Friday, 8 March 2019

నా దేశపు మట్టి

నా దేశపు మట్టి సదా పరిమళమని చెప్పవోయ్ ||
ఏ దేశపు వాసనలకు లోబడమని చెప్పవోయ్ ||
నీ భువిపై మేధావుల చరిత నీకు తెలియనిదా ?
ధన కాంక్షకు తలవంచుతు ఒరగమని చెప్పవోయ్ ||
పుణ్య స్ధల పురాణాలు ప్రతిచెట్టున ఔషదాలు
అరుదైనవి సంస్కృతులు ఘనమేనని చెప్పవోయ్ ||
మన భారత వాకిళ్ళకు భక్తిగానె మ్రొక్కవోయి
బ్రతుకుదారి ఏదైనా గొప్పేనని చెప్పవోయ్ ||
మన గణితం చదరంగం మెళుకువలు మన సంపద
నిండైనది విజ్ఞానపు భారతమని చెప్పవోయ్ ||
అద్వితీయ కళలెన్నో ఆశ్చర్యపు నిధులెన్నో
సంప్రదాయ అభిరుచులు విలువేనని చెప్పవోయ్ ||
.........కొరటమద్ది వాణి

No comments:

Post a Comment