శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ||
ధవళ వర్ణ శరీరముతో,ఝటలు ధరించి,చేతిలోశూలము ధరించిన క్రుపాకరుడు,క్రుపాసింధువు సర్వ రోగములు హరించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
అస్య శ్రీ దత్తాత్రేయ స్రోత మహామంత్రస్య ,భగవాన్ నారద ఋషి:,,అనుషుత్ చందః,శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్దర్ద్యే స్తోత్ర పారాయణ వినియోగః.
నారద పురాణం లో భగవాన్ నారద మహర్షి రచించిన ఈ దత్తాత్రేయ మహామంత్రం పటించిన వారికి దత్తాత్రేయని,అనుగ్రహం,సాక్షాత్కారం కలుగుతుంది.
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧ ||
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧ ||
సృష్టి కర్తయు, అజ్ఞ్నాన స్థితిని నిర్మూలించు వాడు,భావ బంధముల విముక్తి కారకుడు అయిన శ్రీ దత్తాత్రే యునికి నమస్కారం
జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే || ౨ ||
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తుతే || ౨ ||
జనన మరణముల నుంచి విముక్తి ,మనస్సు దేహం పవిత్ర పరచువాడు,దయాముర్తి,దిక్కులనే వస్త్రాలు గా కలవాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౩ ||
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౩ ||
బంగారు వర్ణ శరీరము కలవాడు,సృష్టి కర్తయు, వేద శాస్త్రం లను అవపోసకుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము
హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౪ ||
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౪ ||
పొట్టి,పొడుగు,సన్నము,లావును,కుల గోత్ర రహితుడును,పంచ భూతములతో ప్రకాశించు వాడును అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౫ ||
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౫ ||
యజ్ఞ కార్యములలో కర్త,కర్మ,క్రియలే కాక యజ్ఞం నందు ప్రితికరుడై ,యజ్ఞ స్వరూపు సిద్ద్ధుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే || ౬ ||
సృష్టించిన బ్రహ్మ,స్థితి అయిన విష్ణు,లయకారుడు అయిన శివుడుగా త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౭ ||
జితేంద్రియజితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౭ ||
యోగ భోగ్యము లు కలిగి ,భోగి యు,యోగులలో యోగ్యుడయి ,జ్ఞానము నందు ఆసక్తి కలిగించు పంచేద్రియములు జయించిన వాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే || ౮ ||
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే || ౮ ||
దిక్కులనే అంబరముగా కలవాడు,దివ్యరూపమును ధరిచిన వాడు,పూర్ణ బ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
జంబుద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే || ౯ |
జయమానసతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే || ౯ |
భారతభూమిలో జంబుదీపం మాతాపురO లో నివసించి,జనులకు జయమును కలిగించు వాడును అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము .
భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే || ౧౦ ||
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే || ౧౦ ||
బంగారు భిక్ష పాత్రలో కరవీర గ్రామంలో గృహములలో అనేక రుచికర పదార్ధములను గ్రహించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.,
బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే ఆకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౧ ||
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౧ ||
బ్రహ్మజ్ఞాన౦ అనే ముద్ర తో ,ఆకాశము,భూమిని వస్త్రముగా కలవాడు,మూడు స్థితులలో ప్రజ్ఞతో వుండేవాడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౨ ||
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౨ ||
చిన్మయానందంలో పరబ్రహః స్వరూపుడై దేహ,విదేహ రూపుడు అవధూత అయిన, శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
సత్యరూపసదాచారసత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౩ ||
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౩ ||
సత్య స్వరూపుడు,సత్య ధర్మ సదాచార పరాయణుడు , సత్య ఆశ్రయుడు,అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౪ ||
యజ్ఞసూత్రధరబ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౪ ||
శూలము ఒక చేతిలో,గధ ఒక చేతిలో ధరించి ,వనములయండలి సుగంధ పుష్పములతో మాల ధరించిన వాడు,యజ్ఞ సూత్రము ను
ధరించు వాడు,ఆయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
ధరించు వాడు,ఆయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే || ౧౫ ||
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే || ౧౫ ||
నాశనము,వినాశనము లేనివాడు,పరాత్పరుడు ను,స్త్రోత్రములకు ముక్తి కలిగించు శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
దత్త విద్యాఢ్యలక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౬ ||
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే || ౧౬ ||
జ్ఞానం విద్య అనే పర శ్రేయస్సు,ధనము అనే ఇహ శ్రేయస్సు ,అత్మస్వరుపుడు,గుణ నిర్గుణుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే || ౧౭ ||
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తుతే || ౧౭ ||
కామ,క్రోధ లనే శత్రువులను నాశనము చేసి,జ్ఞానము,విజ్ఞానము లను అనుగ్రహించి సర్వ పాపములను శమింప జేయగల శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.
ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||
ఈ శ్రోత్రం పటించిన మహా దివ్య స్వరూపుడు అయిన దత్తాత్రేయదర్శనం,దత్తాత్రేయ అనుగ్రహం కలుగుతుందని నారద విరచిత నారదపురాణం లో నారద మహర్షి చే కిర్తిచ బడినది.తెలుగులో అనువదించ బడింది.
ముఖ్యంగా ఈ రోజు పసుపు రంగు పువ్వులను స్వామికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలను చేకూరుస్తాడు ...
దేవతలకు క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు అత్రి మహర్షి తన తపోబలంతో వారికి సాయపడతాడు. ఆయన సహధర్మచారిణి అయిన అనసూయాదేవి, పాపభారాన్ని మోయలేకపోతోన్న నదులకు, తన పాతివ్రత్య మహిమచే తిరిగి పవిత్రతను ప్రసాదిస్తుంది. అలాంటి పుణ్య దంపతులను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులు, ఆ దంపతుల అభీష్టం మేరకు 'మార్గశిర శుక్ల చతుర్దశి' రోజున వారి బిడ్డగా జన్మిస్తారు. ఒకే దేహంతో త్రిమూర్తులు తమని తాము అత్రికి దత్తత చేసుకున్న కారణంగా ఆ శిశువుకి 'దత్తాత్రేయుడు' అని అత్రి దంపతులు నామకరణం చేస్తారు.
మూడు తలలు ... ఆరుచేతులు గల ఆ శిశువు నుదుటపై ఊర్ధ్వ పుండ్రంతోను, మెడలోను ... జబ్బలకి ... ముంజేతులకి రుద్రాక్షలు ధరిస్తాడు. శంఖు చక్రాలు ... త్రిశూల ఢమరుకలు ... కమండలం జపమాల ధరించి మహా తేజస్సుతో వెలిగిపోసాగాడు. అలాంటి దత్తాత్రేయస్వామికి అవతార పరిసమాప్తి లేదు. యుగయుగాలుగా ఆయన వుంటూనే ఉంటాడు ... తన అవతారకార్యమైన జ్ఞాన .. యోగ విద్యలను భోదిస్తూ వుంటాడు. దత్తాత్రేయుడు వేదపురుషుడు అనే విషయాన్ని తెలియజెపుతూ నాలుగు వేదాలకు సంకేతంగా ఆయన పాదాల చెంత నాలుగు కుక్కలు కనిపిస్తుంటాయి.
దత్తాత్రేయుడి ఆదేశం మేరకు ఆయన భక్తులను అనుగ్రహించడానికి పక్కనే కామధేనువు వుంటుంది. ఏడుమార్లు స్మరించినంత మాత్రానే వెంటనే అనుగ్రహించే దత్తాత్రేయుడు, మేడిచెట్టు నీడలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ వుంటాడు. మానవాళికి జ్ఞానామృతాన్ని అందించే కార్యక్రమాన్ని ఆయన అవధూతల రూపంలో కొనసాగిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో శ్రీపాద శ్రీవల్లభులు ... శ్రీ నృసింహ సరస్వతి ... మాణిక్య ప్రభు మహారాజ్ ... అక్కల్ కోట మహారాజ్ ... శిరిడీ సాయిబాబా ఆయన అవతారాలుగా చెప్పబడ్డారు.
విశ్వగురువుగా ఉపనిషత్తులచే చెప్పబడుతోన్న దత్తాత్రేయుడు, ఆధ్యాత్మిక సాధనకు మూలమైన జ్ఞానము .. యోగ విద్యలను అందిస్తూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ రూపంలో పరీక్షిస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గితే, వాళ్ల జీవితం ధన్యమైనట్టే. బ్రహ్మకు మంత్ర విద్యను .. వశిష్ఠుడికి యోగవిద్యను ... ప్రహ్లాదుడికి ఆత్మవిద్యను ... పరశురాముడికి శ్రీ విద్యా మంత్రాన్ని దత్తాత్రేయుడు ఉపదేశించాడు. అంతే కాకుండా యదుమహారాజుకి ... హనుమంతుడికి ... సుబ్రహ్మణ్యుడికి ఆయన జ్ఞానభోద చేశాడు.
బలహీనుడైన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామి అనుగ్రహంతోనే వేయి చేతులను పొంది మహా పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు. ఇలా ఎంతో మంది మహర్షులకు ... మహారాజులకు ... సామాన్యులకు వారు కోరిన దానిని బట్టి జ్ఞానం, ఆరోగ్యం, ఆయుష్షు, సంతానం , సౌభాగ్యం , సంపదలు , మోక్షం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఆయన మార్గశిర శుక్ల చతుర్దశి రోజున జన్మించినప్పటికీ, 'మార్గశిర పౌర్ణమి' రోజున ఆయన జయంతిని జరుపుకోవడం దత్త సంప్రదాయంగా వస్తోంది.
అత్యంత విశిష్టమైన ఈ రోజున దత్త పీఠాలను దర్శించడం ... అక్కడి పాదుకలకు నమస్కరించడం ... మేడిచెట్టుకి ప్రదక్షిణలు చేయడం వలన విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి. గురుపరంపరలో గల అవధూతలు కొలువైన ఆలయాలను దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయి. ఈ రోజున దత్తాత్రేయ స్వామి ప్రతిమకు షోడశోపచార పూజ చేసి ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వలన, 'గురుగీత'... 'గురుచరిత్ర' పారాయణం చేయడం వలన సమస్త కోరికలు సిద్ధిస్తాయి
అవతారములు
దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:
దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. ఆ అవతారాలు:
కాలాగ్ని శమనుడు
యోగిరాజ వల్లభుడు
దత్తయోగిరాజు
జ్ఞానసాగరుడు
శ్యామకమలలోచనుడు
శ్యామకమలాలోచనడు
అత్రివర్ధుడు
సంస్కారహీన శివరూపుడు
ఆదిగురువు
దిగంబరదత్తుడు
విశ్వాంబరావధూత
దేవదేవుడు
దత్తావధూత
దిగంబరదేవుడు
కాలాగ్ని శమనుడు
సిద్ధరాజు
మాయాముక్తావధూత
లీలా విశ్వంభరుడు
యోగిరాజ వల్లభుడు
దత్తయోగిరాజు
జ్ఞానసాగరుడు
శ్యామకమలలోచనుడు
శ్యామకమలాలోచనడు
అత్రివర్ధుడు
సంస్కారహీన శివరూపుడు
ఆదిగురువు
దిగంబరదత్తుడు
విశ్వాంబరావధూత
దేవదేవుడు
దత్తావధూత
దిగంబరదేవుడు
కాలాగ్ని శమనుడు
సిద్ధరాజు
మాయాముక్తావధూత
లీలా విశ్వంభరుడు
సర్వేజనా సుఖినోభవంతు
From - Veda samskruti
No comments:
Post a Comment