Friday 24 May 2019

భరత ఖండము

నా
సద్గురువులు,బ్రహ్మచారులు, సాధు సజ్జనులు, గృహస్థులు,
సమాజ హితాన్ని కోరు కవులు,గాయకులు
జీవించి ఉండువరకు సత్కర్మానుష్టానము చేయుచునే ఉందురు!!!
సనాతన ధర్మములో ఇమిడియున్న దివ్య శక్తి ఇదే!!!
భరత ఖండమునందు
జై శ్రీరాం!!!
~ సమర్థ రామదాసు ~

దైవ భక్తి

దైవ భక్తి
దేశ భక్తి
తపస్సు
జ్ఞానము
శీలము
గుణము
ధర్మము
ఎఱిగిన బ్రహ్మచారులు
సాధు సజ్జనులు
భరత ఖండాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారు!!!
~ కాల జ్ఞాని పోతులూరి వీర బ్రహ్మం ~

#సద్భావన:

#సద్భావన:
* * * * * * *
సద్భావన నుంచే
నిశ్శబ్దం పుడుతుంది.
ఆ నిశ్శబ్దం నీచులను సైతం
మట్టుపెడుతుంది!!!
ప్రపంచ శాంతికి
సద్భావనే ప్రాణం!!!

Thursday 16 May 2019

Whisper’s Of My ~~~~~Heartbeat

~~~~~Whisper’s Of My
~~~~~Heartbeat
Inside my heart,
A lovely bird is about to fly.
My obligations to my family,
Hath tethered me to the chains.
The little birds of my domicile,
Are soaring and chanting now.
Trying to hold my breath tight,
For people who need my heed.
Anguish and turmoil abide,
Hate and crime are enduring.
I pledge to mend this beautiful world,
At least for posterity.
Sadhvi Saini ‘Johna’

#దైవీ సంపద


#దైవీ సంపద
* * * * * * * * * 
సత్యము నా తల్లి
జ్ఞానము నా తండ్రి.
యుగయుగాల ధర్మమిదే!!!
ఈ ధర్మాన్ని ఆచరించే స్త్రీపురుషులకు
నేను నా దైవీ సంపదను
సుఖ సంతోషాలను
అను నిత్యం ప్రసాదిస్తూనే ఉంటాను!!!
జై గురుదత్త!!!

RURAL INDIA

RURAL INDIA 

King Makers

కింగు మేకర్లు, యంగ్ టర్కులకంటే ఇపుడు పదవిపై మోజున్న బాబులే ఎక్కువ అయ్యారు

SEZ

సెజ్జుల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవి!!!!





కింగు సెజ్జుల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు ససెజ్జుల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవి!!!!





మాజానికి అత్యంత ప్రమాదకరమైనవి!!!!





మేకర్లు, యంగ్ టర్కులకంటే ఇపుడు పదవిపై మోజున్న@ బాబులే ఎక్కువ అయ్యారు!!!

గోమాత

#
గోమాత
* * * * *
గోవు సకల దేవతా స్వరూపం!
సర్వ వేదాలకు , సకల  శుభాలకు
సుఖ సంతోషాలకు
ధర్మానికి గోవు ప్రతిరూపం!!!
గోవును వధించిన వారు
అంధులై, అధమాంధులై
ఘోర పాప కర్మలను
అనుభవించక తప్పదని క్రిష్ణ భగవానుడు ప్రకటించు చున్నాడు!!!
జై గోమాత!!!

సెజ్జుసెజ్జుల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవి!!!!ల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు సమాజానికి అసెజ్జుల భాగోతాలు, కార్పోరేట్ విద్య - ఈ రెండు సమాజానికి అత్యంత ప్రమాదకరమైనవి!!!!త్యంత ప్రమాదకరమైనవి!!!!

Monday 13 May 2019

#ధ్యాన స్థితి

#ధ్యాన స్థితి
* * * * * * *
సాధకుడు
మరియు
ఇహపరాలను ఎఱిగిన సాధు సజ్జనులు
కవులు,గాయకులు
సుఖ దుఃఖాలను
భవ భయాలను
కర్మ బంధాలను
తమ నిశ్చల ధ్యాన స్థితిలో
నిరంతరం దహించివేస్తుంటారు!!!
నన్ను ఆశ్రయించిన భక్తులకు
ఈ క్రియ అంత్యంత సులభసాధ్యం!!!
జై గురుదత్త!!!!!!

#కాల జ్ఞానం

#కాల జ్ఞానం
* * * * * * * *
రాజధాని నిర్మాణం అంటే 
ముక్కారు పంటలు పండే భూముల దాసోహం కాదు!
రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు!!
పత్రికల గ్రాఫిక్స్ అసలే కాదు!!!
వేడి వడగాల్పులు, పిడుగులకు ఒకటే సంకేతం...
బెజవాడ కనక దుర్గమ్మ ముక్క పుడక
కృష్ణమ్మ త్రాకే రోజు దగ్గరలో ఉంది!!!
కాల జ్ఞానం కల్లకాదు సుమా!!!

భజగోవిందం భజగోవిందం

🌸 నాకెంతో ఇష్టమైన భజ గోవింద స్తోత్రం అర్ద సహితంగా🌸
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||
భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.
మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం ||2||
భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు.
నారీస్తనభర నాభీదేశం
దృష్ట్వా మాగామోహావేశం
ఏతన్మామ్సావసాది వికారం
మనసి విచంతయ వారం వారం ||3||
భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.
నళినీ దలగత జలమతి తరలం
తద్వాజ్జీవితమతిశయచపలం
విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం ||4||
భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.
యావద్విత్తోపార్జన సక్తః
తావన్నిజ పరివారో రక్తః
పశ్చాజీవతి జర్జర దేహే
వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||
భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.
యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్చతి కుశలం గేహే
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||
భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ చూసి భార్య కూడా భయపడుతుంది.
బాలాస్తావతీ క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః |
వృద్ధస్తావాచ్చింతాసక్తః
పరమే బ్రహ్మణి కో పి సక్తః ||7||
భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః |
కస్య త్వం కః కుత ఆయాతః
తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||
భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం |
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||
భావం: సత్పురుషులతో సాంగత్యం చేయడం వల్ల ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః ||10||
భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.
మా కురు ధన జన యవ్వన గర్వం
హరతి నిమేషాత్కాలః సర్వం |
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||11||
భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.
దినయామిన్యౌ సాయం ప్రాతః
శిశిరవసంతవ్ పునరాయాతః |
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః
తదపి న ముంచత్యాశావాయుః ||12||
భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.
కాతే కాంతా ధనగతచింతా
వాతుల కిం తవ నాస్తి నియంతా |
త్రిజగతి సజ్జనసంగాతిరేకా
భవతి భవార్ణవతరణే ||13||
భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.
ద్వాదశమంజరికాభిరశేషః
కథితో వైయాకరణస్యైషః .
ఉపదేశో భూద్విద్యానిపుణైః
శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః ॥13.అ॥
భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.
జటిలో ముండీ లుంఛితకేశః
కాషాయాంబరబహుకృతవేషః |
పశ్యన్నపి చన పశ్యతి మూఢః
హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||
భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.
అంగం గలితం పలితం ముండం
దశనవిహీనం జాతం తుండం |
వృద్ధో యాతి గృహీత్వా దండం
తదపి న ముంచత్యాశాపిండం ||15||
భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.
అగ్రే వహ్నిః పృష్ఠేభానుః
రాత్రౌ చుబుకసమర్పితజానుః |
కరతలభిక్షస్తరుతలవాసః
తదపి న ముంచత్యాశాపాసః ||16||
భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని, వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.
కురుతే గంగాసాగారగమనం
వ్రత పరిపాలన మథవా దానం |
జ్ఞానవిహీనః సర్వమతేన
ముక్తిం న భజతి జన్మశతేన ||17||
భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.
సుర మందిర తరు మూల నివాసః
శయ్యా భూతలమజినం వాసః |
సర్వ పరిగ్రహ భోగ త్యాగః
కస్య సుఖం న కరోతి విరాగః ||18||
భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.
యోగరతో వా భోగరతో వా
సంగరతో వా సంగవిహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ ||19||
భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.
భగవద్గీతా కించిదధీత
గంగా జలలవ కణికాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేవ న చర్చ ||20||
భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.
పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసార బహు దుస్తారే
కృపయా పారే పాహి మురారే ||21||
భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.
రథ్యా చర్పట విరచిత కంథః
పుణ్యాపుణ్య వివర్జిత పంథః |
యోగి యోగనియోజిత చిత్తో
రమతే బాలోన్మత్తవదేవ ||22||
భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.
కస్త్వం కోహం కుత ఆయాతః
కా మే జనని కో మే తాతః |
ఇతి పరభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||
భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:
వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |
భవ సమచిత్తః సర్వత్ర త్వం
వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||
భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.
శత్రౌ మిత్రే పుత్రే బంధవ్
మా కురు యత్నం విగ్రహ సంధవ్ |
సర్వస్మిన్నపి పశ్యాత్మానం
సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||
భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని, బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వా త్మానం భావయ కోహం |
ఆత్మజ్ఞాన విహీనా మూడాః
తే పచ్యంతే నరకనిగూడః ||26||
భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.
గేయం గీతా నామ సహస్రం
ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |
నేయం సజ్జన సంగే చిత్తం
దేయం దీనజనాయ చ విత్తం ||27||
భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.
సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్ధంత శరీరే రోగః |
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం ||28||
భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తితతః సుఖలేశః సత్యం |
పుత్రాదపి ధన భాజాం భీతి:
సర్వత్రైషా విహితా రీతి: ||29||
భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.
ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం |
జాప్యసమేత సమాధివిధానం
కుర్వవధానం మహదవధానం ||30||
భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.
గురుచరణా౦బుజ నిర్భర భక్తః
సంసారాదచిరార్భవ ముక్తః |
సేంద్రియమానస నియమాదేవం
ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||
భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!
మూఢః కశ్చన వైయాకరణో
డుకృన్కరణాధ్యయన ధురిణః .
శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై
బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥
భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
నామస్మరణాదన్యముపాయం
నహి పశ్యామో భవతరణే ॥33॥
భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.
|| ఇతి భజగోవిందం సంపూర్ణం |
C.కిరణ్ బాబు.బ్లాగ్ షాట్. వారి సౌజన్యంతో
~ సోదరి Mythili Chirumamilla సహకారంతో ~

Ramanujacharya

#Ramanujacharya
Ramanujacharya is also known as Ramanuja. He was born in 11th century around 1017 in a Tamil Brahmin family in Sriperumbudur village of Tamil Nadu. His birth name was Lakshmana and was also referred as Ilaya Perumal that is 'the radiant one'. His legacy as a theologian, teacher and philosopher remains alive. Do you know he is one of the greatest teachers of Vishishtadvaita Vedanta which is one of the six classical systems of Indian philosophy?
The northern and southern tradition of Vaishnavism was combined by him and he also strengthened the religious belief and the worship of Lord Vishnu. He taught people that Divine entails rather than transcends all qualities. At the age of 120, he left the world in 1137 CE in Srirangam, Tamil Nadu.
Ramanujacharya's early life: -
About 25 miles west of Madras, Ramanujacharya was born in about 1017 in Sriperumbudur village. His father was Keseva Samayaji and his mother name was Kantimathi. He married Rahshambal in around 1033. After the few days of wedding, his father died and he left alone with lot of grief. He with his mother and wife went to Kanchipuram and settled there. It is said that Ramanuja's marriage life lasted until he was thirty, when he gave up the worldly life for religion. Ramanuja's cousin, Govina Bhatta was his closest friend. He played an important role in Ramanuja's life.
Ramanujacharya's later life: -
Under the teacher Yadavaprakasha, he learnt so many things in the school. Later, he had a vision of god Vishnu. Then, he started doing worship of Vishnu Narayana daily. He became a priest in the temple Varadaraja at Kanchi where he began to expound the doctrine who aspires to final release or moksha from transmigration and further he told that Brahman is identified with the personal god Vishnu.
He was also associated with Ranganatha temple where he establish the teaching that the worship of god and the soul is an essential part of the doctrines of the Upanishads on which the system of Vedanta is built, therefore the teachings of the Vaishanavas and Bhagavatas are not heterodox. He returned to Shrirangam after 20 years and organised the temple worship, founded around 74 centres to disseminate his doctrine. And at the age of 120, he passed away.
Ramanujacharya's Philosophy and Teachings: -
Do you know that at the age of 16, he had mastered all the Vedas and Shastras. He accepted that on three main points any Vedanta system is based namely the Upanishads, the Brahma-Sutras and the Bhagavad Gita. He didn't wrote any commentary on Upanishad but explained in detail all the methods of understanding Upanishads in his first major work known as Vedartha-Samgraha that is the summary of the meaning of the Veda.
His views are also seen through his commentary on the Brahma-Sutras known as the Shri- Bhashya. He also wrote commentary on the Bhagavad Gita known as the Bhagavadagita-Bhashya.
He gave bhakti an intellectual basis with the pursuits of his philosophy. No doubt his contribution to Vedanta was highly significant. He emphasised on the necessity of religious worship as a means of salvation which continued to be more systematic in the devotional effusions of the Alvars who were the poet-mystics of Southern India (&-10th century). Their verse also incorporated in to the temple worship. His bhakti also made a way to northern India.
He also accepted the reality of three distinct orders: matter, soul and God. Ramanuja travelled throughout the country and spread the message of Visishtadvaita. Do you know that Yagna Murthi by name confronted him for 16 days in endless arguments and counter arguments? Finally, he accepted defeat and became a disciple of Ramanuja and changed his name as 'Arulala Perumal Emperumanar'. He wrote 'Gnana Sara, and Prameya Saram'.
Ramanuja's one of the most important disciples who were totally devoted to him was Kuresan also known as Kurattalwani. Ramanujacharya mastered the Bodhaayana Vritti of Sage Vyaasa, he wrote various works like Vedanta Sangraham by explaining the various viewpoints of Sankara, Yadhava, Bhaskara and others Vedanta Deepam, Geetha Bashyam etc. Later, he wrote a granth namely Nityam.
Ramanujacharya's birthplace is now commemorated by a temple in Sriperumbudur and also in an active Vishishtadvaita school. His religious practices and the doctrines that he had promulgated are also carried in two most important Vaishnava centres: the Ranganatha temple in Shrirangam, Tamil Nadu and the Venkateshvara temple in Tirupati, Andhra Pradesh in South India.
So, we can say that Ramanujacharya was the greatest synoptic thinker who had systematised the Visishtadvaitic philosophy and faithfully interpret the ancient knowledge with several texts, letters. His teachings and philosophy are still practiced in southern India.
~ Thanks to Ashwinsujaysingh ~

పసుపు కుంకుమలు

పసుపు కుంకుమలు పబ్లిసిటీలు సరే!!!ఈ 40 ఏళ్ళలో ప్రజలకు కనీసం నాణ్యమైన, ఉచిత త్రాగునీటిని అందించావా???

ప్రధాని

10 రోజుల్లో ప్రధాని కావటమెలా??? కూటములను, ఫ్రంట్లను
అతలాకుతలం చేస్తున్న ప్రశ్న ఇదే ఇపుడు!!!

Eyes and Wings



#The eyes of a compassionate 
"Even water can wear wings
It depends on your vision"
~~AD~~Poetess Aziza Dahdouh~~

#విశ్వశ్రేయస్సు

#విశ్వశ్రేయస్సు
* * * * * * * * * 
ఎత్తయిన పర్వతాలకు
కొండకోనలకు
పుణ్యతీర్థాలకు
పవిత్రక్షేత్రాలకు
పశుపక్ష్యాదులకు


పాడిపంటలకు
విశ్వశ్రేయస్సే ప్రధానంగా భావించి , జీవిస్తున్న
మహాత్ములకు, సజ్జనులకు
కవులకు, గాయకులకు
నేను అను నిత్యం తోడుగా, నీడగా ఉంటా!!!
జై గురుదత్త!!!

Tuesday 7 May 2019

జ్ఞాన ప్రకాశము


#జ్ఞాన ప్రకాశము
* * * * * * * * * * 
హే క్రిష్ణా...
గ్రుడ్డివాడను అయిన నేమి
నిన్ను ఇంద్రధనసు చెంత ఆడించగలను!!
ఆకాశం లో పక్షుల అడుగుల జాడలనూ నీకు చూపించగలను!!!
హే చిన్ని క్రిష్ణా...
నీవు అందించిన జ్ఞాన ప్రకాశముచేత
నిన్ను ఆడించగలను, ఓడించగలను!!!
~ సూరదాస్.. అంధుడు, భక్త కవి, గాయకుడు ~

#సూక్ష్మ రూపం

#సూక్ష్మ రూపం
* * * * * * * * *
అఖండసావధానముచే జీవితములు గడుపుచూ
ఎల్లప్పుడు నిరభిమానులై ఉండు 
సాధుసజ్జనులకు
సమాజ హితాన్ని కోరే కవులకు
తమ గాత్రం ద్వారా భక్తిని ప్రకటించే గాయకులకు
నేను సూక్ష్మరూపంలో వుంటూ
త్రికాల జ్ఞానాన్ని
బ్రహ్మ తత్వాన్ని బోధిస్తాను!!!
జై గురుదత్త!!!

పంచేంద్రియాలు

సాహిత్య రచనలయినా, సామాజిక మాధ్యమం లోని పోస్టులు అయినా, నాలుగు మంచిమాటలైనా ప్రజాభిరుచులను అనుసరించే ప్రసిధ్ధం కావాలి.మనము పలువురితో చెప్పగలిగే మాటల్లో ధర్మము,సమాజ రీతి,నీతి,ప్రజా వ్యవహారము, అభిలాష, ప్రవృత్తులు మొదలైన అనేక అంశాలను సుష్పష్టంగా ప్రతిబింబించాలి!!ఈ నిబధ్ధత కలిగి ఉండటం వల్లే నేను విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు శ్రీ తాడికొండ వెంకట నరసింహా రావు
గారి పోస్టులను అనుసరిస్తూ ఉంటాను --
వారి టైంలైన్ నుంచి సేకరించిన ఒక అమూల్యమైన పోస్ట్ మీ అందరికోసం:
***************************
* * * పంచేంద్రియాలు * * *
మనకు దైవానుగ్రహంతో లభించిన
పంచేంద్రియాలను సక్రమంగా వినియోగించుకోవాలి.
మంచి దృశ్యాల్ని చూడాలి,
ధార్మికమైనవాటినే వినాలి,
సువాసనలనే పీల్చగలగాలి,
సంతోషాలనిచ్చే మాటల్ని పలకాలి,
అంతేకాదు సాత్వికాహారాన్ని తీసుకోవాలి,
నిరభ్యంతరమైన స్పర్శనే కోరుకోవాలి, పొందాలి.
వేద విహిత ధర్మాచరణతో కృతకృత్యులమౌదాం,
ఆదర్శవంతులమౌదాం.
***************************

#జ్ఞాని

#జ్ఞాని
* * * * 
జ్ఞానుల దేహములు కర్పూరము వంటివి.ఒక పర్యాయము కర్పూరము కాలినచో మరల జన్మించదు.అట్టులే జ్ఞానికి జన్మ మరణములు లేవు!!
జై శ్రీరాం!!!

వినయము-విధేయత

#వినయము-విధేయత
* * * * * * * * * * * * * 
వినమ్రుడైన భక్తుడు భగవంతునితో 
తనలోని గుణదోషాలను పరికించి
దోషాలు పరిత్యజించి 
గుణాలను ఆదరించాలని వేడుకుంటాడు!!!
~ అన్నమయ్య ~

#గెలుపు సంబరాలు:

#గెలుపు సంబరాలు:
* * * * * * * * * * * * 
ప్రేమల చిరునామా.. రాయలసీమా 
అనురాగాలా రాగం పాడేనమ్మా.. 
పసిడి కోనసీమా.. పంటచేల నడుమా
పరువాలా గోదావరి పారేనమ్మా..
* * * * * * * * * * * * * * * * * *
గెలుపు సంబరాలకు మంగ్లీ పాటలు, ఆటలు, హుషారైన మాటలు ఇపుడు ప్రధాన ఆకర్షణ!!!!

#అంతా శివమయం:

#అంతా శివమయం:
* * * * * * * * * * *
పంచ భూతములలో ఆకాశం గొప్పది.
దాని ప్రకాశము చేతనే ఇతర భూతములు ప్రకాశించుచున్నవి.
సర్వ ప్రాణులలో అంతరాత్మ గుప్తరూపమున అన్నిటిని విచారించి చూచుచున్నది.
అంతరాత్మ శక్తిలేనిదే ఏ కార్యమూ జరుగదు.
సర్వప్రాణులకు, ఆ ప్రాణులందుండెడి అంతరాత్మకు
పంచభూతములకు
ప్రపంచ పరమార్ధ జ్ఞానప్రాప్తికి ఈశ్వరుడే ఆధారం!!!
ఈ సనాతన ధర్మాన్ని విస్మరించి క్రొత్త సిధ్ధాంతాలకు
ఆకర్షితుడైనవాడు భ్రష్టుపట్టుచున్నాడు!!!!
~ ఆది శంకరుడు ~

Saturday 4 May 2019

#సూక్ష్మ రూపం

#సూక్ష్మ రూపం
* * * * * * * * *
అఖండసావధానముచే జీవితములు గడుపుచూ
ఎల్లప్పుడు నిరభిమానులై ఉండు 
సాధుసజ్జనులకు
సమాజ హితాన్ని కోరే కవులకు
తమ గాత్రం ద్వారా భక్తిని ప్రకటించే గాయకులకు
నేను సూక్ష్మరూపంలో వుంటూ
త్రికాల జ్ఞానాన్ని
బ్రహ్మ తత్వాన్ని బోధిస్తాను!!!
జై గురుదత్త!!!

Friday 3 May 2019

"కుండా జిందాబాద్"

సాహిత్యం సర్వ వేద సారం!!! అందునా తెలుగు సాహిత్యం జనులలో అంతర్లీనంగా దాగిఉన్న సద్భావాలకు ఊపిరిపోసి అందరికి సమదృష్టిని, వివేకాన్ని నేర్పుతుంది.ఆహారం ఏదైనా రుచిని ప్రసాదిస్తూ అన్నార్తుల ఆకలి తీర్చటమే ప్రధానం, ప్రయోజనం కూడా!!! ఈ సత్య నిరూపణను బాగా తెలిసివాడుకావటం వల్లే ప్రముఖ తెలుగు రచయిత శ్రీ Varanasi Ramakrishna  గారు తెలుగు సాహిత్యంలో ఒక వంక సామాజిక దృష్టి, సంప్రదాయాల పునరుజ్జీవనం..మరో వంక వికాస సూత్రాలను తెలుగు పాఠకులకు అందిస్తున్నారు..వారి కథలను మీరు క్రమం తప్పకుండా గోతెలుగు వెబ్ మ్యాగజైన్ లో చదవ వచ్చు!!!
మీకోసం ఇక్కడ "కుండా జిందాబాద్" అను హాస్య రచనను అందిస్తున్నాను.చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.


చూస్తూ చూస్తుండగానే కూల్ గా హాట్ హాట్ సమ్మర్ ప్రవేశించింది. సమ్మర్ అనగానే కుమ్మరి కుండలు మనకి గుర్తుకు రావటం సహజం . దప్పిక తీరాలంటే చల్లగా కుండలో నీళ్ళు తాగాలీ అనుకుంటాం.కొందరు కుండలు వాడటం పాత ఫ్యాషన్ ఆదిమానవుడి లక్షణం, ఫ్రిజ్ లు కూలర్లలో నీళ్ళు తాగటమే కరెక్ట్టు అoటారు. మాంచి ఎండల్లో నీళ్ళు చల్లగా ఉంటేనే లోపలి దిగేది! అంటే వేడి నీటిని (ద్రవాన్ని) చల్ల బరచటం అనే ప్రక్రియ కుండ విజవంతంగా చేస్తుంది. ఐతే ఆధునీకం పేరుతో ఫ్రిజ్ లో నీళ్ళు తాగి ఆరోగ్యాలు చెడిపోతు న్నాయి అని విజ్ఞులు సెలవిస్తారు అప్పట్లో ఈ కూలర్లు ఫ్రిజ్ లు లేని కాలం లో మనుషులు సుబ్బరంగా అన్నీ ప్రకృతి ప్రసాదించిన వాటితోనే తయారుచేసి వాడుకుని కలకాలం హాయిగా ఉన్నారనీ చెప్తారు. కావాలంటే మీరు మ్యూజియంలో చూడండి అప్పట్లో మన పూర్వీకులు చక్కగా అన్నీ కుండల్లో మట్టి పెంకుల్లో వంటలు చేసుకుని మంచి నీరు తాగేరని ఆనవాళ్ళు చూపుతారు. దీనికి విరుగుడుగా ఆధునీకులు అప్పట్లో మనిషికి ఎలా బ్రతకాలో ఎంత హాయిగాజీవించాలో తెలీకనే అలాంటివి వాడాడు ఇప్పుడుఅన్నీదొరుకుతున్నాయి అవేఎందుకూ? ప్రశ్నిస్తారు.
ఒకడు ఒకటి చెప్తే ఇంకోడు దాన్నికాదంటూఇంకోవాదం లేవదీస్తాడు.ఇలా వాద ప్రతివాదాలు శృతి మించి ఆఖరికి ఎక్కడో ఒకచోట “కుండ బద్దలవు తుంది”! అవును! అందుకే బద్దలు కొట్టటానికే ‘కుండ’ పుట్టింది. గమనిస్తే ప్రపంచంలో ప్రతిచోటా అబద్దం అల్లుకుపోతూoటే వాస్తవం కల్పించుకుని నిజ౦ అనే ‘కుండ బద్దలు’ అవుతుంటుంది. కుండ బద్దలయ్యిందీ అంటే అక్కడ ఇంకే అవాస్తవం మిగల్లేదని!
ఆ.. మట్టి కుండ! అదెంత?దాని విలువెంత?జీవిత కాలమెంత? అని అనేస్తాం కానీ కుండశక్తీ నిజానికి పెద్ద బండకీ లేదు,ఉండదు! అంచేత బండ గుర్తు పెట్టుకుందాం నిండు ”కుండ” తొణకదు అది ‘పవర్ ఫుల్లు!’
*** ***** ****
ఇంకా కుండ అంటే చిన్న చూపు ఉన్నవాళ్లకి తెలుగు సినిమాలు చూపిద్దాం. సినీమా వాళ్లకి కుండ కాసులు కురిపించే కామధేనువు!బోలెడన్ని సినిమాల్లో కేవలం కుండల వల్లే హౌస్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో వందల వేల కుండల్ని వరుసగా అందంగా పేర్చి ఆ కుండల నడుమ నృత్యం చెయ్యటం వల్లే మనిషా కోయిరాలాకి అందాల తార అన్న పేరు వచ్చింది.ఆ సినిమా రెండొందల రోజులు ఆడింది! అదేగాని అక్కడ కుండలకి బదులు ఏ మొద్దు రాచిప్పలో అల్యుమినియం సత్తుగిన్నెలో వాడి ఉంటే పిచ్చెర్ అట్టర్ ఫ్లాపు కొట్టేది.ఇక బోల్డన్ని సినిమాల్లో ఇంతెత్తున పేర్చిన కుండల దగ్గర హీరో రౌడీల్ని పట్టుకుని ఉతికి ఆరేసి సివర్లో డిషిండిషిం కొడితే ఒక్కోడు వెళ్లి కుండల మీద పడటంకుండలు డమాల్ డమాల్ మని బద్దలు కావటం వల్లే ఆ పిచ్చేర్లన్ని రికార్డుల్ని బద్దలుకొట్టాయి. స్టంట్ సీన్లు అంటే బోలెడన్ని కుండలు బద్దలు కావటం కంపల్సరీ! కుండలు పగలటం వల్లే సినిమాలు హిట్టవుతాయి! సరిగ్గా ఈ సెంటిమెంట్ వర్క్అవుట్ అయ్యి స్టార్ ప్రొడుసర్లు ప్రతి సినిమాలోకుండలు పగలాల్సిందేనని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తారు.‘కుండలా మజాకా?!’ ఈ టైటిల్ తో ఇంకా పిచ్చేర్ రాలేదు ఎవరైనా చాంబర్లో రిజిస్టర్ చేసుకోవచ్చు.http://www.gotelugu.com/issue317/…/telugu-columns/humarasam/

#ఖంగుతిన్న డ్రాగన్

#ఖంగుతిన్న డ్రాగన్
* * * * * * * * * *
అతి ప్రాచీనమయినది
నిత్య నూతనమయినదీ నా దేశం!!
ఇపుడు
ఉగ్రవాదులనే కాదు
ఉగ్రవాదులను వెనకేసుక వస్తున్న దేశాలను
మట్టుబెట్టగలదు నా దేశం!!!
భారత్ మాతా కి జై!!!!

Thursday 2 May 2019

#జ్ఞాన ప్రకాశము

#జ్ఞాన ప్రకాశము
* * * * * * * *
హే క్రిష్ణా...
గ్రుడ్డివాడను అయిన నేమి
నిన్ను ఇంద్రధనసు చెంత ఆడించగలను!!
ఆకాశం లో పక్షుల అడుగుల జాడలనూ నీకు చూపించగలను!!!
హే చిన్ని క్రిష్ణా...
నీవు అందించిన జ్ఞాన ప్రకాశముచేత
నిన్ను ఆడించగలను, ఓడించగలను!!!
~  సూరదాస్.. అంధుడు, భక్త కవి, గాయకుడు ~