Sunday 31 March 2019

శ్రీ గురు రాఘవేంద్రస్వామి

శ్రీ గురు రాఘవేంద్రస్వామి
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.
ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి.
వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీ
బాయితో వీరికి వివాహమయింది.
వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు.
రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర
శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.
చరిత్ర ....
శ్రీ రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు , గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు.
యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది.
గురుసాంగత్యం..
సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకట నాధుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసమాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేథాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలు చిత్తశుద్ధీ గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో వున్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు పిలిచి “వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి” అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.
తనకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు.
గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై “నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు! అంతేకాదు వ్యతిరేక వర్గాల ఎదురు దాడులనుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ
ువు చెప్పినట్టు చెయ్యి” అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు.
సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి.
40 ఏళ్ల పవిత్ర జీవనం
సన్యాస దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుల వయసు 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్‌ రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్లు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు.
నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను స్థాయికి పెంచడం, సిద్ధి మస్సానెత్‌ఖాన్‌ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం (మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ గెజిటీర్‌ పునర్ముద్రణ 1916 చాప్టర్‌ 15 ఆదోని తాలూకా పేజీ 213) వంటివి జరిగాయి. మద్రాసు గవర్నర్‌ ధామస్‌ మన్రోకు రాఘవేందస్వ్రామి చూపిన అద్భుతాలు బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి.
బృందావనిలో జీవ సమాధి..
పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు.
శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం.
ఆయన ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన వుండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు. అప్పటికే అంతా ముగిసింది. అప్పణాచార్యులు కవి కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి. ఆ శ్లోకమీనాటికీ బృందావనంలో ప్రార్ధనలో పఠిస్తారు. అసమాన శేముషీదురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాటవాలకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో సన్మానించారు.
ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు.
ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడుగా వాసికెక్కాడు.
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు*
శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణ జన్ములు.ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవమవుతునే ఉన్నాయి.వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం .
శ్రీ స్వామి ని ఒక బ్రహ్మచారి చాలకాలంగా సేవించు కుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్ళి చేసుకోవాలనే ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకొని వెళదామని స్వామి చెంతకు వచ్చాడు.ఆసమయం లో శ్రీ రాఘ వేంద్రులు మృత్తికా శౌచము చేసుకుంటున్నారు. ఆమృత్తిక నే ఒక పిడికెడు యిచ్చి, పో ,నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ, మార్గమధ్యం లో ఒక రాత్రి ఒక కరణం గారి ఇంటిముందు పడుకున్నాడు.
అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు..” నాకు దారి ఇవ్వమని. నీ తలపాగ లో అగ్ని ఉందని, దాన్ని తీసిపారేయమని “అరవసాగాడు.. విషయం అర్ధమైన ఆ యువకుడు “ నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం “అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా. ఆ యువకుడు తలక్రింద పెట్టుకున్న , స్వామి ఇచ్చిన మృత్తిక ను కొద్ది గా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు భగభగ మండి మాడి మసై పోయాడు. ఈ గలాటా అంతా విని భైటకొచ్చిన ఇంటి యజమాని ,ఇన్నాళ్లు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆయువకుని ఆదరించి తన చెల్లెలినిచ్చి వివాహం చేశాడు. ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృత్తికామహిమలను గూర్చి, శిష్యులయెడ గురువుల అనుగ్రహాన్ని
ర్చి తెలియజేస్తున్నాయి.
మాంసపు ముక్కలను పట్టువస్త్రం తో కప్పి, కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయమయ్యేటట్టు ,మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి, క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరు గా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహం తో విద్వాంసుడై, మఠాన్ని నిర్మించి, సేవించి. తరించాడు.
పాము కాటుకు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు. తంజావూరు రాజ్యం లో కరువు కాటకాలు పెచ్చరిల్లడం తో ఆ రాజు కోరిక మేరకు రాజధాని లో ప్రవేశించి, ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతం లో వ్రాసి, అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ, జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్దికాలం లోనే కుండపోత గా వర్షాలు పడి, పంటలు పండి, క్షామనివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శ చే పిశాచాలు పారి పోతాయి.. మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి.
స్వామి సమాధిస్ధు లైన 150 సంవత్సరాలకు సమాథి నుండి లేచి వచ్చి, మంత్రాలయం ఆస్తులను పరిశీలించ వచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో తో స్వయం గా మాట్లాడి, అక్షతలిచ్చారట. అతడాశ్చర్య చకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండెడి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు. ఈ విషయం మద్రాసు రివ్యూ ఎనిమిదవ సంపుటము 280 వ పేజిలో వ్రాయబడింది. ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటీరు మొదటి సంపుటం లో 15 వ ప్రకరణం లో ఆదోని తాలూకా ను గురించి 213 –వ పేజీలో ప్రచురించబడింది.
శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది..శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ ...
పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే
ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః
*శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం*
మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే’’ అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.
అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు.
వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు. వెంకటనాధుని తెలివితేటలు గురించి అందరూ పొగిడేవారే. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంకటనాధుడు మధురలోని బావ లక్ష్మీనరసింహాచార్యులవద్ద వేదమంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు. తమ వంశపార్యపరంగా వచ్చే వీణావాయిద్యాయిని కూడ వేంకటనాధుడు నేర్చుకున్నారు. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోట్లోనే వుండేవి.
చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. వెంకటనాథుని జీవితంలో కడు దారిద్య్రం దాపురించింది. చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. సాటిలేని పండితునిగా వేంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు.
తన తరువాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు కలలో శ్రీ మూలారాములు సుదీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మద్వ సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలనిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించటానికి సిద్ధమై గురువు సుదీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. గురు సుదీంద్రతీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం, దిగ్విజయరాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శే్వతఛత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్ని కూడ శ్రీ రాఘవేంద్రతీర్థులకు అప్పగించారు. 1623లో గురువు సుదీంద్రతీర్థులు హంపీవద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మద్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక’ అనే గ్రంథానికి ‘ప్రకాశం’ అనే వివరణ వ్రాసారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక’ సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు.
స్వామిని పర్యవేక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డకప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పూవ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల’ గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు.
స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు.
*అందుకే ఆయన దేవుడయ్యాడు*
రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు, అంటే వేంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవాడు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం ... కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది.
అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చుని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు. భయపడుతూనే లోపలి వచ్చిన ఆ పిల్లవాడు, తనకి చదువుకోవాలని ఉందని చెబుతాడు. తన దగ్గరున్న శిష్యులకన్నా అ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్ధినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరనీ, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో, వాళ్లు తమ పిల్లలను పంపించడం మానేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది.
భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడనీ, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్రస్వామి, నేటికీ అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటాడు.
థామస్ మన్రో/శ్రీ గురు రాఘవేంద్ర స్వామి
క్రీ.శ. 1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీనపరుచుకోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో
దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా దారాళమైన ఆంగ్లంలో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాదారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట.తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృధువుగా పలికినా శాసించే స్వరం, దారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.
గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.
థామస్ మన్రో మద్రాసు గవర్నర్‌గా తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసినవారు కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.
చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు.
ఒక ఆంగ్లేయునికి మనదేశంలో ఇన్నివిధాలుగా దేవుని తార్కాణాలు లభించినాయి.
దైవం..ఆధ్యాత్మికత ~

Eternal Meena

Some artists just refuse to stop the hearts from throbbing ..For their tremendous works.
Remembering Meena Kumari ,an ever charismatic actress of Indian Screen ,better known as the Tragedy queen ,on her death anniversary today .From her many memorable portrayals and eloquent pics .besides her swan song 'Paakiza'.. I chose this pic.from 'Dil apna aur Preeti parai ' ..In which she portrayed the role of a Silent Nurse ..Who spoke through her eyes..A picture of intense inner storm and immense restrain ..
Who says poetry is only about words and rhymes ?!
Copyright Rupa 

Saturday 30 March 2019

Mubarak Begum Songs

Singer Mubarak begum in the film Hamari Yaad Aayegi (1961)

Song : Kabhi Tanhaiyon Mein Yoon hamari yaad aayegi..
Movie : Hamari Yaad Aayegi (1961)
Singer : Mubarak Begum
Lyricist : Kedar Nath Sharma
Music Director : Snehal Bhatkar
Actors : Ashok Sharma, Tanuja, Anand Kumar
_______________________
kabhi tanhaiyon mein yoon
hamaari yaad aayegi
kabhi tanhaiyon mein yoon
hamaari yaad aayegi

In your loneliness
you may sometimes be reminded of me
While it would be getting dark,
lightening may suddenly strike
________________________

Friday 29 March 2019

Souls in colour

~~Souls in colour~~
Who said that
Souls are in
black and white!
Your soul and mine
are a rainbow
and
a magical sunset !
~~AD~~

Me

~~Me~~
Inside me
There is a little girl
Innocent heart with 
great passion for life
she still strolls with
her mother
Together, they gather
wildflowers to decorate
the table in the kitchen
The outside of me
appears a lady
with no defeats
but with a heart
of tender
and hand in hand
She goes to the fields
with her daughter
~~AD~~

Tuesday 26 March 2019

Facts about Temples in AP

తిరుమల వెంకన్నస్వామి భక్తులెవరో , ద్రోహులెవరో తేల్చుదాం రండి .
------------------------------ -----------------------------
-- ప్రజలందరూ ముఖ్యంగా ప్రతి హిందువూ తెలుసుకోవాల్సిన నిజాలు .
--ప్రతిఒక్క వైస్సార్సీపీ కార్యకర్త చదవండి , షేర్ చేయండి , ఇన్ఫర్మేషన్ భద్రంగా పెట్టుకొని తప్పుడు వాదనలని తిప్పికొట్టండి .
--గవర్నమెంట్ జీవోలు ఆధారాలతో సహా నిజాలు తెలుసుకోండి .
అధికారంలోకి రావటానికి నీచాణికి దిగజారి ఒక కుటుంభం మీద ఎంత బురదజల్లారో తెలుసుకోండి .ప్రజలని YS కుటుంబానికి దూరం చేయటానికి ఒక ప్రణాళిక ప్రకారం కొన్ని వందలమందిని నియమించుకొని వందల కోట్లు ఖర్చు పెట్టి మతాన్ని అడ్డంపెట్టుకొని విషప్రచారం చేశారు . నిజానికి హిందూ మతానికి YS చేసినంత మేలు భారతదేశం మొత్తం మీద ఇప్పటికీ ఏ ముఖ్యమంత్రి చేయలేదు .
దేశంమొత్తం మీద హిందూ దేవాలయాల సమీపంలో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది ఒక్క YS మాత్రమే . తిరుమల అంటే మొత్తం ఏడుకొండలు అని ఏకంగా చట్టం చేసి జీవో జారీచేసింది కూడా ఒక్క YS మాత్రమే . ఇలాంటి చట్టాలు ఇంతవరకు ఆంధ్రాని పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు . కానీ YS తిరుమల వైభవం మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కట్టినమయిన చట్టాలతో పాటు చరిత్రలో ఎవ్వరూ చేయని మంచి పనులు చేసాడు .
ఏడుకొండలు వివాదం --స్థానిక సంస్థల ఎన్నికలు - చంద్రబాబే కుట్రకి మూలం
------------------------------------------------------------------
--తిరుమల అంటే ఏడుకొండలు కాదు రెండు కొండలేనని వాదనలు వినిపించిన చంద్రబాబు లాయర్ .
2004 లో వైయస్సార్ ముఖ్యమంత్రి కావటం చంద్రబాబు అస్సలు జీర్ణించుకోలేకపోయాడు . మొదటి రోజు నుండే కుట్రలు పన్నటం మొదలుపెట్టాడు . తనకున్న మీడియా సపోర్ట్ తో వైయస్ మీద ఫ్యాక్క్షన్ ముద్ర వేస్తూ మరో వైపు కులమతాలని రెచ్చకొట్టాలని చూసాడు . దానిలో భాగంగా 2005 లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలని ఉపయోగించుకున్నాడు .
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకి నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు తన ప్రధాన అనుచరుడు జయచంద్ర నాయుడుతో హైకోర్టులో తిరుమలకి సంబంధించి ఒక కేసు వేయించాడు . రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటే కొండపైన తిరుమలకి కూడా పంచాయితీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టుని ఆశ్రయించాడు . జయచంద్రనాయుడు తన వాదనలకు మద్దతుగా ఎప్పుడో పూర్వకాలంలో ఉన్న చట్టాలని వెలికి తీసి
గతం లొ 1975 డిసెంబర్ 2 న విడుదల చెసిన జి.ఒ 1605, మరియు 4 నవంబర్ 1965 విడుదల చెసిన జి.ఒ నెంబర్ 1784 లని అడ్డం పెట్టుకొని ఆ జీవోల ప్రకారం ఆలయ పరిధి రెండు కొండలు మాత్రమేనని ఇప్పుడున్న తిరుమల ఊరు ఆ రెండు కొండల పరిధిలోకి రాదని కాబట్టి తిరుమలకి పంచాయితీ ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు కేసు వేసిన తన అనుచరుడితో కోర్టులో వాదించాడు . ఆనాటి కేసు పూర్వాపరాలు కింద లింక్లో చూడండి .
Tirumala Tirupati Devasthanams ... vs T. Venkata Padmavathamma And Ors. on 27 October, 2006
Tirumala Tirupati Devasthanams ... vs T. Venkata Padmavathamma And Ors. on 27 October, 2006
దానికి వైయస్సార్ ప్రభుత్వం పవిత్రమైన తిరుమలలో ఎన్నికలు పెట్టటం దుర్మార్గమని తిరుమలలో రాజకీయాలు ప్రవేశించటానికి ఒప్పుకోనని దానికి అవసరమైతే చట్టసవరణలు చేసి తిరుమల పరిధిని ఏడు కొండలకి పెంచుతూ చట్టం చేస్తామని కోర్టులో వాదనలు వినిపించి ఆనాటి చంద్రబాబు కుట్రని అడ్డుకోవటం జరిగింది . ఆనాడు కోర్టులో వైయస్సార్ చెప్పినట్లుగానే వెంటనే జీవో నెంబర్ 747 ,746 లని విడుదల చేయటం జరిగింది . దయచేసి ఇప్పటికయినా నిజాలు తెలుసుకోండి .
పాత చట్టాలని అడ్డంపెట్టుకొని తిరుమల అంటే ఏడుకొండలు కాదని కేవలం రెండు కొండలేనని కాబట్టి తిరుమలలో ఎన్నికలు పెట్టాలని కుట్ర చేసింది చంద్రబాబు . చంద్రబాబు కుట్రలని తిప్పికొట్టటం కోసం పాత చట్టాలని తిరగరాసి మొత్తం ఏడుకొండలూ దేవుడివేనని అసలు రాష్ట్రమే మొత్తం వెంకన్నదేనని ధైర్యంగా కొత్త చట్టం చేసింది వైయస్సార్ . ఇప్పుడు మీరే చెప్పండి ఎవరు రెండు కొండలు అన్నారు ? ఎవరు ఏడు కొండలు అన్నారు ?
ఈ దిగువన ఉన్న జీవో లు చదవండి .
============================
TTD website లో కూడా అదే జీవోలుఉన్నాయి , ఇది కూడా నమ్మకపోతేవాళ్ళని ఆ వెంకన్న స్వామి మాత్రమేక్షమించగలడు .
దయచేసి ఫోటోలు చూడండి , ఇవిస్వయంగా TTD website లో ఉన్నవే . లింక్ లో కూడా చూసుకోవచ్చు .TTD వాళ్ళు ఒరిజినల్ కాపీలని స్కాన్ చేసిTTD website లో పెట్టారు .
******G.O.MS.No.747****** - తిరుమలలోనే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రముఖ దేవాలయాల సమీపంలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ జారీ చేసిన జీవో . విశేషం ఏమిటంటే ఇలాంటో చట్టం బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా లేదు . అది YS గొప్పతనం .
తిరుమల తోపాటు , TDT పరిధిలో నడిచే పది తీర్థాలతోపాటు గా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల మొత్తానికి ఇదే చట్టం వర్తిస్తుంది అని జీవోలోనే స్వయంగా చెప్పటం జరిగింది .
The Government hereby notify the following places of worship under Section 2(2) of the
said ordinance.
i) The Tirumala Divya Kshetram comprising all the seven sacred hills as defined in
G.O.Ms.No.746, Revenue (Endts.III) Department, dt. 02.06.2007.
ii) తిరుమల తిరుపతి దేవస్థానము పరిధి లో ఉన్న 10 తీర్థములు
1) శేషతీర్థం
2) కుమారధారతీర్థం
3)సనక సనందనతీర్థం
4) పాపవినాసతీర్థం
5) గోపాలతీర్థం
6) తుంబూర్తీర్థం
7) పసుపుతీర్థం
8)రామకృష్ణతీర్థం
9) భీమతీర్థం
10) కపిలతీర్థం
iii) The temples mentioned in the first schedule of Andhra Pradesh Charitable & Hindu
Religious Institutions and Endowments Act, 1987.
iv) శ్రీవరాహ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం
v) శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం
vi) శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం, ద్వారకాతిరుమల
vii) శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, విజయవాడ
viii)శ్రీ కాళహస్తీశ్వరస్వామి దేవస్థానం, శ్రీకాళహస్తి
ix) శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం, శ్రీశైలం
x) శ్రీ శ్రీ వరసిద్ధి వినాకయస్వామి దేవస్థానం, కాణిపాకం
xi) శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం, భద్రాచలం
xii) శ్రీ రాజ రాజేశ్వరస్వామి దేవస్థానం వేములవాడ
xiii) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, యాదగిరిగుట్ట
xiv) శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి
v) శ్రీ కూర్మస్వామి దేవస్థానం, శ్రీకూర్మం
xvi) శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవిల్లి
xvii) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, ధర్మపురి
xviii) శ్రీ నరసింహస్వామి దేవస్థానం, అహోబిలమఠం
xix) శ్రీమహానందీశ్వరస్వామి దేవస్థానం, మహానంది
xx) శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం, కురువి
అదే రోజు జారీ చేసిన మరో జీవో
========================
****G.O.Ms.No.746*** - తిరుమలలో ఉన్న మొత్తం ఏడుకొండలు స్వామివారివే అని చట్టం చేస్తూ జారీచేసిన జీవో నెంబర్ 746 - తిరుమల మొత్తం7 కొండలు అని పేర్కొంటూ , ఆ కొండలపేర్లుతో సహా జీవోలో ఇచ్చారు .
అంతేకాకుండా ఈ జివోలొనే తిరుమలగొప్పతనం అంతా వివరించారు . ఈజీవోని పూర్తిగా చదవండి , YS గొప్పతనం తెలుసుకోవాలంటే ఈ జీవోనిక్షుణ్ణంగా చదవండి .
తిరుమల గొప్పతనం వర్ణించలేనిదని , ఈలోకంలో సాటిరాగల మరో ఆలయంప్రపంచం మొత్తం లేదని పేర్కొన్నారు .
అంతేకాదు మానవ చరిత్ర అంత క్రీస్తుముందు , క్రీస్తు తరువాత అనిచెప్తున్నారాని , అసలు క్రీస్తుకి పూర్వమే వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదేవాలయమని ఇదే జీవోలో పేర్కొనటంజరిగింది .
నిజంగా ఈ జీవో మొత్తం చదువుతుంటే రాజశేఖరరెడ్డి గారికి తిరుమల మీద ఉన్నభక్తికి నా కళ్ళు చెమర్చాయి . ఇంత అపురూపంగా తిరుమల వెంకన్నని ప్రేమంచిన మనిషి మీద ఎన్ని అభాండాలు వేశారో , ఇంకావేస్తున్నారో తలచుకొంటే కళ్ళలో నీళ్ళువస్తున్నాయి .
***ఫోటోలు ***1 ,2 జీవో నెంబర్ 747
***ఫోటోలు 3,4,5,6 జీవో నెంబర్ 746
***ఫోటో 7 -- పురాతన వెయ్యి కాళ్ళ మండపం . శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాలంటే తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేయాలని ఒక తాంత్రిక బాబా చెప్పాడని ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా పండితులు మొత్తుకున్నా వినకుండా చంద్రబాబు పవిత్రమైన మండపాన్ని కూల్చేశాడు .
***వీడియో 1 -- ఆనాటి ఎన్టీఆర్ దేవదాయచట్టానికి తూట్లు పొడుస్తూ అర్చకులు కడుపు కొడితే దానిని వైయస్సార్ ఏ విధంగా తిరగరాసి బ్రాహ్మణులకి మేలు చేసాడో చిలుకూరి బాలాజీ అర్చకులు సౌందర్ రాజన్ గారి మాటల్లోనే వినండి .
***వీడియో 2 -- వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చటంతోపాటు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు కరుణాకరరెడ్డి మాటల్లో చూడండి .
***వీడియో 3 -- ఈనాడు తిరుమలలో జరుగుతున్న ఘోరాలపై రంగరాజన్ గారి మాటల్లోనే వినండి .
1600 కిలోమీటర్లు పాదయాత్రముగించగానే ఇంటికి కూడా వెళ్లకుండానేరుగా తిరుమలకి వెళ్ళాడు .
అయిదు సంవత్సరాల ముఖ్యమంత్రికాలంలో మొత్తం 35 సార్లు తిరుమలనిదర్శించాడు . అలాంటి మనిషి మీదఎన్ని అభాండాలు వేశారో దుర్మార్గులు .ముఖ్యమంత్రి హోదాలో తిరుమలని అత్యధిక సార్లు సందర్శించింది ఒక్క వైయస్సార్ మాత్రమే అది ఇప్పటికీ రికార్డ్ .
నిజమైన హిందువులందరూ నిజాలు ఇప్పటికయినా గ్రహించండి , మనకి ఎవరు మంచి చేశారో తెలుసుకోని అలాంటి వారిని ఆదరించి అండగా నిలబడటం మన కనీస ధర్మం .
నిజమైన YS అభిమానులందరూ ఈవిషయాన్ని విస్తృతంగా ప్రజాలలోకి తీసుకోని వెళ్లి అసలు నిజాలు తెలియచేయండి .
ఇదీ చరిత్ర - చెరిగిపోని నిజం
------------------------------ --------------—�-
అధికారం కోసం ఎంత నీచాణికి అయినా దిగజారిన వర్గాలు కళ్ల ముందు జరిగిన చరిత్రని కూడా వక్రీకరించి మీడియా మాయజాలంతో అబద్దాలని ప్రచారం చేశారు , ఇంకా చేస్తూనే ఉన్నారు .
అసలు హిందూ మతానికి ఎవరి హయాంలో మేలు జరిగిందో , ఒక్కసారి అంతరాత్మ సాక్షిగా పరిశీలించండి , నిజాలు మీకే తెలుస్తాయి .
YSR ముఖ్యమంత్రి కాగానే ఊరి బాగుకోసం పూజలు చేసే పూజారులు బాగుండాలని వారి కోసం ఎన్నో పధకాలు అమలు చేయటం జరిగింది .
చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పూజారులకి నెల నెలా 5 వేలు జీతాలు ఇవ్వడం జరిగింది , అంతేకాకుండా ఆ జీతాలకి అదనంగా గుడిలో ధూప దీప నైవేద్యం కోసం ప్రతినెలా 3500 రూపాయలు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయానికి ఇవ్వటం జరిగింది .
పూజారులు పడుతున్న కష్టాలు చూసి అగ్రకులం అయినప్పటికీ నిబంధనలు పక్కనబెట్టి వాళ్ళకి ఆరోగ్య స్త్రీ పధకం వర్తింప చేయటం జరిగింది . అంతేకాదు వాళ్ళ పిల్లల అందరికి ఫీజు రిఎమ్బెర్సుమెంట్ ఇవ్వటం జరిగింది . చరిత్రలో ఏముఖ్యమంత్రి కూడా బ్రాహ్మణాలకి ఇన్ని మంచి పనులు చేయలేదు .
అంతేకాదు YSR హయాంలోనే తిరుమల వైభవో పేతంగా వెలిగి పోయింది . ఒక్కసారి తిరుమలలో YSR హయాంలో జరిగిన మంచి పనులు చూడండి .
-- వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు
-- వేదం చదువుకునే ప్రతి విద్యార్థికి 3 లక్షలు ఇచ్చి ప్రోత్సాహం .
-- నాదస్వరం , సన్నాయి , డోలు లాంటివి నేర్చుకొనే పిల్లలకి 1 లక్ష ఇచ్చి ప్రోత్సాహం .
--VIP దర్శనాలు పూర్తిగా రద్దు .
--వేయి కాళ్ళ మండపాన్ని కూల్చింది చంద్రబాబు అయితే
రాజశేఖర్ రెడ్డి హయాంలో మళ్ళీ వేయి కాళ్ళ మండపానికి తిరిగి శంకుస్థాపన .
--Pvrk ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ వేసి చినజీయర్ స్వామి లాంటి వాళ్ళ సమ్మతితో శంకుస్థాపన.
-- వెంకటేశ్వర భక్తీ ఛానల్ ప్రారంభం.
-- పోటు కార్మికుల అందరికి regularise , పెర్మినెంట్ ఉద్యోగం.
-- అర్చకుల జీతాలు పెంచటం.
--వేదం చదివే విద్యార్థులకి స్టయి ఫండ్
-- వైభవో త్సాలు , కళ్యాణోత్సవాలకి అంకురార్పణ
-- అన్నమయ్య 600 వ జయంతి పెద్ద ఎత్తున నిర్వహణ
--అనమయ్యకి 103 అడుగుల విగ్రహం .
-- రామాయణ , భారత భాగవతాలని తెలుగులోకి అనువదించి ఉచితంగా పుస్తాకాలు పంపిణీ చేసిందీ YSR హయాంలోనే.
-- దళిత గోవిందం పేరుతొ స్వామిని అందరికీ దగ్గరకి చేర్చి మతం మారిన దళితులని తిరిగి హిందూ మతంలోకి తీసుకోని రావటం .
ఇలాంటి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టి హిందూ మతానికి చరిత్రలో ఎవ్వరూ చేయని మంచి పనులు కేవలం 5 సంవత్సరాల కాలంలో YSR చేసి చూపించాడు .
అలాంటి YSR కుటుంభం మీద 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడని దుష్ప్రచారం చేసి , మీడియా మాయాజాలంతో కేవలం వోట్లు కోసమే పాకులాడే పచ్చ భక్తులు వాళ్లకి తోడూ అధికారం కోసం ఎంత నీచాణికి అయినా దిగజారే పచ్చని వర్గం అంతా కలిసి విష ప్రచారం చేశారు .
అయినప్పటికీ లబ్ధి పొందిన బ్రాహ్మణులే కాదు , వాళ్లకోసం పోరాటాలు చేసే సౌందర్య రాజన్ వంటి నిజమైన బ్రాహ్మణులు ఇప్పటికీ YSR చేసిన మేలును తలుచుకొంటూనే ఉంటారు . ఆరోజు కాంగ్రెస్ పార్టీని బ్రష్షుపట్టించటం లో భాగంగా అందుకోసం YSR మీద విష ప్రచారం కోసం దొంగ భక్తులు చంద్రబాబు బీనామిలతో కలిసి పన్నిన భయంకరమైన కుట్రలో భాగమే YSR కుటుంభం మీద చేసిన విషప్రచారం .
------------------------------ ------------------------------ --
గత చరిత్రని ఒక్కసారి పరిశీలించండి , అసలు నిజాలేమిటో తెలుసుకోండి
------------------------------ ------------------------------ ---
ఒక్కసారి చరిత్రని తరచి చూడండి , ఎవరి హయాంలో హిందూ మతానికి మేలు జరిగిందో పూర్తిగా నిజం తెలుసుకోండి .
కావాలంటే దీనికి ఎన్నో చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.ఎన్టీఆర్ ఆధ్వర్యంలో అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదట ప్రతీకారం తీర్చుకొంది బ్రహ్మణాల మీదే .
గ్రామాలలో ఉన్న కరణం వ్యవస్థని రద్దు చేసి బ్రాహ్మణుల పొట్ట మీద కొట్టాడు . అంతేకాదు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులాలలో ఎక్కువ మంది బ్రాహ్మణలే ఉన్నారని , వాళ్ళమీద కక్ష్యతోనే రిటైర్మెంట్ వయస్సుని 60 సంవత్సరాల నుండి 55 కి తగ్గించి ఆరకంగా దెబ్బకొట్టాడు .
అంతేకాదు హిందూ దేవాదాయ చట్టంలో మార్పులు తీసుకొచ్చి అప్పటివరకు సర్వ స్వతంత్రంగా ఉన్న దేవాలయాలని ప్రభుత్వ స్వాధీనం లోకి తెచ్చి , దేవాలయాలకి ఉన్న ఆస్థులని ప్రభుత్వ పరం చేసాడు . ఆ విధంగా ఆయా దేవాలయాల మీద ఆధారపడి బ్రతుకుతున్న బ్రాహ్మణ కుటుంభాలని రోడ్డు కి ఈడ్చాడు . అప్పటి నుండే అన్ని దేవాలయాలు ఏడోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి వెళ్లి ప్రభుత్వ చేతిలోకి వెళ్లి ఆఖరికి ఎక్కువ ఆలయాలు మూత పడటానికి కారణం అయింది .
ప్రభుత్వం దేవాలయాల కోసం దాతలు ఇచ్చిన పొలాలని మింగేసి అర్చకుల పొట్టకొట్టి , ఆలయాలని పట్టించుకోకుండా శిధిలావస్థకి కారణం అయ్యింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమే .
ఆ తరువాత చంద్రబాబు హయాంలో ఇంకా ఘోరంగా దేవాలయాల ఆస్థులు అన్ని వేలం వేసి వచ్చిన నిధులని రోడ్లు అభివృది పేరుతొ పచ్చ చొక్కాల జేబులు నింపారు .
హిందూయిజం లేదు , కమ్యూనిజం లేదు ఉన్నదల్లా ఇక టూరిజమే అని ప్రచారం చేసాడు . అంతటితో ఆగకుండా ఆరోజు ఆగమ పండితుల హెచ్చరిస్తున్నా వినకుండా తిరుమలలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చి షాపింగ్ మాల్ కట్టాలని ప్లాన్ చేసాడు . ఏ రోజు అర్చకుల బాధలు పట్టించుకొన్న పాపాన పోలేదు . కనీసం ఎన్నో ఆలయాలలో పూజలు కూడా జరగలేదు , అక్కడక్కడ భక్తులు ఇచ్చే కానుకలతో పూజారులు సొంతంగా నిర్హహించిన చోట్ల మాత్రమె ఆకొంచం అయినా మిగిలి ఉన్నాయి .
అంతేకాదు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి రాగానే పుష్కరాల పేరుతొ షాపింగ్ కాంప్లెక్స్ కోసం మొన్న విజయవాడలో 40 పురాతన ఆలయాలు కూల్చేసాడు . అంతేకాదు దాతలు ఇచ్చిన 1000 కోట్లు విలువ చేసే సదావర్తి ఆలయం భూముల్ని తన సొంత పార్టీ MLA కి కేవలం 4 కోట్లకి కట్టపెట్టాలని చూస్తున్నాడు .
నిజమైన హిందూమత ప్రేమికులారా ఒక్కసారి ఆలోచించండి , ఎవరు మేలు చేశారో ఎవరు ద్రోహం చేశారో ప్రచార మాయాజాలాన్ని పక్కన పెట్టి అంతరాత్మ సాక్షిగా ఆలోచించండి .
ఘోరం ఘోరం
--------------------------
అంత్యంత ఘోరమైన విషయంఏమిటంటే ఆరోజు తిరుమలలో వేదపండితుల ఎంత చెప్పినా వినకుండాఅక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టటం కోసమనితిరుమలలో వేల సంవత్సరాల నాటిఅంత్యంత ముఖ్యమైన వేయికాళ్ళమండపాన్ని కూల్చింది చంద్రబాబు . మొన్నటికి మొన్న విజయవాడలోముల్టీఫ్లెక్స్ సినిమా హాల్ కోసం మొత్తం 200 పురాతన ఆలయాలనికూల్చేసాడు .
ఈరోజు తిరుమలకి అన్యమతస్తుడిని చైర్మగా పెట్టి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నాడు . తన కొడుకు కోసం క్షుద్రపూజలకు ఒప్పుకోలేదని ఏకంగా ప్రధాన అర్చకులైన రమణదీక్షితులు గారిని తొలగించారు . స్వామీ వారి ఆభరణాలు ఎన్నో మాయమవుతున్నాయని , కొన్నింటిని పచ్చ ముట్టా విదేశాలలో వేలం వేయటానికి తరలించారని వార్తలు వస్తున్నాయి . పవిత్రమైన తిరుమలని ఈ రోజు తెలుగుదేశం దొంగలు అక్కడ మకాం వేసి బ్రష్టుపట్టిస్తున్నారు . వీళ్ళ అన్యాయాలకు ఎదురు తిరుగుతున్న అర్చకులుని నిర్ధాక్షిణ్యంగా ఇంటికి పంపుతున్నారు . ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవండి . పచ్చ ముఠా చేసే తప్పుడు ప్రచారం నుండి బయటపడండి . తిరుమలలో జరుగుతున్న ఘోరాలపై గొంతెత్తి పోరాడండి .
నిజమైన హిందువు నిజాల్ని తెలుసుకొని పదిమందికి తెలియచేయాలి .
సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్త ఈ పోస్టును చదవండి ,షేర్ చేయండి .ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోండి . ఎక్కడ మనమీద తప్పుడు ప్రచారం జరుగుతున్నా ఈ ఆధారాలతో తిప్పికొట్టండి .

Facts on Brahmins

చంద్రబాబునాయుడు . !!!!
బ్రాహ్మణులు మీకు ఎందుకు ఓటు వేయాలి.?
1.1984లోకరిణీకాలు తొలగించినందుకా.
2. 1987 లో చల్లా కొండయ్య కమిషన్ వేసి,మిరాశీ వంశపారంపర్య మిరాశి అర్చకత్వ వ్యవస్థను రద్దు చేసినందుకా.
3.టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు చట్టసభలకు అవకాశం కల్పించనందుకా.
4.2000 వేల కోట్ల బ్రాహ్మణులకు చెందిన అగ్రిగోల్డ్ సంస్థను దివాలతీయించినందుకా.
5.500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తానని చెప్పి...230 కోట్లు ఇచ్చినందుకా.
6.2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ లేదు అని చెప్పి,టీటీడీ లో రమణ దీక్షితులు గారి పరంపర తొలగించినందుకా.
7.కృష్ణా పుష్కరాలలో విజయవాడలోని 45 దేవాలయాల ను పడకొట్టినందుకా.
8.153 మంది కో ఆర్డినెటర్ లను తొలగించి,inspire labs ద్వారా డబ్బును దోచినందుకా.
9.పీఠాధిపతులను,మఠాధిపతులను,టీడీపీ పార్టీలోనిబ్రాహ్మణులచేతదుర్భాహాలాడి0చినందుకా .
10.GOMS NO 76 కు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పి,అమాయకులైన అర్చకులను పదే పదే రమ్మని పిలిపించుకుని GO ని విడుదల చేయకుండా మొహం చాటేసినందుకా
పైన పేర్కొన్న 10 అంశాలను రాష్ట్రంలోని ప్రతి బ్రాహ్మణుడికి చేరేలాగా ప్రతి బ్రాహ్మణుడు షేర్ చేయండి,26 లక్షల బ్రాహ్మణుల జీవితాలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 4 గురికి శాసనసభకు అవకాశం కల్పించారు.
1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.వైసీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ నియమించారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య

Friday 22 March 2019

#తమ్ముళ్ళూ...

#తమ్ముళ్ళూ...
*************
నేను శతృదేశానికి జై అంటే మీరు జై అనాలి!!!
రాహుల్ ఖాన్, రాబర్ట్ గాంధీలను అనుసరిస్తే మీరూ ఫాలో కావాలి!!!
నేను నల్ల అంటే మీరు నల్ల అనాలి!!!


~ బాబూ ఖాన్ ప్రసంగాలు ~

Friday 8 March 2019

THE GREAT APPRECIATION”

మా పాప రాసిన మరో ఆర్టికల్, ఉమెన్స్ డే సందర్భంగా ....
“THE GREAT APPRECIATION”
The GREAT "International Women’s Day" started celebrations a week before , where the walls of facebook filled about presenting the women and phone was crammed with the forwarded messages describing the importance of women why? why, such a great appreciation for us only on that particular day..?
Today’s world is winded up with the new inventions and discoveries , each of them winning its own level of appreciation. But, we forgot to appreciate the sublime creation of God – A GIRL
We describe our nation as the “MOTHER” land. The land of customs, culture and tradition , which have been confined fortunately or unfortunately to the social media. In this so called “MOTHER” land, we never respect a women. This world describes each of its conception with women like the nature but never depict it for a women. We treat her like an object that’s been created for the use of men’s needs.
“We have the endurance of EARTH, that can bear all the responsibilities. We have that power of WATER that stores all the sorrow within us. We have the power of FIRE that can give light to others and burn when we get exhausted. We have the heart of the SKY that can hoard all the emotions in it.We the power of AIR, as pure as it.”
As a mother, daughter, sister, wife… we acquire many responsibilities in all these phases, each giving a new pain and new challenge, but we accept all these with a gentle smile on our face. We face them guarding our beloved ones, but in return to these we gain nothing… We doesn’t require any appreciation for all these, all we need is little respect. Respect for facing all the challenges ,respect for the pain, inspite we are getting betrayed by the society…
A little respect makes us stronger for facing more pain and more challenges...
--Akhila Vaddamani

నా దేశపు మట్టి

నా దేశపు మట్టి సదా పరిమళమని చెప్పవోయ్ ||
ఏ దేశపు వాసనలకు లోబడమని చెప్పవోయ్ ||
నీ భువిపై మేధావుల చరిత నీకు తెలియనిదా ?
ధన కాంక్షకు తలవంచుతు ఒరగమని చెప్పవోయ్ ||
పుణ్య స్ధల పురాణాలు ప్రతిచెట్టున ఔషదాలు
అరుదైనవి సంస్కృతులు ఘనమేనని చెప్పవోయ్ ||
మన భారత వాకిళ్ళకు భక్తిగానె మ్రొక్కవోయి
బ్రతుకుదారి ఏదైనా గొప్పేనని చెప్పవోయ్ ||
మన గణితం చదరంగం మెళుకువలు మన సంపద
నిండైనది విజ్ఞానపు భారతమని చెప్పవోయ్ ||
అద్వితీయ కళలెన్నో ఆశ్చర్యపు నిధులెన్నో
సంప్రదాయ అభిరుచులు విలువేనని చెప్పవోయ్ ||
.........కొరటమద్ది వాణి

ఆత్మ



నేను అంటున్న వ్యక్తిగత అహంకారం ఏ చోట ఉద్భవిస్తున్నదో
లేక తిరిగి అది దేనిలో అంతర్హితమవుతున్నదో అదే ఆత్మ , సహజ జ్ఞానము
స్వయంభవ మగు వస్తువునకు 
కారణముండదు!!!
సహజ జ్ఞానికి
ప్రపంచముతో ఎలాంటి బంధమూ ఉండదు!!!!!
ఉన్నా అది లోకోధ్ధరణకే!!!

సహజ జ్ఞానము

సహజ జ్ఞానము (Intuitive Philosophy) 
****************************************
ఆత్మను చూచువానికి
మనశ్సరీరములు అదృశ్యమైనట్లే
పరిపూర్ణ నిశ్చలత్వము పొందిన వానికి
చలనము అదృశ్యమగును!!!
***************************************

WOMEN EMPOWERMENT

This is called~~~~ WOMEN EMPOWERMENT❤️💐🙌🙌🙌🙌
సత్సాంగత్యం
************
సగటు మనిషి ఎపుడూ అనుకరణ జీవే!!
తనకు నచ్చిన విషయాలను
బాగా నచ్చిన వారితో సేకరిస్తూ
వారిని అనుసరిస్తూ
తన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకుంటాడు..
దీన్నే సత్సాంగత్య ప్రభావం అంటాం!!!
ఆ సాంగత్యం
బడి కావచ్చు
అమ్మ ఒడి కావచ్చు
అది ఒక అద్వితీయ శక్తి కావచ్చు!!!

THE WOMAN DEEP WITHIN...

THE WOMAN DEEP WITHIN...
.
I'm a tiny spark
Of that supreme radiance
A wave of that undying flow
Originated from the locks of Shiva
Oh !!
Let this realization
Seep deep
Into my being
Beset with fragrances and ashes
An inseparable part of Shiva
I'm an Everflowing Ganga
@ Sister Rupa