Thursday 18 July 2019

SANAATHANA DHARMA

SANAATHANA DHARMA
మేము వైదిక బ్రాహ్మణులం.
వేదాధ్యయనం చేయటానికి గానీ...
జప ధ్యానాలు చేయటానికి గానీ....
ఆత్మ సాధన చేయటానికి గానీ...
మాకు తప్ప
స్త్రీలకీ,ఇతర వర్ణ,కులస్తులకీ
అర్హత లేదు...అనిన,అంటున్న
దురహంకారులు...
హిందూ సనాతన ధర్మానికి
ఎంత కీడు చేసారో!
అంత కీడూ...
మా తాత ముత్తాతల్ని
మీ తాత ముత్తాతలు
అణిచీ వేసారు....
అంటరాని వారన్నారు...
విద్యకీ అభివృధ్ధికీ
దూరం చేసారు.
కాబట్టే మేం
హిందూ ధర్మాన్ని ద్వేషిస్తాం.
వేదాలనీ,వేద మూర్తుల్నీ ద్వేషిస్తాం..
అంటూ మతం మారిన వారూ...
నాస్తిక హేటు వాదులూ...
వగైరా సంఘాలూ చేసాయి.
ఈ రెండు వర్గాలు చేసిన కీడుకు
కొన్ని రెట్ల మేలు...
ఎవరెంత విషం చిమ్మినా
ఎవరెన్ని బండ తిట్లు తిట్టినా
కడగండ్లు కలిగించినా
పట్టించుకోకుండా
అదే తమ జోవిత సాధన గా తలచి
హిందూ సనాతన ధర్మ సారస్వతాన్నీ
సంస్కృత సాహిత్యాన్నీ
ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తూ
సామాన్యులకర్ధమయ్యే సరళ భాష లో
వ్యాఖ్యాన గ్రంధాలు రచిస్తూ
తరాల తరబడి
సనాతన ధర్మాన్ని భుజాలపై మోసిన
శాస్త్రులూ,శర్మలూ,రావులూ,అయ్యలూ,
ఆయా గ్రంధాలని తమ పురుషార్ధాలను
విరాళాలుగా వెచ్చించి
ప్రచురించి ప్రచారించిన
ఎన్నో కులాల గృహస్థులూ
కొన్ని కోట్ల రెట్లు మేలు చేసారు.
కాబట్టే మొదటి రెండు వర్గాలు
ఎంత గొంతు చించుకు అరిచినా
గుండె బాదుకు ఏడిచినా
హిందూ సనాతన ధర్మం చెక్కు చెదరక నిలిచి ఉంది.ఎందుకంటే సనాతన ధర్మం... అనే పందిరికి
క్రింద చెప్పిన రెండు వర్గాలూ గుంజలు గనక!
అందుకే .ఇప్పటికీ మన ధర్మం
ప్రపంచానికి నీడనిస్తోంది.
విశ్వ వేదికకు వెలుగులు ప్రసరింపజేస్తోంది.
ఓం తత్ సత్!

No comments:

Post a Comment