Saturday 18 August 2018

రియల్ హీరోలు ..దార్శనికులు

*****************************
రియల్ హీరోలు ..దార్శనికులు.
******************************
సోమనాత్ చటర్జీ ...పీ.వీ.నరసింహా రావు
నీతికి,ధర్మానికి,అత్యుత్తమ విలువలకు కట్టుబడి 
తమకు దక్కిన హోదాలతో దేశం హితం కోసము శ్రమించినవారు!!
వీరికి సొంత ఇళ్ళు లేదు.....బ్యాంకి బ్యాలన్సులు లేవు!
ఉన్నదంతా ప్రజల సంక్షేమంకోసమే ఊడ్చి ఇచ్చేశారు!!
వీరు ఉత్తమ పార్లమెంటేరియన్లు,స్పీకర్లే కాదు
దేశ పురోగతికోసం నిరంతరం శ్రమించిన మహానేతలు!!
దురదృష్టకర విషయం సొంత పార్టీలచేతే వీరు ఇరువురు గెంటివేయబడ్డారు!
ధర్మం ఇంకా ఉందికాబోలు ఆ రెండు పార్టీలూ ఇపుడు భూస్థాపితమయ్యాయి!!
విందులను,చిందులను,
విచ్చలవిడి విలాసాలను కోరుకునే నేటి మెజారిటీ సమాజం
ఇటువంటి మహానుభావులను విస్మరిస్తూనే ఉంటుంది.
అందుకే కాబోలు ఒక సందర్భం లో పీ.వీ.నరసింహారావు గారు అన్న మాటలు ఇక్కడ గుర్తుంచుకోవాలి - " ఈ భువిని మనం నందనవనంగా మార్చలేకపోవచ్చు, కానీ మనం నడుస్తున్న బాటలో కొంతలో కొంత కుళ్ళును కడిగివేస్తూ ఉండాలి.....కొన్ని ముళ్ళనైనా తొలగించగలగాలి"

No comments:

Post a Comment