Tuesday 26 March 2019

Facts about Temples in AP

తిరుమల వెంకన్నస్వామి భక్తులెవరో , ద్రోహులెవరో తేల్చుదాం రండి .
------------------------------ -----------------------------
-- ప్రజలందరూ ముఖ్యంగా ప్రతి హిందువూ తెలుసుకోవాల్సిన నిజాలు .
--ప్రతిఒక్క వైస్సార్సీపీ కార్యకర్త చదవండి , షేర్ చేయండి , ఇన్ఫర్మేషన్ భద్రంగా పెట్టుకొని తప్పుడు వాదనలని తిప్పికొట్టండి .
--గవర్నమెంట్ జీవోలు ఆధారాలతో సహా నిజాలు తెలుసుకోండి .
అధికారంలోకి రావటానికి నీచాణికి దిగజారి ఒక కుటుంభం మీద ఎంత బురదజల్లారో తెలుసుకోండి .ప్రజలని YS కుటుంబానికి దూరం చేయటానికి ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని వందలమందిని నియమించుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి మతాన్ని అడ్డంపెట్టుకొని విషప్రచారం చేశారు . నిజానికి హిందూ మతానికి YS చేసినంత మేలు భారతదేశం మొత్తం మీద ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయలేదు .
దేశంమొత్తం మీద హిందూ దేవాలయాల సమీపంలో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది ఒక్క YS మాత్రమే . తిరుమల అంటే మొత్తం ఏడుకొండలు అని ఏకంగా చట్టం చేసి జీవో జారీచేసింది కూడా ఒక్క YS మాత్రమే . ఇలాంటి చట్టాలు ఇంతవరకు ఆంధ్రాని పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు . కానీ YS తిరుమల వైభవం మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కట్టినమయిన చట్టాలతో పాటు చరిత్రలో ఎవ్వరూ చేయని మంచి పనులు చేసాడు .
ఏడుకొండలు వివాదం --స్థానిక సంస్థల ఎన్నికలు - చంద్రబాబే కుట్రకి మూలం
------------------------------------------------------------------
--తిరుమల అంటే ఏడుకొండలు కాదు రెండు కొండలేనని వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్ .
2004 లో వైయస్సార్ ముఖ్యమంత్రి కావటం చంద్రబాబు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు . మొదటి రోజు నుండే కుట్రలు పన్నటం మొదలుపెట్టాడు . తనకున్న మీడియా సపోర్ట్ తో వైయస్ మీద ఫ్యాక్క్షన్ ముద్ర వేస్తూ మరో వైపు కులమతాలని రెచ్చకొట్టాలని చూసాడు . దానిలో భాగంగా 2005 లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలని ఉపయోగించుకున్నాడు .
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకి నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు తన ప్రధాన అనుచరుడు జయచంద్ర నాయుడుతో హైకోర్టులో తిరుమలకి సంబంధించి ఒక కేసు వేయించాడు . రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటే కొండపైన తిరుమలకి కూడా పంచాయితీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టుని ఆశ్రయించాడు . జయచంద్రనాయుడు తన వాదనలకు మద్దతుగా ఎప్పుడో పూర్వకాలంలో ఉన్న చట్టాలని వెలికి తీసి
గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605, మరియు 4 నవంబర్ 1965 విడుదల చెసిన జి.ఒ నెంబర్ 1784 లని అడ్డం పెట్టుకొని ఆ జీవోల ప్రకారం ఆలయ పరిధి రెండు కొండలు మాత్రమేనని ఇప్పుడున్న తిరుమల ఊరు ఆ రెండు కొండల పరిధిలోకి రాదని కాబట్టి తిరుమలకి పంచాయితీ ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు కేసు వేసిన తన అనుచరుడితో కోర్టులో వాదించాడు . ఆనాటి కేసు పూర్వాపరాలు కింద లింక్లో చూడండి .
Tirumala Tirupati Devasthanams ... vs T. Venkata Padmavathamma And Ors. on 27 October, 2006
Tirumala Tirupati Devasthanams ... vs T. Venkata Padmavathamma And Ors. on 27 October, 2006
దానికి వైయస్సార్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమలలో ఎన్నికలు పెట్టటం దుర్మార్గమని తిరుమలలో రాజకీయాలు ప్రవేశించటానికి ఒప్పుకోనని దానికి అవసరమైతే చట్టసవరణలు చేసి తిరుమల పరిధిని ఏడు కొండలకి పెంచుతూ చట్టం చేస్తామని కోర్టులో వాదనలు వినిపించి ఆనాటి చంద్రబాబు కుట్రని అడ్డుకోవటం జరిగింది . ఆనాడు కోర్టులో వైయస్సార్ చెప్పినట్లుగానే వెంటనే జీవో నెంబర్ 747 ,746 లని విడుదల చేయటం జరిగింది . దయచేసి ఇప్పటికయినా నిజాలు తెలుసుకోండి .
పాత చట్టాలని అడ్డంపెట్టుకొని తిరుమల అంటే ఏడుకొండలు కాదని కేవలం రెండు కొండలేనని కాబట్టి తిరుమలలో ఎన్నికలు పెట్టాలని కుట్ర చేసింది చంద్రబాబు . చంద్రబాబు కుట్రలని తిప్పికొట్టటం కోసం పాత చట్టాలని తిరగరాసి మొత్తం ఏడుకొండలూ దేవుడివేనని అసలు రాష్ట్రమే మొత్తం వెంకన్నదేనని ధైర్యంగా కొత్త చట్టం చేసింది వైయస్సార్ . ఇప్పుడు మీరే చెప్పండి ఎవరు రెండు కొండలు అన్నారు ? ఎవరు ఏడు కొండలు అన్నారు ?
ఈ దిగువన ఉన్న జీవో లు చదవండి .
============================
TTD website లో కూడా అదే జీవోలుఉన్నాయి , ఇది కూడా నమ్మకపోతేవాళ్ళని ఆ వెంకన్న స్వామి మాత్రమేక్షమించగలడు .
దయచేసి ఫోటోలు చూడండి , ఇవిస్వయంగా TTD website లో ఉన్నవే . లింక్ లో కూడా చూసుకోవచ్చు .TTD వాళ్ళు ఒరిజినల్ కాపీలని స్కాన్ చేసిTTD website లో పెట్టారు .
******G.O.MS.No.747****** - తిరుమలలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రముఖ దేవాలయాల సమీపంలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవో . విశేషం ఏమిటంటే ఇలాంటో చట్టం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా లేదు . అది YS గొప్పతనం .
తిరుమల తోపాటు , TDT పరిధిలో నడిచే పది తీర్థాలతోపాటు గా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల మొత్తానికి ఇదే చట్టం వర్తిస్తుంది అని జీవోలోనే స్వయంగా చెప్పటం జరిగింది .
The Government hereby notify the following places of worship under Section 2(2) of the
said ordinance.
i) The Tirumala Divya Kshetram comprising all the seven sacred hills as defined in
G.O.Ms.No.746, Revenue (Endts.III) Department, dt. 02.06.2007.
ii) తిరుమల తిరుపతి దేవస్థానము పరిధి లో ఉన్న 10 తీర్థములు
1) శేషతీర్థం
2) కుమారధారతీర్థం
3)సనక సనందనతీర్థం
4) పాపవినాసతీర్థం
5) గోపాలతీర్థం
6) తుంబూర్తీర్థం
7) పసుపుతీర్థం
8)రామకృష్ణతీర్థం
9) భీమతీర్థం
10) కపిలతీర్థం
iii) The temples mentioned in the first schedule of Andhra Pradesh Charitable & Hindu
Religious Institutions and Endowments Act, 1987.
iv) శ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం
v) శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం
vi) శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, ద్వారకాతిరుమల
vii) శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ
viii)శ్రీ కాళహస్తీశ్వరస్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి
ix) శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీశైలం
x) శ్రీ శ్రీ వరసిద్ధి వినాకయస్వామి దేవస్థానం, కాణిపాకం
xi) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం
xii) శ్రీ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానం వేములవాడ
xiii) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, యాదగిరిగుట్ట
xiv) శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి
v) శ్రీ కూర్మస్వామి దేవస్థానం, శ్రీకూర్మం
xvi) శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవిల్లి
xvii) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ధర్మపురి
xviii) శ్రీ నరసింహస్వామి దేవస్థానం, అహోబిలమఠం
xix) శ్రీమహానందీశ్వరస్వామి దేవస్థానం, మహానంది
xx) శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కురువి
అదే రోజు జారీ చేసిన మరో జీవో
========================
****G.O.Ms.No.746*** - తిరుమలలో ఉన్న మొత్తం ఏడుకొండలు స్వామివారివే అని చట్టం చేస్తూ జారీచేసిన జీవో నెంబర్ 746 - తిరుమల మొత్తం7 కొండలు అని పేర్కొంటూ , ఆ కొండలపేర్లుతో సహా జీవోలో ఇచ్చారు .
అంతేకాకుండా ఈ జివోలొనే తిరుమలగొప్పతనం అంతా వివరించారు . ఈజీవోని పూర్తిగా చదవండి , YS గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ జీవోనిక్షుణ్ణంగా చదవండి .
తిరుమల గొప్పతనం వర్ణించలేనిదని , ఈలోకంలో సాటిరాగల మరో ఆలయంప్రపంచం మొత్తం లేదని పేర్కొన్నారు .
అంతేకాదు మానవ చరిత్ర అంత క్రీస్తుముందు , క్రీస్తు తరువాత అనిచెప్తున్నారాని , అసలు క్రీస్తుకి పూర్వమే వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదేవాలయమని ఇదే జీవోలో పేర్కొనటంజరిగింది .
నిజంగా ఈ జీవో మొత్తం చదువుతుంటే రాజశేఖరరెడ్డి గారికి తిరుమల మీద ఉన్నభక్తికి నా కళ్ళు చెమర్చాయి . ఇంత అపురూపంగా తిరుమల వెంకన్నని ప్రేమంచిన మనిషి మీద ఎన్ని అభాండాలు వేశారో , ఇంకావేస్తున్నారో తలచుకొంటే కళ్ళలో నీళ్ళువస్తున్నాయి .
***ఫోటోలు ***1 ,2 జీవో నెంబర్ 747
***ఫోటోలు 3,4,5,6 జీవో నెంబర్ 746
***ఫోటో 7 -- పురాతన వెయ్యి కాళ్ళ మండపం . శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలంటే తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేయాలని ఒక తాంత్రిక బాబా చెప్పాడని ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పండితులు మొత్తుకున్నా వినకుండా చంద్రబాబు పవిత్రమైన మండపాన్ని కూల్చేశాడు .
***వీడియో 1 -- ఆనాటి ఎన్టీఆర్ దేవదాయచట్టానికి తూట్లు పొడుస్తూ అర్చకులు కడుపు కొడితే దానిని వైయస్సార్ ఏ విధంగా తిరగరాసి బ్రాహ్మణులకి మేలు చేసాడో చిలుకూరి బాలాజీ అర్చకులు సౌందర్ రాజన్ గారి మాటల్లోనే వినండి .
***వీడియో 2 -- వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చటంతోపాటు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు కరుణాకరరెడ్డి మాటల్లో చూడండి .
***వీడియో 3 -- ఈనాడు తిరుమలలో జరుగుతున్న ఘోరాలపై రంగరాజన్ గారి మాటల్లోనే వినండి .
1600 కిలోమీటర్లు పాదయాత్రముగించగానే ఇంటికి కూడా వెళ్లకుండానేరుగా తిరుమలకి వెళ్ళాడు .
అయిదు సంవత్సరాల ముఖ్యమంత్రికాలంలో మొత్తం 35 సార్లు తిరుమలనిదర్శించాడు . అలాంటి మనిషి మీదఎన్ని అభాండాలు వేశారో దుర్మార్గులు .ముఖ్యమంత్రి హోదాలో తిరుమలని అత్యధిక సార్లు సందర్శించింది ఒక్క వైయస్సార్ మాత్రమే అది ఇప్పటికీ రికార్డ్ .
నిజమైన హిందువులందరూ నిజాలు ఇప్పటికయినా గ్రహించండి , మనకి ఎవరు మంచి చేశారో తెలుసుకోని అలాంటి వారిని ఆదరించి అండగా నిలబడటం మన కనీస ధర్మం .
నిజమైన YS అభిమానులందరూ ఈవిషయాన్ని విస్తృతంగా ప్రజాలలోకి తీసుకోని వెళ్లి అసలు నిజాలు తెలియచేయండి .
ఇదీ చరిత్ర - చెరిగిపోని నిజం
------------------------------ --------------—�-
అధికారం కోసం ఎంత నీచాణికి అయినా దిగజారిన వర్గాలు కళ్ల ముందు జరిగిన చరిత్రని కూడా వక్రీకరించి మీడియా మాయజాలంతో అబద్దాలని ప్రచారం చేశారు , ఇంకా చేస్తూనే ఉన్నారు .
అసలు హిందూ మతానికి ఎవరి హయాంలో మేలు జరిగిందో , ఒక్కసారి అంతరాత్మ సాక్షిగా పరిశీలించండి , నిజాలు మీకే తెలుస్తాయి .
YSR ముఖ్యమంత్రి కాగానే ఊరి బాగుకోసం పూజలు చేసే పూజారులు బాగుండాలని వారి కోసం ఎన్నో పధకాలు అమలు చేయటం జరిగింది .
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పూజారులకి నెల నెలా 5 వేలు జీతాలు ఇవ్వడం జరిగింది , అంతేకాకుండా ఆ జీతాలకి అదనంగా గుడిలో ధూప దీప నైవేద్యం కోసం ప్రతినెలా 3500 రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయానికి ఇవ్వటం జరిగింది .
పూజారులు పడుతున్న కష్టాలు చూసి అగ్రకులం అయినప్పటికీ నిబంధనలు పక్కనబెట్టి వాళ్ళకి ఆరోగ్య స్త్రీ పధకం వర్తింప చేయటం జరిగింది . అంతేకాదు వాళ్ళ పిల్లల అందరికి ఫీజు రిఎమ్బెర్సుమెంట్ ఇవ్వటం జరిగింది . చరిత్రలో ఏముఖ్యమంత్రి కూడా బ్రాహ్మణాలకి ఇన్ని మంచి పనులు చేయలేదు .
అంతేకాదు YSR హయాంలోనే తిరుమల వైభవో పేతంగా వెలిగి పోయింది . ఒక్కసారి తిరుమలలో YSR హయాంలో జరిగిన మంచి పనులు చూడండి .
-- వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు
-- వేదం చదువుకునే ప్రతి విద్యార్థికి 3 లక్షలు ఇచ్చి ప్రోత్సాహం .
-- నాదస్వరం , సన్నాయి , డోలు లాంటివి నేర్చుకొనే పిల్లలకి 1 లక్ష ఇచ్చి ప్రోత్సాహం .
--VIP దర్శనాలు పూర్తిగా రద్దు .
--వేయి కాళ్ళ మండపాన్ని కూల్చింది చంద్రబాబు అయితే
రాజశేఖర్ రెడ్డి హయాంలో మళ్ళీ వేయి కాళ్ళ మండపానికి తిరిగి శంకుస్థాపన .
--Pvrk ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ వేసి చినజీయర్ స్వామి లాంటి వాళ్ళ సమ్మతితో శంకుస్థాపన.
-- వెంకటేశ్వర భక్తీ ఛానల్ ప్రారంభం.
-- పోటు కార్మికుల అందరికి regularise , పెర్మినెంట్ ఉద్యోగం.
-- అర్చకుల జీతాలు పెంచటం.
--వేదం చదివే విద్యార్థులకి స్టయి ఫండ్
-- వైభవో త్సాలు , కళ్యాణోత్సవాలకి అంకురార్పణ
-- అన్నమయ్య 600 వ జయంతి పెద్ద ఎత్తున నిర్వహణ
--అనమయ్యకి 103 అడుగుల విగ్రహం .
-- రామాయణ , భారత భాగవతాలని తెలుగులోకి అనువదించి ఉచితంగా పుస్తాకాలు పంపిణీ చేసిందీ YSR హయాంలోనే.
-- దళిత గోవిందం పేరుతొ స్వామిని అందరికీ దగ్గరకి చేర్చి మతం మారిన దళితులని తిరిగి హిందూ మతంలోకి తీసుకోని రావటం .
ఇలాంటి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టి హిందూ మతానికి చరిత్రలో ఎవ్వరూ చేయని మంచి పనులు కేవలం 5 సంవత్సరాల కాలంలో YSR చేసి చూపించాడు .
అలాంటి YSR కుటుంభం మీద 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడని దుష్ప్రచారం చేసి , మీడియా మాయాజాలంతో కేవలం వోట్లు కోసమే పాకులాడే పచ్చ భక్తులు వాళ్లకి తోడూ అధికారం కోసం ఎంత నీచాణికి అయినా దిగజారే పచ్చని వర్గం అంతా కలిసి విష ప్రచారం చేశారు .
అయినప్పటికీ లబ్ధి పొందిన బ్రాహ్మణులే కాదు , వాళ్లకోసం పోరాటాలు చేసే సౌందర్య రాజన్ వంటి నిజమైన బ్రాహ్మణులు ఇప్పటికీ YSR చేసిన మేలును తలుచుకొంటూనే ఉంటారు . ఆరోజు కాంగ్రెస్ పార్టీని బ్రష్షుపట్టించటం లో భాగంగా అందుకోసం YSR మీద విష ప్రచారం కోసం దొంగ భక్తులు చంద్రబాబు బీనామిలతో కలిసి పన్నిన భయంకరమైన కుట్రలో భాగమే YSR కుటుంభం మీద చేసిన విషప్రచారం .
------------------------------ ------------------------------ --
గత చరిత్రని ఒక్కసారి పరిశీలించండి , అసలు నిజాలేమిటో తెలుసుకోండి
------------------------------ ------------------------------ ---
ఒక్కసారి చరిత్రని తరచి చూడండి , ఎవరి హయాంలో హిందూ మతానికి మేలు జరిగిందో పూర్తిగా నిజం తెలుసుకోండి .
కావాలంటే దీనికి ఎన్నో చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.ఎన్టీఆర్ ఆధ్వర్యంలో అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదట ప్రతీకారం తీర్చుకొంది బ్రహ్మణాల మీదే .
గ్రామాలలో ఉన్న కరణం వ్యవస్థని రద్దు చేసి బ్రాహ్మణుల పొట్ట మీద కొట్టాడు . అంతేకాదు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులాలలో ఎక్కువ మంది బ్రాహ్మణలే ఉన్నారని , వాళ్ళమీద కక్ష్యతోనే రిటైర్మెంట్ వయస్సుని 60 సంవత్సరాల నుండి 55 కి తగ్గించి ఆరకంగా దెబ్బకొట్టాడు .
అంతేకాదు హిందూ దేవాదాయ చట్టంలో మార్పులు తీసుకొచ్చి అప్పటివరకు సర్వ స్వతంత్రంగా ఉన్న దేవాలయాలని ప్రభుత్వ స్వాధీనం లోకి తెచ్చి , దేవాలయాలకి ఉన్న ఆస్థులని ప్రభుత్వ పరం చేసాడు . ఆ విధంగా ఆయా దేవాలయాల మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రాహ్మణ కుటుంభాలని రోడ్డు కి ఈడ్చాడు . అప్పటి నుండే అన్ని దేవాలయాలు ఏడోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి వెళ్లి ప్రభుత్వ చేతిలోకి వెళ్లి ఆఖరికి ఎక్కువ ఆలయాలు మూత పడటానికి కారణం అయింది .
ప్రభుత్వం దేవాలయాల కోసం దాతలు ఇచ్చిన పొలాలని మింగేసి అర్చకుల పొట్టకొట్టి , ఆలయాలని పట్టించుకోకుండా శిధిలావస్థకి కారణం అయ్యింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే .
ఆ తరువాత చంద్రబాబు హయాంలో ఇంకా ఘోరంగా దేవాలయాల ఆస్థులు అన్ని వేలం వేసి వచ్చిన నిధులని రోడ్లు అభివృది పేరుతొ పచ్చ చొక్కాల జేబులు నింపారు .
హిందూయిజం లేదు , కమ్యూనిజం లేదు ఉన్నదల్లా ఇక టూరిజమే అని ప్రచారం చేసాడు . అంతటితో ఆగకుండా ఆరోజు ఆగమ పండితుల హెచ్చరిస్తున్నా వినకుండా తిరుమలలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చి షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ చేసాడు . ఏ రోజు అర్చకుల బాధలు పట్టించుకొన్న పాపాన పోలేదు . కనీసం ఎన్నో ఆలయాలలో పూజలు కూడా జరగలేదు , అక్కడక్కడ భక్తులు ఇచ్చే కానుకలతో పూజారులు సొంతంగా నిర్హహించిన చోట్ల మాత్రమె ఆకొంచం అయినా మిగిలి ఉన్నాయి .
అంతేకాదు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాగానే పుష్కరాల పేరుతొ షాపింగ్ కాంప్లెక్స్ కోసం మొన్న విజయవాడలో 40 పురాతన ఆలయాలు కూల్చేసాడు . అంతేకాదు దాతలు ఇచ్చిన 1000 కోట్లు విలువ చేసే సదావర్తి ఆలయం భూముల్ని తన సొంత పార్టీ MLA కి కేవలం 4 కోట్లకి కట్టపెట్టాలని చూస్తున్నాడు .
నిజమైన హిందూమత ప్రేమికులారా ఒక్కసారి ఆలోచించండి , ఎవరు మేలు చేశారో ఎవరు ద్రోహం చేశారో ప్రచార మాయాజాలాన్ని పక్కన పెట్టి అంతరాత్మ సాక్షిగా ఆలోచించండి .
ఘోరం ఘోరం
--------------------------
అంత్యంత ఘోరమైన విషయంఏమిటంటే ఆరోజు తిరుమలలో వేదపండితుల ఎంత చెప్పినా వినకుండాఅక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టటం కోసమనితిరుమలలో వేల సంవత్సరాల నాటిఅంత్యంత ముఖ్యమైన వేయికాళ్ళమండపాన్ని కూల్చింది చంద్రబాబు . మొన్నటికి మొన్న విజయవాడలోముల్టీఫ్లెక్స్ సినిమా హాల్ కోసం మొత్తం 200 పురాతన ఆలయాలనికూల్చేసాడు .
ఈరోజు తిరుమలకి అన్యమతస్తుడిని చైర్మగా పెట్టి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నాడు . తన కొడుకు కోసం క్షుద్రపూజలకు ఒప్పుకోలేదని ఏకంగా ప్రధాన అర్చకులైన రమణదీక్షితులు గారిని తొలగించారు . స్వామీ వారి ఆభరణాలు ఎన్నో మాయమవుతున్నాయని , కొన్నింటిని పచ్చ ముట్టా విదేశాలలో వేలం వేయటానికి తరలించారని వార్తలు వస్తున్నాయి . పవిత్రమైన తిరుమలని ఈ రోజు తెలుగుదేశం దొంగలు అక్కడ మకాం వేసి బ్రష్టుపట్టిస్తున్నారు . వీళ్ళ అన్యాయాలకు ఎదురు తిరుగుతున్న అర్చకులుని నిర్ధాక్షిణ్యంగా ఇంటికి పంపుతున్నారు . ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవండి . పచ్చ ముఠా చేసే తప్పుడు ప్రచారం నుండి బయటపడండి . తిరుమలలో జరుగుతున్న ఘోరాలపై గొంతెత్తి పోరాడండి .
నిజమైన హిందువు నిజాల్ని తెలుసుకొని పదిమందికి తెలియచేయాలి .
సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్త ఈ పోస్టును చదవండి ,షేర్ చేయండి .ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోండి . ఎక్కడ మనమీద తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఈ ఆధారాలతో తిప్పికొట్టండి .

No comments:

Post a Comment