Wednesday, 7 November 2018

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.
దిక్కులు :-
"""""""""
(1) తూర్పు, 
(2) పడమర,
(3) ఉత్తరం,
(4) దక్షిణం
మూలలు :-
""""""""""""""""
(1) ఆగ్నేయం,
(2) నైరుతి,
(3) వాయువ్యం,
(4) ఈశాన్యం
వేదాలు :-
"""""""""""""
(1) ఋగ్వే దం,
(2) యజుర్వేదం,
(3) సామవేదం,
(4) అదర్వణ వేదం
పురుషార్ధాలు :-
"""""""""""""""""""""
(1) ధర్మ,
(2) అర్థ,
(3) కామ,
(4) మోక్షా
పంచభూతాలు :-
"""""""""""""""""""""""
(1) గాలి,
(2) నీరు,
(3) భూమి,
(4) ఆకాశం,
(5) అగ్ని.
పంచేంద్రియాలు :-
""""""""""""""""""""""""""
(1) కన్ను,
(2) ముక్కు,
(3) చెవి,
(4) నాలుక,
(5) చర్మం.
లలిత కళలు :-
""""""""""""'"'"""""""
(1) కవిత్వం,
(2) చిత్రలేఖనం,
(3) నాట్యం,
(4) సంగీతం,
(5) శిల్పం.
పంచగంగలు :-
"""""""""""""""""""""
(1) గంగ,
(2) కృష్ణ,
(3) గోదావరి,
(4) కావేరి,
(5) తుంగభద్ర.
దేవతావృక్షాలు :-
""""""""""""""""""""""""
(1) మందారం,
(2) పారిజాతం,
(3) కల్పవృక్షం,
(4) సంతానం,
(5) హరిచందనం.
పంచోపచారాలు :-
"""""""""""""""""""""""""
(1) స్నానం,
(2) పూజ,
(3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం,
(5) నమస్కారం.
పంచామృతాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆవుపాలు,
(2) పెరుగు,
(3) నెయ్యి,
(4) చక్కెర,
(5) తేనె.
పంచలోహాలు :-
"""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) రాగి,
(4) సీసం,
(5) తగరం.
పంచారామాలు :-
""""""""""""""""""""""""
(1) అమరావతి,
(2) భీమవరం,
(3) పాలకొల్లు,
(4) సామర్లకోట,
(5) ద్రాక్షారామం
షడ్రుచులు :-
"""""""""""""""""
(1) తీపి,
(2) పులుపు,
(3) చేదు,
(4) వగరు,
(5) కారం,
(6) ఉప్పు.
అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-
"""""""""""""""""""""""""""""""""""""""
(1) కామం,
(2) క్రోధం,
(3) లోభం,
(4) మోహం,
(5) మదం,
(6) మత్సరం.
ఋతువులు :-
""""""""""""""""""""
(1) వసంత,
(2) గ్రీష్మ,
(3) వర్ష,
(4) శరద్ఋతువు,
(5) హేమంత,
(6) శిశిర
సప్త ఋషులు :-
""""""""""""""""""""""""
(1) కాశ్యపుడు,
(2) గౌతముడు,
(3) అత్రి,
(4) విశ్వామిత్రుడు,
(5) భరద్వాజ,
(6) జమదగ్ని,
(7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు :-
"""""""""""""""""""""""""""""""
(1) శేషాద్రి,
(2) నీలాద్రి,
(3) గరుడాద్రి,
(4) అంజనాద్రి,
(5) వృషభాద్రి,
(6) నారాయణాద్రి,
(7) వేంకటాద్రి.
సప్త వ్యసనాలు :-
""""""""""""""""""""""""
(1) జూదం,
(2) మద్యం,
(3) దొంగతనం,
(4) వేట,
(5) వ్యబిచారం,
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు :-
""""""""""""""""""""""
(1) గంగ,
(2) యమునా,
(3) సరస్వతి,
(4) గోదావరి,
(5) సింధు,
(6) నర్మద,
(7) కావేరి.
నవధాన్యాలు :-
""""""""""""""""""""""""
(1) గోధుమ,
(2) వడ్లు,
(3) పెసలు,
(4) శనగలు,
(5) కందులు,
(6) నువ్వులు,
(7) మినుములు,
(8) ఉలవలు,
(9) అలసందలు.
నవరత్నాలు :-
"""''''""""""""""""""""
(1) ముత్యం,
(2) పగడం,
(3) గోమేధికం,
(4) వజ్రం,
(5) కెంపు,
(6) నీలం,
(7) కనకపుష్యరాగం,
(8) పచ్చ (మరకతం),
(9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు :-
""""""""""""""""""""""""
(1) బంగారం,
(2) వెండి,
(3) ఇత్తడి,
(4) రాగి,
(5) ఇనుము,
(6) కంచు,
(7) సీసం,
(8) తగరం,
(9) కాంతలోహం.
నవరసాలు :-
"""""""""""""""""""
(1) హాస్యం,
(2) శృంగార,
(3) కరుణ,
(4) శాంత,
(5) రౌద్ర,
(6) భయానక,
(7) బీభత్స,
(8) అద్భుత,
(9) వీర
నవదుర్గలు :-
"""""""""""""""""""
(1) శైలపుత్రి,
(2) బ్రహ్మ చారిణి,
(3) చంద్రఘంట,
(4) కూష్మాండ,
(5) స్కందమాత,
(6) కాత్యాయని,
(7) కాళరాత్రి,
(8) మహాగౌరి,
(9) సిద్ధిధాత్రి.
దశ సంస్కారాలు :-
""""""""""""""""""""""""""
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
దశావతారాలు :-
"""""""""""""""""""""""""
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.
జ్యోతిర్లింగాలు :-
""""""""""""""""""""""""
హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
తమిళనాడు ~ రామలింగేశ్వరం
తెలుగు వారాలు :-
"""""""""""""""""""""""""
(1) ఆది,
(2) సోమ,
(3) మంగళ,
(4) బుధ,
(5) గురు,
(6) శుక్ర,
(7) శని.
తెలుగు నెలలు :-
"""""""""""""""""""""""""
( 1 ) చైత్రం,
( 2 ) వైశాఖం,
( 3 ) జ్యేష్ఠం,
( 4 ) ఆషాఢం,
( 5 ) శ్రావణం,
( 6 ) భాద్రపదం,
( 7 ) ఆశ్వీయుజం,
( 8 ) కార్తీకం,
( 9 ) మార్గశిరం,
(10) పుష్యం,
(11) మాఘం,
(12) ఫాల్గుణం.
రాశులు :-
""""""""""""""
( 1 ) మేషం,
( 2 ) వృషభం,
( 3 ) మిథునం,
( 4 ) కర్కాటకం,
( 5 ) సింహం,
( 6 ) కన్య,
( 7 ) తుల,
( 8 ) వృశ్చికం,
( 9 ) ధనస్సు,
(10) మకరం,
(11) కుంభం,
(12) మీనం.
తిథులు :-
""""""""""""""""
( 1 ) పాఢ్యమి,
( 2 ) విధియ,
( 3 ) తదియ,
( 4 ) చవితి,
( 5 ) పంచమి,
( 6 ) షష్ఠి,
( 7 ) సప్తమి,
( 8 ) అష్టమి,
( 9 ) నవమి,
(10) దశమి,
(11) ఏకాదశి,
(12) ద్వాదశి,
(13) త్రయోదశి,
(14) చతుర్దశి,
(15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు :-
"""""""""""""""""
( 1 ) అశ్విని,
( 2 ) భరణి,
( 3 ) కృత్తిక,
( 4 ) రోహిణి,
( 5 ) మృగశిర,
( 6 ) ఆరుద్ర,
( 7 ) పునర్వసు,
( 8 ) పుష్యమి,
( 9 ) ఆశ్లేష,
(10) మఖ,
(11) పుబ్బ,
(12) ఉత్తర,
(13) హస్త,
(14) చిత్త,
(15) స్వాతి,
(16) విశాఖ,
(17) అనురాధ,
(18) జ్యేష్ఠ,
(19) మూల,
(20) పూర్వాషాఢ,
(21) ఉత్తరాషాఢ,
(22) శ్రావణం,
(23) ధనిష్ఠ,
(24) శతభిషం,
(25) పూర్వాబాద్ర,
(26) ఉత్తరాబాద్ర,
(27) రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు :-
""""""""""""""""""""""""""""""""""""""
( 1 ) ప్రభవ :-
1927, 1987, 2047, 2107
( 2 ) విభవ :-
1928, 1988, 2048, 2108
( 3 ) శుక్ల :-
1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :-
1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113
( 8 )భావ. -
1934, 1994, 2054, 2114
9యువ. -
1935, 1995, 2055, 2115
10.ధాత. -
1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. -
1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118
13.ప్రమాది. -
1939, 1999, 2059, 2119
14.విక్రమ. -
1940, 2000, 2060, 2120
15.వృష.-
1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. -
1942, 2002, 2062, 2122
17.స్వభాను. -
1943, 2003, 2063, 2123
18.తారణ. -
1944, 2004, 2064, 2124
19.పార్థివ. -
1945, 2005, 2065, 2125
20.వ్యయ.-
1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. -
1947, 2007, 2067, 2127
22.సర్వదారి. -
1948, 2008, 2068, 2128
23.విరోధి. -
1949, 2009, 2069, 2129
24.వికృతి. -
1950, 2010, 2070, 2130
25.ఖర.
1951, 2011, 2071, 2131
26.నందన.
1952, 2012, 2072, 2132
27 విజయ.
1953, 2013, 2073, 2133,
28.జయ.
1954, 2014, 2074, 2134
29.మన్మద.
1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి.
1956, 2016, 2076, 2136
31.హేవళంబి.
1957, 2017, 2077, 2137
32.విళంబి.
1958, 2018, 2078, 2138
33.వికారి.
1959, 2019, 2079, 2139
34.శార్వారి.
1960, 2020, 2080, 2140
35.ప్లవ
1961, 2021, 2081, 2141
36.శుభకృత్.
1962, 2022, 2082, 2142
37.శోభకృత్.
1963, 2023, 2083, 2143
38. క్రోది.
1964, 2024, 2084, 2144,
39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145
40.పరాభవ.
1966, 2026, 2086, 2146
41.ప్లవంగ.
1967, 2027, 2087, 2147
42.కీలక.
1968, 2028, 2088, 2148
43.సౌమ్య.
1969, 2029, 2089, 2149
44.సాధారణ .
1970, 2030, 2090, 2150
45.విరోధికృత్.
1971, 2031, 2091, 2151
46.పరీదావి.
1972, 2032, 2092, 2152
47.ప్రమాది.
1973, 2033, 2093, 2153
48.ఆనంద.
1974, 2034, 2094, 2154
49.రాక్షస.
1975, 2035, 2095, 2155
50.నల :-
1976, 2036, 2096, 2156,
51.పింగళ
1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి
1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి
1979, 2039, 2099, 2159
54.రౌద్రి
1980, 2040, 2100, 2160
55.దుర్మతి
1981, 2041, 2101, 2161
56.దుందుభి
1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి
1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి
1984, 2044, 2104, 2164
59.క్రోదన
1985, 2045, 2105, 216
60.అక్షయ
1986, 2046, 2106, 2166.

Tuesday, 6 November 2018

TELUGU HITS - చిత్రం : భార్య (1968)

ఆ పాత మధురాలు
చిత్రం : భార్య (1968) 
నిన్న చూసింది ఈ అరుణకాంతులే
నిన్న చూసింది ఈ అరుణకాంతులే


వింత అందాలు చిందేను నేడెందుకో // నిన్న చూసింది //
ఎరుగవు నీవు ఎపుడీ హాయి
ఎరుగవు నీవు ఎపుడీ హాయి
ఎగిసీ పడేవిల ఎందుకే తువాయి!
ఓ విరజాజి నినుజతగూడి
తుంటరి చేసి
సరాగములు ఆడి
పలికే పదాలలో భావాలమే!! // నిన్న చూసింది //
పెన్నిధివోలె దొరికితివీవు నిలువుమయా నా తోడుగా // పెన్నిధి వోలె //
నిన్నే నా మది నమ్మిన దాన
నిన్నే నా మది నమ్మిన దాన
నను పాలింపుమా స్వామీ !!!


Saturday, 3 November 2018

సనాతన ధర్మం

సనాతన ధర్మాన్ని పాటించడమే విజయానికి మార్గం!
హిందూ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టేందుకు 
మనం ఒక వ్యూహాన్ని అనుసరించవచ్చు.
ఏ ధర్మాన్ని ధ్వంసం చేయాలని…అనుష్ఠాన పరులని హత్యలు చేస్తున్నారో,
ఏ ధర్మాన్ని ఆచరణ నుంచి తప్పించాలని కోర్టు తీర్పులు వెలువరిస్తున్నారో…
ఆ ధర్మాన్ని మరింతగా,మరింత ఎక్కువ మందిమి ఆచరిద్దాం గాక!
ఉదయం సుప్రభాతం మైక్ లో వినిపించినందుకు ఒక వృధ్ధ బ్రాహ్మణ పూజారిని చంపితే
ఆ చుట్టుపక్కల ఉన్నవారందరితో సహా, మనందరమూ …
మనమన నివాస స్థానాల్లో …ఉదయాన్నే మన యిష్ట దేవతల సుప్రభాతాలు
మన దగ్గర గల సాంకేతికలతో వినిపించాలి.
[అయితే అది మితి మీరిన ధ్వని కాలుష్యనికి దారి తీయకూడదు.ఉదయాన్నే భాస్కరునికి, పక్షులు తమ కిలకిలారావాలతో స్వాగతం పలుకుతాయని ఛాందోగ్యోపనిషత్ చెబుతుంది.
వాటికి భంగం కలిగించకూడదు గనుకా,
దేనికైనా గీత యుక్తాహార విహారస్య అంటుంది గనుకా.]
ఆపైన వీలైనంత మంది.. మన దగ్గరి దేవాలయాలకి వెళ్ళి ,
ఆ సుప్రభాతం ఉన్న పదో ఇరవయ్యో నిముషాలు గుడి లో ఉండాలి.
ఒక్కణ్ణి చంపితే వందమందిమి తయారౌతామన్న హెచ్చరిక …
హిందూ ద్వేషుల్లో దడ పుట్టించాలి.
బ్రాహ్మణోక్తం గా ఆయా యజ్ఞ యాగాది క్రతువులు జరపాలి.
ప్రతి ఒక్క హిందువూ మనవైనా ఆచారాలనీ, సాంప్రదాయాలనీ నిక్కచ్చిగా పాటించాలి.
ఇక ముఖాన బొట్టు పెట్టుకోవడాన్ని,ముంగిట ముగ్గు పెట్టుకోవడాన్ని నిలిపివేయాలంటూ …
కోర్టులు తీర్పులిస్తే …ఆ కుటిలతే ప్రపచానికి మరింతా వెల్లడి అవుతుంది,
అజ్ఞానంతో ఇంకా ఉదాసీనం గా ఉన్న హిందువులకి కూడా నసాళానికి ఆవేశం అంటుతుంది.

~ Matha Ananthananda ~

POET

వెలుగును ఇచ్చే సూర్యుడు మాట్లాడడు!
సువాసనను ఇచ్చే పువ్వు పలకదు!!
సమాజ హితం కోసం 
కవిత్వాన్ని ధారపోసే కవి ఆర్భాటం కోరడు!!!
~ శ్రీ రామ సమర్థ ~ 

నాసీమ రాయలసీమ..

నాసీమ రాయలసీమ.. రతనాల సీమ…
రాయలసీమ అంటే YS రాజశేఖర్ రెడ్డి కాదు..!!, లేక చంద్రబాబు నాయుడు కాదు..లేక YS జగన్ అంతకంటే కాదు..!! అంతకుముందే దానికి ఒక చరిత్ర ఉంది..!! ఎంతో వైభోగం ఉంది..!! ఫ్యాక్షన్ అనేది కేవలం 1970 నుండి 1995 వరకు మాత్రమే. కానీ నేడు చాలావరకు ఫ్యాక్షన్ పోయింది..అందరికి చదువు విలువ తెలిసింది..!
మాడుగుల నాగఫణి శర్మ (జననం 1959 తాడిపత్రి, అనంతపురం)
లక్కోజు సంజీవరాయశర్మ (1907-1997 ప్రొద్దుటూరు, కడప) గణిత బ్రహ్మగా పేరొందిన వీరు ప్రపంచంలో ఆరు వేల గణితా వధానాలు చేసిన ఏకైక వ్యక్తి
అన్నమయ్య (1408-1503 రాజంపేట కడప) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయ కారుడు..!!
కుందకుందాచార్యుడు (కొనకొండ్ల – గుంతకల్లు -అనంత పురం
తరిగొండ వెంగమాంబ (1730 -1817 తరిగొండలో చిత్తూరు జిల్లా) 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, కంది మల్లయ పల్లి, కడప.!! 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త
వేమన (సుమారు 1652-1730 మధ్యకాలం, కడప జిల్లా
మొల్ల (1440 -1530 –గోపవరం-కడప) 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి.
గజ్జెల మల్లారెడ్డి (1925 ఆంకా ళమ్మ గూడూరు కడప) ఈయన ఒక అభ్యుదయ, వ్యంగ్య కవి
గువ్వల చెన్నడు (17-18 శతా బ్దాల శతక కవి) కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో శతకాన్ని రచించాడు..!!
పుట్టపర్తి నారాయణాచార్యులు (1914-1990 చియ్యేడు-అనంత పురం) తెలుగు పదాల తో ‘‘శివ తాండవం’’ ఆడించిన కవి.
తరిమెల నాగిరెడ్డి(1917-1976 తరిమెల గ్రామం-అనంతపురం)
B.N రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి 1908-1977) జన్మస్థలం కొత్తపల్లి, పులి వెందుల, కడప జిల్లా..!! బి.ఎన్.రెడ్డి తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత.
బి.నాగిరెడ్డి (బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912-2004 విజయ ప్రొడక్షన్స్ ) దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి..
కె.వి.రెడ్డి (జూలై 1, 1912 – 1972 అనంతపురం జిల్లా తాడిపత్రి) కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాలకు స్వర్ణ యుగమైన, 1940-1970 మధ్య కాలంలో ఎన్నో ఉత్తమ చిత్రాల ను తెలుగు తెరకు అందించిన ప్రతిభా వంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు రచయిత..!!
టీ.జి. కమలాదేవి (1930 – 2012 కార్వేటి నగరం చిత్తూరు) ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి
జిక్కి (1938-2004 చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జననం)
నీలం సంజీవరెడ్డి (1913-1996, ఇల్లూరు గ్రామం అనంతపురం) భారత రాష్ట్రపతి
దామోదరం సంజీవయ్య (1921–1972 కల్లూరు కర్నూలు) మొదటి దళిత ముఖ్యమంత్రి
మునెయ్య (కడప జిల్లా, దొమ్మర నంద్యాల గ్రామం) ఈయన ప్రముఖ జానపద గాయకుడు.
జిడ్డు కృష్ణమూర్తి (1895-1986 మదనపల్లె చిత్తూరు జిల్లా)
బళ్ళారి రాఘవ (1880-1946 తాడిపత్రి అనంతపురం జిల్లా)
శంకరంబాడి సుందరాచారి (1914-1977 తిరుపతి చిత్తూరు జిల్లా)
C.R Reddy (1880-1951 కట్టమంచి చిత్తూరు)
కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభా వంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శ వాది, రాజ నీతిజ్ఞుడు. ఇంతటి ప్రతిభా పాటవాలు ఒక వ్యక్తిలో కానరావడం అరుదు..!!
గడియారం వేంకట శేషశాస్త్రి (1894 పెదముడియం కడప)
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువు నా రగుల్చుతూ రచించిన మహా కావ్యమే ‘శ్రీశివభారతం’.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి (1926-2014 రాయదుర్గం అనంతపురం)
తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత..!!
మధురాంతకం రాజారాం (1930-1999 మొగరాల గ్రామం చిత్తూరు జిల్లా)
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (జననం 18 శతాబ్దం తొలినాళ్ళ లో-మరణం-1847 జన్మస్థానం రూపనగుడి కర్నూలు జిల్లా)
రాయలసీమ అంటే ఇది..!!
ఇలా ఎందఱో మహాను భావులు మరెందరో చరిత్రలో నిలచిన వారు. అందరూ కలగలిపిన నేల ఈ రాయలసీమ అంటే సీమ అంటే నాలుగు నాటు బాంబులు, 10 మంది ఫాక్షనిస్టు పది సుమోలు కాదు. ఇక్కడ ఆప్యాయతకి అద్భుతమైన ఆతిధ్యానికి మారుపేరు. ఇప్పుడు చెప్పండి రాయలసీమ అంటే ఏంటో ఇప్పుడు చెప్పండి సీమ వైభోగం ఏంటో ఎలా ఉండేదో..తలెత్తి సగర్వంగా చాటి చెప్పండి ఇది మా గడ్డ..ఇది మన రాయలసీమ.

KARTHIKA DEEPAM

KARTHIKA DEEPAM

శీతాకాలం లో చల్లదనానికి సూక్ష్మజీవులు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి.అవి వేడికి..ధ్వనికి నశిస్తాయి..చలికాలంలో వేడి తక్కువ ఉంటుంది కాబట్టి కార్తీకంలో

వీలైనన్ని
ఆవునెయ్యి..నువ్వుల నూనెతో దీపాలు పెట్టమని చెప్పారు..
హైందవ ధర్మంలో ఏమి చెప్పిన ఇటు ఇహంలోను...అటు పరంలోను ఉపయోగపడేలాగా చెప్పారు.అన్నిటికీ టిష్యూ పేపర్ల సంస్కృతి ఉన్న వారు అవి లేనప్పుడు వారి పూర్వికులు ఏమి చేశారో కదా???..గొర్రెల కి ఒక లక్షణం ఉంటుంది.. మొదటి గొర్రె ఎటు వెళితే మిగిలినవి కూడా గుడ్డిగా అదే దారి అనుసరిస్తాయి..మనం గొర్రెలం కాదు..వివేకం ఉన్న గోవులం..మంచి చెడు విభజించగలిగే హంసలం..
~ శ్రీమతి పూర్ణశ్రీ గారికి దన్యవాదములతో ~

POET JAYALAKSHMI

POET JAYALAKSHMI
My mother late Jayalakshmi 
Studied upto 3rd standard in Tamil . 
The only "vyakthi" to byheart " very very less known SAKAMMA YAKSHA GANA RAMAYANAM" telugu . If printed it will ve over 700 pages. Patalu, pathyalu, Tripadha, dailouges. .

She started writing at the age of 39 , telugu poems. 
Wait ..... in Tamil lipi, 
At tge age of 40/41 learnt l
Telugu letters and after Getting HIS Anugraha " that is in Ashta graha Koota 1962 at Ramanujachariyar Channadhi. lord Betarayaswami. Ante , svayam Sri venkateswarudu tirumalaundi Denkanipuram veta gani roopam dhalchi occhinadu. Beta in kannada vetagadu.
Mother crations are about 7000 poems ,750 keerthanas , suprabatgam, ashtakams , namavali in Sanskrit . .she completed Sri Ramavkathamrutham 1500 poems .in telugu and at tge age of 95. 
We released her dwadhasa sathamani mala on sept month this year.
~ Narasimhan Venkataramaiah ~
Manage