Tuesday, 3 September 2019

#లీనం-విలీనం: BANKS

#లీనం-విలీనం:
సమస్య ఎక్కడవుందో పరిష్కారం అక్కడే దొరికి తీరుతుంది!!!
బ్యాంకులన్నీ ఒక్కటవుతున్నాయి.
పిల్లల బడి తల్లి ఒడికి చేరితే తప్పేముంది??
ఆర్థిక సంస్కరణల్లో నిర్మల ....
ఇందిరకంటే ఎక్కడ ఎక్కువ పేరు తెచ్చుకుంటుందో అని బాధపడితే ఎలా??
వినయం,క్రమ శిక్షణ కొందరిని ఉన్నతులను చేస్తుంది.
తద్వారా దేశం ప్రగతిబాటలో పయనిస్తుంది.
Keep up your good work Nirmala Seetharaman.

#Tulsi or Thulasi

#Tulsi or Thulasi
#Indianity in US
America ‘s president candidate for next election ...
Vaishnava-Haindava Congresswoman
TULSI is from Vaishnava Cult and Tulsi is a devotee of Lord Krishna and a member of ISKCON.

#లీనం -విలీనం :

#లీనం -విలీనం :
#ఇక APSRTC ప్రభుత్వం లే చేరిక!
మంచిదే!!
కాని బస్ స్టాండులను ఆధునీకరించాలి.
ప్రతి పల్లెకు బస్ సేవలను తిరిగీ పునరుధ్ధరించాలి!!
ఆటోల, స్కూటరిస్టుల రావిడి కొంతవరకైనా తగ్గుతుంది ఇలా చేస్తే!!!
ఉన్నంతలో ఆర్టీసీ ప్రయాణం క్షేమకరం.
అందులోని సిబ్బంది సేవలు మనం మరువరానివి!!
సమాజానికి రైతు, సైనికుడు ఎంత ముఖ్యమో
ఆర్టీసి సిబ్బంది అంతే ముఖ్యమని ప్రజలు,ప్రభుత్వాలు గ్రహించాలి, వారిని గౌరవించాలి!!!

#కవి..పండితుడు:

#కవి..పండితుడు:
నిరహంకారం,నిర్మలత్వం
నిశ్చలభక్తి,అంతఃకరణ శుధ్ధి
ఈ సుగుణాలే కవి,పండితులు,విద్యాధికులకు కావలసినది.
అందుకే ఆదిశంకరులు షట్దీపస్తోత్రంలో 
"అవినయ మపనయ విష్ణో" అనగా -
"స్వామీ! నా యందలి అవినయ గుణాన్ని తొలగించు"
అని ప్రార్థించాడు శ్రీమన్నారాయణుని!
జయ జయ రఘువీర సమర్థ

FEW WORDS ON ME

FEW WORDS ON ME
Rama Subba Rao Bhuthamapuram garu is an inspiring, intelligent fb friend with the strength of character. I am very fortunate to have such a patriot, a man of dazzling intellect as my fb friend. He is a highly cultured person with many admirers including few of foreign origin. His posts are of motivating nature. I could get several inspiring personalities as fb friends through his courtesy, consolidating my faith in the Upanishadic knowledge and Sanathana Dharma. His friendship helps me in my spiritual progress. An aura of holiness pervades him because of his holy thoughts.The one quality of him i like most is that once he makes friendship with someone, he makes it his purpose to introduce him to his other friends of similar interests and likes expanding one's horizon of world of friendship. Whenever he likes someone, his posts, he praises that person and encourages to the hilt. He is a perfect example of an ideal friend even if it is on fb. I cherish his friendship and hope to sustain it for ever. Thank you sir, Ramu garu. Thank you very much fb.
By Shri.Kranthikumar Sammohi 

Sunday, 1 September 2019

కవిత్వ కళానిరూపణము

#
కవిత్వ కళానిరూపణము 
**************************
మానవీయ విలువలతోపాటు నీతిని బోధించే నీతి సాహిత్యాన్ని, పురాణ సాహిత్యాన్ని పిల్లలకు అందించకపోతే 
ఈ సమాజం అధోగతిపాలు అవుతుంది!!! ఈ సత్యాన్ని కవులు,పెద్దలు అందరూ గుర్తెరుగాలి!!!
~ శ్రీ రామ సమర్థ ~

#ProudToBeAnLician

63 Years of Trust!!
యోగక్షేమం వహామ్యహం.. !!!
ఆపదలన్నీ కట్ట కట్టుకుని చుట్టుముట్టినప్పుడు..
కష్టాలన్నీ కలిసి వచ్చినప్పుడు,
తాను మీ వెంటే ఉంటానన్న సూచన భగవద్గీత లోని ఈ శ్లోకం లో కనిపిస్తుంది.
నిజానికి "యోగక్షేమం వహామ్యహం " అన్నది ఒక మాట కాదు.
ఒక అభయం..
ఒక ఆశీస్సు.
అందుకే జీవిత బీమా సంస్థ ఈ వాక్యాన్ని తన నినాదం గా మార్చుకుంది.
1956 నాటి మాట.!!
ఆనాటి ప్రైవేటు కంపెనీలు ప్రజలకు చెల్లించవలసిన లక్షల క్లెయిములు ఎగవేయగా..ఎల్ ఐ సి ఆ మొత్తాన్ని తన మూల ధనం నుంచి చెల్లించింది.
అలా 1956 సంవత్సరం సెప్టెంబర్ 1న మొదలు పెట్టిన ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులు. ఎన్నో చాలెంజెస్. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రూపంలో ఎన్ని సవాళ్ళు విసిరినా... ఎల్ ఐ సి తన ప్రగతి పధాన్ని ఎప్పుడూ ఆపలేదు. ప్రభుత్వ రంగ సంస్థగా సమాజం లో తన భాధ్యతనీ విస్మరించలేదు.
ప్రజల నమ్మకమే పునాదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే అతి పెద్ద ఆర్ధిక సంస్థగా నిలిచింది.
క్లెయిముల పరిష్కారంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రజల యొక్క అచంచలమైన విశ్వాసాన్ని చూరగొంది.
"ప్రజల సొమ్ము ప్రజలకే " అన్న లక్ష్యంతో దేశంలో మౌలిక వసతుల కల్పనకు, వివిధ సామాజిక పధకాలకు ఏటా లక్షల కోట్లు అందిస్తోంది.
మనకు నిత్య జీవనాధారాలైన గృహ, విద్యుత్, నీటి పారుదల, రోడ్లు.. రైల్వేస్ ఈ రంగాలన్నింటికీ కలిపి గత సంవత్సరం ఎల్ ఐ సి అందించిన నిధులెంతో తెలుసా.. 29,84,331 కోట్లు.
ప్రపంచం మొత్తం ప్రైవేటికరణకు దాసోహం అంటున్నా.. పాలక వర్గాలు గంగిగోవులాంటి ఎల్ ఐ సి ని బలి ఇవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా చెక్కుచెదరని దీక్షతో మేం శ్రమిస్తూనే ఉంటాం.
మా సంస్థని కాపాడుకుంటాం...
ఎందుకంటే...
WE ARE PROUD TO BE LICIANS...
~ Sister Uma Nuthakki ~