సాహిత్యం సర్వ వేద సారం!!! అందునా తెలుగు సాహిత్యం జనులలో అంతర్లీనంగా దాగిఉన్న సద్భావాలకు ఊపిరిపోసి అందరికి సమదృష్టిని, వివేకాన్ని నేర్పుతుంది.ఆహారం ఏదైనా రుచిని ప్రసాదిస్తూ అన్నార్తుల ఆకలి తీర్చటమే ప్రధానం, ప్రయోజనం కూడా!!! ఈ సత్య నిరూపణను బాగా తెలిసివాడుకావటం వల్లే ప్రముఖ తెలుగు రచయిత శ్రీ Varanasi Ramakrishna గారు తెలుగు సాహిత్యంలో ఒక వంక సామాజిక దృష్టి, సంప్రదాయాల పునరుజ్జీవనం..మరో వంక వికాస సూత్రాలను తెలుగు పాఠకులకు అందిస్తున్నారు..వారి కథలను మీరు క్రమం తప్పకుండా గోతెలుగు వెబ్ మ్యాగజైన్ లో చదవ వచ్చు!!!
మీకోసం ఇక్కడ "కుండా జిందాబాద్" అను హాస్య రచనను అందిస్తున్నాను.చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.
మీకోసం ఇక్కడ "కుండా జిందాబాద్" అను హాస్య రచనను అందిస్తున్నాను.చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.
చూస్తూ చూస్తుండగానే కూల్ గా హాట్ హాట్ సమ్మర్ ప్రవేశించింది. సమ్మర్ అనగానే కుమ్మరి కుండలు మనకి గుర్తుకు రావటం సహజం . దప్పిక తీరాలంటే చల్లగా కుండలో నీళ్ళు తాగాలీ అనుకుంటాం.కొందరు కుండలు వాడటం పాత ఫ్యాషన్ ఆదిమానవుడి లక్షణం, ఫ్రిజ్ లు కూలర్లలో నీళ్ళు తాగటమే కరెక్ట్టు అoటారు. మాంచి ఎండల్లో నీళ్ళు చల్లగా ఉంటేనే లోపలి దిగేది! అంటే వేడి నీటిని (ద్రవాన్ని) చల్ల బరచటం అనే ప్రక్రియ కుండ విజవంతంగా చేస్తుంది. ఐతే ఆధునీకం పేరుతో ఫ్రిజ్ లో నీళ్ళు తాగి ఆరోగ్యాలు చెడిపోతు న్నాయి అని విజ్ఞులు సెలవిస్తారు అప్పట్లో ఈ కూలర్లు ఫ్రిజ్ లు లేని కాలం లో మనుషులు సుబ్బరంగా అన్నీ ప్రకృతి ప్రసాదించిన వాటితోనే తయారుచేసి వాడుకుని కలకాలం హాయిగా ఉన్నారనీ చెప్తారు. కావాలంటే మీరు మ్యూజియంలో చూడండి అప్పట్లో మన పూర్వీకులు చక్కగా అన్నీ కుండల్లో మట్టి పెంకుల్లో వంటలు చేసుకుని మంచి నీరు తాగేరని ఆనవాళ్ళు చూపుతారు. దీనికి విరుగుడుగా ఆధునీకులు అప్పట్లో మనిషికి ఎలా బ్రతకాలో ఎంత హాయిగాజీవించాలో తెలీకనే అలాంటివి వాడాడు ఇప్పుడుఅన్నీదొరుకుతున్నాయి అవేఎందుకూ? ప్రశ్నిస్తారు.
ఒకడు ఒకటి చెప్తే ఇంకోడు దాన్నికాదంటూఇంకోవాదం లేవదీస్తాడు.ఇలా వాద ప్రతివాదాలు శృతి మించి ఆఖరికి ఎక్కడో ఒకచోట “కుండ బద్దలవు తుంది”! అవును! అందుకే బద్దలు కొట్టటానికే ‘కుండ’ పుట్టింది. గమనిస్తే ప్రపంచంలో ప్రతిచోటా అబద్దం అల్లుకుపోతూoటే వాస్తవం కల్పించుకుని నిజ౦ అనే ‘కుండ బద్దలు’ అవుతుంటుంది. కుండ బద్దలయ్యిందీ అంటే అక్కడ ఇంకే అవాస్తవం మిగల్లేదని!
ఆ.. మట్టి కుండ! అదెంత?దాని విలువెంత?జీవిత కాలమెంత? అని అనేస్తాం కానీ కుండశక్తీ నిజానికి పెద్ద బండకీ లేదు,ఉండదు! అంచేత బండ గుర్తు పెట్టుకుందాం నిండు ”కుండ” తొణకదు అది ‘పవర్ ఫుల్లు!’
*** ***** ****
ఇంకా కుండ అంటే చిన్న చూపు ఉన్నవాళ్లకి తెలుగు సినిమాలు చూపిద్దాం. సినీమా వాళ్లకి కుండ కాసులు కురిపించే కామధేనువు!బోలెడన్ని సినిమాల్లో కేవలం కుండల వల్లే హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వందల వేల కుండల్ని వరుసగా అందంగా పేర్చి ఆ కుండల నడుమ నృత్యం చెయ్యటం వల్లే మనిషా కోయిరాలాకి అందాల తార అన్న పేరు వచ్చింది.ఆ సినిమా రెండొందల రోజులు ఆడింది! అదేగాని అక్కడ కుండలకి బదులు ఏ మొద్దు రాచిప్పలో అల్యుమినియం సత్తుగిన్నెలో వాడి ఉంటే పిచ్చెర్ అట్టర్ ఫ్లాపు కొట్టేది.ఇక బోల్డన్ని సినిమాల్లో ఇంతెత్తున పేర్చిన కుండల దగ్గర హీరో రౌడీల్ని పట్టుకుని ఉతికి ఆరేసి సివర్లో డిషిండిషిం కొడితే ఒక్కోడు వెళ్లి కుండల మీద పడటంకుండలు డమాల్ డమాల్ మని బద్దలు కావటం వల్లే ఆ పిచ్చేర్లన్ని రికార్డుల్ని బద్దలుకొట్టాయి. స్టంట్ సీన్లు అంటే బోలెడన్ని కుండలు బద్దలు కావటం కంపల్సరీ! కుండలు పగలటం వల్లే సినిమాలు హిట్టవుతాయి! సరిగ్గా ఈ సెంటిమెంట్ వర్క్అవుట్ అయ్యి స్టార్ ప్రొడుసర్లు ప్రతి సినిమాలోకుండలు పగలాల్సిందేనని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తారు.‘కుండలా మజాకా?!’ ఈ టైటిల్ తో ఇంకా పిచ్చేర్ రాలేదు ఎవరైనా చాంబర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.http://www.gotelugu.com/issue317/…/telugu-columns/humarasam/
No comments:
Post a Comment