Sunday, 25 April 2021

*** Let us pray to our mind remain devoted to values and morality ***

Excessive entertainment in the form of obscenity and vulgarity, meaningless movies, TV series, web series,...Studies from primary schools to college level  that ignore devotion and morality...Adults sticking to Facebook,Twitter and all in the  net craze for hours to hours..Falling in love with cricket without respecting our healthy domestic games..Evil trends that disrupt villages,dairy crops, livestock and pastures...Where are we going???Ignoring devotion, morality, and values... That is why calamities like corona are emerging and warning the humanity.

Can you deny this fact???

Let us put aside ego and science for a while. Let us think wisely.

Let us preserve our  rich  and ancient Indian traditions and values ​​that are ideal for the world.

Let us keep all evil desires and ego at a distance.Let us not distrub the tranquility of the Nature...Let us do good to ourselves,our children and our society.

Let us pray to our mind  to always remain devoted to values and morality.


Friday, 12 March 2021

Swami Krishnananda’s website

 Welcome to

Swami Krishnananda’s website

Here you will find ebooks and articles as well as audios and videos on yoga, meditation, philosophy, scriptural texts and related subjects.

This priceless wisdom is made commensurate to the needs of aspiring seekers and is brought to us by one of India's renowned Masters. Swami Krishnananda's style of delivering these spiritual teachings is engaging and renders spiritual learning and studies deeply fulfilling.

May the blessings of Swami Krishnananda be with us always.

Saturday, 9 January 2021

*** దత్త సుప్రభాతం ***

 


*** దత్త సుప్రభాతం ***

రచన:తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి తాత గారు.


శ్రీ శంకరోదిత గణాగుణవీత భాతః !

రామానుజోక్త సగుణ ప్రగుణాత్మ మూర్తే!

సత్తార్థ కాస్తి పదలక్ష్య మహావిభూతే!

దత్త ప్రభో త్వదుదయే మమ సుప్రబాతం ॥ 

భావము::శ్రీ శంకరాచార్యులచే బోధింపబడిన గుణములు, అగుణములు రెండు లేని పరమాత్మ స్వరూపము కలవాడా, రామానుజుని చేత బోధింపబడిన అనంతకళ్యాణ గుణములు కల , గుణాతీతమైన సగుణమూర్తి , అత్రి అనసూయల భక్తికి మెచ్చి దయతో వారికి పుత్రునిగా వచ్చితివి కనుక, దత్త ప్రభువనే బిరుదు కలవాడా, అందరిలో ఆత్మగా వెలుగొందుతున్న మహావైభవము కలవాడా, నా హృదయములో నీనెప్పుడూ వుండుటయే నాకు సుప్రభాతం.

# మాతృశ్రీ రాజ్యలక్ష్మి శ్రీనివాస్ గారికి దన్యవాదములతో 

Saturday, 12 December 2020

పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

 పాండవులు ఆయుధాలు జమ్మి పైనే ఎందుకు దాచారు?

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.

రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.

దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.

నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.

ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.

మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.

ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,

అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |

కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,

యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |

తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు

మరి ఇన్ని విశిష్ఠతలు ఉన్న జమ్మిచెట్టు ఎందుకు మాయం అవుతోంది?


జై శ్రీ రాం 

జై భారత్

🙏🌺🌺🌺🌺🌺🌺🌺🙏

Saturday, 28 November 2020

మహాత్ముల పరిచయం-.... పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

 


మహాత్ముల పరిచయం-386....

పద్మనాభచార్య స్వామి/పద్మపాద చార్య...🙏🏻

Rajyalakshmi Srinivas Boddupalli

ఉమాబాయి, రఘునాధ్ స్వామి దంపతులకు 1849 సంవత్సరం లో జన్మించారు. తుంగభద్ర నదీ తీరంలో దత్తాత్రేయ సాంప్రదాయం విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు.

త్రివేది బ్రహ్మణ కుటుంబం లో జన్మించిన వీరు చిన్నప్పుడు సంస్కృతంతో పాటు అనేక భాషలు మాట్లాడేవారు. తరువాత  గురువు అయిన యశ్వంత్ మహరాజ్ దగ్గర ఉపదేశం పొంది,దీక్ష  తీసుకున్నారు. గురువు ఆజ్ఞ పై 4 వర్ణాలవారికి అర్ధం అయ్యేలా ధర్మ బోధ చేయడం తన లక్ష్యం గా పెట్టు కున్నారు. వీరు 

జాతవేద మహవాక్య గ్రంధం,వేదాంత కౌముది,హరి పాట్,శుభేదా భజన మాలిక వంటి గ్రoధాలు అందరికి అర్ధం అయ్యేలా రచించి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ లలో  పర్యటించి ప్రజలకు జ్ఞానబోధ చేసారు.   వీరు ఉన్న చోట దత్త  మందిరాలు కట్టించేవారు. అక్కడ ఒక ఆచార వ్యవహారాలను, పద్ధతి ప్రవేశపెట్టి ప్రజలను ఉద్ధరించారు.

అనేకమందిని ఆధ్యాత్మిక చర్చలలో ఓడించి, ఆధ్యాత్మిక మార్గంలో కి తీసుకొచ్చారు. కష్ట జీవులలో ఎక్కువగా ఉంటూ,వారిని ధర్మ మార్గం వైపు నడుపుతూ మద్యపానం, ధూమ పానం,అనాగరిక పనులు మానిపించేవారు. వారిని దత్త భక్తులు చేసి,ఆధ్యాత్మికంగా మార్గ నిర్దేశం చేశారు. ఎక్కువగా తుంగభద్ర నదీ ప్రాంతంలో వీరిచే ఉద్ధరించబడిన సంప్రదాయం కనపడుతుంది.అందరితో "జయ సచ్చిదానంద" మంత్రంతో భజనలు చేయించేవారు. జ్ఞాన ప్రచారం చేసేవారు. ఇప్పటికే వీరు రాసిన భజనలు తుంగభద్ర నది తీర గ్రామాల్లో వినపడుతున్నాయి.చివరకు పాలగరణాజిక్ అనే  కొండ పై 26-జనవరిలో/1912 సంవత్సరం లో వేలాదిమందిని దత్త సంప్రదాయం లోకి మళ్ళించి సమాధి చెందారు.

శ్రీ గురుశరణం!నమో గురవే వాసుదేవాయ !

 దత్త లీలా క్షేత్ర మహత్యం

వాసుదేవ లీలామృతం

రచన:రంగావధూత

తెలుగు:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.


Part-67

నమో గురవే వాసుదేవాయ !

శ్రీ గురుశరణం!

ఒకసారి స్వామి వారు మాణ్గావ్ లోని నారోపంత్ ఉకిడవే తో మంచి గంధం చెక్కతో చిన్న మంచం దత్త స్వామి పవళింపు సేవ కోసం చేయించారు. అతను తయారుచేసి తీసుకొచ్చాడు. భక్తుల సమక్షంలో స్వామికి సమర్పించాడు. అందరూ అతనిని తయారుచేయడానికి ఎంత పైకం ఖర్చయింది. ఉకిడవే భగవంతుని కోసం, నేను లెక్కపెట్టలేదు అన్నాడు. స్వామి వారు కూర్చుని ఇదంతా వింటున్నారు. వెంటనే స్వామి వారు 23 రూపాయల 12అణాలు అన్నారు. అప్పుడు ఉకిడవే ఖర్చు లెక్కవేయగా సరిగా అంతే వుంది. అందరూ ఆశ్చర్యపోయారు.

దత్త దర్శనం:

 దత్త దర్శనం

తెలుగు సరళం:రాజ్యలక్ష్మి శ్రీనివాస్ బోడ్డుపల్లి.

నైమిశారణ్యం లో ఆధ్యాత్మిక ఉన్నతస్థితిలో ఉండే ఋషులు,మునులు ప్రజలకు కావలసిన ధర్మాలు,వ్రతాలు,వాటి నియమాలు తెలుపు సూతమహా ముని సమక్షంలో కూర్చుని శ్రీ వాసుదేవుని ధ్యానిస్తూ ఏకాగ్రచిత్తులు అయ్యారు. గాలి లేనప్పుడు ఉండే నీటి వలే కదలక  ఆధ్యాత్మిక తాదాప్యంలో ఉన్నప్పుడు పరిమళ సుగంధముల చిరుగాలి వీచింది. ఆ గాలితో పాటు సమస్త విశ్వమును ప్రకాశింప చేస్తూ కొన్ని కోట్ల సూర్యులు ఉదయించినట్లు తేజస్సు కనపడింది. తరువాత మునులకు మంగళ వాద్యముల ధ్వనులు వినపడ్డాయి. ఆ తేజస్సును చూడలేక మునులు కన్నులు మూసుకొని కూర్చుని, బంగారు గని దొరికినను చేజిక్కించుకోలేని దురదృష్టవoతునివలే ఎదురుగా కనపడుతున్నా కూడా చూడలేక పోతున్నామని ప్రార్ధిస్తున్నారు. అప్పుడు మేఘ ధ్వని వంటి వాక్కు వినపడి కళ్ళు తెరవమంది. వారికి అనంతుడు అను శ్రీ దత్తమూర్తి కనిపించారు. ఆ మునులు స్వామిని చూడగానే ఎలా ఉన్నారో స్తుతించారు.

1.దేవదేవం మహాత్మానం ! పరమానంద విగ్రహం!

విశ్వరూపం మహాభాగం! విచిత్రామలవర్చసమ్ !

భావము::🙏 దేవదేవుడు, మహాత్ముడు, ఆనందమూర్తి, విశ్వరూపుడు, చావు పుట్టుకలు లేక, సాటిలేని కీర్తిని కలిగినవాడు( మహాభాగుడు) అయినటువంటి దత్త దేవుని చూచిరి.🙏

2.తేజోమండలమధ్యస్థం ! ఉద్యంత మివ భాస్కరం!

త్రివర్ణం త్రియుగం త్రంశ్యం! త్రిగుణేశం త్రయీమయం॥

భావము:: తేజోమండలము లాగా వెలుగుతున్న, ఉదయించిన సూర్యుని వలె వున్నట్టి, నలుపు, తెలుపు, ఎరుపు  రంగులు కలిగి, ఆరు చేతులతో ఆవిర్భవించిన,బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశములు కలిగినట్టి, త్రిగుణాలుకు ఈశుడైనట్టి,ఋగ్, యజుర్వేద, సామవేద స్వరూపుడగు దత్త దేవుని చూసిరి🙏

3.ఆదిమధ్యాంతరహితం ! అనంతేతి చ విశ్రుతం!

బ్రహ్మోపేంద్రేశరూపం ! క్వచిదేకం పృథక్క్వ చ!

భావము:: ఆది, అంతము,నాశనము లేనివాడు, అనంతుడు,త్రిమూర్తి స్వరూపుడు, ఒక్కడే అనేక రూపములు ధరించినవాడు అయిన దత్తాత్రేయుని చూసిరి.🙏

4.రక్త చందన లిప్తాంగం! హంసవాహనమచ్యుతం

స్వరాలింగిత వామాంగం! ద్విభుజం ద్విజ దైవతం!

భావము::🙏 ఎర్రని మంచి గంధము పూయబడిన శరీరము కలిగి హంసవాహనమును ఎక్కిన బ్రహ్మ గానూ, శ్రీదేవి తో కూడిన విష్ణువు గాను, ఎడమభాగమున దేవితో కూడిన  శివుడు గాను, రెండు భుజములు కలవాడును, ద్విజులకు దేవతయైన దత్త స్వరూపమును చూసిరి.🙏


5.కమండలుం చ బిభ్రాణం! పూర్ణం దివ్యాంబునా సదా!

దివ్యపద్మాక్ష మాలాంచ! యజ్ఞసూత్రం తథైవ చ॥ 

భావము:: దివ్యమగు జలముతో నిండిన కమండలమును, దివ్య జపమాలను, యజ్ఞోపవీతమును ధరించినట్టి దత్త స్వామిని చూసిరి.🙏

6.చతుర్భుజం చతుర్వేదం ! చాతుర్హోత్రప్రవర్తకం !

ప్రజాపతిపతిందేవం ! జపంతంబ్రహ్మవాగ్యతం !

భావము:: నాలుగు భుజములు కలవాడును, నాలుగు వేదముల స్వరూపుడు, యజ్ఞప్రవర్తకుడు, బ్రహ్మకు ప్రభువైనట్టి వాడు, బ్రహ్మ జపమను చేయుచున్నట్టి ఆ దివ్యమైన దత్త స్వరూపమును మునులు చూసిరి.🙏