Saturday 5 May 2018

// పట్టపగలు చుక్కలు నేల రాలేనయా //
*****************************
ఒక్క రోజులో 40,000 కు పైగా పిడుగులు!!!!!!!!!!
జిల్లాల వారిగా లెక్కలు భలే తేల్చారు!!!
ఈ ఉపద్రవాలకు కారాణలేమిటో తెలిసి కూడా
పాలకులు, ప్రజాప్రతినిధులు,ఛానల్లు, పత్రికలు
నోరు మెదపకుండా కూర్చున్నాయి!!!
చెట్లన్నా, పచ్చని పల్లెలు, పచ్చని పంటభూములన్నా
ప్రకృతికీ, ప్రతి ప్రాణికోటికి పరవశమే!!!
వృక్షాలను, పల్లెలు,పచ్చని పంటపొలాలు
దైవాలుగా భావించి ఆరాధించిన భవ్య సంస్కృతిమనది.
పచ్చదనంతో అనుబంధం కలిగిన వ్యక్తికి
సహజంగా మంచితనం పెంపొందుతుంది అన్నది వాస్తవం..

మరి నేడు జరుగుతున్నది -
చెట్టు,పుట్ట,కొండలు,గుట్టలు ...
పల్లెలు, జలవనరులు ,
ముక్కారులు పంటలు పండి  అన్నాన్నిచ్చే సారవంతమైన భూములు...
అన్నీ సెజ్జులు, పరిశ్రమలు అంటూ కల్లబొల్లి కబుర్లతో
లేని అభివృద్ధి పేరిట దోపిడీకి గురి అవుతున్నాయ్!!!
అందుకే ఈ ప్రమాద ఘంటికలు!!!!!!!!
కాలజ్ఞాని, కవి  శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం వారు
ఊరకే చెప్పలేదు :
// పట్టపగలు చుక్కలు నేల  రాలేనయా
పాపాత్ములందరూ పగిలి పగిలి  నశించి పోయేరయా//













No comments:

Post a Comment