Thursday 24 May 2018

దత్తుని రూపంలో అంతరార్థం

దత్తుని రూపంలో అంతరార్థం
దత్తుని రూపంలో అంతరార్థం శ్రీ దత్తమూర్తి మూడు శిర స్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే, *మూడు శిరస్సులు:- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారము లోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము. *నాలుగు కుక్కలు:- నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు. *ఆవు:- మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు. *మాల:- అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము. *త్రిశూలము :- ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి. *చక్రము:- అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును. *డమరు:- సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి. *కమండలము:-సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

No comments:

Post a Comment