దత్తభక్తుడు గా ఉండటం ఎన్నో జన్మల అదృష్టం శ్రీగురుదత్తాత్రేయస్వామి వారు చాలా మహిమ కలిగిన స్వామివారు. ఆయనను పూజించినవాళ్ళు జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తిని దత్తస్వామి ఇస్తారు. దత్తనామం పలకండి. మానవజన్మ ధన్యం చేసుకోండి జయగురుదత్తా దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా !
Monday, 26 October 2020
దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.
Sunday, 25 October 2020
సర్వం దత్తమయం
తల్లి తండ్రీ దత్తుడే। బార్యా పిల్లలూ దత్తుడే। గురువు దైవం దత్తుడే। మిత్రుడు శత్రువు దత్తుడే। అయినవాళ్ళు కానివాళ్ళు దత్తుడే। తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు దత్తుడే। నువ్వు నేను దత్తుడే। తెలిసినది తెలియనది దత్తుడే।।। సర్వం దత్తమయం
సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు
సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు
Saturday, 24 October 2020
సమశ్లోకి నుంచి....
దత్త లీలా క్షేత్ర మహత్మ్యం....🙏🏻
సమశ్లోకి నుంచి......
శ్లో::- యద్గృహే2 సౌ కథారమ్యా శ్రావ్యతే పఠ్యతే సదా!
నందతే శ్రీయుతం తస్య సుశీలం విమలం కులమ్ ॥
శ్లో::- శ్రీగరోఃకృపయా తత్ర రోగపీడాది నైవచ!
సప్తాహశ్రవణా త్సర్వ పాశ(ప)నాశోఽప్య సంశయం॥
భావం::- 🙏🏻
ఏ గృహంలో దత్తాత్రేయుల వారి ప్రతిరూపమైన ఈ గురుచరిత్ర నిత్యం పారాయణ చేయబడుతూ ఉంటుందో, ఆ గృహంలో సిరిసంపదలు
కోకొల్లలుగా ఉంటాయి. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళంతా ప్రశాంత మనస్కులై, సుచరిత్రులై సుఖసంతోషాలతో తులదూగుతుంటారు. దత్తాత్రేయావతారు లైన శ్రీనరసింహసరస్వతీస్వామి
వారి అనుగ్రహం వల్ల రోగాలు, బాధలూ, గ్రహ పీడలు దూరంగా పారిపోతాయి. ఈ గ్రంథాన్ని దీక్షతో సప్తాహ పారాయణం చేస్తే సర్వపాపాలు భస్మీపటలమౌతాయి. కనుక ఈ పవిత్ర గ్రంథాన్ని శ్రద్ధా భక్తితో పూజించి, పఠించి, అమృత స్వరూపులు కండి.
జై గురు దేవ దత్త.🙏🏻
శ్రీ దుర్గ్ దత్త మందిరం,మాసోలి గ్రామం,గోవా.
దత్త లీలా క్షేత్ర మహత్యం
దత్త క్షేత్రాలు-150.
రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.
శ్రీ దుర్గ్ దత్త మందిరం,మాసోలి గ్రామం,గోవా.
ఈ అలయంలో విగ్రహం ప్రతిష్ఠ మన తెలుగు వారు అయిన బ్రహ్మానంద సరస్వతి(విజయవాడ వారు)వాసుదేవనంద సరస్వతి అనుమతి తో చేశారు.
ఈ మందిర విశేషాలు
1.సామాన్య భక్తులకు కూడా ఇక్కడ దైవ శక్తి ఉంది అని తెలుస్తుంది.
2.ఈ మందిరం లో గర్భగుడి, హారతి ఇచ్చే ప్రాంతం,ప్రదక్షిణలు చేసే ప్రాంతం,మార్గం భూమి నుంచి 2 అడుగులు ఎత్తుగా ఉంటుంది. మందిర ప్రాంగణం వెనుక వైపు లో ఔదుంబర్ వృక్షం,పురాతన దత్తాత్రేయ పాదుకలు ఉన్నాయి.
3.ఈ ఆలయంలో గర్భగుడి మొత్తం చెక్కలతో,సుందర శిల్పకళా వైభవంగా ఉంటుంది.
4.సుందరమైన ఏకముఖి దత్త,ఆరు చేతులతో ఎంతో అందంగా వున్నారు.
5.ఇక్కడ దత్తాత్రేయ స్వామి మంత్ర శక్తి,యోగశక్తి, నిఘాడ శక్తి కి అధిపతి. ఆలయ గర్భగుడి తలుపు లపై మానవుని లోని కుండలినీ శక్తి కి సంభందించిన ఆరు చక్రాలు చెక్కబడి ఉన్నాయి.వాటి గుండా దత్తాత్రేయ స్వామి ని.చూసి నప్పుడు మనకు కూడా స్వామి విగ్రహం లో అవే భాగాలు కనపడతాయి.ఇదొక అధ్భూతం.
దత్త స్వామి దగ్గరనాలుగు వేదాలు సూచించు 4 కుక్కలు బదులు బ్రహ్మ,అహం బ్రహ్మాస్మి,తత్వ మసి, అయమాత్మ బ్రహ్మ అని నాలుగు వేదాల సారం రాసి ఉంటుంది.
6.శంకర,దేవి,పాoడురంగడు,మాణిక్య ప్రభు,జ్ఞేనేశ్వర్,బాలవధూత ఇలా వారం రోజుల్లో ఒక్కోరోజు ఒక్కో అలంకరణ ఉంటుంది.
7.గురుచరిత్ర ని పరిశోధన/శుద్ధికరుణ జరిగిన ప్రాంతం ఇది.
జై గురు దత్త.
అత్రి మహర్షి స్థాపిత విరుపాక్ష సోమేశ్వర స్వామి.
దత్త లీలా క్షేత్ర మహత్యం
దత్త క్షేత్రాలు
Part-149
అత్రి మహర్షి స్థాపిత విరుపాక్ష సోమేశ్వర స్వామి.
అత్రి మహర్షి శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షం అయి అత్రి మహర్షి కి ఆత్మ లింగం(గోకర్ణం లో ఉన్న లాంటి లింగం)👌 ఇచ్చారు.ఈ లింగం ను అత్రి మహర్షి కృత యుగం లో మార్గ దర్శ ఈశ్వర లింగం ప్రతిష్ఠ చేశారు.ఈ లింగం పొద్దున్న రక్త వర్ణం,మధ్యాహ్నం స్పటిక, సాయంత్రం మధు వర్ణం(తేనె రంగు) లో మారుతుంది.ఈ లింగం కు శ్రీ కృష్ణ దేవరాయలు గుడి కట్టించారు.
అడ్రస్:శ్రీ విరుపాక్ష గ్రామం,శ్రీ విరుపాక్ష సోమేశ్వర స్వామి మందిరం,mulbagal కి 3 km దూరం,కొల్లార్ జిల్లా,కర్ణాటక.
