Sunday 11 March 2018

JOURNEY

JOURNEY
అమ్మ ఒడి, నాన్న బడి
సైకిలుపై చుట్టివచ్చిన NH5 రహదారి
ఒక పాట,ఒక పద్యం,ఒక పాఠం
ఒక ఆశ,ఒక ఆశయం,
నిలబెట్టిన జెండాకఱ్ఱ, నడిపించిన మేధోధార
అలరించిన ఆ కవిత్వాలు ,ఆశ్రయించిన తత్త్వాలు,
అదేమిటో! జీవితం దొరిలించుకుపోయిన
స్నేహితులంతా మళ్ళీ వచ్చేసారు!
పొడుగ్గా, బలంగా... జుట్టు తెల్లబడిందంతే!
విచిత్రం! అవే నవ్వులు, అదే కన్నీళ్ళ రుచి.
భూమి ఎంత గుండ్రంగా ఉంది!
భళిరా! బ్రతుకు నాటకం రక్తి కట్టింది
పతాక సన్నివేశపు విషాదానికి మేలుమలుపులద్దింది
విడిపోయినవాళ్ళు, కలుసుకోబోయి తృటిలో తప్పిపోయిన వాళ్ళు...
నా వాళ్ళంతా నా చుట్టూనే ఉన్నారు
ఇక ఫర్లేదు! ఎవరు వెళ్ళినా మళ్ళీ వస్తారని తెలిసింది
బడలికలు, భారాలు లేని పసిడి సీమ
నా హృదయమే పెక్కు స్నేహాలైనట్టుంది
ప్రపంచం నాలానూ ఉంది, నాకన్నా బాగుంది.
మిత్రులే నా అంతర్నేత్రాలు
నాలో నాతో సాగిన జీవనదులు
-- Sailaja K 

No comments:

Post a Comment