Thursday, 18 July 2019

చెంగు చెంగునా...

చెంగు చెంగునా...
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా....
చెంగు చెంగునా గంతులు వేయండి
రంగురంగుల మోపురాలతో.. రంకెలు వేసే రోజెపుడో
చెకచెకమంటూ అంగలువేసీ.. నేలనుదున్నే అదనెపుడో
కూలిపోయినా సంసారానికి.. గోగాకింతా పెట్టే దెపుడో
ఆశలన్ని మీమీద బెట్టుకొని.. తిరిగే మా వెత లణగే దెపుడో
చెంగు చెంగునా గంతులు వేయండి
పంచభక్ష్య పరమాన్నం తెమ్మని
బంతిని గూర్చుని అలగరుగా..
పట్టుపరుపులను వేయించండని..పట్టుబట్టి వేధించరుగా
గుప్పెడు గడ్డితో గ్రుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ
జాలిలేని నరపశువుల కన్న..మీరే మేలనిపిస్తారూ
చెంగు చెంగునా గంతులు వేయండి
పగలనకుండా రేయినకుండా..పరోపకారం చేస్తారూ
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం జూపిస్తారూ
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు..సంపద పెంచే జాతిరత్నములు
మా ఇలవేల్పులు మీరు లేనిదే..మానవజాతికి బ్రతుకే లేదు
చెంగు చెంగునా
చెంగు చెంగునా గంతులు వేయండి
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా
చెంగు చెంగునా గంతులు వేయండి
@ from the wall of Nandiraju Ramamohanrao

No comments:

Post a Comment