పుడు వారి పూర్వికులు ఏమి చేశారో కదా???..గొర్రెల కి ఒక లక్షణం ఉంటుంది.. మొదటి గొర్రె ఎటు వెళితే మిగిలినవి కూడా గుడ్డిగా అదే దారి అనుసరిస్తాయి..మనం గొర్రెలం కాదు..వివేకం ఉన్న గోవులం..మంచి చెడు విభజించగలిగే హంసలం..
~ శ్రీమతి పూర్ణశ్రీ గారికి దన్యవాదములతో ~

POET JAYALAKSHMI

POET JAYALAKSHMI
My mother late Jayalakshmi 
Studied upto 3rd standard in Tamil . 
The only "vyakthi" to byheart " very very less known SAKAMMA YAKSHA GANA RAMAYANAM" telugu . If printed it will ve over 700 pages. Patalu, pathyalu, Tripadha, dailouges. .

She started writing at the age of 39 , telugu poems. 
Wait ..... in Tamil lipi, 
At tge age of 40/41 learnt l
Telugu letters and after Getting HIS Anugraha " that is in Ashta graha Koota 1962 at Ramanujachariyar Channadhi. lord Betarayaswami. Ante , svayam Sri venkateswarudu tirumalaundi Denkanipuram veta gani roopam dhalchi occhinadu. Beta in kannada vetagadu.
Mother crations are about 7000 poems ,750 keerthanas , suprabatgam, ashtakams , namavali in Sanskrit . .she completed Sri Ramavkathamrutham 1500 poems .in telugu and at tge age of 95. 
We released her dwadhasa sathamani mala on sept month this year.
~ Narasimhan Venkataramaiah ~
Manage