Thursday, 22 November 2018

VISWANATHA SATYANARAYANA

SIMPLICITY WITH SPIRITUAL ESSENCE
VISWANATHA SATYANARAYANA

“ విశ్వనాధ సత్యనారాయణ “. వేయిపడగలు,రామాయణ కల్పవృక్షం వంటి సంప్రదాయ సాహిత్య గ్రంథ రచయిత ,తెలుగు సాహిత్యంలో సంప్రదాయమేరుపర్వతం లాంటి ప్రఖ్యాతిని పొందిన కవీశ్వరులు ...
ఆయన సాధారణ జీవన విధానము..విషయవాంఛలను తొలగించే ఆయన కవితా శైలి నన్ను వేయిపడగలను హింది భాషలోకి అనువదించేలా చేసిందని బహుభాషా కోవిదుడు, భారత అత్యుత్తమ ప్రధాని శ్రీ పీవీ నరసింహా రావు చెబుతారు...

Viswanatha Satyanarayana (10 September 1895 – 18 October 1976)  was a Telugu writer of the 20th century.  Viswanatha's style of poetry was classical in nature and his popular works include Ramayana Kalpa Vrukshamu (Ramayana the wish-granting divine tree), Kinnersani patalu (Mermaid songs) and and Veyipadagalu (The Thousand Hoods).

Wednesday, 21 November 2018

మాతృదేవోభవ , పితృదేవోభవ

1) మాతృదేవోభవ , పితృదేవోభవ
అని చెప్పిన దేశం భారత దేశం.
కానీ దానిని ఆచరించేది ఆస్ట్రేలియా. ( పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం అస్ట్రేలియాది)
2) గురుదేవోభవ అని చెప్పినదేశం భారతదేశం..కానీ దానిని ఆచరించేది చైనా. ( గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది.)
3) యత్ర నార్యంతు పూజ్యతే .... అని చెప్పిన దేశం భారతదేశం. కానీ ఆచరించేది నార్వే. ( మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటిస్థానం)
4) పెద్దలను , వృద్ధులను గౌరవించమని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరించేది ఐస్ ల్యాండ్. (మొదటి స్థానం ఐస్ ల్యాండ్ దే.)
5) సత్యమేవజయతే అని చెప్పిన దేశం భారత్ దేశం. కానీ దానిని ఆచరిస్తున్నది యూకే. (నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్ డం దే.)
6) కష్టేఫలి , కృషితో నాస్తి దుర్భిక్షం.. అని చెప్పిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది దక్షిణ కొరియా. ( హార్డ్ వర్క్ లో మొదటి స్థానం సౌత్ కొరియా దే)
7) ప్రపంచానికి శాంతి సందేశం అందించిన దేశం భారతదేశం. కానీ ఆచరిస్తున్నది నార్వే.( ప్రశాంతత లో మొదటి స్థానం నార్వే దే.)
8) భగవద్గీత బోధించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది జపాన్ .( కర్తవ్య నిర్వహణలో అంకితభావంలో మొదటి స్థానం జపాన్ దే)
9) ఎన్నో నీతి నియమాలను నిర్దేశించిన దేశం భారత దేశం. కానీ ఆచరిస్తున్నది సింగపూర్.( క్రమ శిక్షణ లో మొదటి స్థానం సింగపూర్ దే)
10) విద్య ను, జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారత దేశం. కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్. ( విద్య , విలువలు లో మొదటి స్థానం ఫిన్ ల్యాండ్ దే)
నేను మొదటి స్థానాన్ని మాత్రమే తెలియజేసాను. పై విషయాలలో స్వల్ప తేడాలతో టాప్ ట్వంటీ లో ఉన్న దేశాలు ఇవి..(ర్యాండం గా)
నార్వే, ఐస్ ల్యాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్ ల్యాండ్, జపాన్, యూకే, చైనా, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ , దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, యూఏఈ, ఆస్ట్రేలియా .....
చెప్పడం కాదు. చేసి చూపిస్తేనే విలువుంటుంది. లేకపోతె చెప్పేవి శ్రీరంగనీతులు అవుతాయి. పై విషయాలన్నింటిలో భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది.
మనదేశం మొదటి స్థానం లోకి వచ్ఛేరోజు వస్తుందని ఆశిద్దాం

త్రికరణశుధ్ధి కరువైతే???

త్రికరణశుధ్ధి కరువైతే???
* * * * * * * * * * * * * * * 
అతిశయోక్తులు...అలంకారాలూ...
అక్షర ఐశ్వర్యం అనుకునేరు!!! 
త్రికరణ శుధ్ధి కరువైనపుడు 
మీ కలం లో పులుముకున్న 
అసంబధ్ధ, అబధ్ధ భావాలవి!!!
~ రాచమల్లు రామచంద్రా రెడ్డి ~

· #కవిత్వ కళా నిరూపణము * *




#కవిత్వ కళా నిరూపణము 2
* * * * * * * * * * * * * * * 
శుచి, ధారణ, ధ్యానం,క్రమశిక్షణ,ఈశ్వర భక్తి ,సోదర భావము ...ఇవేమి లేకుండా కవి ఎన్ని గ్రంధాలు రాసిన పండితుడు కాజాలడు....అట్టి రచనలకు వెలుగుండదు!!!
~ శ్రీ రామ సమర్థ - దాసబోధ నుంచి సంగ్రహించబడిన సత్యవాక్కులివి ~

పిఠాపురం

పిఠాపురం
"హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
(శ్రీనాధుడు భీమేశ్వర పురాణం )
పీఠికాపురమది ఘనపీఠమనగ
దేవళముల కూడలిదియు దివ్యమైన
ధామము పవిత్ర జలముల తటము నందు
స్నానమాచరించినతోడ సకల శుభము !!
కుక్కుటేశ్వరుడైనాడు కోకనదుడు
యా పురూహూతికమనకు నంబ కాగ
శక్తి పీఠమిదియె దత్త స్వామి నిచట
పరిమళించెను శ్రీపాద వల్లభునిగ !!
ఆ గయాసురుఁ యొడలది యజ్ఞ వాటి
ఘనత కలిగిన భక్తుని కలిలమదియు
తాకినంతనె జీవుల తరల చేయు
పాద గయగ పిలువబడు ప్రస్తుతంబు !!
దివ్య మైనట్టి గుడులతో భవ్య మౌగ
పీఠికాపురంబదియును విజయమొసగు
భక్త వరులకు కన్నుల పండుగాయె
చూచి వద్దము రండయ సుజనులార !!
కాకినాడకు చేరువన్ కలదు పురము
కార్తికమున హరిహరుల గాంచుటనగ
పుణ్య ప్రదమగు పరమును పొంద గలము
శివుని కొల్చుట శుభమగు చేరి మనకు !!
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పై విధంగా చెబుతాడు.
పాదగయ క్షేత్ర వివరణ
కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. .కుక్కుటేశ్వర దేవాలయంఈ దేవాలయం కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయం ఎదురుగా కల ఏకశిల నంది అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది. కుక్కుటేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొద్దిగా దిగువగా ఉంటుంది. ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి.కుక్కుటేశ్వరస్వామి
ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం
పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం,శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు, ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం"గా ఏర్పాటు చేయబడింది, శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు,భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే కలదు,మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు ఉన్నాయి.

Sunday, 11 November 2018

NOVEMBER 12, PUBLIC SERVICING BROADCASTING DAY

NOVEMBER 12, PUBLIC SERVICING BROADCASTING DAY
Broadcasting indeed is an important social service
That equips the listeners with knowledge up to date nice!
Private and public sector service in this regard great
Premier broadcaster is that of our central Government!
November twelfth today is “Public Service Broadcasting Day”
Observed every year on this day to commemorate
Mahatma Gandhi’s maiden visit to All India Radio
(AIR) studio!Father of the Nation Mahatma
Gandhi visited the studio, Delhi first and last.
To address the refugees from Pakistan,
At Kurukshetra in Haryana after partition.
Consoling, assuring and providing consolation!
Notwithstanding the invasion of Television far and wide
Radio has its own charm and role to play in side by side
We know the people treat transistor as sister and keep
With them not to miss programs important and interesting neat!
Image result for Image of All India Radio Delhi

Karthika Masam -

Karthika Masam -
The Most Auspicious and Sacred Month
It is a month long festival, starting just after Deepavali Amavasya where both Lord Shiva and Maha Vishnu are worshipped and prayed.
It is most auspicious and sacred month for both Shaiva and Vaishnava followers.
It is believed that offering prayers to "Shivakesavas" particularly in this month brings luck and prosperity. Karthika Masam is the favorite month to Lord Shiva amongst all other months.
“Shivaya Vishnu Roopaya
Shiva Roopaya Vishnave.
Shivaya Hrudayam Vishnu
Vishnoscha Hrudayagum Shivah"
"Yathaa Shivamayo Vishnu
Evam Vishnu Maya Shivah"
Karthika Masam helps the devotee to
understand and embrace the thought that
there is no difference between Lord Vishnu and Lord Shiva and they both are one.